Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Adbhuta Vishayalu
Adbhuta Vishayalu
Adbhuta Vishayalu
Ebook110 pages32 minutes

Adbhuta Vishayalu

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dr.Jayanthi Chakravarthi Ph.D in Telugu is currently working as a Freelance Writer & Editor. He has done M.A.Telugu, M.A. Sanskrit, M.A. Archaeology, M.Phil. Archaeology, S.L.E.T. in Telugu and Sanskrit. He has written more than 75 on various subjects. He has worked as an editor for 4 years with Sri Kanaka Durga Prabha
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580304601185
Adbhuta Vishayalu

Read more from Dr.Jayanthi Chakravarthi Ph.D.

Related to Adbhuta Vishayalu

Related ebooks

Reviews for Adbhuta Vishayalu

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Adbhuta Vishayalu - Dr.Jayanthi Chakravarthi Ph.D.

    http://www.pustaka.co.in

    అద్భుత విషయాలు

    Adbhuta Vishayalu

    Author:

    జయంతి చక్రవర్తి

    Dr. Jayanthi Chakravarthi Ph.D.

    For more books

    http://www.pustaka.co.in/home/author//jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.
    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    అద్భుత విషయాలు

    టాల్ స్టాయ్ కంఠస్వరం 1908లో అమెరికా విజ్ఞానవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ రికార్డు చేసిన లియోటాల్ స్టాయ్ కంఠస్వరం రికార్డులు ఇటీవల కనుగొనబడ్డాయి. వాటిని రష్యాకు తెప్పించారు. రికార్డు చేయించిన అమెరికా స్టూడియో మేనేజర్ వాల్టర్ మిల్లర్ ఇంట్లో ఇవి కనుగొనబడ్డాయి. అమెరికాలోని ఎడిసన్ సెంటర్ లో 1914వ సంవత్సరంలో ఏర్పడిన అగ్నిప్రమాదంలో ఈ రికార్డులు నాశనమైపోయాయని, ఇంతకాలం అనుకున్నారు.

    ***

    మనిషి – ఏనుగు

    ఇంగ్లాండుకు చెందిన మార్క్ షాండ్ అనే రచయిత, కోణార్క సూర్యదేవాలయం నుంచి బీహార్‌లోని సోనేపూర్ వరకు గల దాదాపు 1000 కి.మీ. దూరం ఏనుగుమీదే ప్రయాణం చేశాడు. మనిషికీ, ఏనుగుకూ గల సంబంధమూ, మావటీలు ఏనుగునెలా అదుపులోకి తీసుకునేదీ, మచ్చిక చేసుకునేదీ ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవడానికి ఆయన ఈ ఏనుగు ప్రయాణం చేశాడు.

    ***

    నిజంగానే అంతటి ప్రాచీనమైనదా?

    ఇటలీలోని టురీన్ చర్చిలో ఏసుప్రభువును శిలువచేశాక, ఆయన కాయంమీద కప్పబడిన బట్ట అని విశ్వసింపబడే శాలువా ఉన్నది. దానిమీద నెత్తురు మరకలు ఉన్నాయి. అయితే, ఇటీవల మూడు విశ్వవిద్యాలయాలు జరిపిన పరిశోధనలలో ఈ బట్ట అంతటి ప్రాచీనమైనది కాదనీ, అది 14వ శతాబ్దానికి చెందినదనీ తెలియవచ్చింది.

    ***

    పుష్పక విమానాలు

    మన పురాణగాథలలో కనిపించే పుష్పకవిమానాలు కేవలం కవుల కల్పన మాత్రమే కాదనీ, అవి నిజమేనని ఇటలీకి చెందిన విజ్ఞానవేత్త డా|| రోబర్టో పినోటీ అభిప్రాయపడుతున్నాడు. ఇటీవల బెంగుళూరులో జరిగిన అంతర్జాతీయ వ్యోమవిజ్ఞాన సదస్సులో ప్రసంగిస్తూ ఆయన మన ప్రాచీన గ్రంథాలను పరిశోధించినట్టయితే పుష్పకవిమానాల నిర్మాణానికి సంబంధించిన విజ్ఞానం వెలుగులోకి రావచ్చునని అభిప్రాయపడ్డాడు!

    ***

    చరిత్రపూర్వయుగపు మత్స్యం!

    హిందూ మహాసముద్రంలో పరిశోధనలు జరుపుతున్న జపాన్ శాస్త్రజ్ఞులకు ఒక వింత చేప

    దొరికింది. దానికి మాటాడే శక్తి గనక వున్నట్టయితే, మనిషి పుట్టుక గురించి దాని తాత ముత్తాతలు చెప్పిన విషయాలు తెలియజేసి వుండేది. 85 కిలోల బరువుగల ఈ చేప, ఎప్పుడో నశించిపోయిందని భావించబడుతూన్న కోల్ కాంత్ మత్స్య సంతతికి చెందినది.

    ***

    ఎగిరే పళ్లాలు

    1988వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన, ఆకాశంలో గుండ్రటి వింత పళ్ళాలు ఎగరడం చూసినట్టు, బ్రెజిల్ దేశానికి చెందిన ముగ్గురు వైమానికులు తెలియజేశారు.

    ***

    నెపోలియన్ ఉత్తరం!

    1903వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన నెపోలియన్ బోనాపార్ట్ తన సేనానికి రాసిన ఒక ఉత్తరం వేలానికి వచ్చింది. ఇంగ్లాండును జయించే పథకం గురించి అతడా ఉత్తరంలో రాశాడు. తమ ఓడలు ఈజిప్టుకేసి వెళుతూన్నట్టు మభ్య పెట్టి, హఠాత్తుగా ఇంగ్లాండును ముట్టడించాలని అతడు ఉత్తరంలో తెలియజేశాడు.

    ***

    అతి ప్రాచీనమైన సంగీత వాద్యం!

    ఒరిస్సా రాష్ట్రంలోని బొలాంగీర్ జిల్లాలో అతి ప్రాచీనమైన సంగీత వాద్యం కనుగొన బడింది. అదొక రాతి లిథోఫోన్!

    ***

    గుండుసూది తలపై విజ్ఞాన సర్వస్వం

    బ్రిటిష్ విజ్ఞానవేత్తలు 'ఎలక్ట్రాన్ బీమ్'ను రూపొందించి వున్నారు. ఎలక్ట్రాన్ బీమ్ ప్రక్రియ ద్వారా బ్రిటిష్ విజ్ఞాన సర్వస్వం (ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా) 29 సంపుటాలనూ ఒక గుండుసూది తలమీద ఇమడ్చడం సాధ్యమవుతుంది. ఒక పెన్సిల్ గీత మీద పదిలక్షల అక్షరాలూ, సూది తలమీద పదిలక్షల రంద్రాలూ చేయడం, దీనిద్వారా సాధ్యమవుతుంది.

    ***

    థాయ్ లాండ్ పురాతన రాజధాని!

    25 సంవత్సరాలుగా జరిపిన పరిశోధనలు, త్రవ్వకాలు ఫలితంగా థాయ్ లాండ్ ప్రాచీన రాజధాని నగరం వెలుగులోకి వచ్చింది. శతాబ్దాలుగా మూసుకుపోయిన మట్టినీ, అల్లుకుపోయిన అడవులూ తొలగించి, విజ్ఞానవేత్తలు 700 సంవత్సరాలకు పూర్వం వెలిసిన సుఖోతాయ్ నగర శిథిలాలను కనుగొన్నారు. ఆ 'స్వర్ణయుగం' నాటి 193 బౌద్ధాలయాలు, కందకాలూ, ఇటుక ఆవాలూ వెలుగులోకి వచ్చాయి.

    ***

    పొడవైన కారు

    ఫిన్లాండులో రూపొందించబడిన ప్రపంచంలోకెల్లా చాలా పొడవైన కారు మొట్టమొదటిసారిగా హెల్సింకీలో విడుదలచేయబడింది.

    Enjoying the preview?
    Page 1 of 1