Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

సత్యం శివం సుందరం
సత్యం శివం సుందరం
సత్యం శివం సుందరం
Ebook493 pages2 hours

సత్యం శివం సుందరం

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

‘సత్యం శివం సుందరం’ అనే ఈ కథల సంపుటిలో, ఈ సహస్రాబ్దంలో వ్రాసిన 26 కథలు వున్నాయి. వీటిలో చాల వరకూ అమెరికా నేపధ్యంలో జరిగిన భారతీయుల జీవిత కథలు. ఈ పుస్తకంలోని కథల్లో, కొన్ని హాస్య కథలున్నాయి, కొన్ని సీరియస్ కథలున్నాయి. కొన్ని బహుమతులు అందుకున్న కథలు వున్నాయి. ఈ కథలన్నీ తెలుగునాట ఆంధ్రభూమి, విపుల, స్వాతి, స్వప్న, రచన, ఈనాడు ఆదివారం, నవ్య, సురభి మొదలైన పత్రికల్లోనూ, అమెరికాలో వివిధ పత్రికల్లోనూ ప్రచురించబడ్డవే!  

LanguageTelugu
Release dateJul 5, 2017
ISBN9781386577027
సత్యం శివం సుందరం
Author

Satyam Mandapati

Satyam Mandapati is a very popular writer in Telugu, publishing more than 300 short stories, 4 novels, several plays, and a dozen features in all the leading Telugu magazines in India and USA. Some of his stories were translated into other languages.  In 1994-95, Satyam wrote "America Betaaludi Kathalu", the first Telugu serial stories from USA depicting the life of Indian immigrants in USA. They were released as a book in 1995. "America Betaaludi Kathalu" the first ever book on India/Telugu Diaspora sold out in about a year and it went into a second edition soon selling all copies. Satyam so far published thirteen print books, out of which three books went into second print and were also sold out. He also published eight e-books that are sold currently on all key websites, including Kinige, Apple iBooks and Kindle. Satyam received six awards from Vanguri Foundation of America and two from Rachana magazine for his short stories. Satyam also received several awards for his contribution to Telugu literature from film actor Akkineni Nageswara Rao in 1997 and from Sri PV Narasimha Rao, Prime Minister of India in 2000. Other awards received are from Vamsee International, SAPNA, Siri Foundation, Vamsee Cultural Trust, Friendship Foundation of India, Chaitanya Bharati, TANA, ATA, TAMA, TANTEX, TCA etc.  Satyam is conducting monthly Telugu Sahitya Sadassulu in Austin, TX since 1992 and is the force behind the statewide Texas Telugu Sahitya Sadassulu conducted twice a year for the last 21 years. Satyam Mandapati currently lives in the metro area of Austin, Texas. Satyam did his B. Sc. Physics from Hindu College, Guntur; B.E from Engineering College, Kakinada and M.E. from Andhra University, Vizag. He worked in the Indian Space Research Organization as a Senior Manager for ten years and moved to USA in 1982 and recently retired after working as Vice President of Operations and General Manager from two Hi-Tech companies in Austin. Satyam Mandapati Contact Information: E-mail:             satyam_mandapati@yahoo.com

Read more from Satyam Mandapati

Related to సత్యం శివం సుందరం

Related ebooks

Reviews for సత్యం శివం సుందరం

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    సత్యం శివం సుందరం - Satyam Mandapati

    సత్యం శివం సుందరం

    సత్యం మందపాటి

    అమెరికా కథలు

    ––––––––

    తెలుగు సాహిత్య సౌరభం

    గుంటూరు  హైదరాబాద్    ఆస్టిన్

    Satyam Sivam Sundaram

    An Anthology of Short Stories By Satyam Mandapati

    Satyam Mandapati e-Books

    Language: Telugu

    July, 2017

    Copy Right: Satyam Mandapati

    Telugu Typesetting:  Satyam Mandapati and Ujwal Manepalli

    For Print Book Copies in India:

    Navodaya Book House

    Opp. Arya Samaj Mandir, Kachiguda X Roads,

    Hyderabad – 500 027

    Phone: (040) 24652387

    Contact in India:

    V. Sri Lakshmi, 

    1-1-231/4, First Floor, Jyothi Bhavan, Chikkadpalli,

    Hyderabad 500020

    Phone: (040) 27651264

    For Print Book Copies in USA:

    Email: satyam_mandapati@yahoo.com

    Price: $ 4.99

    నా మాట

    ఆలోచనలకు అలవాట్లున్నాయి. అలవాట్లకు ఆసరాలున్నాయి. ఆసరాలకు కొన్ని ఆంక్షలూ వున్నాయి.

    సత్యంగారు 46 ఏళ్ళుగా రచనలు చేస్తున్నారు. 33 ఏళ్ళుగా అమెరికాలో వుంటున్నారు. ఈ 33 ఏళ్ళల్లో కేవలం 40 వారాలే ఇండియాలో గడిపారు. ఈ మూడు వాక్యాలూ చెప్పి, మొదటి మూడు షరతులూ సత్యంగారి రచనలకు అన్వయిస్తే, ఆయన ‘లోగుట్టు’ మనకి అర్ధమవుతుంది. వాటి కథ చెప్పక, చెప్పుతున్నట్టవుతుంది.

    సత్యంగారు ఇంజనీరు. కథకి ఎలా టంకం వేయాలో, ఏయే లక్షణాలను సమీకరిస్తే కథవుతుందో, దాన్ని ఏయే పాళ్ళల్లో రంగరించాలో చదువును బట్టీ, అనుభవాన్ని బట్టీ ఆకళించుకున్నారు. ఈ కథలన్నింటికీ అందమైన చట్రం వుంది. ఇతివృత్తంలో వైవిధ్యం వుంది. చెప్పడంలో తనదైన ఒడుపు వుంది – వెఱసి చెయ్యి తిరిగిన సాక్ష్యం ఉంది.

    అయితే వీటిలో కొన్ని మాత్రమే ఇండియా కథలు. అందులో ఎక్కువ కథల ఇతివృత్తాలు, రచయిత ఆలోచనల్లో, అనుభవాల్లో పుట్టినవి. కాగితం మీద సరాసరి బదిలీ అయినవి. ‘కరణేషు మంత్రి’, ‘పూలు లేని కాడలు’, ‘మరో ప్రస్థానం’ అలాంటివి,

    మిగతావి ఫక్తు అమెరికా కథలు. అమెరికా వెళ్ళినవారికి, అమెరికా వాతావరణం తెలిసిన వారికి రచయిత చెప్తేనే తప్ప తెలియనవి కొన్ని. అతి అరుదైన, లక్షల్లోనో, కోట్లలోనో సకృతుగా కనిపించే వింతలూ, వింత రోగాలూ – తద్వారా వచ్చే విచిత్రమైన సమస్యలు, వాటి చుట్టూ అల్లిన ఇతివృత్తాలు రచయితకి ఇష్టం. 

    లక్షల్లో ఏ వొక్కడికో వచ్చే Gender Identity Disorder (నిన్ను నిన్నుగా ప్రేమించు), వందల్లో ఏ ఒక్కరికో వచ్చే హజిన్సన్ గిల్ఫర్డ్ ప్రోజేరియా (సాధించావే మనసా!), ఆల్సైమర్స్ (నాతి చరామి), లుకీమియా (సంధ్యావందనం) – యివన్నీ రచయిత కథల్లో పెట్టుబడులు. ఇందువల్ల ఈ రోగాలూ, వీటివల్ల వచ్చే ఆరోగ్య, మానసిక, సామాజిక, భౌతిక పరిణామాలు – రచయిత చెప్తేనే కాని మనకు తెలీదు. ఈ ఇంజనీరుగారు గడుసుగా కొన్ని ఎల్లల్ని తనే బిగించి, ఆయన తీసుకెళ్ళే దారిలోనే మనల్ని నడిపిస్తారు. 

    ఆయా రుగ్మతల సమస్యలు మన అనుభవంలోకి రానప్పుడు, ఆ సమస్య, దానికి సంబంధించిన పరిణామాలు మనకు hearsay గానే మిగిలిపోతాయి. మనకి అరుదైన నేపధ్యం – అమెరికా. ఈ సృష్టిలోనే అరుదైన రుగ్మతలు ఈ జబ్బులు. ఆ సమస్యలో పాత్రల, సంఘటనల నడక బొత్తిగా కొత్తది. వింతయినది. ఇది ఇతివృత్తం చేసే శాసనం. దీనికి మరో తీర్పు లేదు – ఇది రచయిత కోరుకున్న, ఎంచుకున్న నేపధ్యం కనుక.

    ఈకథల్లో ఎన్నో కొత్త లోకంలో, కొత్త విషయాలున్నాయి. ఈ లోకంలోకి రచయిత మన చెయ్యి పుచ్చుకుని నడిపించుకు పోతారు. మనం తప్పిపోకుండా ఆయన వెనుక బుద్ధిగా నడుస్తాం.

    రచయిత చుట్టూ వున్న సమాజంలోనించీ ఇతివృత్తాల్ని ఎన్నుకుంటారు. చూసే చిత్రాలకి, వినే వార్తలకి, జరిగే సంఘటనలకీ స్పందిస్తారు. ఇవన్నీ ఆయన కథలకి స్పూర్తి. చాల కథలని సత్యంగారు సూచనగా వదిలేస్తారు. అది మంచి కథ లక్షణం. గొప్ప కథలకి చుక్కాని. అయితే ఒడ్డు మరికాస్త దూరంలో ఉందనగానే – నీటిలో కాళ్ళు అందని లోతులో దింపేసిన ‘బెంగ’ నాలాంటి వాడికి కలుగుతుంది. మరొక్క వాక్యమో, మరొక్క వివరణో రచయిత సూచనప్రాయంగా చేస్తే బాగుండునని నాకు అనిపించిన సందర్భాలున్నాయి.

    ఉదాహరణకి – ‘పూలు లేని కాడలు’లో సూచనగా వదిలేసిన ముగింపులో రచయిత ‘పేదరికానికి మతం లేదు. పసిపిల్లలకి మతం తెలీదు. చదువుకున్న అజ్ఞానులకే ఈ మతం’ అని రచయిత కేవలం ‘సూచించి’ వదిలేశారు. ‘నాతిచరామి’లో మానవత్వంలోనే దైవత్వం చూడడాన్ని సూచించారు. ఇలాంటి సందర్భాల్లో మూల సూత్రాన్ని మరి కాస్త వాచ్యం చేస్తే, రచన ‘రుచి’ పెరుగుతుందని నాకనిపించింది.

    నిజానికి రచయిత ఒక కథకు ఉపోద్ఘాతం రాస్తూ, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు – మానవత్వంలో దైవత్వాన్ని వెదకడం తనకి ఇష్టమని. పక్కవాడి జాలినో, ఊతాన్నో, అందుకుని బ్రతకడం ఆయనకి నచ్చదు. కనీసం రెండు కథల్లో, రెండు పాత్రల ద్వారా స్పష్టంగా ఆ ఉద్దేశాన్ని సూచించారు. అంతిమ క్షణాల్లో లైఫ్ సపోర్ట్ అవసరమైతే, ‘నన్ను హాయిగా వెళ్ళిపోనివ్వండి’ అనే ఆలోచనని, ‘వెళ్ళొస్తానండీ’, ‘సత్యం శివం సుందరం’ కథల్లో చెప్పారు. అది వ్యక్తి ఆలోచనలో డిగ్నిటీకి నిదర్శనం.

    ‘ఉమారమణీయం’లో ఉమ అమెరికాలో వుంటూ, ఇండియాలో పక్షుల కిలకిలా రావాలు, హరిదాసు కీర్తనలు మిస్సవుతున్నానని వాపోతుంది. ఇండియా లోనూ అందరూ మిస్ అవుతున్నారని ఆమెకి తెలీదు. రమ, భక్తియాత్రలంటూ భర్తతో దేశమంతా తిరిగిందే కాని, అమెరికా వెళ్ళాలనే కోరిక మిగిలిపోయింది. ఇద్దరూ రెండు రకాలయిన రాజీలతో, ఫ్రాంక్ఫర్ట్ ఎయర్పోర్ట్లో కలుస్తారు. కలం పట్టుకుంటే, అమెరికాలో ప్రతి తెలుగింటిలోనూ ఇలాంటిదో కథ దొరుకుతుంది.

    నాకు నచ్చిన, కితకితలు పెట్టినట్టు నవ్వించిన కథ – ‘అరిచ్చెందర మాత్తర్లు’ కథ. నిజానికి ఇది కథ కాదు. అద్భుతమైన నాటిక. సత్యంగారు పాంట్రీలోకి జొరబడి, స్వచ్చమైన వీట్ బ్రెడ్ తీసి, మైక్రోవేవులో వేడి చేసి, మర్మలేడ్ రాసి, రెండు కొనలు కొరికి – కలాన్ని హాస్యంలో ఉదారంగా ముంచి – ఈ కథ వ్రాయటానికి కూర్చున్నారనిపించింది. ఆ కథలో ప్రతి వాక్యమూ పదును తేలింది.  మచ్చుకి:

    ‘రాజరికాలు పోయాక మంత్రులే రాజులయారు కనుక, ఈ రాజుగారు మంత్రయారు’

    ‘దేవుడు గొప్ప ఇంజనీరు సుమా. మనిషి ఏదన్నా అనేటప్పుడు పెదిమలు కదులుతాయి. కానీ అనుకునేటప్పుడు పెదిమలు కదలవు కదా’

    ‘నేను ప్రభుత్వోద్యోగిని. ప్రభుత్వం ఏది నమ్మితే. నేను అదే నమ్ముతాను’

    నా సవరణ. ప్రభుత్వం ఏది నమ్మమంటే..

    ‘దేవుడి సృష్టిలో లోపం ఇదే. మనలో మనం నవ్వుకున్నా, పెదవుల మీద ఆ నవ్వు లీలామాత్రంగా కనిపిస్తూనే వుంటుంది’

    ఇవి అరిచ్చెందర మాత్తరలు కావు. అనకాపిల్లి బెల్లంతో చేసిన యాప వుండలు.

    నేను దాదాపు 50 ఏళ్ళ క్రిందట ‘నిజం నిద్రపోయింది’ అనే నాటిక వ్రాశాను. మూలం మాత్రం అదే. కానీ నేపధ్యం, ధోరణి వేరు.

    సత్యంగారు అర్జంటుగా ఈ కథని నాటికగా వ్రాస్తే, అద్భుతంగా రాణిస్తుంది. నాటకీయత నూటికినూరు పాళ్ళూ పుణికి పుచ్చుకున్న ఇతివృత్తం. రచయిత నిర్వహించిన తీరు కూడా అత్యంత శ్లాఘనీయం.

    కథలో కొత్తదనాన్ని, కొత్త ఆలోచననీ, కొత్త ఒడుపునీ, కొత్త నేపధ్యాన్నీ, ఎప్పటి కప్పుడు అన్వేషిస్తూ తనకి తెలిసిన ప్రపంచంలోంచి పాఠకుడికి తెలియాల్సిన కోణాన్ని ఆవిష్కరించే ఇంజనీరు సత్యం మందపాటి.

    గొల్లపూడి మారుతీరావు

    విశాఖపట్నం

    నవంబరు, 2014

    నేను - నా కథలు

    ‘సత్యం శివం సుందరం’ అనే ఈ కథల సంపుటిలో, నేను ఈ సహస్రాబ్దంలో వ్రాసిన 26 కథలు వున్నాయి. వీటిలో చాల వరకూ అమెరికా నేపధ్యంలో జరిగిన భారతీయుల జీవిత కథలు. కొన్ని కథలకి ఇండియా నేపధ్యం తీసుకోవలసిన అవసరం వుండి, ఆ పని చేయవలసి వచ్చింది. కొన్ని ఇండియా నేపధ్యంలోనే జరిగిన కథలు.

    ఇంకా కొన్ని గొల్లపూడి మారుతీరావుగారు చెప్పినట్టు, ఈనాటి ప్రపంచంలో బయటికి వస్తున్న, ఎన్నో రకాల మానసిక, శారీరక రుగ్మతలని ఆధారం చేసుకుని  వ్రాసిన కథలు. మన తెలుగువాళ్ళకి ఇలాటి రుగ్మతల గురించి చెప్పాలనే తపనతో వ్రాసినవి.

    ‘ఆయన పెద్దవాడయిపోయాడు, అందుకని ఈ రోగం వచ్చింది. ఇంకా ఈ వయసులో దానికి మందెందుకు?’ అని వదిలేసిన సందర్భాలు ఇండియాలో ఎన్నో చూశాను. మతిమరుపు ఎక్కువ అవుతుంటే, ‘ఏదో పెద్దవాడు, మరచిపోడా?’ అని వదిలేస్తారే కానీ, అది డెమెన్షియా అనీ, ఆల్సైమర్స్ జబ్బుకి దారి తీస్తుందనీ తెలుసుకోలేక, చికిత్స మానేసి, 70 సంవత్సరాల వయస్సులోనే, పొగొట్టుకున్న వారిలో మా దగ్గరి బంధువులే కొంతమంది వున్నారు. కొన్ని రుగ్మతలు, ఈనాడు అక్కడా ఇక్కడా మాత్రమే జరుగుతున్నా, చాల త్వరగా వ్యాపిస్తున్నాయి కూడాను. అలాటిది ఇక్కడ అమెరికాలో వాటిని ముందుగా కనుక్కుని, సమయం మించిపోకుండా సరైన చికిత్స చేసి, మనుష్యులకు మరోజన్మని ఇస్తుంటే, కనీసం ఇలాటి సమాచారం మనవాళ్లకి అందివ్వటం నా బాధ్యత అనిపించి, వ్రాసినవి ఇలాటి కథలు.

    నా కధల్లో క్లుప్తత వుంటుందని చాల మంది అంటుంటారు. ఆ క్లుప్తతతో పాటు, కొంచెం గుప్తత కూడా అవసరం అని నా ఉద్దేశ్యం. ఇక్కడ గుప్తత అంటే, మరీ అరటిపండు వలిచి చేతిలో పెట్టకుండా వుండటం అని నా భావన. అంతా రచయితే చెప్పే బదులు, పాఠకులని కొంత ఆలోచనలో పెడితే, ఆ రచన ఒక బాధ్యత కలిగిన రచన అవుతుందని కూడా నా అభిప్రాయం. 

    ఈ పుస్తకంలోని కథల్లో, కొన్ని హాస్య కథలున్నాయి, కొన్ని సీరియస్ కథలున్నాయి. కొన్ని బహుమతులు అందుకున్న కథలు వున్నాయి. ఈ కథలన్నీ తెలుగునాట ఆంధ్రభూమి, విపుల, స్వాతి, స్వప్న, రచన, ఈనాడు ఆదివారం, నవ్య, సురభి మొదలైన పత్రికల్లోనూ, అమెరికాలో వివిధ పత్రికల్లోనూ ప్రచురించబడ్డవే! 

    ఈ కథలని ప్రచురించిన పత్రికా సంపాదకులకు, బహుమతులనిచ్చి ప్రోత్సహించిన సంస్థలకీ నా మనఃపూర్వక ధన్యవాదాలు. 

    అడగగానే, ఎంతో బిజీగా వుంటున్నా, వెంటనే ‘నా మాట’ వ్రాసి పంపించిన నా అభిమాన రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావుగారికి సర్వదా కృతజ్ఞడిని.  

    ఈ కథలన్నీ ప్రచురణకి ముందే చదివి ఎన్నో సలహాలిచ్చినది నా శ్రీమతి విమల. ఆవిడ లేకపోతే, నేను లేను. నా సాహిత్యం లేదు. అందుకే ఆవిడకి నా ధన్యవాదాలు.

    నేను అమెరికాలో ఎన్నో దశాబ్దాలుగా వుంటున్న బహుదూరపు బాటసారినే అయినా, ఇండియాలో నేను లేని లోటు తీర్చి, నా కథలు, పుస్తకాల విషయంలో, నా పక్కనే నిలబడి, ఎంతో శ్రమకోర్చి, నన్ను ప్రోత్సహిస్తున్న, అక్కయ్య రచయిత్రి శ్రీమతి ఉంగుటూరి శ్రీలక్ష్మి, మా బావగారు వి.వి.సుబ్బారావుగార్లకు, నేను ఎంతో ఋణపడి వున్నాను. వారిద్దరూ నాకు సహాయ సహకారాలింతగా ఇవ్వకపోతే, నా తెలుగు సాహిత్య సమారాధన ఏనాడో కొండెక్కి వుండేది. వారిద్దరికీ గౌరవంతో, ప్రేమతో, నా నమస్సుమాంజలి.

    కొన్ని కథలకి డిటిపి పని చేసి ఇచ్చిన ఉజ్వల్ మానేపల్లికి ధన్యవాదాలు.

    అందమైన ముఖచిత్రాన్ని చిత్రించిన వాసుగారికి ధన్యవాదాలు.

    పుస్తకాన్ని ఎంతో అందంగా ప్రింటు చేసిన శ్రీకళా ప్రింటర్స్ శ్రీనివాసరావు గారికీ, పుస్తకాన్ని ఇండియాలో పంపిణీ చేస్తున్న ‘నవోదయ’ సాంబశివరావుగారికీ కృతజ్ఞుడిని.

    ఇది ప్రింటు చేసిన నా పుస్తకాలలో పదకొండవది. మూడు ఈ-పుస్తకాలు కూడా, ‘కినిగే.కాం’ సైటులో వున్నాయి. వీటినన్నిటినీ ఆదరిస్తున్న మీకు ఈ కథా సంపుటి కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

    సత్యం మందపాటి

    ఆస్టిన్, టెక్సస్, యు.ఎస్.ఎ.

    జనవరి, 2015 

    వావీ... వరసా...

    1. సౌమ్య

    2.  సాధించవే మనసా

    3.  కరణేషు మంత్రి

    4.  నిన్ను నిన్నుగా ప్రేమించు

    5.  మరణ ముహూర్తం

    6.  నమ్మకమా, నిన్ను నమ్మవచ్చా?

    7.  సత్యం శివం సుందరం

    8.  చిలుక పచ్చ సిలుకు చీర

    9.  అరిచ్చెందర మాత్తర్లు

    10. జీవితమే సఫలము

    11. పూలు లేని కాడలు

    12. జోయాన్

    13. గజగామిని

    14. మాతృత్వానికి మరో మణిహారం

    15. కార్యేషు దాసి

    16. కుంతి – కుమారి

    17. జాలి

    18. నాతిచరామి

    19.  ఉమారమణీయం

    20. భోజ్యేషు మాత

    21. అమ్మ కడుపు చల్లగా

    22. మరో ప్రస్థానం

    23. సంధ్యావందనం

    24. హారతి

    25. బృందావనం

    26. వెళ్ళొస్తానండీ! 

    సౌమ్య

    వారానికి కనీసం నాలుగు సార్లైనా మా ఇంటికి దగ్గరగా వున్న జిమ్కి వెళ్లి, గంటన్నరా, రెండు గంటలు ఎక్సర్సైజ్ చేయటం నాకూ, శిరీషకీ అలవాటయి పోయింది.

    ఆ రోజు శనివారం. ప్రొద్దునే తొమ్మిది గంటలకు జిమ్కి వెళ్ళాం.

    ఒక గంట ట్రెడ్మిల్ మీదా, ఇంకొక గంట బరువులెత్తటం, సైకిల్ తొక్కటం లాంటివి చేయటం అలవాటు. ఆ రోజు ఎందుకోగానీ నాకు కావలసిన అన్ని మెషీన్లు బిజీగా వున్నాయి. శిరీష తనకి కావలసిన ఎలిప్టికల్ మెషీన్ ఖాళీగా వుండటంతో అక్కడికి వెళ్ళింది. ఇక నేను మేడ మీద వున్న వాకింగ్ ట్రాక్కి వెళ్ళవలసి వచ్చింది. నేను ఎప్పుడో కానీ అక్కడికి వెళ్ళాను. ట్రెడ్మిల్ మీద వున్నా సౌలభ్యం నడకలో వుండదు. అక్కడ ట్రాక్ మీద పది రౌండ్లు కొడితే ఒక మైల్ అవుతుంది. నేను కనీసం మూడు మైళ్ళయినా నడుస్తాను. అంటే ముప్పై రౌండ్లు పైన నడవాలన్న మాట. చెవులకి ఎంపీత్రీ ఇయర్ ఫోన్లు తగిలించుకుని, ఘంటసాలవారి పాటలు వింటూ నడక మొదలుపెట్టాను.

    నాతో పాటు నలుగురైదుగురు వున్నారేమో అక్కడ. కొంతమంది జాగింగ్ చేస్తుంటే, కొంతమంది చకచకా నడుస్తున్నారు. మొదటి రౌండ్ చేస్తున్నపుడే అందరితోనూ గుడ్ మార్నింగులు  చెప్పించుకోవటం, చెప్పటంతో స్పీడ్ పెరగలేదు. తర్వాత స్పీడ్ పెంచి అందమె ఆనందం, ఆనందమె జీవిత మకరందం లాంటి పాటలు వింటూ, ఆనందంగా నడుస్తున్నాను.

    అప్పుడే వచ్చింది ఆవిడ. బాగా వయసున్న ఆవిడ. కనీసం డెబ్భైఐదేళ్ళ వయసుంటుందేమో, ఐదడుగుల పొడుగుంటుంది. సన్నగా, పీలగా వుంది. తెల్లటి జుట్టుతో, తెల్లటి నిక్కరు, టీషర్టులో, చిరునవ్వులు చిందించే ముఖంతో, ఎంతో అందంగా, దివి నుండి అప్పుడే దిగి వచ్చిన దేవతలా వుంది. చూడగానే నాకు ఒక విధమైన సదభిప్రాయం కలిగింది. ఆవిడ చకచకా నడుస్తున్నది.

    నాకన్నా కొంచెం ముందుగా నడవటం మొదలు పెట్టిన ఆవిడని అందుకోవటానికి ఎక్కువసేపు పట్టలేదు. ఆవిడ పక్కకి రాగానే, నా వేపు తిరిగి పలకరింపుగా నవ్వింది. వెన్నెల కురిసినట్టు వుంటుంది ఆవిడ చిరునవ్వు.

    చిన్నగా నవ్వాను ‘గుడ్ మార్నింగ్’ అంటూ.

    ‘నీ టీషర్టు మీద వ్రాసింది బాగుంది. ఉయ్ మస్ట్ బి ది ఛేంజ్ వుయ్ విష్ టు సీ’ అంది.

    ‘అవును. అది మహాత్మాగాంధీ చెప్పిన సూక్తి. ఈ టీషర్ట్ మా అమ్మాయి ఇచ్చింది నాకు’ అన్నాను.

    ఆవిడ తల వూపి చిరునవ్వు నవ్వింది.

    నేనూ నవ్వి, నడక వేగం పెంచాను.

    తరువాత ప్రతి శనివారం అక్కడికి వెళ్ళినప్పుడు, కనీసం ఆవిడని చూడటం కోసం పైకి వెళ్ళి ఒక పావుగంట అక్కడ నడవటం ప్రారంభించాను. ఆవిడ ఎక్కువగా మాట్లాడదు కానీ, సౌమ్యంగా నవ్వుతుంది.

    ఆరోజు కారులో ఇంటికి వస్తున్నప్పుడు అడిగింది శిరీష నవ్వుతూ ‘ఏమిటీ ఈ మధ్య జిమ్లో మేడ మీద కాలి నడక మొదలుపెట్టావ్. ఎవరైనా మంచి అందమైన అమెరికన్ అమ్మాయి కనపడిందా ఏమిటి’ అని.

    ‘అవును చాలా అందంగా వుంటుంది, అందంగా నవ్వుతుంది. పేరు సౌమ్య’ అన్నాను నేనూ నవ్వుతూ.

    ‘నిజంగానే..’ అంది కళ్ళు పెద్దవి చేసి శిరీష. ‘అవును.. నాకన్నా కనీసం పాతికేళ్ళు పెద్దది. అయినా నాకు బాగా నచ్చింది ఆవిడ. ఆవిడ చిరునవ్వు సౌమ్యంగా వుంటుంది కాబట్టి, అది నేను పెట్టుకున్న తెలుగు పేరు’ అన్నాను నవ్వుతూ.

    ఆవిడ అక్కడికి వచ్చే సమయంలో ఏమాత్రం మార్పు లేకపోవటంతో ప్రతి శనివారం కలుస్తూనే వున్నాను. ఆవిడ ఒక వేళ ఆలస్యంగా వస్తుంటే, నా కళ్ళు ఆవిడ కోసం వెతకటం కూడా మొదలుపెట్టాయి. అలా రెండు మూడు నెలలు గడిచాయనుకుంటాను. హఠాత్తుగా ఆవిడ రావడం మానేసింది.

    రెండు వారలు కనపడకపోయే సరికీ శిరీషతో ‘సౌమ్యగారు రావటం లేదు, ఎందుకో మరి’ అన్నాను.

    శిరీష ఆట పట్టిస్తూ ‘ఏం దిగులు పడ్డావా?’ అంది.

    ‘అవును’ అన్నాను.

    ‘ఎందుకు అంత దిగులు’ అంది నవ్వుతూ.

    ఈసారి సీరియస్గానే అన్నాను ‘నిజంగానే ఆవిడనీ, ఆవిడ చిరునవ్వునీ చూడాలని వుంటుంది నాకు. సౌమ్యంగా వున్న ఆవిడ ముఖం చూస్తే ఆ రోజంతా బాగుంటుంది నాకు. రెండేళ్ళ క్రితం పోయిన మా అమ్మ ముఖంలో కూడా అదే

    సౌమ్యమైన చిరునవ్వు చూసేవాడిని. అందుకేనేమో....’ అన్నాను.

    నా చెయ్యి పట్టుకుని మృదువుగా వత్తింది శిరీష.

    రెండు రోజుల తరువాత అనుకుంటాను. ఎనిమిదింటికే హాస్పిటల్కి వెళ్ళి నా మార్నింగ్ రౌండ్స్ ఐ.సి.యు. (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) దగ్గర నించీ మొదలు పెట్టాను. నా ఇద్దరూ పేషెంట్లనీ చూసి అక్కడినించీ వెళ్ళబోతుంటే, నర్స్ చెప్పింది ‘రూమ్ నెం. 327లో పేషెంటుని కూడా మీకే రిఫెర్ చేశారు’ అంటూ ఛార్ట్ అందించింది.

    పేషెంట్ పేరు జూలీ లెన్నీ. వయసు ఎనభై ఏళ్ళు. నాకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ నాన్సీ, ఆ పేషెంట్కి కార్డియలజిస్ట్ ఎవరు లేకపోవటంతో, నా చేతుల్లో పెట్టింది. రాత్రి తొమ్మిదింటికి హార్ట్ ఎటాక్ వచ్చి 911కి ఫోన్ చేస్తే పేషెంటుని ఎమెర్జెన్సీకి తీసుకువచ్చినట్టు వుంది ఛార్ట్లో. అంబులెన్సులో తీసుకువస్తున్నప్పుడు సిపిఆర్ కూడా ఇచ్చినట్టు వుంది. చేసిన పరీక్షలు, ఈసిజి రిపోర్ట్, ఇచ్చిన మందులు అన్నీ వివరంగా వ్రాసి వున్నాయి.

    తలుపు మీద రెండు సార్లు కొట్టి సమాధానం రాకపోతే, నెమ్మదిగా తలుపు తెరిచి లోపలి వెళ్ళాను.

    ముఖం ఒక్కటే కనపడేటట్టు దుప్పటి కప్పుకుని పడుకుని వుంది. ముక్కుకి ఆక్సిజన్ గొట్టాలు తగిలించివున్నాయి. రాత్రి నిద్రపోవటానికి మందులు ఇవ్వటం వాళ్ళ ఇంకా నిద్ర పోతున్నది.

    దగ్గరగా వెళ్ళి ‘మిస్ లెన్నీ’ అన్నాను నెమ్మదిగా. కొంచెం కదిలింది.

    పక్కనే వున్న లైటు వేస్తూ, ‘గుడ్ మార్నింగ్! హవ్వార్యూ?’ అన్నాను.

    ఆవిడ కళ్ళు తెరిచింది. అప్పుడే గుర్తు పట్టాను. ఆవిడే సౌమ్య. అసలు పేరు జూలీ అన్నమాట.

    అరే! పాపం! ఆరోగ్యంగా ఎప్పుడూ చిరునవ్వులు చిందించే ఆవిడ. మరి ఇలా ఎందుకు అయ్యిందో...

    నన్ను వెంటనే గుర్తు పట్టింది. చిరునవ్వు నవ్వింది. అదే సౌమ్యత, అదే వెన్నెల.

    ‘పోయిన రెండు శనివారాలు నేను జిమ్కి రాలేదు....ఒంట్లో బాగా లేక..’ అంది.

    ‘అవును. ఇప్పుడెలా వుంది?’ అడిగాను.

    ‘గుండెల్లో నొప్పి తగ్గింది కానీ, ఇంకా అప్పుడప్పుడూ వస్తూనే వుంది. ఇంతకు ముందు ఏనాడూ అనారోగ్యం లేదు నాకు. జ్వరం కూడా వచ్చేది కాదు’

    ‘నిన్న సాయంత్రం బాగా వీక్గా అనిపించింది. రాత్రి తొమ్మిదింటికి గుండెల్ని పిండేస్తున్నట్టుగా వుంటే విలవిల్లాడాను. వెంటనే 911 పిలిచి, తలుపు తీసి వుంచాను. వాళ్ళు ఎప్పుడూ వచ్చారో కూడా తెలియదు. దారిలో ఆక్సిజన్ ఇచ్చి, సిపిఆర్ చేసి, మొత్తానికి ఎంత చేయాలో అంతా చేసి, నా ప్రాణం పోకుండా కాపాడారు’ అంది.

    ‘మీకు ఎవరూ లేరా?’ అడిగాను.

    ‘లేరు. నేనొక్కదాన్నే. మా అయన ఏడు నెలల క్రితమే చనిపోయాడు’ అంది.

    ‘మీకు సహాయంగా ఎవరైనా దగ్గరివాళ్ళని పిలిపించమంటే ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను పిలిచి చెబుతాను... భయపడాల్సింది ఏమీ లేదు కానీ తోడుగా వుంటారని’ అన్నాను.

    ఆవిడ ముఖకవళికలు మారాయి. అదోలా అయిపొయింది. వెంటనే తమాయించుకుని, తన ట్రేడ్మార్క్  చిరునవ్వు నవ్వింది.

    ‘లేదు. అవసరమయితే నేనే చెబుతాను’ అంది.

    ‘నన్ను చూస్తున్నందుకు ధాంక్స్. మీ చేతుల్లో భద్రంగా వుంటానని తెలుసు. ఒక్క విషయం చెప్పండి. బ్రతుకుతానంటారా?’ సూటిగా అడిగింది.

    ‘తప్పకుండాను. మీ వయసుకి మించిన ఆరోగ్యంతో వున్నారు. రోజుకి రెండు మైళ్ళు నడుస్తున్నారు. ఏం ఫరవాలేదు. కాకపోతే కొన్ని పరీక్షలు చేసి ఆర్టరీస్ ఎంత బ్లాక్ అయ్యయో చూడాలి. దాన్నిబట్టి మిగతా నిర్ణయాలు తీసుకుందాం’ అన్నాను.

    ‘మళ్ళీ సాయంత్రం వస్తారుగా’ అని అడిగింది.

    నిజానికి అన్ని పరీక్షలూ పూర్తయి, మర్నాటి లోపల డాక్టర్ రిపోర్టులు రావు. అయినా ఎందుకో వచ్చి ఆవిడ పక్కనే వుండి ధైర్యం చెప్పాలనిపించింది.

    ‘వస్తాను. బహుశా చీకటి పడ్డాక’ అన్నాను.

    ‘ఫర్వాలేదు నిద్రపోను లేండి’ అంది నవ్వుతూ.

    నేను వచ్చేసరికీ రాత్రి తొమ్మిదయింది. ఆవిడ నిద్రపోతున్నది. ముఖం ప్రశాంతంగా వుంది. నిద్రలో కూడా అదే చిరునవ్వు అదే సౌమ్యత. అదే వెన్నెల.

    నేను తెచ్చిన పూలగుత్తి, గెట్ వెల్ కార్డు అక్కడ పెట్టి, కేస్ షీట్ అందుకుని చదివాను. అన్ని పరీక్షలూ చేశారు. కొన్ని ఫలితాలు వచ్చాయి. కొన్ని మర్నాడు ప్రోద్దుటికి కానీ రావు. ఆవిడ ఇసిజి అంత సుముఖంగా లేదు. నేను అనుకున్నట్టు ఆరోగ్యంగా ఏమీ బాగా లేదు.

    ఇంటికి వచ్చాక శిరీషకి చెప్పాను జరిగిన విషయం.

    ‘అయ్యయ్యో, ఈ వయసులో ఎందుకొచ్చిందో పాపం. కోలుకుంటుందా?’ అడిగింది.

    ‘కష్టమే. రేపు మిగితా రిజల్ట్స్ చూస్తే కానీ నిర్ధారణగా చెప్పలేం’ అన్నాను.

    మర్నాడు పదకొండింటికి వెళ్ళాను. నేను అనుకున్నట్టుగానే రిపోర్టులు అన్నీ వచ్చాయి. ఆవిడకి రెండు ఆర్టరీలు తొంభై శాతం పైనే పూడుకుపోయాయి. బైపాస్ సర్జరీ చేయకపోతే చాలా కష్టం. కానీ ఆ వయసులో సర్జరీని తట్టుకోగలదా?

    లోపలికి వెళ్ళాను. నవ్వుతూ పలకరించింది.

    ‘ఎలా వున్నారు. రాత్రి బాగా నిద్ర పట్టిందా?’ అంది.

    చిన్నగా నవ్వి ‘రిపోర్టులు అన్నీ వచ్చాయి’ అన్నాను.

    ‘నేను ఎలా వున్నాను’ అంది నవ్వుతూ.

    ‘అంత మంచి వార్త కాదు’ అంటూ అసలు విషయం చెప్పాను.

    ‘బైపాస్ సర్జరీ చేయటం అవసరం. కానీ ఈ వయసులో, ఈ పరిస్థితిలో అదెంత మంచిదా అని ఆలోచిస్తున్నాను’ అన్నాను.

    జూలీ ఒక్క క్షణం ఏమి మాట్లాడలేదు. ఆలోచిస్తున్నది. తలెత్తి అడిగింది. ‘సర్జరీ చెయ్యకపోతే ఏమవుతుంది’ అని.

    ఆవిడ చేయి పట్టుకుని అన్నాను, ‘స్టెంట్ పెట్టటానికి

    Enjoying the preview?
    Page 1 of 1