Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

మంచు మొగ్గలు (Manchu Moggalu)
మంచు మొగ్గలు (Manchu Moggalu)
మంచు మొగ్గలు (Manchu Moggalu)
Ebook446 pages3 hours

మంచు మొగ్గలు (Manchu Moggalu)

Rating: 3 out of 5 stars

3/5

()

Read preview

About this ebook

Snow flowers look so beautiful and fascinating yet nature made them never to become sun flowers.
Love too is charming but can it with stand heat of Life?
“అన్నీ వుంటే 'స్వీట్ హార్ట్'
అంటాడు . ఏమీ లేకపోతే చెల్లెలు లాంటిది అంటాడు."
మగాళ్ళ మనస్తత్వం ఇంతేనా?

మంచు మొగ్గలు (Manchu Moggalu)
Author

డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

Dr Sai Ramesh Gandham - Pen name "Radha" (డాక్టర్ సాయి రమేష్ గంధం - “రాధ”)Medical Doctor by vocation and writer by avocation -Loves Music and believes that out of all the arts singing is not just a talent but it is a unique the gift from almighty -'God'Penned lyrics for Fifty five songs (46 devotional songs and 9 social songs) - all sung by eminent South Indian singers like Dr SP Balu,Shankar Mahadevan,Janaki ....and many more great singers.The albums Sai Gananjali(Music director: Sunil Kashyap), Sai Geethanjali(Music Director: Gangadhar of Bhagavadgeetha foundation), Sai Stotranjali (Music Director: Ravi Chandra) , Daiva Swaranjali and Hanumanjali ( Music director: Phani Narayana very famous veena player) were successfully released by Madhura Entertainment ."God made man&woman made mesmerizing music"Songs links:https://eternaltunes.godaddysites.com/https://soundcloud.com/user-724062537/trackshttps://www.youtube.com/channel/UCO6qz6d_pT1E6EczyYpGw4Ahttps://open.spotify.com/playlist/2Z2Q9S8mvZsxLKdDTvWS5Jhttps://wynk.in/music/artist/dr-sai-ramesh-gandham/wa_42ByHb9wgghttps://www.jiosaavn.com/s/playlist/689fe43ac877afea85e170f5aa20dcd7/Starred_Songs/R,Ax0h5vSXVuOxiEGmm6lQ__Author of 18 published medical articles and many English poems and few short stories.Links:http://orcid.org/0000-0003-2049-7088https://scholar.google.com/citations?user=ZMzzFM0AAAAJ&hl=en&citsig=AMD79oqnkFgRccYWEObPYbCrUbbKc9k6ighttps://scholar.google.com/citations?user=ZMzzFM0AAAAJ&hl=en&oi=sraWrote several telugu novels and several short storieshttps://sayirameshgandham.medium.com/

Read more from డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

Related to మంచు మొగ్గలు (Manchu Moggalu)

Related ebooks

Related categories

Reviews for మంచు మొగ్గలు (Manchu Moggalu)

Rating: 3 out of 5 stars
3/5

2 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    మంచు మొగ్గలు (Manchu Moggalu) - డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

    రాధ రాసిన

    మంచు మొగ్గలు

    డాక్టర్ సాయి రమేష్ గంధం

    Copy right @

    writer & Publisher:

    Dr Sai Ramesh Gandham (డాక్టర్ సాయి రమేష్ గంధం)

    లండన్ మహాసగరంలో విక్టోరియా అనే ప్రాంతంలో వెలింగ్టన్ స్ట్రీట్ అనే పెద్ద సందులో చిన్నతరహా పెద్ద మనుషులు చేతిలో డబ్బులు మూలుగుతున్నప్పుడల్లా వచ్చి చూసిపోయే మామాడ్యూక్ కెసీనోలో, అతి సాధారణమైన యిటాలియన్ వైన్ సేవిస్తూ, తెల్లవాళ్లు ఆడంబరానికి కృత్రిమంగా పెంచుకునే చిన్ని పొదరింటి మొక్కల చాటున, ఓ మూలవేసి వున్న టేబుల్‌ ముందు ఎదురెదురుగా కూర్చుని ఒకరినొకరు అదేపనిగా పరీక్షించుకుంటున్నారు, పేరుకి భారతీయులు అని చెప్పు కొనబడే ఓ పెళ్లికాని యువ జంట.

    ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావ్ సుమా .. అన్నాడు రవి, మగాడు ఎప్పడూ ఆడదానితో ముచ్చటించే మాటల్నే కాస్త హుందాగా ఉచ్చరిస్తూ

    ఓ రియల్లీ ... మురిసిపోయింది కల్పన.

    ఇంగ్లాండులో పుట్టి పెరిగిన వ్యక్తులేమో చూడటానికి చక్కని దొరపిల్లల్లా కనిపిస్తున్నారు యిద్దరూ.రంగు హంగుతోపాటు ఆంగ్లేయ నడవడికలు నాగరికతలు కూడా బాగా వంటబట్టించుకున్నారేమో, అసలైన సిసలైన భారతీయులు వీళ్ల తాత ముత్తాతలు అని చెప్పుకోటానికి కూడా వీలు లేకుండా చేస్తున్నాయి ఆ యువతీ యువకుల అవతారాలు.

    చూసే వాళ్లకి ఏ స్పెయిన్ నుండో, గ్రీస్ నుండో వలస వచ్చిన తెల్లవాళ్లలా కనిపిస్తారేకాని, భారతీయులన్న అపోహకూడా కలగదు ఎవరికీ.

    కల్పన .. నాకు తెలీక అడుగుతామ. నేను చెప్పి నట్టు ఎందుకు చేయకూడదు చెప్పు కళ్ళల్లో కోమలి అందాల్ని కరిగించుకుంటూ కోరిక తీరా అడిగాడు రవి.

    బాగుంది నీ వరస .. నువ్వు ఎన్నెన్నో చెప్పావు .. యింకెన్నో ప్రామిస్ లు కూడా చేశావు .. ఏదని గుర్తుంచుకోమంటావు ...

    ఐసీ

    కళ్లు చెదిరేలా ఎగసిపడుతున్న ఆ సుందరాంగి లేత గుండెలమీద చూపులు కేంద్రీకరించి , మత్తెకించే లోలోపలి అందాల్ని ఊహించుకుంటూ వుక్కిరి బిక్కిరి అయ్యాడు రవి.

    ఆ మాత్రం పసికట్టలేని అమాయకురాలు కాదు కల్పన .

    అంతా నీకే అర్పితం అని ఎపుడో మాట యిచ్చానుగా అంది ముద్దుగా చూస్తూ,మోజుగా చేయి పట్టుకుని నిమురుతూ

    ఆయ్ నొ ... బట్ ..

    ఎందుకు రవీ అంత అనుమానం .. ఎవరు కాదన్నా ఈ కల్పన మాత్రం నీది .. నీ సొంతం .. రియల్లీ .. బిలీవ్ మీ ...

    చెల్లాచెదరైన కారుమబ్బుల్లా విరబూసుకున్న నల్లనికేశాలని వయ్యారంగా తల విదిలించి వెనుకకి తోసుకుంటూ బుజ్జగించింది కల్పన.

    ముచ్చటైన ఆమె ముఖంలో తీర్చిదిద్దినట్లున్న ఏ పూతలూలేని ఎర్రని పెదవులు అందుకుని ఆస్వాదించటమంటూ తొందర పెట్టాయి అతగాడిని , అపురూపంగా అదిరిపడుతూ . అయినా ఆ అందాల బాల కళ్లల్లోంచి తన నీడని తప్పించుకుని ఆమె సొగసులకోసం ప్రాకులాడ లేకపోయాడు రవి.

    ఏదో తెలియని నిండుతనంతో నిగనిగలాడుతున్న ఆమె నీల నేత్రాల్లోకి తదేకంగా చూస్తూ మెత్తని గుండెల గోడల మీద మసక మసక రంగులలో ఏవో తెలియని నగ్న చిత్రాన్ని ఊహిస్తున్నాడతను

    ఏమిటి రవీ అంత దీక్షగా ఆలోచిస్తున్నావ్ ..

    ఏమీ లేదు ..

    ఏమీ లేదా ... అంది కల్పన కోరిక తీరా చూస్తూ

    అదే ... యింత అందాన్ని ఎందుకలా వృధాచేస్తున్నావో నాకు అర్ధంకావడంలేదుసుమా ... మనసులో మాట మాటల్లో పెట్టలేక కాస్త అవస్థపడ్డాడు రవి

    ఇంతకీ సందేశం ఏమిటంట ..

    సందేశంకాదు ... చిన్న సలహా ...

    ఆల్ రైట్ ..ఏదో ఒకటి ... అసలు విషయం ఏమిటో చెప్పు ...

    ఏముంది .. వెరీ సింపుల్ .. అందాన్ని అడవి కాచిన వెన్నెల చేస్తే ఎవరికీ ఏమీ వరగదేమో ... వాట్ డూ యు సే స్వీట్ హార్ట్ ..

    ఆ మాటే గట్టిగా అంటే తను ఎంత విమర్శకు గురి కావాల్సి వస్తుందో అతడికి బాగా తెలుసు . అందుకే తగు జాగ్రత్త తీసుకుంటూ తన అభిప్రాయాన్ని చూచాయగా సూచించాడు రవి .గాఢంగా నిట్టూర్చి గ్లాసులోని వైన్ ని సుకుమారంగా సిప్ చేసింది కల్పన, గుండెల్లో వస్తున్న గుబుల్ని మత్తు పానీయంతో చిత్తు చేసి సద్దుమణిగిస్తూ

    అందులో తప్పేముంది చెప్పు .. అవకాశాన్ని వదులుకోలేకపోయాడు రవి. ఆప్యాయంగా ఆమె చేయి అందుకుని సవరిస్తూ, సముదాయించి చెప్పాడు చూడు కల్పనా .. నా చేతిలో మంచి ఆర్ట్ వుంది ... నీకా కావల్సినంత అందం వుంది ... పైగా మన మనసులు కూడా కలిశాయి ... అవునా ... పోతే మనం యిద్దరం యింకా ఏకం కాలేదు అనుకోవడానికి ఏదైనా అభ్యంతరం అంటూ వుంటే దానికి కారణం నువ్వూ కాదు ... నేనూ కాదు ... అశాశ్వతమైన ఈ శరీరాలు మాత్రమే ... యు నో దట్ ప్రెట్టీ వెల్ .. డోంట్ యు ... ఆఫ్ట్రాల్ ఈ భౌతిక కాయాన్ని కలుపుకోటం ఎంత సేపు .. ఫ్యూమినిట్స్ జాబ్ ... నువ్వేదో పురాణం భారతం అని బెంగ పెట్టుకున్నావు కాబట్టి పెళ్ళి వరకు ఆగుదామని మాట యిచ్చానేకాని ఐ హేట్ దట్ సెంటిమెంట్ .. నాకు తెలీక అడుగు తాను అసలు అలాంటి ఫన్నీ ఫీలింగ్స్ ఎందుకు ఉండాలి మనకి ... ఓకే మన పూర్వీకులు భారతీయులే కావచ్చు ... వాళ్ళకేదో పిచ్చో , వెర్రో వుండివుండొచ్చు ... అదంతా వాళ్ళ గొడవ .. మనం ఇప్పుడు భారతీయులం కాదు కదా వైషుడ్ వుయ్ బోదర్ ... లిసన్ .. యు ఆర్ ఎ బ్రిటిష్ సిటిజన్ .. అవునా నేనూ బ్రిటిష్ పౌరుడినే ... యిండియన్ లేడీస్లా నువ్వు చీరలు కడుతున్నావా చెప్పు .. నో .. బేంగిల్స్ వేసుకుంటున్నావా .. లేదే ... దెన్ వై ఆర్ దీజ్ ... వుయ్ ఆర్ క్రే జీ రియల్లీ... ఎవరో ఎప్పుడో సృష్టించుకున్న సాంప్రదాయాల చాటున ఇప్పుడు మన ఆనందాన్ని ఆహుతి చేసుకుంటే నష్టం ఎవరికి ఆ తరువాత ఏదో పోగొట్టుకున్నామని ఏడిస్తే ప్రయోజనం ఏమిటి ... వుయ్ మస్ట్ రియలైజ్ దట్ ...

    "ఇంతకీ ఈ ఉపన్యాసమంతా దేనికి ... ఆత్మాభిమానం చంపుకుని కాని పని చేయమంటావు .. అంతేగా లిసన్ టుమి మైడియర్ రవి ... నువ్వు ఏం చేసినా సరే నా నగ్న చిత్రాల్ని గీయడానికి మాత్రం చచ్చిన ఒప్పుకోను ... అండ్ అయ్ వార్న్ యు ...

    నెవ్వర్ ఇన్ సిస్ట్ మి టు డు దట్ ... యు ఆండర్ స్టేండ్ ..." కనకాంబరం రంగు దాల్చాయి కల్పన కపోలాలు కోపంతో.

    ఓ మై గుడ్ నెస్ ... ఎందుకంత ఆవేశం? టేకిట్ ఈజీ మైలవ్ ... లిసన్ మనిద్దరం కలిసి డబుల్ ఎ సర్టిఫికెట్లున్న సినిమాలు ఎన్ని చూశామో మర్చిపోయావా ... అంతే కాదు సభ్యతలేని కేబ్రేలు చూడలేదా ... ఒకటేమిటి అనాగరికమైన ఆడల్ట్ షోలు... .. ఎన్ని చూడలేదు. అదంతా ఆత్మగౌరవం చంపుకునే అంటావా...

    మిస్టర్ రవి ప్రతాప్ ... అదీ యిదీ ఒక్కటే అనుకుంటే యు ఆర్ రియల్లీ యిన్ సేన్ .. దట్సాల్ ... అంతకంటే నేనేమీ కామెంట్ చేయలేను

    ఐ సీ ... జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ... ఇఫ్ యుడోంట్ మైండ్ రెండింటి మధ్య తేడా ఏమిటంట ... చిలిపిగా నవ్వి జవరాల్ని కవ్వించాడు

    నీకు ఏమీ కనిపించక పోవచ్చు .. కాని చాలా తేడా వుంది మిస్టర్ .. మాటల్లో అర్థంకాదు మట్టి బుర్రకి ... చూడడం వేరు చేయడం వేరు యు బెటర్ రియలైజ్ దట్ ... అంది కల్పన వాడి చూపులతో వేడిగా చూస్తూ

    చూసి నేర్చుకున్నది చేసి చూపడంలో తప్పేముంది .. చూసింది నేర్చుకున్నదీ తప్పే అయినప్పుడు .. పంతానికి పొడిగించాడు రవి

    రియల్లీ ... యు ఆర్ ఎ ఫూల్ రవీ ... నీతో వాదించడం నాదే బుద్ధి తక్కువ విసురుగా కుర్చీలోంచి లేవబోయింది కల్పన

    చటుక్కున ముందుకు వంగి చేయిపట్టుకొని ఆపి, రెండో చేత్తో మృదువుగా ప్రియురాలి చెక్కిలి నిమురుతూ సంజాయిషీ చెప్పుకున్నాడు రవి

    డార్లింగ్ ... డోంట్ గెట్ సో అప్ సెట్ ఎబౌట్ ఇట్ .. ఏదో మాట వరసకి అన్నానంతే ఈమాత్రం దానికే ఇంత కోపమైతే ఎలా అబ్బా ... అయినా నీకు ఇష్టంలేని పని ఎప్పుడైనా చేశానా ... ఎప్పుడైనా నిన్ను అలా చేయమని బలవంతం పెట్టనా నువ్వే చెప్పు ..

    క్షణకాలం విరామం ప్రకటించింది కల్పన, మాటలు పెంచలేక మౌనం వహిస్తూ

    ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావ్

    చాలా లేట్ అయినట్లుంది మనం బయలుదేరితే బాగుంటుందేమో అంది కల్పన హడావిడిగా హేండ్ బ్యాగ్ తీసి మేకప్ అద్దుకుంటూ

    ఏమిటా కంగారు కాసేపు కూర్చుని వెళదాంలే అన్నాడు రవి కొట్టిపారేస్తూ

    టైమ్ ఎంతయిందో తెలుసా?

    కెసీనో అంతా ఒక్కసారి కలయచూస్తూ జూద వినోదాల్లో తేలిపోలేక మునుగుతున్న ఆంగ్లేయుల్ని తిలకిస్తున్నాడు రవి, ప్రియురాలి మాటలని పట్టించుకోకుండా

    పదకొండు దాటింది ... కెన్ యు హియర్ మి అంది కల్పన రెట్టిస్తూ

    ఆంతేకదా బెంగ పెట్టుకోక తెల్లవారే లోపల మీ ఇంటి దగ్గర దింపే బాధ్యత నాది సరేనా

    లుక్ రవి .. వంటి మీదకు ఎంత వయసు వచ్చినా నేను ఇంకా తల్లిదండ్రుల అదుపాజ్ఞలో వున్న పిల్లనే ఆనిమాత్రం మర్చిపోక .. అంది అసహనంగా చూస్తూ

    ఈ పెళ్లి చేసుకోబోయే వాడితో ఎంత సేపు తిరిగినా... ఎలా తిరిగినా.. ఈ దేశంలో ఎవరూ తప్పు పట్టరు .. ఇది ఇండియా కాదుగా వర్రీ అవ్వక ..

    ఒకరు తప్పు పట్టినా పట్టకపోయినా .. కట్టుకోబోయే వాడు కాలుజారి .. చేయిపట్టుకున్న చిన్న దాన్ని తప్పటడుగు వేయిస్తే ఇరువురికీ ప్రమాదమే మరి అంది నిశితంగా విశాల నేత్రాల్లో విలువైన భావాల్ని ప్రదర్శిస్తూ

    అనుమానించే మనిషికి మనసు విప్పి విన్నవించుకోటంకంటే మించిన అవమానం ఇంకొకటి వుండదు ... అన్నాడు రవి నిరసనగా

    అదికాదు రవీ .. నేను చెప్పేది ఏమిటంటే ... అంటూ మధ్యలో మాటలు ఆపి లేచి వచ్చి చిన్న వోయిన చెలికాడి మోమును చిరు ముద్దుతో ప్రపుల్లం చేయడానికి ప్రయత్నించింది కల్పన

    ప్లీజ్ .. ఇంకేమీ చెప్పొద్దు .. వెళ్దాం పద ... అంటూ లేచాడు రవి , చిరునవ్వు చిందించి ముఖవళికలకు ముసుగు కప్పుతూ!

    రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఓవర్ కోట్లు తీసుకుని తొడుక్కుంటున్నారు ఇద్దరూ .

    అంతలో గాలి దుమారంలా వాళ్ల దగ్గరకు వచ్చింది దంతపు బొమ్మలాంటి ఓ దొరసాని . ఏదో సుడిగాలిలో చిక్కుకుని కాలు చేయి ఆడక తేలిపోతున్నట్లు కనిపించింది ఆ కోమలాంగి, నిలువెల్లా కంపిస్తూ

    లుక్ లేడీ .. ప్లీజ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను .. నువ్వు ఇప్పుడు చాలా ప్రమాదంలో చిక్కుకోబోతున్నావు .. కాలయాపన చేయకుండా కారో, టాక్సీయో ఎక్కి తిన్నగా మీ ఇంటికి వెళ్ళు ... ఫర్ క్రైస్ట్ సేక్ .. ఎక్కడా ఆగ వద్దు ... ప్లీజ్ యింతకంటే వివరించి ఏమీ చెప్పలేను కాని ... నేను చెప్పినట్లు చెయ్యి .. దట్సాల్ .. యు విల్ బి సేఫ్ .. ఆయ్ ప్రామిస్ .. అంది వెలవెలబోతూ ఆ దొరసాని

    వాట్ .. ఆరిచినంత పనిచేసింది కల్పన తలాతోకాలేని ఆ ఆగంతకురాలి సంభాషణకి ఆర్ధం తెలియక ఆశ్చర్యపోతూ

    కమాన్ లేడీ .. వాటీజ్ ఆల్ దిస్ ఫస్ ఎబౌట్ ... రవి అందుకున్నాడు అదేదో తమాషాకి అన్నట్లు తేలికగా తీసిపారేస్తూ

    ప్లీజ్ నేను సీరియస్ గా చెప్తున్నాను .. ఈ అమ్మాయి చాలా ప్రమాదంలో వుంది .. జస్ట్ డు ... యాజ్ అయ్ సే .. విల్ యు? అంది దొరసాని దుడుకుగా

    లిసన్ హనీ మమ్మల్ని ఇలా సస్పెన్స్ లో పెట్టి చంపడం దేనికి .. అదేమిటో కాస్త వివరంగా చెప్పకూడదూ? అన్నాడు రవి కించిత్ కోపంతో

    సారీ ఫోక్స్ ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను చెప్పినా మీరు నమ్మరు .. బట్ ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ గో హోమ్ .. అంది ఆ తరుణీ లత తల్లడిల్లిపోతూ

    కల్పనని పక్కకు పిలిచి చెవిలో రహస్యంగా చెప్పాడు రవి - ఆ కల్లబొల్లికబుర్లేవీ నమ్మకు లెట్స్ గో.. అదేదో మతి చెడి ఆలా వాగుతుందంతే ..

    ఆలా ఎందుకనుకోవాలి .. ఆమే చెప్తోంది నిజమేనేమో ఎవరికి తెలుసు ..

    "డోంట్ బి సిల్లీ డార్లింగ్ .. ఎవరో పిచ్చిది ఏదో వాగితే నమ్ముతాను అంటావేంటి ..

    నీకేమైనా మతిపోయిందా .."

    నన్ను భయపెట్టడం వలన ఆమెకి వచ్చే లాభం ఏమిటంట .. తనను తాను ప్రశ్నించుకున్నట్లు అడిగింది కల్పన అమాయకంగా

    అక్కడే వుంది తెలివంతా .. చూడు కల్పన .. ఇలాంటి చోట్లకి రకరకాల మనుషులు వస్తుంటారు ... అందులో ఎంతమంది పిచ్చివాళ్లు వుంటారో... ఎంతమంది చెడ్డ వాళ్లుంటారో ఎవ్వరికీ తెలీదు ... కేవలం అరుస్తూ, కరుస్తూ కనిపించే వాళ్ళే పిచ్చివాళ్లు అనుకోడం శుద్ధ అవివేకం .... కొందరు పిచ్చివాళ్లు చాలా తెలివిగా నీకంటే నాకంటే క్యూట్ గా కనిపిస్తుంటారు పైకి .. ఏవో ఇంట్లో బాధలకి తట్టుకోలేక వీధినపడి రోడ్డున పోయే మనలాంటి అమాయకుల్ని నమ్మించి నానా యాతన పెట్టడం అలాంటి వాళ్ళకి ఓ హాబీ ... టూకీగా చెప్పాలంటే అదొకరకమైన వ్యాపారమంతే గ్యాంబ్ లింగులా ... ఆర్ధమవుతుందా? చెక్కిన బొమ్మలా నిలబడిపోయిన చెలియ భుజంమీద చేయి వేసి ఆప్యాయంగా నిమురుతూ నచ్చజెప్పాడు

    గ్యాంబ్ లింగా ... ఏమిటి రవీ నువ్వంటుంది .. కలవరపడింది కల్పన

    ఈ నాటకమంతా ఎందుకనుకుంటున్నావ్ .. డబ్బులకోసం బిలీవ్ మి స్వీట్ హార్ట్ .. ఓ రకంగా బ్లాక్ మెయిల్ చేయడం అన్నమాట నొక్కిచెప్పాడు రవి

    వాట్ ... నమ్మ లేకపోతోంది కల్పన

    చూస్తుండు .. యిప్పుడే నీకు నిరూపిస్తాను అంటూ చేయి పట్టుకుని దొరసాని దగ్గరకి తీసుకువెళ్లాడు ప్రియురాలిని.

    ఆల్ రైట్ ... యంగ్ లేడీ ... హౌ మచ్ డు యు వాంట్ టెల్ మి ... అన్నాడు రవి హుందాగా

    ఆ శ్వేతాంగి నివ్వెరపోయింది

    మైగాడ్ ... నామీద మీకు నమ్మకం లేదు కదూ నాకు తెలుసు ... నేను ఏం చెప్పినా ఎవరూ నమ్మరని ... అంది ఆ దొరసాని చిన్నబుచ్చుకుని చూపులు దించుకుంటూ

    "అయామ్ సారీ ... అతడి మాటలేవీ పట్టించుకోవద్దు కాని ... అసలు విషయం

    ఏమిటో వివరంగా చెప్పగలవా.." అను నయించింది కల్పన, దిగులుగా నిలబడ్డ దొరసాని దగ్గరకు జరిగి ప్రేమగా చేయి పట్టుకుంటూ

    కల్పనా... నేను చెప్పేది కాస్త వింటావా..

    రవీ విల్ యు ప్లీజ్ షటప్ ... నన్ను మాట్లాడనీ ... కోపగించుకుంది కల్పన

    ఆల్ రైట్ హనీ ... గో ఎహెడ్ .. అంటూ విసురుగా బయటకు నడిచాడు రవి

    ప్లీజ్ .. నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ అంతే ... ఏమీ అనుకోవద్దు... మగాళ్ల సంగతి నీకు తెలుసుగా .. ఎనీ వే ... నా అపాలజీ ఫర్ హిజ్ సిల్లీ బిహేవియర్ ... సంజాయిషీ యిచ్చుకుంది కల్పన

    అయ్ నో ... థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ ... నువ్వు చెప్పినట్లే చేస్తాను అంది కల్పన కృతజ్ఞతా పూర్వకంగా కరచాలనం చేస్తూ

    నా మాట మీద ఆ మాత్రం నమ్మకం ఉంచి నందుకు చాలా థ్యాంక్స్ .. నన్ను నమ్ము నీ కంతా విడమరచి చెప్పాలని వుంది .. బట్ అయ్ కాంట్ యునో వై ..

    డోంట్ వర్రీ .. నేను గెస్ చేయగలను .. ఎవరూ నీ మాటలు నమ్మరు అంటావు అంతే కదా..

    ఆగకుండా ఆ శ్వేత నారి చెప్తూనే వుంది - "భవిష్యత్తు తెలుసుకోవాలని ఆరాట పడటంలో అర్ధం వుంటుంది కాని .. ఆ భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని తలచుకుని తల్లడిల్లి పోవటంలో అర్ధం వుండదు ... అలా అని మృత్యు దేవత ఫలానా చోట పొంచి వుందని ముందుగానే తెలిస్తే ... తిన్నగా వెళ్ళి తనని తాను బలి పెట్టుకోటం మూర్ఖత్వమే

    అవుతుంది ... డోంట్ యు ఎగ్రీ ..."

    ఆసక్తిగా వింటోంది కల్పన ఆ దొరసానివైపు తదేకంగా చూస్తూ

    అఫ్ కోర్స్ బ్రతుకంటేనే ఓ పెద్ద రణరంగం ... ఎక్కడ ఏ ప్రమాదం పొంచివుంటుందో... ఎవరికి ఎప్పుడు ఏ ఆపద వస్తుందో ఎవరికి తెలుసు ... ఒకవేళ అది ఊహించి తెలుసుకోగలిగే నాలాంటి మనుషులు ఎవరైనా వుంటే వాళ్ల మాట ముచ్చటగా పాటించటమే మంచిది ... వాట్ డు యు సే

    తల వూపింది కల్పన

    ప్లీజ్ నేను చెప్పేదిగుర్తుంచుకో తిన్నగా మీ యింటికి వెళ్లిపో ఎక్కడా ఆగొద్దు అర్ధమయ్యిందా ...?

    ఆ అమ్మాయికి మెంటల్ ఏమో అనిపించింది కల్పనకి

    ష్యూర్ ... అయ్ వోంట్ ... గుడ్ నైట్ అంటూ అక్కడనుండి కదిలింది

    గుడ్ నైట్ .. అండ్ గాడ్ బ్లెస్

    బయటకు వచ్చిన కల్పనని చూసి -

    అమ్మయ్య ... అయ్యిందా... యింకా ఎంత సేపు ఈ చలిలో పడేసి వణికిస్తావో అని భయపడ్డాను ... త్వరగానే వదిలేసిందే ఆ దెయ్యం .. అన్నాడు రవి కవ్విస్తూ,

    ఏదో ఆలోచిస్తూ అడుగులో అడుగువేస్తూ బయటకు వచ్చిన కల్పన అతగాడి మాటలు పట్టించుకోకుండా మౌనంగా ముందుకు కదిలింది

    ఏమిటంత పరాకుగా వున్నావ్ ... ఏమి నూరి పోసిందేమిటి ... ఆ ఆంగ్లో అమెరికన్ నారీ శిరోమణి ... అన్నాడు కసిగా

    రవీ ... ఒకోసారి నువ్వు చాలా ఫూలిష్గా బిహేవ్ చేస్తుంటావు సుమా... ఎందుకో నాకు అర్ధం కాదు .. ఎదుటి మనిషిని కాస్త అర్ధం చేసుకోటానికి కాస్త ప్రయత్నించు .. అంది అసహనంగా

    నువ్వే అంటావుగా మనిషికో పిచ్చి అని ... ప్రతీ విషయాన్నీ కాస్త నిదానంగా పరిశీలించటం బహుశా నా పిచ్చి అయివుండొచ్చు అన్నాడు రవి హాస్యాస్పదంగా నవ్వుతూ

    సమ్ టైమ్స్ యు డిస్గస్ట్ మి .. ఆయ్ రియల్లీ హేట్ యు .. అంది కల్పన రుసరుసలాడుతూ

    అయిష్టంలోంచే ఆవిర్భవిస్తుంది మైడియర్ .. అపర ప్రేమ కూడా ... మన ఇండియన్ పురాణాల్లో ఎక్కడో ఎవడో చెప్పినట్లు గుర్తు .. విషంలోంచే అమ్రుతం పుట్టిందని .. అలాగే ద్వేషంలోంచి అనురాగం పుడుతుందేమో ఎవరికి తెలుసు వెటకరించాడు రవి

    "సరే నువ్వు అలా ఊహించుకుంటూ కూర్చో ... నేను ఇంటికి వెళ్తున్నాను ..

    గుడ్ నైట్" అంది కల్పన వున్నట్లుండి ఫుట్ పాత్ మీదనుంచి దిగి రోడ్డుకు అడ్డంగా నడుస్తూ వెనుక పరుగు పెట్టి వచ్చి కంగారుగా చేయి పట్టుకుని ఆపాడు రవి

    ఏయ్ ... ఏమిటా తొందర నీకేమైనా మతి పోయిందా .. ఏ కారు కిందైనా పడాలని వుందా... కాస్త చూసుకుని నడు ... అన్నాడు మందలిస్తూ

    నువ్వు యిలా నన్ను విసిగిస్తే నిజంగా ఆలాంటిదేదో జరుగుతుంది..ఏమనుకున్నావో .. అంటూ చేయి విడిపించుకుని పరుగెట్టి రోడ్డు దాటి అవతలి ప్రక్క ఫుట్ పాత్ మీదకు చేరుకుంది కల్పన

    రవి అనుసరించాడు అనునయిస్తూ.

    ప్లీజ్ కల్పనా... నా మాట కాస్త వింటావా..

    ఒక్క కుదుపున ఆగి వెనక్కు తిరిగి వురిమి వురిమి చూసింది ఏమిటీ గొడవ అన్నట్లు .

    ఆల్ రైట్ .. నీకు చాలా కోపం వచ్చిందని ఆ చెంపలే చెప్తున్నాయి కాని .. కాస్త కనికరించు ఈ ప్రేమ పూజారిని ... ప్లీజ్ ... నువ్వు యిలా చూపుల్తో చీత్కరించుకుని అలిగి వెళ్ళిపోతే రాత్రికి నాకు నిద్రపడ్తుందనుకున్నావా .. ఉహు .. కంటికి కునుకైనా రాదు .. ప్రామిస్ అందుచేత నా తప్పులు మన్నించి ... చిన్న ప్రేమ భిక్ష పెట్టి పో... నీకు పుణ్యం వుంటుంది అంటూ చేతులతో సుకుమారమైన ఆ కోమలాంగి నడుం చుట్టి దగ్గరకు లాక్కుని వుక్కిరి బిక్కిరి అయ్యేలా పెనవేసుకొని పెదవులు చుంబించాడు.

    కల్పన కోపమంతా కరిగిపోయింది క్షణంలో.

    నా రూముకి వచ్చి కా సేపు కూర్చుని వెళ్ళ కూడదూ.. రేవు శనివారం ... మీ ఆఫీస్ కి శలవేగా... బైది వే నీ కోసం బ్రిస్టల్ క్రీమ్ షెర్రీ కొని ఉంచాను .. అన్నాడు కోరికలన్నీ కళ్ళల్లో పెట్టుకొని అభ్యర్థిస్తూ.

    ఓ నో .. నో వే ... యింత రాత్రి నీ రూమ్ కి వస్తే యింకేమైనా వుందా... మీ మగాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు కాని ... యింకోసారి ఎప్పుడైనా పట్ట పగలు వచ్చి నీ తియ్యని షెర్రీ టేస్ట్ చేసి చూస్తాను ... నన్ను యింక వదిలి పెట్టు అంది దూరంగా జరుగుతూ

    ఓకె ... నీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు .. నీకు ఆ మాత్రం అభిమానం లేదు కాని .."

    ఎందుకు లేదు ... కావల్సినంత ... వరదలై పొంగి పారుతోంది మరి ఈ లేత గుండెల్లో.. అంది కల్పన కన్నుగీటుతూ

    అరే నాకు తెలీదే ... ముందుగా చెప్పి వుంటే ఓ చేయి వేసి ఆపి వుండేవాడినేమో.. అన్నాడు చిలిపిగా

    ఈ అవతారానికి ఆ మాత్రం నిగ్రహం లేదనేగా నా భయమంతా .. ఎనీ వేబెంగ పెట్టుకోక ఆ పొంగే అనురాగం ... అభిమానం అన్నీ నీకేలే ... కాస్త ఓపిక పట్టు .. నచ్చ చెప్పింది కల్పన

    ఎస్ .. యువర్ రోయల్ హైనెస్ అన్నాడు ఎక్కడలేని వినయం ఒలకబోసి అభినయిస్తూ

    నేను వెళ్ళాను ప్లీజ్ అంది ముద్దుగా రవి మాటలకి మురిసిపోతూ

    "నా కానుక యిచ్చి పోతానంటే

    Enjoying the preview?
    Page 1 of 1