Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

దిగంబర దేవతలు (Digambara Devathalu)
దిగంబర దేవతలు (Digambara Devathalu)
దిగంబర దేవతలు (Digambara Devathalu)
Ebook388 pages4 hours

దిగంబర దేవతలు (Digambara Devathalu)

Rating: 3 out of 5 stars

3/5

()

Read preview

About this ebook

Love and Fortune are featureless and aimless inanimate objects
By melting and freezing can transform into many shapes and sizes
No one knows when and how they come and go
ప్రేమ , భాగ్యం ఓ నిర్ణీతమైన ఆకారం ఆశయం లేని జడ పదార్ధాలు
ఘనీభవిస్తాయి ద్రవీభవిస్తాయి రకరకాలుగా మారిపోతూ వుంటాయి
అవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎప్పుడు ఎలా పోతాయో ఎవరికీ తెలియదు !

దిగంబర దేవతలు (Digambara Devathalu)
Author

డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

Dr Sai Ramesh Gandham - Pen name "Radha" (డాక్టర్ సాయి రమేష్ గంధం - “రాధ”)Medical Doctor by vocation and writer by avocation -Loves Music and believes that out of all the arts singing is not just a talent but it is a unique the gift from almighty -'God'Penned lyrics for Fifty five songs (46 devotional songs and 9 social songs) - all sung by eminent South Indian singers like Dr SP Balu,Shankar Mahadevan,Janaki ....and many more great singers.The albums Sai Gananjali(Music director: Sunil Kashyap), Sai Geethanjali(Music Director: Gangadhar of Bhagavadgeetha foundation), Sai Stotranjali (Music Director: Ravi Chandra) , Daiva Swaranjali and Hanumanjali ( Music director: Phani Narayana very famous veena player) were successfully released by Madhura Entertainment ."God made man&woman made mesmerizing music"Songs links:https://eternaltunes.godaddysites.com/https://soundcloud.com/user-724062537/trackshttps://www.youtube.com/channel/UCO6qz6d_pT1E6EczyYpGw4Ahttps://open.spotify.com/playlist/2Z2Q9S8mvZsxLKdDTvWS5Jhttps://wynk.in/music/artist/dr-sai-ramesh-gandham/wa_42ByHb9wgghttps://www.jiosaavn.com/s/playlist/689fe43ac877afea85e170f5aa20dcd7/Starred_Songs/R,Ax0h5vSXVuOxiEGmm6lQ__Author of 18 published medical articles and many English poems and few short stories.Links:http://orcid.org/0000-0003-2049-7088https://scholar.google.com/citations?user=ZMzzFM0AAAAJ&hl=en&citsig=AMD79oqnkFgRccYWEObPYbCrUbbKc9k6ighttps://scholar.google.com/citations?user=ZMzzFM0AAAAJ&hl=en&oi=sraWrote several telugu novels and several short storieshttps://sayirameshgandham.medium.com/

Read more from డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

Related to దిగంబర దేవతలు (Digambara Devathalu)

Related ebooks

Reviews for దిగంబర దేవతలు (Digambara Devathalu)

Rating: 3 out of 5 stars
3/5

2 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    దిగంబర దేవతలు (Digambara Devathalu) - డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

    228

    రాధ రాసిన

    దిగంబర దేవతలు

    డాక్టర్ సాయి రమేష్ గంధం

    Copy right @

    writer & Publisher:

    Dr Sai Ramesh Gandham (డాక్టర్ సాయి రమేష్ గంధం)

    ఐదెకరాల గ్లోస్టర్ షైర్ పచ్చికభూమిలో అందంగా కట్టబడ్డ విక్టోరియన్ కాలం నాటి మేనర్ హౌస్ లో గువ్వ , గోరువంకల్లా కాపురం చేస్తున్నారు విక్టర్ డంకన్, అతడి మూడో భార్య, ఒకనాటి ప్యారిస్ బ్యూటీ క్వీన్ అయిన షాంటేల్ కలిసి స్వర్గలోక సుఖాలన్నీ బ్రిటిష్ భూమిమీద విచ్చలవిడిగా అనుభవిస్తూ.

    ఆ తెల్ల దంపతులికి పిల్లలు లేరు. కాని ఎంత ఎదిగినా కంటికి బొద్దుగా ముద్దుగా కనిపించే ఓ డజను జాతి పిల్లులు, ముట్టుకుంటే నరాలు ఎక్కతీసి కండల్ని కొరికి ముక్కలు చేసే ఓ అరడజను కంత్రీ క్రాస్ కుక్కలు వున్నాయి ఇంటినీ ఇంటిలో వాళ్ళనీ సందడిగా వుంచటానికి.

    లంకంత లోగిల్ని వూడ్చటానికీ, ఎప్పటికప్పుడు ఇంటికి పట్టే అన్నిరకాల బూజుల్నీ దులపటానికీ, పది పడక గదుల్లో ప్రతిరోజూ దుప్పట్లు తిరగవేసి సర్ది ఇంటిని అద్దంలా వుంచటానికీ ఓ అరడజను నౌకర్లు మాత్రం ఇంట్లో చుట్టాలికంటే ముచ్చటగా ఇమిడిపోయారు ఓ పదిసంవత్సరాలుగా !

    ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న షెఫ్ నీ, తను హాలెండ్ లో కొన్నాళ్ళు మోడలింగ్ చేసినప్పుడు పరిచయమైన మేకప్ మెయిడ్ మరియాని తనకోసం ప్రత్యేకంగా నియమించుకుంది ఇనప పెట్టెలాంటి ఇంటికీ, ఇంటిలో ఇనప పెట్టెకీ ప్రత్యేక యజమానురాలై చలామణీ అవుతున్న ఆ ఫ్రెంచ్ దొరసాని షాంటేల్ డంకన్.

    సుమారు మూడు సంవత్సరాల క్రితం విక్టర్ డంకన్ బిజినెస్ పనిమీద ఒకసారి ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ప్యారిస్ లో ఓ ప్రఖ్యాత నైట్ క్లబ్ లో పరిచయం అయ్యింది షాంటేల్. అప్పటిలో యూరోపియన్ మోడలింగ్ తో పాటు అతి ఖరీదైన హోటల్స్ లో దిగంబర నాట్యాలు కూడా ఆడ్తుండేది ఆ ఫ్రెంచ్ దొరసాని పొట్టకూటికోసం .

    తొలి చూపుల్లో దట్టమైన ప్రేమ పుట్టకపోయినా షాంటేల్ వంటి సొంపుల్లో మాత్రం అతగాడి జ్ఞానేంద్రియాలన్నీ బంకలో చిక్కిన జింకలా అతుక్కుపోయాయి పాపం !

    తుచ్చమైన వాంఛతో ఆ తరుణీలత తనువు తాకి క్షణికమైన వేడి చల్లార్చుకుని వూరుకోలేక కైపెక్కించే ఆ కోమలాంగి అందాల్నే తిన్నగా ఇంటికి దిగుమతి చేయించి తెచ్చుకున్నాడు విక్టర్ .

    మంగళసూత్రాల్లాంటి మోకుత్రాళ్ళు పేని మెడలో కట్టటానికి చాలా టైమ్ పడుతుందని తెల్లవాళ్ళు అనాదిగా అలవాటు చేసుకున్న చిన్న చేతి వుంగరం ఒకటి నాజూకైన షాంటేల్ చేతి వ్రేలికి అతి తేలికగా తొడిగేశాడు విక్టర్, ఆనవాయితీ ప్రకారం గ్లోస్టర్ కెతీడ్రల్లో వూరి పెద్దల సన్నిధిలో వూరకనే ఏసుప్రభువు శిలువ మీద ఒట్టువేసి ఆ అపురూప సుందరాంగిని అర్థాంగిగా స్వీకరిస్తూ.

    అప్పటికే విక్టర్ రెండో భార్యగా కొన్నాళ్ళు కాపురం వెలగబెట్టిన ఓ ఇటాలియస్ దొరసాని అతడి తీరుతెన్నులు నచ్చక విడాకులు ఇచ్చేసి తనదేశం వెళ్ళిపోయింది,అతడివలన తనకి సంతానప్రాప్తి రాలేదన్న నెపంతో.

    పిల్లలంటే పరమరోతషాంటేల్ ,అందుకే అతడికీ అంతులేని అతడి అష్టయిశ్వర్యాలకీ ఎదురులేని పట్టపురాణి అవ్వటానికి ఎలాంటి ఆటంకం లేకపోయింది

    విక్టర్ పేరున్న వ్యాపారస్థుడే కాదు చాలా పెద్ద వ్యవహారస్థుడు కూడా అతడు చెయ్యని వ్యాపారం లేదు, చేయి పెట్టని వ్యవహారం అంతకంటే లేదు . కండలకి ఎముకల గూడు దన్ను ఇచ్చినట్లు విక్టర్ శక్తి సామర్థ్యాలకి విలువైన పెట్టుబడి అయ్యింది అతడి పదునైన మెదడు . పైగా దానికి ఎప్పటికప్పుడు సానపెట్టటానికి అన్నట్లు దేముడు ప్రసాదించిన ప్రతిభ ప్రజ్ఞ ఒకదానికొకటి అతగాడిలో చూడ ముచ్చటగా ఇమిడిపోయాయి విస్కీలో సోడానీళ్ళలా ? తను పట్టింది బంగారం అవ్వటం అన్నది భగవంతుడు తనకిచ్చిన వరం అయితే , తన సమర్థతతో తనకి దక్కని దానిని కూడా మరెవ్వరికీ చిక్కకుండా చేయగలగటం అన్నది తనకి తాను ప్రసాదించుకున్న ప్రత్యేక వరకట్నమయ్యింది విక్టర్ కి

    చిన్నప్పటి నుంచీ చదరంగం అంటే చెప్పలేని ప్రీతి విక్టర్ కి . అందుకే ఇంట్లో ఓ కంప్యూటర్ చదరంగం స్క్రీన్ తన విశ్రాంతి గదిగోడల్లో పెట్టించుకున్నాడు ఎత్తుకు పైఎత్తులు బాగా సాధన చేయటానికి . ఎదుటి పావుని ఎలా ఆడించాలో, దెబ్బతినకుండా తన పావుల్ని ఎలా నడిపించాలో విక్టర్ కి బాగా తెలుసు . అన్నిటితో పాటు అది కూడా అతడికి పుట్టుకతో వచ్చిన బ్రహ్మవిద్యే అయ్యింది . నిజజీవితంలో కూడా మనుషుల్ని మరబొమ్మల్ని చేసి తనకు నచ్చిన తీరులో ఆడించగల సమర్థుడు విక్టర్ . పైగా నిజాయితీగా, న్యాయంగా చేస్తే ఏ వ్యాపారం ఎదగదు నిదానంగా సాగదు అని స్పష్టంగా గ్రహించిన వ్యక్తి కూడా . అందుకే వేలాది కోట్లకి పడగెత్తిన దొరబాబు అయ్యాడు పడమటి దేశాల మల్టీమిలియనేర్ల స్థాయిని చేరుకుంటూ .

    ఇంట్లో ఏ మూల చూసినా డబ్బు మూలుగుతోంది అంటే ఆ మోతుబరి ఇంటిని లక్ష్మీదేవి వూసుపోక వూరికే వరించైనా వుండాలి లేదా ఆ వ్యాపారి చేతిలో దారితప్పిన ధనలక్ష్మిని ఆకర్షించే అతి విలువైన అయస్కాంతం లాంటిది ఏదైనా వుండివుండాలి ?

    విక్టర్ విషయంలో రెండోదే నిజమని వాదించవచ్చు . పద్దుల పుస్తకాలు తారుమారు చేసి, పన్నులు ఎగవేసి నాలుగు డబ్బులు వెనకవేయటం అన్నది చిన్నతరహా వ్యాపారస్ఠులు చేసే చిల్లర పని . కాని విక్టర్ లాంటి మోతుబరి వ్యాపారస్ఠుడు సాగుచేసే అతి రహస్యమైన అసలు పనులు వేరే వుంటాయి .

    షాంటేల్ అంటే అపరిమితమైన మోజు విక్టర్ కి . తన వ్యాపారం చిలవలు, పలవలు తొడిగి అడివిలో మర్రివృక్షంలా విశాలంగా పెరిగిపోటానికి అతి ముఖ్య కారణం షాంటేల్ అనీ తనరాకతో పాటు అద్రుష్టాన్ని కూడా వెంటేసుకు వచ్చిందనీ అతడికి ఓ గాఢ మూఢ నమ్మకం .

    అది కనిపెట్టి విక్టర్ ని చేతిలో కీలుబొమ్మ చేసుకుంది ఆ ఫ్రెంచ్ దొరసాని మెట్టినింట్లో పాదంమోపిన ఆయిదారు మాసాలకే . అభ్యంతరం చెప్పటానికి అందులో తప్పేమీ కనిపించలేదు విక్టర్ కి.

    మగాడికి మోహం ఆముదంలాంటిది . వంటికి పట్టితే ఒకంతట వదలదు, త్రాగితే దప్పిక తీర్చదు .

    ఇప్పుడు అదే ఆవస్థలో చిక్కుకున్నాడు విక్టర్ .

    వంపుదేరిన షాంటేల్ ఒళ్ళు విక్టర్ కళ్ళకి రంగుటద్దాలు తొడుగుతుంటే, అతగాడి కంటికి అతినగ్నమైన ఆ కోమలాంగి సుందరాంగాల రంగులు తప్పించి ఇంకేమి కనిపిస్తాయి?

    డార్లింగ్ .. నువ్వు ఊ అను కొండమీద కోతిని తీసుకువచ్చి నీముందు వుంచుతాను .. అని మూలిగేవాడు విక్టర్ పారవశ్యం పట్టలేక , ఇల్లాలు ఇంటికి వచ్చిన కొత్తలో.

    ఇంట్లో వున్న పశువులు, పక్షులు ప్రస్తుతానికి చాలు కాని ముందు నాకు ఓ మంచి ఫరారీ కారు కొనిపెట్టు నీకు అంత వుబలాటంగా వుంటే .. అనేది షాంటేల్ గోముగా అతగాడి ఒళ్ళో అపురూపంగా సర్దుకొని కూర్చుని తీర్చిదిద్దిన పెదవుల లిప్ స్టిక్ చెరగకుండా సుతారంగా ఓ చిరు ముద్దు పెడ్తూ .

    అడగటం తరువాయి వజ్రాలు వైడూర్యాల దగ్గర నుంచి, బీరువాలో పట్టనన్ని బట్టలు, వాటికి మేచింగ్ జోళ్ళు, అతి ఖరీదైన అత్తరు బుడ్డులు ఇంకెన్నెన్నో ఆభరణాలు, ఒకటేమిటి ప్రపంచంలో మనిషి సృష్టించుకోగలిగే ఆడంబరాలన్నీ అమర్చి పెట్టాడు విక్టర్ తన ముద్దుల మూడో భార్య మక్కువ తీర్చడానికి .

    బదులుగా అతడికి కావలసినంత ఆనందం అందుబాటులో వుంచేది షాంటేల్ తన మిలియనేర్ మొగుడికి పక్కలో చుక్కై .

    ఒకరి కోరిక ఒకరు పూర్తిగా తీర్చుకోగలిగినప్పుడు మనిషికి కలిగే లోటు ఏముంటుంది? మనసుకు తాపం ఎందుకు పుడ్తుంది? అందుకే ప్రశాంతతకి తొలిపలుకు వాళ్ళకి వాళ్ళే రాసేసుకున్నారు జంటగా ఒకటై .

    అందుకే ఓ సంవత్సర కాలం సునాయాసంగా ఇట్టే గడిచిపోయింది ఆ దంపతులిరువురికీ.

    ***

    ఎప్పటిలా ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి మరీ ముస్తాబయ్యింది షాంటేల్ . ఎందుకో ఆరోజు ప్రత్యేకంగా ఆరిన జుట్టు అందంగా, విరబోసుకుని హృదయ పైభాగం అప్పుడే ఎదిగినట్లు లో నెక్ బ్లౌస్ ధరించి అత్యంత ఆకర్షణీయంగా తయారయ్యి మేడ దిగి , తలుపు తట్టకుండా తిన్నగా విక్టర్ ఆఫీస్ గదిలోకి వేంచేసింది షాంటేల్ వయ్యారంగా.

    స్వింగింగ్ చెయిర్ లో కూర్చుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు విక్టర్ సీరియస్ గా.

    సారీ డార్లింగ్ .. నువ్వు ఖాళీగా కూర్చున్నావనుకున్నాను .. అంటూ గిరుక్కున వెనక్కు తిరిగింది

    ఏదైనా భరిస్తాడేమోగాని వ్యాపార విషయాల్లో పనికి భంగం వాటిల్లినా, ఎవరైనా అనవసరంగా కలగజేసుకున్నా తన భర్త అసలు భరించలేడనీ, పైగా విరుచుకుపడతాడనీ ఆమెకి బాగా తెలుసు . అందుకే ఆ విషయంలో మాత్రం అతడికి చాలా దూరంగా వుంటోంది షాంటేల్ . భర్త చేసే బిజినెస్ ఏమిటో, అతడికి వచ్చే అసలైన సిసలైన ఆదాయం ఎంతో వివరంగా తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంతో వున్నా , అంతవరకూ ఎప్పుడూ తన కుతూహలం బయట పెట్టలేకపోయింది షాంటేల్ .

    దానికి కారణం విక్టర్ అంటే భయముండీ కాదు, అతడిమీద ఏర్పడ్డ ప్రేమ, అనురాగం అంతకంటే కాదు . కేవలం విలువైన వివాహబంధం ఎక్కడ పట్టు సడలుతుందో , సాఫీగా సాగుతున్న జీవనయానం గతుకు రోడ్డునపడి హీన స్థితికి ఎక్కడ దిగజారుతుందో అని మాత్రమే!

    అలాంటిదేదో లేకపోతే ఓ వెస్ట్రన్ వనిత ఒదిగిమదిగి గుట్టుగా మొగుడుతో కాపురం చేస్తుందా?

    నో హనీ .. డోంట్ గో .. ఆయ్ నియర్లీ ఫినిష్డ్ .. అంటూ షాంటేల్ ని వారించి ఫోన్‌లో వ్యక్తికి ఏదో సర్ది చెప్పి ఫోన్ పెట్టేశాడు విక్టర్ అవును ఇంతకీ విశేషం ఏమిటి కన్ను చెదిరేలా తయారవయ్యావు .. కొంపతీసి మళ్ళీ మోడలింగ్ ప్రారంభించడం లేదు కదా .. అంటూ ఎదురువచ్చి ఆనందం పట్టలేక ఇల్లాల్ని రెండు చేతులతో చుట్టపెట్టి పట్టుకున్నాడు.

    ముగ్ధంగా ఓ ముసిముసి నవ్వు నవ్వి వెల్ .. అయామ్ గోయింగ్ టు సి ఏ ఫ్యాషన్ పెరేడ్ .. డార్లింగ్ .. అంది షాంటేల్ కైపెక్కించే పెదపుల్ని మునిపంటితో కవ్వింపుగా కొరుకుతూ .

    ఏముంది .. ఆడపిల్లల అందాలకి వెలకట్టటానికి ఏ చెప్పుల కంపెనీవాడో, సెంట్ కంపెనీవాడో ఆహ్వానం పంపించి వుంటాడు .. అంతేనా ..

    మూతి విరిచింది షాంటేల్, విక్టర్ మాట విరుపుకి ఓర్వలేక.

    ఈ మాత్రందానికి అంత అలక అయితే ఎలా హనీ .. నిజం చెప్తున్నాను .. బ్యూటీ జడ్జ్ గా నీకు మించిన బ్యూటీ క్వీన్ ఎవరు దొరుకుతుంది చెప్పు .. యు డిజర్వ్ ఆల్ దిస్ .. గో అండ్ ఎంజాయ్ హనీ .. అంటూ నెచ్చెలిని ప్రసన్నం చేసుకోటానికి ప్రయత్నిస్తూ ఆమెను మరింత మీదకు లాక్కుని గాఢంగా చుంబించి ఉక్కిరిబిక్కిరి చేశాడు విక్టర్.

    కమాన్ డార్లింగ్ .. బిహేవ్ యువర్ సెల్ఫ్ .. ఓ మైగాడ్ .. ఏం చేశావో చూశావా .. నా మేక్అప్ అంతా చెరిగిపోయింది, హెయిర్ స్టైల్ అంతా పాడయ్యింది .. అంది షాంటేల్ దురుసుగా, ఈసడింపుగా విక్టర్ ని దూరంగా తోస్తూ.

    చిన్నబుచ్చుకున్నాడు విక్టర్ దొర చూడామణి చీదరింపుకి తాళలేక సారీ హనీ .. అన్నాడు మెల్లగా .

    లుక్ వాట్ యు హేవ్ డన్ .. అందుకే నువ్వంటే నాకు అసహ్యం .. అంది షాంటేల్ ఒంటిని దాచలేక అవస్థపడుతున్న పుల్లిపొర కాగితంలాంటి వుడుపుల్ని వుపద్రవంగా సర్దుకుంటూ.

    సారీ అని చెప్పానుగా ..

    అంతా అయిపోయాక సారీ ఎందుకు .. మీ ఇంగ్లీష్ మేనర్స్ పాడుకాను .. మీ ఇంగ్లీష్ వాళ్ళ తీరుతెన్నులు చూస్తుంటే ఒకోసారి నాకు ఒళ్ళు మండిపోతుందనుకో .. అందమైన ఆడదాన్ని ఎంత అపురూపంగా హేండిల్ చేయాలి .. ఏ ఫ్రెంచ్ పిల్లాడిని అడిగినా చెప్తాడు .. సరసమాడడం సరిగ్గా రాదు .. సరైన సెక్స్ చేతకాదు మీ ఇంగ్లీష్ మగాళ్ళకి .. సిల్లీ ఫెలోస్ .. అంది షాంటేల్ దెప్పిపొడుపుగా.

    మరోసారి షాక్ తిన్నాడు విక్టర్ .

    క్రిందటి రాత్రి పడకటింటిలో తను అనవసరంగా నీరసపడినందుకే షాంటేల్ ఇప్పుడలా ఎత్తిపొడుస్తోందని వెంటనే పసికట్టాడు అతడు సారీ ఎబౌట్ ... లాస్ట్ నైట్ టూ .. అన్నాడు అవమానంతో ఎరుపెక్కిన కళ్ళకి తన గదికి వున్న అష్టదిక్కులు చూపిస్తూ.

    సర్లే ఇదేమీ కొత్తకాదుగా ... ఒక రాత్రితో సరిపుచ్చుకోటానికి .. వాడిగా అతడి వైపు చూస్తూ మరింత రెట్టించింది ప్రసక్తిని .

    ఏమిటో షాంటేల్ ... ఈ మధ్య బిజినెస్ గొడవలతో నిజంగా మతి పోతోందనుకో .. ఆ విషయంలో అర్ధాంగిని ఎదిరించి గెలవలేకో, గత్యంతరం లేకో, మొత్తానికి మాట తగ్గాడు విక్టర్.

    మతితోపాటు ఒంటికి వుండాల్సిన స్పర్శజ్ఞానాలన్నీ పోతే చాలా ప్రమాదం మరి ... నవ్వింది షాంటేల్ కొంటెగా.

    డోంట్ బి సిల్లీ హనీ .. పదునుగా వినవచ్చాయి విక్టర్ మాటలు.

    రియల్లీ డార్లింగ్ .. రెండు మూడు నెలల బట్టి చూస్తున్నాను .. నీ తీరులో చాలా మార్పు వచ్చింది .. మన పెళ్ళయిన కొత్తలో పక్కన నువ్వుంటే కప్పుకోటానికి ఎలక్ట్రిక్ బ్లాంకెట్ల అవసరం ఏమాత్రం వుండేది కాదు .. మరి ఇప్పుడో! నాకంటే ముందు నువ్వే ముసుగుతన్ని పక్క ఎక్కుతున్నావ్ .. ఏమయ్యిందో మరి ఆ వేడి వూపు అంతా .. అంది షాంటేల్ మందలింపు ధోరణిలో, తన శ్రుంగార వేదన సూటిగా నివేదించుకుంటూ.

    మౌనం వహించాడు విక్టర్, గోడకి బిగించి వున్న కంప్యూటర్ చెస్ బోర్డువైపు మెల్లగా నడుస్తూ. వెనుకనే వచ్చి అతడ్ని ఒడిసిపట్టుకుంది షాంటేల్ ఆప్యాయంగా. ప్లీజ్ తొందరగా డాక్టర్ కి చూపించుకో లేకపోతే నాకు మతిపోతుంది .. యునో వాట్ ఆయ్ మీన్ .. చిలిపిగా నవ్వి చెలికాడి రాగి వెంట్రుకలు సవరిస్తూ మెడమీద ముద్దుల వర్షం కురిపించింది.

    అప్పటికీ అతడిలో చైతన్యం రాలేదు శాపం సోకి శిల్పమైనట్లు వెర్రిగా కంప్యూటర్ చెస్ బోర్డు వైపు చూస్తూ కంప్యూటర్ మీటలు అటు ఇటు నొక్కుతూ నిలబడిపోయాడు ఎంతోసేపు

    షాంటేల్ అక్కడ నుంచి అలిగి వెళ్ళిపోయిందన్న సంగతి అతడు గమనించ లేదు. పొగమంచులా ముసిరిన ఎనలేని ఆలోచనలతో అతడి మెదడు ఎప్పుడో మొద్దుబారిపోయింది.

    మోబైల్ ఫోన్ మారుమ్రోగుతున్నా విక్టర్ కి తెలివి రాలేదు, అంగరక్షకుడు బ్యారీ నార్మన్ పక్క గదిలోంచి వచ్చి చెప్పే వరకూ థ్యాంక్స్ బ్యారీ .. తీసుకుంటాను .. అన్నాడు విక్టర్ అన్యమనస్కంగా ఇంకా ఏదో ఆలోచిస్తూ , చెస్ బోర్డ్ వైపు దీక్షగా చూస్తూ

    బ్యారీ బయటకు వెళ్ళిన అలికిడి అయ్యాక సావకాశంగా ఫోన్ ఎత్తి హల్లో అన్నాడు విక్టర్ తాపీగా

    నేను బాస్ కుమార్ ని .. అవతలి వ్యక్తి కంఠం కంచుగంటలా మోగింది ఫోన్లో

    విక్టర్ ముకం విప్పారింది వెనువెంటనే

    ఓ .. మై డియర్ కుమార్ .. ఏమైపోయావ్ ఇంతకాలం .. నీకోసం వూరంతా తెగ గాలిస్తున్నాను .. నువ్వు కనిపించడం లేదని మనవాళ్ళంతా కంప్లెయింట్ చేస్తుంటే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా .. నువ్వు పోతే నా కుడిభుజం పోయినట్లే మరి .. ఎనీవే నువ్వు క్షేమంగా వున్నావ్ కదా .. అదే పదివేలు .. అన్నాడు విక్టర్ ఓ విషపూరితమైన నవ్వు నవ్వుతూ.

    సారీ బాస్ .. నీకు తెలియజేయడానికి టైమ్ లేకపోయింది .. మా డాడీకి గుండెపోటు వచ్చిందని కాల్ వస్తే అర్జెంట్ గా లండన్ వెళ్ళాల్సి వచ్చింది .. సంజాయిషీ చెప్పుకున్నాడు కుమార్

    ఓనో దట్స్ వెరీ బేడ్ .. నీకు ఏ కీడు జరిగినా నాకు జరిగినట్లే ఫీల్ అవుతానని నీకు తెలుసుగా .. సో టెల్ మి .. మీ డాడీ ఇప్పుడు ఎలా వున్నాడు ... నేను చేయగలిగింది ఏమైనా వుంటే చెప్పు వెంటనే చేసేస్తాను .. అన్నాడు విక్టర్ వాగ్ధానపూర్వకంగా.

    నో బాస్ .. థ్యాంక్యూ .. దేముడి దయవలన డాడీ కులాసాగానే వున్నాడు ..

    ఓ వెల్ .. ఎట్ లీస్ట్ సమ్ థింగ్ గుడ్ .. అయితే మన మాటేమిటి .. బిజినెస్ లోకి దిగటానికి తీరుబడి దొరికినట్లేగా ..

    ప్లీజ్ బాస్ .. ఓ వారం రోజులు బ్రేక్ కావాలి .. అన్ని విధాలా బాగా అలిసిపోయి వున్నాను .. ఏ కోస్టల్ రిసార్ట్ కో పోయి రెస్ట్ తీసుకుంటేనే కాని మళ్ళీ మామూలు మనిషిని కాలేనేమో అనిపిస్తోంది .. కుమార్ కంఠంలో మార్పు వచ్చింది .

    లిసన్ మై బాయ్ .. చిన్న చిన్న చేపలైతే నేను అసలు పట్టించుకోనని నీకు తెలుసుగా .. కాని ఇది చాలా పెద్ద చేప మరి .. ఇలాంటి బేరం ఎప్పుడోగాని తగలదు వదులుకుంటే మళ్ళీ రాదు .. పైగా ఎరవేయకుండా వల విసరకుండా మన చేతికి చిక్కబోతోంది .. ఇంత మంచి అవకాశాన్ని వదులుకుంటామా చెప్పు .. విక్టర్ మాటల్లో వింత అభిమానం ధ్వనించింది. బట్ .. బాస్ .. ఏదో నచ్చ చెపాలని ప్రయత్నించాడు కుమార్.

    వాదించే వాళ్ళంటే నాకు ఒళ్ళుమంట .. అందుచేత నేను ఓ మంచి సలహా ఇస్తాను ముద్దుగా విను .. ఆర్ యు లిసనింగ్ .. నా మాట విని ఓ రెండు రోజులు శ్రమపడ్డావంటే ఆ తరువాత ఆరునెలలు విశ్రాంతి తీసుకోవచ్చు .. అక్కడ ఇక్కడ కాదు ఏ స్పెయిస్ లోనో, ఇటలీలోనో ఏ ఫైవ్ స్టార్ హోటల్ లోనో ... నీ ఇష్టం యు నేమ్ ఇట్ ... అవును బ్రదర్ ఈ బేరంలో మన లాభం అంతా ఇంతా కాదు .. నువ్వే చూస్తావుగా .. పోతే మీ నాన్న గురించేగా నీ బెంగంతా .. అతడి విషయం నాకు వదిలేసేయ్ .. ఫస్ట్ క్లాస్ అయిన హార్లీ స్ట్రీట్ సెషలిస్ట్ ని ఎవడినో పిలిపించి మంచి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయిస్తాను .. సరేనా .. ఆదరింపుకంటే అధికారం ఎక్కువపాళ్ళలో వుంది విక్టర్ ఉపన్యాసంలో.

    అది కాదు బాస్ ..

    ఇంకేమీ చెప్పొద్దు ఓ గంటలో నువ్వు ఇక్కడ వుండాలి .. ఆలస్యం చేయకుండా త్వరగా తయారవ్వు .. అర్ధమయ్యిందా .. సమాధానం కోసం ఎదురు చూడకుండా ఠక్కున ఫోన్ కట్చేశాదు విక్టర్.

    'బ్లడీ ఇండియన్స్ .. వృద్ధిలోకి తెద్దామన్నా , ఉద్దరిద్దామన్నా వీలుపడనివ్వరుకదా .. ఊబిలో దున్నల్లా చేదస్తాలు పట్టుకుని గిజగిజ తన్నుకుంటారే కాని కాస్త తెగించి ముందుకు రారు' కసిగా తిట్టుకున్నాడు విక్టర్ కటువైన ఇంగ్లీష్ పదాలు ప్రయోగించి కుమార్ మీద కోపం వెళ్ళగక్కుతూ .

    ***

    రత్నకుమార్ పేరుకి భారతీయుడే కాని పుట్టింది, పెరిగింది అంతా గ్రేట్ బ్రిటన్లోనే . పాతికేళ్ళ క్రితం అతడి తండ్రి చెన్నపట్టణంలో షిప్ ఎక్కి, తిన్నగా సౌతాంప్టన్ హార్బర్ చేరుకుని, గుట్టుచప్పుడు కాకుండా ఓ పాడుబడ్డ యింగ్లీష్ కోటలో పర్మనెంట్ గా పాగా వేశాడు.

    ఇంగ్లీషు సంఘంలో గుర్తింపు కావాలన్న తపనతో దారితప్పి తిరుగుతోన్న డయానా అనే ఓ దొరసాని సుందరివి పబ్లిక్ బార్ లో వరించి

    Enjoying the preview?
    Page 1 of 1