Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

వింత మనుషులు (Vintha Manushulu)
వింత మనుషులు (Vintha Manushulu)
వింత మనుషులు (Vintha Manushulu)
Ebook330 pages2 hours

వింత మనుషులు (Vintha Manushulu)

Rating: 3.5 out of 5 stars

3.5/5

()

Read preview

About this ebook

A romantic telugu novel with a twist - a sweet love story that is entirely based on trust and feelings for each other.
నమ్మకం అనుభూతి లేని ప్రేమ ఎంత ద్రుఢమైనదైనా అది కేవలం ఆకర్షణ మాత్రమే అవుతుంది ...

వింత మనుషులు (Vintha Manushulu)
Author

డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

Dr Sai Ramesh Gandham - Pen name "Radha" (డాక్టర్ సాయి రమేష్ గంధం - “రాధ”)Medical Doctor by vocation and writer by avocation -Loves Music and believes that out of all the arts singing is not just a talent but it is a unique the gift from almighty -'God'Penned lyrics for Fifty five songs (46 devotional songs and 9 social songs) - all sung by eminent South Indian singers like Dr SP Balu,Shankar Mahadevan,Janaki ....and many more great singers.The albums Sai Gananjali(Music director: Sunil Kashyap), Sai Geethanjali(Music Director: Gangadhar of Bhagavadgeetha foundation), Sai Stotranjali (Music Director: Ravi Chandra) , Daiva Swaranjali and Hanumanjali ( Music director: Phani Narayana very famous veena player) were successfully released by Madhura Entertainment ."God made man&woman made mesmerizing music"Songs links:https://eternaltunes.godaddysites.com/https://soundcloud.com/user-724062537/trackshttps://www.youtube.com/channel/UCO6qz6d_pT1E6EczyYpGw4Ahttps://open.spotify.com/playlist/2Z2Q9S8mvZsxLKdDTvWS5Jhttps://wynk.in/music/artist/dr-sai-ramesh-gandham/wa_42ByHb9wgghttps://www.jiosaavn.com/s/playlist/689fe43ac877afea85e170f5aa20dcd7/Starred_Songs/R,Ax0h5vSXVuOxiEGmm6lQ__Author of 18 published medical articles and many English poems and few short stories.Links:http://orcid.org/0000-0003-2049-7088https://scholar.google.com/citations?user=ZMzzFM0AAAAJ&hl=en&citsig=AMD79oqnkFgRccYWEObPYbCrUbbKc9k6ighttps://scholar.google.com/citations?user=ZMzzFM0AAAAJ&hl=en&oi=sraWrote several telugu novels and several short storieshttps://sayirameshgandham.medium.com/

Read more from డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

Related to వింత మనుషులు (Vintha Manushulu)

Related ebooks

Reviews for వింత మనుషులు (Vintha Manushulu)

Rating: 3.25 out of 5 stars
3.5/5

8 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    వింత మనుషులు (Vintha Manushulu) - డాక్టర్ సాయి రమేష్ గంధం ( Dr Sai Ramesh Gandham) ('రాధ')

    188

    రాధ రాసిన

    వింత మనుషులు

    డాక్టర్ సాయి రమేష్ గంధం

    Copy right @ Sayi Ramesh Gandham (Radha)

    (author & Publisher)

    ఆరోజు నా ఖరీదైన మోటర్ బైక్ కి రిపేరు వచ్చింది ! ఖర్మఅంటే అదే అనుకుంటాను. నాకు అత్యంత అవసరం వచ్చి వాహనంతో పనిపడినప్పుడే సరిగ్గా దాని ఆరోగ్యం కూడా పాడవ్వటం కొన్నప్పటినుండీ దానికి బాగా అలవాటైపోయింది. అసలే ఆ రోజు సునీతాదేవి పుట్టిన రోజు. తప్పకుండా వెళ్ళాలి. రమ్మని మరీ మరీ చెప్పింది. వెళ్ళక పోతే నామాట దక్కదు. సునీత ఎవరంటే సింపిల్ గా గోపాల్ చిన్నాన్నగారి గారాల పట్టి . ఆ పట్టణంలో పలుకుబడివున్న పెద్ద కంట్రాక్టర్లలో ఆయన ఒకరు. ఎక్కడో సిటీకి చాలా దూరంగా అందమైన బంగళా కూడా కట్టించుకున్నారు. ఆ రోజు వాళ్ళ యిల్లు ఖండాంతరాలకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. పుట్టినరోజు అంటూ పిలిచింది. కాని ఎలా వస్తాం అనుకుంది. ఏ ఆటోలోనో , సిటీబస్సు ఎక్కో వస్తారనుకుందా ? అనుకుంటుంది... ఎందుకనుకోదు. ఆవిడకే మహారాణి ఆవిడగారికి ఏమి తెలుస్తాయి నా లాంటి బ్యాచులర్స్ భరించే కష్టాలు నష్టాలూను?

    పాపం… నా బైక్ వుంది కదా కలిసిపోదామని ఆశపడ్డాడు వేణు. బస్సు స్టాప్ దగ్గరలో కలుసుకుందామని చెప్పాను. వచ్చికలుసుకున్నాడు. బైక్ లేదని కాబోలు ముఖం దిగాలు వేశాడు. -

    గురూ ! నీ వాహనం మీద లేనిపోని ఆశలు పెట్టు కొని కొత్త సూట్ వేసుకుని మరీ వచ్చాను అన్నాడు.

    చూడు బ్రదర్ బైక్ మీద వెళ్దాం అన్నానే కాని కొత్త బట్టలు వేసుకుని రమ్మన్నానా చెప్పు...అయినాప్రాణం లేని జీవాలమీద ఆశలు పెట్టుకోవడం అంత మంచిది కాదు అన్నాను.

    అంతేనంటావా గురూ... నీరసంగా బ్రౌన్ సూట్ వైపు చూసుకున్నాడు.

    ఆహా... అంతే చిన్నగా నవ్వే శాను.

    ఎందుకో ఆ రోజు ఒక్క ఆటో కూడా ఖాళీగా రాలేదు . బస్సు వచ్చింది కానీ కిక్కిరిసి వుంది. అప్పటికే అయిదున్నర అయింది. సునీత సరిగ్గా అయిదింటికే రమ్మంది. అందుకే నా కంగారు. నా కంగారుమాట దేముడు ఎరుగును కాని వేణు మాత్రం నిలబడ లేక పోతున్నాడు.

    గురూ... అసలు ప్రపంచం అన్నది చూడు అది చాలా తమాషాగా వుంటుంది. అంత దాకా ఎందుకు మన సంగతే తీసుకో... అన్నీ వున్నా అందుకుందా మన్నది చేతికి అందదు... అవునుగురూ... ఫర్ ఎక్జాంపిల్ నువ్వే తీసుకో... నీకు బైక్ వుందా... అయినా దానిమీద ఎక్కి వెళ్ళే భాగ్యం నీకు లేదు... నాకు తెలుసు వుండదు ... నిన్ను నమ్ముకోవటంవలన నాకూ లేదు … అవు నంటావా …?

    ఉ... వినీవిననట్లు తల వూపేశాను, వేణుమాత్రం ఏమీ పట్టించుకోకుండా వాగేస్తున్నాడు.

    బ్రతుకన్నది చూశావూ...అది భలే తమాషాగా వుంటుంది సుమా . . . కొన్నాళ్ళు యిలా బస్సుస్టాపులు పట్టుకొని వేలాడతామా . . . మరికొన్నాళ్ళు కార్ల మీద తిరిగేస్తాం . . . అప్పుడు బస్ స్టాప్ జీవితం అసలు గుర్తుండదంటే, నమ్ము. ఒక వేళ కారణాంత రాలవల్ల బస్సు ఎక్కవలసి వచ్చిందే అనుకో. అప్పుడు యిలా అవస్థ పడక్కర్లేదు … అవునుగురూ … ఇలా నిలబడిన క్షణానికే ఎవడో ఒకడు కారు ఆపి యిక్కడ నిలబడ్డారు ఏమిటి సార్ సంగతి? రండి నా కారులో డ్రాప్ చేస్తాను అంటాడు ... అవునంటావా!

    ఆ... ఆ... అయితే బ్రదర్ అప్పటివరకూ ఒంటరిగా యిక్కడే కూర్చుని జపం చెయ్యి … నాకు మాత్రం లిఫ్ట్ దొరకబోతోంది... అని రోడ్డు మీదకు వచ్చాను.

    అయ్యోగురూ ... అంత పని చెయ్యకు. అంటూ నా వెనుక పరుగెట్టి వచ్చాడు. దూరంగా వస్తున్న కారుని ఆపాను. అందులో చిన్నాన్న వున్నారు.

    యింకా యిక్కడే వున్నావా ? అయిదింటి కల్లా వచ్చేస్తావని చెప్పింది సునీత … అవును నీ బైక్ ఏది?? యక్ష ప్రశ్నలు వేశారాయన.

    అదంతా తర్వాత చెప్తాను … మీరు ఇంటికేనా వెళ్తుంది.

    ఆ...ఆ...ఇంటికే...

    అయితే మేమూ వస్తాం అని అంకుల్ జవాబుకి ఎదురుచూడకుండా, "రా...బ్రదర్' అంటూ ముందు సీట్లో వేణూని కూర్చోమని , వెనుక సీట్లో చిన్నాన్న పక్కన నేను బైటాయించాను .

    కారు కదులుతుంటే చిన్నాన్న అడిగారు ఈయన ఎవరు! అని.

    వేణు అని ... మా క్లాస్ మేట్ ... సునీత పార్టీకి యిన్వైట్ చేసింది ... అన్నాను. అమాయకుడిలా ముఖం పెట్టి వెనక్కు తిరిగి నమస్కారమండీ... అన్నాడు సవినయంగా.

    వేణుని ఎగాదిగా చూస్తూ సంతోషం అన్నారు గోపాలం చిన్నాన్న .

    నీ బర్త్ డేకి యెంత మంచి బహుమతి తెచ్చానో చూడు సునీత అంటూ వేణుని చూపించాను.

    సునీత కనీకనిపించనంత సిగ్గుపడి, ఏమిటా మాటలు అన్నట్టు నామీద చిరు కోపం నటించింది.

    నా మాటలు వేణుకి వినిపించలేదు.

    సినిమాలో హీరోలా చిన్న పోజ్ ఇస్తూ సునీత దగ్గరకి వచ్చి తను తెచ్చిన కానుక ప్యాకెట్ అందించి ‘హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే...' అన్నాడు.

    ఏరా మధు ఇంతఆలస్యంగానా రావటం … అని పలకరించి ఓ ప్రక్కన నాతో మాట్లాడుతూ మరోప్రక్క వేణుని పరికించి చూసింది పిన్ని.

    హాలంతా అతిథులతో కళ కళలాడిపోతోంది - మగవాళ్ళకంటే ఆడవావాళ్ళే ఎక్కువగా వున్నారేమో మరీ అందంగా కనిపిస్తోంది చుట్టూవున్న వాతావరణం.

    అదిసరే . . . నిన్ను ఎప్పుడు రమ్మన్నాను… ఎప్పుడు దిగావ్... అసలు ఈ వేళ నా బర్త్ డే అని జ్ఞాపకం వుందా . . . అవునులే ఎందుకు వుంటుంది… వుండదులే అంటూ రుసరుస లాడింది సునీత.

    అరె.... అది కాదు సునీ....అసలేం జరిగిందంటే...?

    చాలు.... చాలు ఏం జరగక పోయినా నువ్వు మాత్రం ఏదో కల్పిస్తావని నాకు తెలుసులే… చిరు కోపంతో చిందులు తొక్కింది అలవాటు ప్రకారం.

    అరె... ఏమిటా కంగారు.... అసలు నేను చెప్పేది కాస్త విను... నీకు పుట్టిన రోజు బహుమతి కూడా తీసుకు రాలేకపోయానంటే కారణం తెలుసుకోవా మరి … ఏం చెయ్యను ... నా వాహనం అకస్మాత్తుగా విశ్రాంతి తీసుకుంటానంది .. సారీ … టైమ్ లేక పోయింది. అంటూ అసలు విషయం చెప్పటానకి ప్రయత్నించాను.

    ఆ... ఆ... విశ్రాంతిలోనే వుంటుంది ... వుండనీ ... అయినా నిన్ను యిలా వదిలి పెట్టేస్తే లాభం లేదు... యు మస్ట్ బి పనిష్డ్ ... అంటూ ప్రతీకారంగా ఓ నవ్వు విసిరి వెళ్ళిపోయింది.

    ఆమెను ఆపి మాటలు పొడిగించటం కాలయాపనం అనిపించింది. అందుకే మౌనంగా చూస్తూవుండిపోయాను.

    హడావుడిగా అటూయిటూతిరుగుతూ వచ్చిన స్నేహితులతో కబుర్లాడుతోంది . మధ్య మధ్య వేణు వైపు ఓ కవ్వింపు చూపు విసురుతోంది. ఈయన గారు చూపులు సరేసరి ఐస్కాంతంలా సునీతనే అంటుకుపోయాయి.

    నిజంగా ఆ వేళ సునీత చాలా అందంగావుంది . లేత గులాబీ రంగు చీర, అదే రంగు జాకెట్టు, పొడుగైన వాలుజడ, రెండు చేతులకీ అందమైన గాజులూ, మెరిసే డైమండ్ కమలాలు, నుదుట కనీకనిపించనంత గులాబీ రంగు బొట్టు, ఒక టేమిటి అన్నీ కలిసి సునీత సహజ సౌందర్యానికి మరింత అందాన్ని యిస్తున్నాయి .ఈ వేణు చాల అదృష్టవంతుడే అనుకుంటూ , చిత్రమంతా చూస్తూ మూలన సోఫాలో కూర్చుని తేనీరు సేవిస్తున్నాను.

    అప్పుడప్పుడూ కధలు రాయటానికి తంటాలు పడే అన్నయ్య ఒకడున్నాడు నాకు అని చెప్పాను గుర్తుందా ఆయనే ఈ మహాను భావుడు … నాకంటే మూడు సంవత్సరాలు ముందే పుట్టాడు కాని బి ఎస్ సి చదివి కాస్త వెనుకబడి మెడిసిన్ లో నా క్లాస్ మేట్ అయ్యాడు చివరి మాటలు వెక్కిరింపుగా అంటూ సునీత నన్ను పరిచయం చేసింది ప్రక్కన వున్న ఒక అమ్మాయికి .

    చాలా నిరాడంబరంగా వున్నా ఎందుకో చాలా అందంగా కనిపించింది ఆ అమ్మాయి , నా తొలి చూపులకి.

    ఉలిక్కి పడి నిలబడి కళ్ళు అప్పగించి చూస్తూవుండి పోయాను.

    వినయంగా నమస్కరించింది . ప్రతి నమ స్కారం చేశాను.

    ఎవరీమె! అన్నట్లు సునీత వైపు ఆశ్చర్యంగా చూడటం నావంతయ్యింది.

    మధు... ఈ రోజు ఒక మహావ్య కిని నీకు పరిచయం చేస్తున్నాను. అలాగా... ఎవరా మహావ్యక్తి… మాధవి ...అని ఒక ప్రఖ్యాత రచయిత్రివుంది... ఆవిడ పేరు విన్నావా?

    ష్యూర్ వినేవుంటాను ... ఇంతకీ ఆవిడ నీకు తెలుసా? అన్నాను వెంటనే ఆ పేరు గుర్తురాక.

    తెలియటమే కాదు... నాప్రాణ స్నేహితురాలు కూడాను.... ఆ మాధవే ఈ మాధవి.

    వాట్ ... అంటూ మర్యాద మరచిపోయి ఆమెను పట్టి పట్టి చూశాను .

    ఆవిడ యిబ్బందిగా తల తిప్పుకుంది.

    మిమ్మల్ని యిలా సునీత పుణ్యమా అని కలుసు కున్నందుకు చాలా నైస్ గా వుంది ... మా సునీతకి మీలాంటి స్నేహితురాలు ఉండటం మా అదృష్టమే నేమో… అన్నాను.

    మాధవి పొడి పొడిగా థ్యాంక్స్... అంది.

    నాకు ఏమి చెయ్యాలో అర్ధంగాక ఆవిడ వైపు చూస్తూ వుండిపోయాను. .

    అయి తే సునీ... మాధవిగారికీ, నీకూ న్నేహం ఎలా అయ్యింది?

    మేమిద్దరం బాల్య స్నేహితులం అని ఇంతకీ మాధవిని ఎందుకు పరిచయం చేస్తున్నానో తెలుసా? అని అడిగింది.

    ఎందుకన్నట్లు ప్రశ్నార్థకంగా చూశాను.

    కథలు రాసేవాళ్ళ ఆలోచనలు అలవాట్లు అన్నీ ఒకేలా వుంటాయని అంటారు ... అందుకని కాస్సేపు వాటి గురించి మాట్లాడుకుంటారని …. ఎలా రాయాలో మాధవి చెప్తుంది.. నువ్వు కూడా సరిగ్గా రాయటం నేర్చుకోవచ్చు … ఏమంటావ్?

    సాదింపులో సునీతా బాగా ఆరితేరిపోతుందని గ్రహించటానికి ఎక్కువ సమయం పట్టలేదు

    అయినా మాట పొర్లకుండా ఒక్క క్షణం ఆలోచించి ఓ ష్యూర్ … అన్నాను,

    థాంక్యూ... అని - మాధవీ! యిఫ్ యు డోంట్ మైండ్ మధుతో మాట్లాడ్తుండు.... నేనిప్పుడే వచ్చేస్తాను. అంటూ ఆవిడ జవాబుకి ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది.

    నాకు ఏం చెయ్యాలో తోచలేదు, కంగారుగా అటూ యిటూ చూశాను. ఎవరి కబురుల్లో వాళ్ళువున్నారు.

    ఆమె సంశయిస్తూ నిలబడిపోయింది.

    ఆమెను చూస్తుంటే మంచి హుషారు, ఆనందం యింకా ఏవేవో పుట్టుకువచ్చాయి. మామూలు కథలు రాసే రచయిత్రి యింత అందంగా వుంటుందా అనిపించింది. మాధవి రాసిన కథలు ప్రత్యేకంగా చదవకపోయినా.... మొదటి చూపులోనే ఆవిడ చాలా మంచిది అనిపించింది ... ఎందుకో నా మనసు వూసులాడమని ముందుకు తోసింది .

    రండి .... యిలా కూర్చోండి.... అంటూ సోఫా చూపించాను.

    ఆవిడ కూర్చుంది మాటమంతి లేకుండా.మోమాట పడ్తుందనిపించింది.ఆమె ఎటో చూస్తున్నా నేను మాత్రం ఆమెనే చూస్తూ కూర్చున్నాను ఎన్నో యుగాలుగా పరిచయం వున్న వ్యక్తిని చూస్తున్నట్లు ఫీలవుతూ.

    రెండు క్షణాలైనా ఆవిడమాట్లాడ లేదు, సరి కదా తల తిప్పైనా చూడ లేదు నా వంక. వుండబట్టలేక నేనే సంభాషణ మొదలుపెట్టాను

    "మీరు ఏం చేస్తు న్నారు?

    ఆవిడ వులిక్కి పడి నా వైపు చూసింది.

    ఆహా, నా వుద్దేశం మీ రెక్కడైనా పని చేస్తు న్నారా అని? మాటలు సర్దుకున్నాను.

    ఆవిడ సున్నితంగా ప్రస్తుతం పని చెయ్యడం లేదు ... చదువుకుంటున్నాను. అంది.

    చదువుకుంటున్నారా? ఆ మాటలు ఆశ్చర్యంగా అన్నాను కాబోలు చురుకుగా నా వైపు చూసింది – ఏం చదువుతున్నారు? అడిగాను ఆసక్తిగా

    ఎమ్ ఏ

    రెండు క్షణాలు మౌనంగా వుండిపోయాను. ‘అరె! ఈవిడ అంత పెద్ద చదువు చదువుతూ ఎంత నిరాడంబరంగా వుంది. యింత చిన్న వయస్సులో అంత పెద్దరచయిత్రి అయ్యిందంటే రియల్లీ షి యీజ్ వెరీ గ్రేట్ వుమన్’ అనుకున్నాను.

    ఎందుకో ఆవిడతో మాట్లాడాలనే కోర్కె ఎక్కువయ్యింది.

    ఎక్కడ వుంటున్నారు!

    క్రిష్ణా నగర్ లో అంది నెమ్మదిగా

    అయితే మేమున్న చోటే అన్న మాట

    ఆవిడ చివ్వున తలఎత్తి ఏమిటీ వ్యర్ధ ప్రసంగం అన్నట్టు చూసింది

    అప్పుడర్ధమయ్యింది నాకు నా మాటల్లో నేను చూపించిన కుతూహలం ఏమిటో?

    "హాస్టల్ లో వుంటున్నారా?

    లేదు … చిన్న పోర్షన్ అద్దెకు తీసుకున్నాను

    ఒక్కరే వుంటున్నారా

    ఆ…?

    నిజంగానా! ఆశ్చర్యంలో అనుకోకుండా నోరుజారాను.

    ఆవిడ చివాలున తలఎత్తి కొంచం ఘాటుగా చూసింది.

    నాకు మాత్రం కంగారు పుట్టుకు వచ్చింది.

    అది కాదండి, మీ పేరెంట్స్ ఎవరైనా మీతో కలిసి వుంటున్నారా .. అని ..? మాటలు తడుముకున్నాను.

    లేదు .. నేను ఒంటరిగా వుంటున్నాను అంది.

    ఆ మాటలు అంటుంటే ఆవిడ గొంతుక వణికి నట్లనిపించింది. ఆమె ముఖంలో నిరుత్సాహం నీడలయ్యింది. ఎందుకు అలా అయిపోయిందో అర్థం కాలేదు.

    ఏదో అడ గాలనిపించింది. అయినా ఆమె ముఖం చూస్తుంటే ఏమీ అడగ లేక పోయాను.

    మీరూ యిక్కడే వుంటున్నా రా ? నా కళ్ళలోకి గమ్మత్తుగా చూసింది.

    విరామం తరువాత సెకండ్ హాఫ్ సినిమా బాగుంటుందేమో అన్న అనుభూతి కలిగింది ఆవిడ తొలి ప్రశ్న వేయటంతో

    అబ్బే లేదండీ. అమాయకంగా జవాబిచ్చి వూరు కున్నాను

    మీరూ ఈ ఇంటిలోనే వుంటున్నారా అని కాదు నేను అడుగుతుంది .. వైజాగ్ లోనే వుంటున్నారా అని? సౌమ్యమైన స్వరంతో విడమరిచి అడిగింది ఆమె

    ఓ అదా…అయితే సునీత నా గురించి ఎప్పుడూ ఏమి చెప్ప లేదన్న మాట ... అన్నాను.

    చెప్పిందనుకోండి ... అంటూ నా కళ్ళల్లోకి ఒక్క సారి చూసి కళ్ళు దించుకుంది.

    అయి తే – నేనుకూడా ఇదే వైజాగ్ లో అయిదు సంవత్స రాలగా వుంటున్నాను అని చెప్ప లేదా మరి ... చిలిపిగా నే అడిగాను.

    ఆమె సమాధానంగా సన్నగా నవ్వింది.

    వైజాగ్ లోనే చదువుతున్నా ఈ ఇంట్లో మాత్రం వుండటం లేదు ... మీలాగే వేరే చిన్న అపార్ట్ మెంట్ రెంట్ కి తీసుకున్నాను … చిత్రం ఏమిటంటే మీరు వుంటున్న క్రిష్ణానగర్ లోనే .. వాట్ ఎ కోఇన్సిడెన్స్ అంటూ ఆవిడ కళ్ళల్లోకి సూటిగా చూశాను.

    సున్నితంగా ‘ఉ’ కొట్టింది.

    ఆవిడ్ని అంత దగ్గరగా చూస్తుంటే ఏదో తెలియని కొత్త అనుభూతి కలిగినట్లయ్యింది.

    ఇంతకీ సునీత కనీసం నా పేరైనా చెప్పిందా మీకు! తిరిగి అడగాలనే అడిగాను.

    ఆహా .. మీ గురించి అంతా చెప్పింది!

    అంతా అంటే? పట్టి పట్టి చూస్తూ గుచ్చి గుచ్చి అడిగాను.

    అదే మీరు ఎక్కడ వుంటున్నారో తప్ప విడిచి మిగ తాది అంతా !? అబ్బ తెగ విసిగిస్తున్నారే అన్నట్లు చూసింది.

    అబ్బ! మీరు కథలు మాత్రం బలే అల్లేస్తారండీ … అవును, కథలంటే గుర్తుకి వచ్చింది … ఈ మధ్య ఏం కథలు రాశారు? ఇంకా ఏమేమి రాయాలను కుంటున్నారు? అని ముందుకు వంగి ఆవిడ వైపు పరీక్షగా ప్రత్యేకంగా చూశాను , ఏమనుకుంటుందో అన్న విచక్షణ లేకుండా.

    అబ్బే, నేనేమీ అంత పెద్ద చెప్పుకోదగ్గ రచయిత్రిని కాదు లేండి అని తల పక్కకు తిప్పుకుంది.

    అఫ్కోర్స్ … బోస్టింగ్ అంత మంచిది కాదను కోండి …అలాగే ఆడవాళ్ళు అబద్ధం ఆడటం కూడా అంత మంచిది కాదండోయ్ … మరి పర్యవసానం ఎలా వుంటుందో వూహించారా?

    ఎందుకో అతి చనువు ప్రదర్శిస్తున్నానేమో అన్నఆలోచనే రాలేదు ఆక్షణాన

    ఏం జరుగుతుంది అన్నట్టు తల ఎత్తి చూసింది. ఆ చూపుల్లో వున్న ఏమిటీ అప్రస్తుత ప్రస్తావం అన్నమనోభావం నాకు అర్థం అయ్యింది . అయినా -ఆడపిల్లలు పుడ్తారు అంటూ అనాలోచితంగా సంభాషణని సాగదీశాను.

    ఆమె పల్లెత్తు

    Enjoying the preview?
    Page 1 of 1