Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Prema Oka Kala
Prema Oka Kala
Prema Oka Kala
Ebook607 pages5 hours

Prema Oka Kala

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ముందే చెపుతున్నాను స్మీ. ప్రేమ అనగానే ఇదేదో హృదయాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ అనుకుని చదవటం ప్రారంభించినట్టయితే, ప్రేమ బురదలో బోదకాలు వేసినంత ఆశాభంగం చెందుతారు.
ఈ పుస్తకం ‘స్నేహం-ఆప్యాయత- ప్రేమ - మోహం - దాంపత్యం-రొమాన్స్-అనుబంధం’ అని ఆరు ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధo పెరిగేది ఈ పరిణామక్రమoలోనే కాబట్టి, పుస్తకo కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుoటుందని భావించటం జరిగిoది.
LanguageTelugu
Release dateApr 2, 2021
ISBN6580301105810
Prema Oka Kala

Read more from Yandamoori Veerendranath

Related to Prema Oka Kala

Related ebooks

Reviews for Prema Oka Kala

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Prema Oka Kala - Yandamoori Veerendranath

    http://www.pustaka.co.in

    ప్రేమ ఒక కళ

    Prema Oka Kala

    Author:

    డా. యండమూరి వీరేంద్రనాథ్

    Dr. Yandamoori Veerendranath

    For more books

    http://www.pustaka.co.in/home/author/yandamoori-veerendranath-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయసూచిక

    1. ప్రేమగా ఒక ముందుమాట

    2. స్నేహం

    3. ఆప్యాయత

    4. ప్రేమ

    5. మోహం

    6. దాంపత్యం

    7. రొమాన్స్

    8. అనుబంధం

    బొమ్మలు: డా.జయదేవ్

    అంకితం

    ఈ పుస్తకానికి మిత్రుడు రాళ్ళబండి కవితాప్రసాద్ ముందుమాట వ్రాయవలసి ఉన్నది. వ్రాతప్రతిలో ఇంకా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి మాస్టారూ. అంతా పూర్తి చేసి ఒకేసారి ఇస్తాను అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. అంతలోనే అనుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ లోటు ఈ పుస్తకానికీ, అతడు లేని లోటు నాకూ ఎన్నటికీ తీరదు. అశ్రుపూరిత నయనాలతో

    అతడికి –

    ప్రేమంటే

    తన ఇండిపెండెన్స్ కోల్పోకుండా

    ప్రేమించిన వ్యక్తి పై

    డిపెండ్ అవటం.

    1. ప్రేమగా ఒక ముందుమాట

    ముందే చెపుతున్నాను స్మీ. ప్రేమ అనగానే ఇదేదో హృదయాన్ని గిలిగింతలు పెట్టే ప్రేమ అనుకుని చదవటం ప్రారంభించినట్టయితే, ప్రేమ బురదలో బోదకాలు వేసినంత ఆశాభంగం చెందుతారు.

    ఈ పుస్తకం ‘స్నేహం-ఆప్యాయత- ప్రేమ - మోహం - దాంపత్యం-రొమాన్స్-అనుబంధం’ అని ఆరు ఏడు అధ్యాయాలుగా సాగుతుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనిషి తాలూకు అనుబంధo పెరిగేది ఈ పరిణామక్రమoలోనే కాబట్టి, పుస్తకo కూడా ఈ ఎవల్యూషన్లో ఉంటేనే బాగుoటుందని భావించటం జరిగిoది.

    అమ్మ నుంచి ప్రేమతో తొలిముద్దు, నాన్నతో పొరపాటుల దిద్దుబాటు, స్నేహితుల్లోని నచ్చిన గుణాల్ని ప్రేమించటం, అమ్మ. నాన్న, స్నేహితుల మైనస్-పాయింట్స్‌ మనస్పూర్తిగా ఒప్పుకోవటం... ఆ విధంగా మనిషి తన ప్రేమ పరిధిని పెంచుకుంటాడు. (అయితే కొన్నిసార్లు నమ్మిన సిద్ధాంతం కోసం విభేదించటానికి వెనుకాడడు కూడా. కానీ విభేదo వేరు, శత్రుత్వం వేరు).

    విభేదాలు లేని చోట ప్రేమ పెరుగుతుంది. చిన్నపిల్లల్ని అందరూ ప్రేమిస్తారు. ఎందుకు? ‘ముద్దొస్తారు కాబట్టి’ అంటారు. కాదు. వారు మనం చెప్పినట్టూ వింటారు. వాదించరు. అడిగింది ‘ఇవ్వము’ అంటే కొంచెం సేపు ఏడుస్తారే తప్ప మనతో శత్రుత్వం ఏర్పర్చుకోరు. అందుకే ముద్దొస్తారు.

    కానీ వయసు పెరిగేకొద్దీ వారికి స్వంత భావాలు ఏర్పడతాయి. వాదించటం మొదలు పెడతారు. ఆజ్ఞల్ని తిరస్కరించటం ఆరంభిస్తారు. రహస్యాలు దాస్తారు. వ్యక్తిత్వం మారేకొద్దీ పాత పరిచయాలు పలచనయి కొత్తవారితో పరిచయం పెరుగుతుంది. ఇంట్లోవారికన్నా బయటివారు దగ్గరవటం మొదలవుతుంది.

    పిల్లలు పెద్దలకి దూరమై స్నేహితులకి దగ్గరవటానికి కారణం: స్నేహితులు నచ్చితే వింటారు, నచ్చకపోతే వాదించుకుంటారు..! తల్లిదండ్రులు వినరు, నచ్చకపోతే తమ అధికారం ఉపయోగించి వాదన ఆపుచేస్తారు.

    తన అభిప్రాయాల్నే బలంగా నమ్ముతూ, తన సిద్ధాంతాలని విడవక పోవటాన్నిఇండివిడ్యువాలిటి అంటారు. ఇండివిడ్యువాలిటి పెరిగేకొద్దీ ఆలోచనల్లో వచ్చే మార్పే స్నేహితులు/ ప్రేమికులు/ దంపతులు విడిపోవటానికి కారణం. ఈ మనస్తత్వం ఒక్కోసారి పాజిటివ్‌ ఫలితాన్ని, కొన్నిసార్లు నెగెటివ్‌ ఫలితాన్ని ఇస్తుంది.

    Individuality కి వ్యతిరేక పదం Duality. అంటే రెండు భావాలతో (డబుల్ స్టాండర్డ్స్ తో) సర్దుకుపోవటం. భర్తని మనసులో విపరీతంగా అసహ్యించుకొంటూ పుట్టింటివారి దగ్గర గొప్పగా పొగడటం; తన తరఫు వారిని ఒకలా, భార్య తరఫు వారిని ఒకలా చూడటం, ఇటువంటి మనస్తత్వానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. డబుల్ స్టాండర్డ్స్ ఉన్నవారితో స్నేహమూ, బంధమూ, దాంపత్యమూ చాలా కష్టం.

    ఇండివిడ్యువలిస్టులు రెండు రకాలు: మొదటి రకం వ్యక్తులు తమ స్వంత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని (వారెంత సన్నిహితులైనా సరే) సహించరు. …నీ నిర్ణయాల్లో నేను వేలు పెట్టను. నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అనే ఫిలాసఫి వీరిది. వీరితో సమస్య లేదు. ‘ఎవరి పరిధులు (ప్రైవేట్ సర్కిల్స్) వారివి’ అనే వీరి సిద్ధాoతం అర్థం చేసుకోవాలంతే..! మొదట్లో కష్టమనిపిoచినా, అర్థం చేసుకోగలిగితే ఆదినిష్ఠూరాలు, బాలారిష్టాలు అధిగమించి, వీరితో సహచర్యం సజావుగా సాగిపోతుంది.

    రెండో రకం వారితోనే కష్టం. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళనే మూర్ఖత్వం వీరిది. 'రాముడిది ఒకే బాణం. నాది ఒకే మాట’ అంటూ ఉంటారు. ఇండివిడ్యువాలిటి గురించీ, ఆత్మాభిమానం గురించీ ఎక్కువగా మాట్లాడే ఈ రకం మనుష్యులు, అవే లక్షణాలు ఎదుటి వాళ్ళలో ఉంటే భరించలేరు. వీరితో సహచర్యం చాలా కష్టం. ఒకేలా కనపడినా, బలమైన వ్యక్తిత్వానికీ, మూర్ఖత్వానికీ తేడా ఉంది.

    భర్తకి ఏడుకొండలవాడంటే భక్తి అనుకుందాం. భార్యకి అలాంటి నమ్మకాలు లేవు. పైగా మోకాళ్ళు నొప్పులు. పిల్లలు బలహీనంగా ఉన్నారు. అయినా సరే మూర్ఖుడు తనతో పాటూ అందర్నీ కొండ ఎక్కిస్తాడు. భర్తకి విగ్రహారాధన అంటే నమ్మకం లేదు. భార్యకి దేవుడంటే నమ్మకం. వ్యక్తిత్వం ఉన్నవాడు ఆమెని పంపుతాడు. లేదా ఆమె కోసం తన నమ్మకాన్ని పక్కన పెట్టి తాను కూడా వెళతాడు. మూర్ఖుడు వద్దని శాసిస్తాడు. అదీ తేడా.

    చిన్నప్పుడు తాను నేర్చుకోలేకపోయింది కాబట్టి, కూతురికి ఇష్టం లేకపోయినా నాట్యం నేర్పించే తల్లి; లెక్కలు రాని కొడుకుని ఐ.ఐ.టి అడ్వాన్స్‌డ్ కోర్స్‌లో చేర్పించే తండ్రీ కూడా ఈ కోవలోకే వస్తారు.

    కొత్త దంపతులు రాత్రి రెండిoటికి కలిస్తే, తొలి సంతానం గొప్పగా పుడతారని’ ఒక సిద్ధాంతి మా ఆయనకి చెప్పిందట. అలారం పెట్టి లేపుతున్నాడు. సంతానం మాటేమో గానీ, అర్ధరాత్రి లేవలేక విరక్తి కలుగుతోంది... అని కొత్తగా పెళ్ళయిన ఒక అమ్మాయి వాపోయింది. ఈ సిద్ధాంతీమణి గతంలో ఒక వార పత్రికకు జాతక ఫలాలు వ్రాసేది.

    ప్రపంచ చరిత్రలో ఆయిల్‌ పుల్లింగ్ కన్నా గొప్పదైన మూర్ఖ తార్కాణం మరొకటి లేదని ఇన్నాళ్ళూ అనుకునేవాణ్ణి. వినే బక్రాలుంటే చెప్పే చోక్రాలకి అంతుండదని ఆమె మొగుడి గురించి విన్నాక తెలిసింది.

    ఎంత చదువు చదివి యెన్నిటి విన్నను హీనుడవగుణంబు మానలేడు అంటూ 600 సంవత్సరాల క్రితమే హేతువాది వేమన ఇలాంటి వారి ఛాందస భావాలపై ఆటవెలదిని ఈటెగా విసిరి, వారి 'మూర్ఖపద్ధతి'ని చీల్చి చెండాడాడు.

    గర్విష్టులతో, సాడిస్టులతో కన్నా, మూర్ఖులతో సంసారం చేయటానికి గొప్ప సహనం ఉండాలి. వారి తెలివిని(?) భరించే శక్తీ కావాలి. తాము చెప్పిందే వేదమన్న ఈ రకం మూర్ఖులు ఎక్కడ లేని జ్ఞానాన్నీ తమకి ఆపాదించుకుంటారు. తమకున్న అధికారం, హెచ్చయిన గొంతు, మాట దురుసుతనం, శారీరక బలం, సంఘంలో పేరు మొదలైన అర్హత(!)ల వల్ల ఇంట్లోవారిని డామినేట్ చేస్తూoటారు.

    తన జీతమెంతో కూడా చెప్పకుండా కొంత మొహాన కొట్టి, 'ఛస్తావో బ్రతుకుతావో నీ ఇష్టం. నెలాఖరి వరకూ మళ్ళీ నయాపైసా అడిగితే వళ్ళు చీరేస్తాను' అనే భర్తలు కూడా ఈ కోవలోకే చేరుతారు.

    వీరి సహచర్యంలో ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం తొంగి చూస్తూ ఉంటుంది. ఇంట్లో ఇద్దరూ విధిలేక కలిసి ఉన్నట్టూ ఉంటారు.

    ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవటం వల్లనో, పిల్లల కోసమో, సమాజానికి వెరచో సర్దుకుపోయే స్త్రీలు… వీరితో సంసారం చేయలేక, మనసులో బాధని బయటకి వ్యక్తీకరించలేక, తమ గృహంతర్భాగ గాధాగాధ్యగుహల్లో నిర్లిప్తoగా ముణగదీసుకు పడుకుంటారు. అసంతృప్తికి చిరునవ్వు ముసుగేసి తిరిగే ఎందరు దంపతులు మనకి కొత్త కాదు?

    చాలా సందర్భాలలో భర్త డామినేషన్ని, భార్య చేతగాని విధేయతనీ (లేదా భార్య గయ్యళీతనాన్నీ, భర్త నిశ్శబ్దాన్నీ) చూసి, అన్యోన్యతగా భ్రమపడుతూ 'ఆహా! ఎంత గొప్ప దంపతులు' అనుకుంటాం. భార్యాభర్తల మధ్య వుండాల్సింది విధేయత కాదు. ప్రేమ.

    స్నేహించిన/ప్రేమించిన కొత్తలో అందరూ మంచి లక్షణాలనే చూపిస్తారు. ఎదుటి వ్యక్తిది బలమైన వ్యక్తిత్వమో, లేక మొండితనమో (రెండూ ఒకేలా ఉంటాయి కాబట్టి) తెలుసుకోవటం కష్టం. ప్రేమలూ, స్నేహాలూ, ఫెయిలయ్యేది అక్కడే. అలాంటి అవగాహన కోసం ఏమి చెయ్యాలో చెప్పే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది.

    లౌక్యం:

    గిరిజా కల్యాణ యక్షగానంలో పర్వత రాజ పుత్రి పార్వతి, శివుడు లభించక ఆత్మహత్యకు పాల్పడబోతూంటే, తగదిది తగదిది ధరణీధర వర సుకుమారీ... అండగా మదనుడుండగా, మన విరి శరముల పదనుండగా... కోరిన వాడెవడైనా, ఎంతటి ఘనుడైనా కోలనేయనా, సరసను కూలనేయనా... కనుగొనల ననమొనల గాసి చేసి.. నీ దాసు చేయనా అంటాడు సూత్రధారుడు. అదీ లౌక్యం(డిప్లమసి).

    దురదృష్టవశాత్తూ ‘లౌక్యం’ అన్న పదాన్ని మనం ఎక్కువ నెగెటివ్ సెన్స్‌లోనే వాడతాం. ఇండివిడ్యువాలిటీ, మొండితనం, లౌక్యం, డబుల్ స్టాండర్డ్ అన్నీ వేరు వేరు. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. అబద్ధం చెప్పక పోవడానికీ, నిజం చెప్పకుండా ఉండడానికీ ఉన్న భేదం లాంటిదే లౌక్యం. విదేశాల్లో తమ దేశ ప్రతినిధులైన రాయబారులకి (డిప్లమాట్స్‌కి) ఇప్పటికీ చాలా ప్రాముఖ్యత ఉన్నది.

    ప్రేమంటే అవతలి వ్యక్తిపై నిన్నటికన్నా ఈరోజు ఇంకొంచెం ఇష్టం పెరగటం, రేపటికి అది మరింత పెరుగుతుందన్న నమ్మకం ఉండడం. -డేగరెక్కల చప్పుడు.

    లౌక్యానికి ప్రతీక శ్రీకృష్ణుడు..! రాయబారమూ చేసాడు. యుద్ధ సారథ్యమూ వహించాడు.

    లౌక్యులకి చుట్టూ ఉన్నవారి ఇష్టాయిష్టాలూ, బలహీనతలూ క్షుణ్ణంగా అవగతమై ఉంటాయి. పొగడాల్సిన చోట అది పొగడ్త అని అనుమానం రాకుండా పొగడటం, తెగడాల్సిన చోట కంట్రోల్‌లో ఉండటం అనే గొప్ప కళ వీరి స్వంతం.

    కన్యాశుల్కం నాటకంలో అది మోసం కాదు. నా లౌక్య ప్రజ్ఞే అంటాడు రామప్ప పoతులు. ఔరా! తాము చేస్తే లౌక్యమూ, మరొకరు చేస్తే మోసమూనా? అని ఆశ్చర్యపోతుంది మధురవాణి. ‘నమ్మిన చోట చేస్తే మోసమూ, నమ్మని చోట చేస్తే లౌక్యము’ అనే నానుడిని ఎంతో గొప్పగా చెప్పాడు గురజాడ అప్పారావు మాస్టారు..! ఏ లోకాన ఉన్నాడో మహానుభావుడు.

    లౌక్యమoటే మునగ చెట్టు ఎక్కించటం కాదు. అది భట్రాజుల పని. ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా, నష్ట పరచకుండా మనక్కావాల్సింది సాధించుకోవటం లౌక్యం. లౌక్యంగా మాట్లాడటం కూడా ఒక కళ. ఇందులో నిందా స్తుతి, అంతర్లీన పొగడ్త ఉంటాయి. ఇటువంటి సంభాషణని అమ్మాయిలు ఎంతో ఇష్టపడతారు.

    స్నేహమైనా, ప్రేమైనా, దాoపత్యములోనైనా అవతలివారికి అపకారములేని సంతోషమిచ్చే లౌక్యము సదా ఆచరణీయము..! అభిలషణీయము..!

    నేను అందంగా ఉంటానా? అడిగింది ఒక అమ్మాయి. ఉండవన్నాడు అబ్బాయి. పైగా నవ్వాడు. అమ్మాయికి కోపం వచ్చింది. నేను దూరమైతే ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చవా? అంది రోషంగా. రాల్చనన్నాడు అబ్బాయి. అయితే గుడ్ బై… అంటూ ఆ అమ్మాయి లేచి విసవిసా వెళ్ళిపోబోయింది. అతడామె చేయి పట్టుకొని ఆపి నువ్వు అందంగా కాదు. అద్భుతంగా ఉంటావు. నువ్వు నా నుంచి దూరమైతే నేను ఏడవను. ఎందుకంటే అప్పటికే నేను మరణిస్తాను కాబట్టి అన్నాడు. మనసుకు వయసొచ్చి, అమ్మాయి కనురెప్ప పావురం రెక్కలా టపటపా కొట్టుకుంది.

    వివాహాలూ-విడిపోవటాలు:

    సంసారంలో అభిప్రాయభేదాలు తప్పవు. ఎక్కడ కాంప్రమైజ్ కావాలి? ఎవరు సర్దుకుపోవాలి? ఏ పరిస్థితుల్లో కావాలి? అన్నది సమస్య. బాధపడుతూ కలిసుండాలా? విడిపోయి సుఖంగా ఉండాలా? అన్నది ఇంకా పెద్ద సమస్య. దాంపత్యం చేదుగా మారటానికి పెద్దగా కారణాలవసరం లేదు. ‘సర్దుకుపోలేక పోవటం’ అన్న ఒక్క కారణం చాలు.

    టీవీ9 కోసం ప్రకాష్‌రాజ్‌ని చేసిన ఇంటర్వ్యూలో హృతిక్‌రోషన్, నాగార్జున, స్పీల్‌బర్గ్, కెమరూన్, పవన్ కళ్యాణ్, అమీర్‌ఖాన్, కమల్‌హాసన్లను ఉదాహరిస్తూ, విడాకులిచ్చిన వ్యక్తులకి పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. మరి మనసు నిండా అంత ప్రేమ ఉండి, మనసారా నాతి చరామి అని వాగ్దానం చేసిన దంపతులు ఎందుకు విడాకులు తీసుకుంటారు? సర్దుకుపోయే గుణం లేకనా? ఇప్పుడుండే దాని కన్నా విడిపోయి ఇంకా హ్యాపీగా బ్రతకవచ్చనా? అని అడిగినప్పుడు, ముక్తసరిగా ఆర్థికస్వాతంత్ర్యం వల్ల వచ్చే (మా) అసంతృప్తి వల్ల అని సమాధానం ఇచ్చాడు. నాలుగు పదాల్లో అద్భుతమైన అర్థమున్న జవాబు.

    వివిధ హోటల్స్‌లో వెరైటీ ఫుడ్స్ తినేవాడికి ఎప్పుడూ ఒకే హోటల్లో తినాలని అనిపించదు. రకరకాల వ్యక్తులతో ‘గాఢ’ పరిచయాలున్నవారికి ఇంటి మనిషి నచ్చక పోవడంలో ఆశ్చర్యo లేదు. మార్కెట్లో సరుకులూ, వాటిని కొనగలిగే అవకాశాలూ, ఛాయిస్‌లూ ఎక్కువయ్యే కొద్దీ, సరైనదాన్ని ఎన్నుకోలేక పోయామే అనే బాధ ఎక్కువ ఉoటుంది. అద్దాల బీరువాలో వస్తువులు ఎప్పుడూ అందంగానే కనిపిస్తాయి. వాడిన తరువాతే మన్నిక తెలిసేది.

    ఒకరికి విడాకులిచ్చి మరొకరిని చేసుకునేది… తమ పిల్లల అసంతృప్తి కన్నా, ‘తన’ అవసరం ముఖ్యమనా? సంతృప్తి లేని మనస్తత్వం వలనా? ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్న ఎలిజిబత్ టేలర్, అసంతృప్తితో ఆత్మహత్య చేసుకున్న మారిలిన్‌ మన్రోలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి.

    మూడు రాత్రుల దాంపత్యంలో ఉండేది దాహం. దాన్ని మూడు నెలల పాటు నిలబెట్టేది మోహం. మూడేళ్ళ కాలంలో అది ఆప్యాయతగా మారి, ముప్ఫై సంవత్సరాల పాటు అదే సాంద్రతతో నిలవగలిగితే అది అనుబంధం. మొదటి రోజు ఉన్నంత బిలాంగిoగ్‌నెస్‌తో జీవితపు చివరిరోజు వరకూ ఉంటే అదే ప్రేమ.

    ‘జంతువులకి అసంతృప్తి ఉండదు. మనుష్యులకి అసంతృప్తి సహజ ప్రక్రియ’ అని ఓషో లాంటి కొందరు వాదిస్తారు. దీనికి ఉదాహరణగా, "అబ్బాయీ, అమ్మాయీ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా పక్క నుంచి ఒక అందాలరాశి వెళ్తూoదనుకుందాం. ఆ అబ్బాయి కన్నార్పకుండా ఆమె వైపు చూస్తూ ఉంటాడు. అతడి స్నేహితురాలు ఉక్రోషంతో, ఈర్ష్యతో ఉడికిపోతుంది.

    అబ్బాయి చూడటం సహజమైన క్రియ. అమ్మాయి ఈర్ష్య చెందటం కూడా అంతే సహజమైన ప్రక్రియ " అంటాడు ఓషో.

    ఈ స్టేట్‌మెంట్‌తో మనం పూర్తిగా ఏకీభవించవలసిన అవసరం లేదు. కడుపు నిండుగా ఉన్నప్పుడు ఎంత ఇష్టమైన స్వీటు కనబడ్డా మనసటు పోదు. ఇష్టమైన వ్యక్తితో నిజమైన ప్రేమలో ఉన్నప్పుడు ప్రవరుడూ, నలకూబరుడు కలిసొచ్చినా, రంభా ఊర్వశులు నలుగురూ కలిసి నాట్యం చేసినా, అటు చూడబుద్ధి వెయ్యదు.

    పట్టూ విడుపులతో సర్దుకు పోలేని ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మితిమీరిన తెలివైన వారు, ఇద్దరు మూర్ఖులు లేదా వితండవాదులు మంచి దంపతులయ్యే ఛాన్సు తక్కువ. అదే విధంగా ఒక మంచి భార్య, మంచి భర్త ఒక మంచి జంట అవుతారనే రూలేమీ లేదు.

    దశాబ్దాల తరబడి ప్రేమించుకున్న వారు కూడా, వివాహం జరిగిన తరువాత 'తప్పు చేసామేమో' అని బాధపడటానికి కారణం వివాత్పూర్వ ప్రేమలోని మైకమే. ప్రేమలో మైకం-లేని-స్పృహ చాలా అవసరం.

    ‘గంగాజల్ ' అనే హిందీ సినిమా చూసిన అమ్మాయి, నాకు హీరో కంటే విలనే బాగా నచ్చాడు. ప్రేమంటే అలా ఉండాలి అంది. పెళ్ళి కాని పిల్ల(ల) లోకో భిన్న రుచి.

    పెళ్ళైన మూడో రోజు గర్వంగా, సమయపాలన నా ప్రాణం. '80 రోజుల్లో భూప్రదక్షణం' నవల హీరో ఫిలియాస్‌ ఫాగ్ నా ఆదర్శం. అయిదింటికి లేచి ఎక్సర్సైజ్ చేసి, ఆరింటికల్లా నా వ్యాసాంగం లోకి దిగి పోతాను. ఆరోగ్యకరమైన అలవాట్ల నుంచీ అన్నీ సిస్టమాటిక్‌గా, శుభ్రంగా ఉంచుకుంటాను. శుభ్రత నా ప్రాణం చెప్పాడు అబ్బాయి. ఇంత రొటీనా? ఇదంతా పెళ్ళికి ముందే నాకెందుకు చెప్పలేదు? నాకు జీవితం పిచ్చిపిచ్చిగా ఉండాలి. ప్రతిరోజూ ఒకేలా ఉండే మెకానికల్‌నెస్ అస్సలు నచ్చదు అన్నదా అమ్మాయి.

    చూడండి ఎంత గమ్మత్తో..! ఒకరి క్రమశిక్షణ మరొకరికి రొటీన్ లైఫ్. ఒకరికి హీరో కన్నా విలన్‌లా ఉంటే ఇష్టం. పెళ్ళికి ముందు ఇంత చిన్న (ముఖ్యమైన) విషయాన్ని వాళ్ళిద్దరూ గుర్తించలేదు.

    ప్రేమలో/స్నేహంలో ఎదురయ్యే ఇటువంటి ధృక్పథ-భేదాలు ఎలా సరిదిద్దు కోవాలో చెప్పే ప్రయత్నం ఈ పుస్తకంలో జరిగింది.

    స్నేహంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలా అని మీకు అనుమానం రావచ్చు. సాధారణ పరిచయాల్లో అవసరం లేదు గానీ లవర్స్‌ని (సారీ. లవర్స్‌ కాదు. లవర్‌ని) ఎన్నుకోవటానికి స్పృహ కావాలి. జీవిత భాగస్వామిని ఎన్నుకొనేటప్పుడూ, నిగూఢ రహస్యాలు చర్చించేటప్పుడూ ‘మైకం-లేని-జాగ్రత్త’ కావాలి. అత్మీయులు అనుకుని నమ్మి, మనం ఎన్నిసార్లు మోసపోలేదు?

    ప్రేమలోనే కాదు. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా దురదృష్టం వెంటాడవచ్చు. ఒద్దికగా పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్న ముద్దరాలికి మందు లేనిదే ముద్ద దిగని మొగుడు, విలువల పట్ల నమ్మకమున్న అమ్మాయికి వ్యభిచారుడు, శుభ్రతకి ప్రాణమిచ్చే స్త్రీకి బద్దకం బురదని మెచ్చే సూకరము, జాగ్రత్త పరుడైన కుర్రాడికి ఆర్థిక నియంత్రణ లేని భార్య భాగస్వాములుగా రావచ్చు.

    ఇలాంటి నిరాశా నిస్పృహలేర్పడినప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. అడవిలో దారి తప్పినప్పుడు చీకటిలో ప్రయాణం చెయ్యకూడదు. చెట్టెక్కి కూర్చోవాలి. మంట వేసుక్కూర్చుని జాగారం చెయ్యాలి. ఏమీ చెయ్యకుండా ఉండటం కన్నా ఏదో ఒకటి చెయ్యటం మంచిది. ఏ ఓటమీ ముగింపు కాదనీ, అన్నీ కోల్పోయి కూడా జీరో-బేస్డ్ స్థాయి నుంచి తిరిగి జీవితం ప్రారంభించవచ్చని 'విజయానికి అయిదు మెట్లు’ లో చెప్పటం జరిగింది. అదే విధంగా-

    ‘ప్రేమలో విఫలమవటం' అన్న ప్రసక్తేలేదనీ, మరణం వల్ల గానీ, అభిప్రాయ భేదం వల్ల గానీ మన జీవితంలోంచి ఒకరు నిష్క్రమించినప్పుడు, ప్రేమని తిరిగి ఫ్రెష్‌గా మొదలుపెట్టవచ్చనీ, ప్రేమని పునఃప్రారంభించటం తప్పు కాదనీ చెప్పే ఒక పాజిటివ్ వివాదాస్పదమైన చర్చ ఈ పుస్తకంలో జరిగింది.

    ప్రేమ అనేది బంధంతో మొదలవ్వాలి. అబ్బాయిగానీ, అమ్మాయిగానీ నన్ను పెళ్ళి చేసుకోవటం నీకిష్టమేనా అని అడగాలి. ఆమె 'ఓకే' అంటే అప్పుడు ఐ లవ్యూ అనాలి. -డేగ రెక్కల చప్పుడు.

    వివాదాస్పదమైన చర్చoటే ఏమిటో ఒక ఉదాహరణ చెప్తాను. 'డాక్టర్ చక్రవర్తి ' సినిమాలో నాగేశ్వరరావు సావిత్రిని పవిత్రంగా ప్రేమిస్తాడు. అర్ధరాత్రయినా మూడ్‌ వస్తే (చూడాలన్న మూడ్‌ వస్తే) నిష్కల్మష హృదయంతో వెళ్ళి తలుపు కొడుతూ ఉంటాడు.

    వీరి పవిత్ర స్నేహం చూసి సావిత్రి మొగుడుకి వళ్ళుమండి, నిండు గర్భవతిని ఇంట్లోంచి గెంటేస్తాడు. తానామెని 'చెల్లిగా' ప్రేమిస్తూన్నానని హీరో క్లారిఫై చేస్తే జగ్గయ్య కళ్ళు తెరుచుకుంటాయి. ఈలోపు ఆమెకు ప్రాణాల మీదకొస్తుంది. అమెరికా వెళ్ళిపోతూన్న నాగేశ్వరరావు విమానాన్ని వెనక్కి తిప్పిoచి(!) తిరిగి రావటంతో కథ సుఖాంతమౌతుంది.

    దీని స్క్రీన్‌ప్లే చెయ్యటానికి తల ప్రాణం తోకకొచ్చిందని ఆ సినిమా రచయిత గొల్లపూడి మారుతీరావు స్వయంగా చెప్పాడు. ఎందుకంటే, అది ‘అన్నా- చెల్లి అనుబంధo’ అని ముందే చెప్తే సస్పెన్సు ఉండదు. చివర్లో చెప్తే, 'ఈ విషయం ముందే చెప్పి ఏడవొచ్చు కదా' అని ప్రేక్షకులు విసుక్కునే ప్రమాదం ఉంది.

    ఈ కత్తి మీద సాముని (నాగేశ్వరరావుకి ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక చెల్లిని సృష్టించి, ఆమెతో ‘పాడమని నన్నడగవలెనా/ పాడమని నన్నడగ తగునా’ అన్న రెండర్థాల ఆత్రేయ పాట పాడించి) చక్కగా చేశారు కాబట్టి సూపర్ హిట్టయింది. సరిగ్గా ఇలాంటి కథాంశంతో వచ్చిన సల్మాన్, షారూక్, మాధురీ దీక్షిత్ 'హమ్ తుమ్హారే హై సనమ్'; శ్రుతిహాసన్- సిద్ధార్థ తెలుగు చిత్రం 'ఓ మై ఫ్రెండ్' చెరో మూడు రోజులూ అడాయి.

    స్త్రీ పురుషుల మధ్య పవిత్ర స్నేహాన్ని భర్తలే కాదు, ప్రేక్షకులు కూడా ఒప్పుకోరని చెప్పటం ఈ పుస్తకపు ఉద్దేశ్యం కాదు. నవలని సినిమాగా మార్చటం ఎంత కష్టమో చెప్పటం కూడా కాదు. భార్యాభర్తల అన్యోన్యపు పాలలో విభేదపు ఉప్పుకల్లు పడటానికి ఇంత చిన్నసమస్య చాలని చెప్పటమే ఉద్దేశ్యం..!

    వివాదాస్పదమైన చర్చ అంటే ఏమిటో అర్థమవ్వటానికి పై ఉదాహరణ ఎన్నుకోవటం జరిగింది. ఉదాహరణ దరిద్రంగా ఉందా? వదిలెయ్యండి.

    కానీ ఒక్క విషయం..! విడాకులు తీసుకుoదామని మ్యారేజి-కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చేవారు ఇంతకన్నా చిన్న కారణాల వల్ల వస్తారని ఊహించగలరా?

    పైన చెప్పిన సినిమా కథలాంటి ఒక యథార్థ సంఘటనకి నేను ప్రత్యక్ష సాక్షిని.

    ఒక స్త్రీ తాలూకు సమస్యని పరిష్కరించటానికి ఉత్తమ మార్గం, ఆమె చెప్పేది చివరి వరకూ వినడం మాత్రమే. - విజయంలో భాగస్వామ్యం.

    కొత్తగా పెళ్ళయిన ఒకమ్మాయికి వివాహత్పూర్వం ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఆమె కొత్త భర్తకి (పద ప్రయోగానికి క్షమించాలి) ఇలాంటి స్నేహాల మీద నమ్మకం లేదు. కలుసుకోవద్దని ఆంక్ష పెట్టాడు. అది తన వ్యక్తిత్వానికి సంబంధించిన విషయమని ఆ అమ్మాయి ఎదురు తిరిగింది.

    చిన్నచిన్న వాగులన్నీ కలిసి నదిగా మారినట్టూ, విభేదమనే వర్షం చిలికిచిలికి గాలివానై, విడాకుల సునామీగా మారిన వేళ ఆ అమ్మాయిని కౌన్సిలర్ దగ్గరకు తీసుకొచ్చారు. పెనం మీద ఆవగింజలా ఎగిసి ఆవేశపడుతూ ‘తన వాదన’ వినిపించింది అమ్మాయి. పక్కన కూర్చున్న తల్లిదండ్రులు బిక్కుబిక్కుమని చూడటం నాకింకా గుర్తుంది.

    దంపతుల మధ్య అసంతృప్తి కాలిమీద కుట్టే దోమలాంటిది. ఏదో చెయ్యాలని అనిపిస్తుంది. ఏం చెయ్యాలో తెలీదు. అరచేత్తో చరుస్తాము. అటు దోమ చస్తుంది. ఇటు దురద మనల్ని చంపుతుంది. అది సుఖంగా ఉండదు. మనల్ని సుఖంగా ఉండనివ్వదు. క్షమించాలి. ఇంతకన్నా దరిద్రమైన పోలిక దొరకలేదు.

    కౌన్సిలరు మాత్రం ఏమి సలహా ఇవ్వగలడు? మంచి కౌన్సిలర్ ఎప్పుడూ ఇరుకున పెట్టే ప్రశ్నలు వెయ్యడు. స్నేహితురాలి పక్కన పడుకుని, మీద చెయ్యేసి కబుర్లు చెప్పినట్టూ, నీ స్నేహితుడి పక్కన పడుకుని చెప్పగలవా? లాంటి పరిష్కారాలు చెప్పడు. వివిధ రకాలైన మార్గాల్ని సూచించి, వాటిలో ఒకదాన్ని ఎంచుకోమంటాడు. పై పరిస్థితుల్లో ఆమె:

    - భర్తని లెక్క చేయకుండా స్నేహితుడిని కలుసుకోవచ్చు.

    - నొప్పింపక తానొవ్వని రీతిలో భర్త పరోక్షంలో అతన్ని కలుసుకోవచ్చు.

    గతంలో పిక్నిక్‌కి వెళ్ళినప్పుడు, ఇద్దరూ ఒకే గదిలో రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఎలా ఉన్నారో, స్నేహితుడి పవిత్ర వ్యక్తిత్వం గురించి భర్తకి వివరించి చెప్పవచ్చు (కానీ ఇది విడాకులకి దారితీసే ప్రమాదం ఉంది).

    - అతడి భార్యని తన భర్తకి చెల్లిగా పరిచయం చేస్తూ, ఆమెని నోరారా ‘వదినా’ అని పిలుస్తూ, మొత్తం అందర్నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు.

    - పడక సత్యాగ్రహంలాంటి పద్ధతుల ద్వారా భర్తని లొంగదీసుకోవచ్చు.

    - భర్త కోసం ఇష్టం లేకున్నానో, మనస్పూర్తిగానో పాత స్నేహానికి బై చెప్పవచ్చు.

    నిరంతరం నిరాశతో బాధపడటం కంటే పైవాటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవటం మేలు. దురదృష్టవశాత్తూ చాలామంది పరిష్కారం కన్నా విధినే ఎక్కువ ఆశ్రయిస్తారు. జీవితం ఎక్కడా ఆగిపోదనీ, విధి తాలూకు స్టీరింగ్ భగవంతుని చేతిలో ఉండదనీ, మనం ఎటు తిప్పితే జీవితం అటు వెళ్తుందనీ అనుకోరు. మరో పరిష్కార మార్గం లేదని నమ్ముతూ, మనసులో బాధపడుతూ, మొహంపై చిరునవ్వు పులుముకుంటూ వర్తమాన జీవన విధానాన్ని కొనసాగిస్తారు.

    సంసార సమస్యలతో, ప్రేమ ఫెయిల్యూర్‌తో, ఇంకా వివిధ రకాల ప్రోబ్లమ్స్‌తో కౌన్సిలర్స్ దగ్గరకి వచ్చే వారికో సూచన. కాస్త ఆలోచిస్తే, మనకే అనేక మార్గాలు స్ఫురిస్తాయి. ఇవన్నీ మన చేతిలోనే ఉంటాయి. కౌన్సిలర్లు మార్గదర్శులు మాత్రమే. ప్రయాణించవలసిన వారము మనమే. ఇలాంటి సందర్భాల్లో ఫ్రాయిడ్ …నిరర్థకమైన కోరికను ‘మలుపు తిప్పడం’ ద్వారా మరింత మంచి మార్గంలో పయనించవచ్చు అని సూచిస్తాడు. అభిమాన హీరో మొదటిషో తెల్లారాట కోసం అర్ధరాత్రి అలారం పెట్టుకుని లేచి వెళ్ళే అభిమాని, అందులోని థ్రిల్‌ ఊహించుకుంటాడే తప్ప అక్కడి తోపులాట, లాఠీచార్జి మొదలైనవి ఆలోచించడు. నెగెటివ్ విషయాల గురించి బాధపడటం మానేసి, అతడు కేవలం ఆనందాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాడన్న మాట. అదే పాజిటివ్ ఆలోచన..! దీన్నే చదువుకి అన్వయిస్తే, ‘…మోర్నింగ్‌షో కోసం కంటే, చదువు కోసం తెల్లార్నే లేవటం ఉపయోగకరం’ అని తెలుసుకోవటం మరింత పాజిటివ్ ఆలోచన. అలాంటి సానుకూల ఆలోచనాధోరణి గురించిన చర్చ కూడా ఈ

    Enjoying the preview?
    Page 1 of 1