Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Tanalo Nannu
Tanalo Nannu
Tanalo Nannu
Ebook324 pages1 hour

Tanalo Nannu

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

A collection of short stories in Telugu by Panini Jannabhatla. The stories explore different aspects of life with relatable characters that touch a chord with readers.

 

Tanalo Nannu

Shabari

Maro Kurukshetram

Suryodayam

Kalavaramaaye Madhilo

Aatmasamarpana

Departure Gate

Digital Friend

Vidyadaanam

Rangu Maarchina Samudram

Guppumanna Notlu

Endukee Agadham

Eighth Sin

 

LanguageTelugu
Release dateMay 24, 2023
ISBN9798215092743
Tanalo Nannu

Related to Tanalo Nannu

Related ebooks

Reviews for Tanalo Nannu

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Tanalo Nannu - Panini Jannabhatla

    రచయిత మాట

    పుట్టిన రోజు నాడు ఓ అందమైన బహుమతిని అందుకోబోతున్న ఓ పిల్లాడి ముఖంలోని ఆశ్చర్యాన్నీ, మనసులో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆనందాన్నీ, దాంట్లో ఏముందో తెరిచి చూడాలన్న తహతహని ఓసారి ఊహించుకోండి. ఈ పుస్తకాన్ని మీ చేతుల్లో చూస్తున్న నాదీ ఆ పిల్లాడి పరిస్థితే! దీన్ని చదువుతున్నారన్న సంతోషం, ఎలా ఉంటుందంటారోనన్న ఆతృత, ఊహించని కల వాస్తవంలోకి మారుతోందన్న ఆశ్చర్యం!

    2020లో నేను ఇండియాకి వెళ్ళినప్పుడు ఎదురైన సంఘటనలే నా మొట్టమొదటి కథా వస్తువులుగా మారాయి. అప్పుడు మొదలైన నా ప్రయాణం తర్వాత్తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో మరిన్ని కథలకి దారితీసింది. ‘అసలు కథలెందుకు రాసాను, రాస్తున్నాను?’ అన్న ప్రశ్నకి మాత్రం నాకు కొన్ని ‘బహుశా’ లే సమాధానాలుగా దొరికాయి - ‘బహుశా నాలో, మనలో ఉన్న అపోహల్నీ, రహస్యాలని ఎత్తి చూపాలనే పిచ్చి ఆలోచనేమో?’, ‘బహుశా మనసుని కుదిపేస్తున్న భావాలని అందరితో పంచుకోవాలనే ఆశేమో?’, ‘బహుశా రెక్కలు తొడుక్కున్న నా కుతూహలం, విహరించి వచ్చి చెప్పిన విచిత్రాలకి రూపమివ్వాలనేమో?’, 'బహుశా నా ఉనికిని చాటడానికి  నేనెన్నుకున్న రహస్య మార్గమేమో?', 'బహుశా నా నుండి హఠాత్తుగా బయటపడ్డ రచయితని‌ గట్టిగా ఒడిసిపట్టుకునే ప్రయత్నమేమో?'

    పొద్దున ఇడ్లీ సాంబార్ నీ, మధ్యాహ్నం పిజ్జానీ, సాయంత్రం ఓ ఫంక్షన్ లో బఫే భోజనాన్నీ మనం అవలీలగా తినగలం. అలానే ఓ పూట అన్నమయ్య పాటల్ని అత్యంత ఆరాధనగా వినగలం, మరోపూట ఓ హాలీవుడ్ మూవీని కళ్ళు పెద్దవి చేసుకుని చూడగలం. మిత్రులతో కలిసినప్పుడు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలని క్షణాల్లో మార్చి మార్చి అనర్గళంగా మాట్లాడగలం. అదే విధంగా, సామాజిక మాధ్యమాల్లో కోకొల్లలుగా వచ్చిపడే విషయాలనీ తేలికగా స్పృశించగలం. నా కథలు కూడా ఇలాంటి వైరుద్ధ్యాలని ప్రతిబింబించేవే. ఈ కథలు ఒకదానికంటే మరొకటి భిన్నంగా ఉండటం సమాజంలో వివిధ విషయాలపైన నాకున్న ఆసక్తి‌ వల్ల కాకతాళీయంగా జరిగిందే. వేగంగా మారే విభిన్నతలని అర్ధంచేసుకునే, ఆస్వాదించగలిగే లక్షణం ఈ తరానికి సాధారణమే కనుక, పాఠకులు ఇటువంటి కథావైవిధ్యాన్ని ఆదరిస్తారనే గట్టి నమ్మకమైతే ఉంది.

    ప్రతి రచయిత(త్రి)కీ తమ ప్రత్యేకమైన శైలీ, శిల్పాలు ఉన్నా ఇతర రచయితల ప్రభావం వారి మీద తప్పనిసరిగా ఉంటుంది. అలాగే నేను చదివిన, ప్రభావితం చెయ్యబడిన దిగ్గజాలెందరో. దాశరథి రంగాచార్య రచనల్లోని ఆవేశం, చాసో రచనల్లోని క్లుప్తత, బుచ్చిబాబు కథల్లోని లోతు, చలం చూపించే తిరుగుబాటు నన్ను ఆశ్చర్యపరిచాయి, పరుస్తూనే ఉన్నాయి. ఈ తరం తెలుగు రచయితలూ, సినీ దర్శకులూ చేస్తున్న అద్భుతమైన రచనలు, వినూత్న ప్రయోగాలు కూడా నిరంతరం నేర్చుకోవడానికి సహకరిస్తున్నాయి. 

    ప్రయాణం నాదైనా, దానికో బలం కావాలి. ఎదురుగా రెపెరెపలాడుతూ కవ్విస్తున్న తెల్లకాగితాన్ని అర్ధవంతంగా నింపే ఆత్మస్థైర్యం కావాలి. 'మీరు బాగా రాస్తున్నారు' అన్న మూడు పదాలతో ఆ రెండింటినీ నాలో నింపిన‌ వ్యక్తి కిరణ్ ప్రభ గారు. కౌముది వెబ్ మ్యాగజైన్ వ్యవస్థాపకులుగా, ప్రఖ్యాత టాక్‌ షో హోస్ట్ గా సాహితీ ప్రపంచంలో ఆయన తెలియని వారుండరు. అంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆయన వీలు చేసుకొని నాకిచ్చిన, ఇస్తున్న సలహాలే రాయగలగటానికి నా‌కు ప్రేరణ. నా మొదటి కథ 'విద్యాదానం' కౌముదిలో ప్రచురించినప్పటినుండీ వారి ఈ అభిమానానికి పాత్రుణ్ణి కావడం కేవలం నా‌ అదృష్టం. అదే ప్రేమతో, అడిగిన వెంటనే తన విలువైన సమయాన్ని కేటాయించి ఈ పుస్తకానికి అద్భుతమైన ముందుమాటని కూడా రాసిచ్చిన వారికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను?! 

    అలాగే, కొత్త రచయితనని భావించకుండా నా 'ఎందుకీ అగాధం' కథని ఎంపిక చేసి '2021 డయాస్పొరా తెలుగు సంకలనం' లో‌ ప్రచురించి, 'మరో కురుక్షేత్రం' కథని‌ 2022 ఉగాది కథల పోటీలో ఉత్తమ కథగా ఎంపికచేసిన వంగూరి ఫౌండేషన్ చిట్టెన్ రాజు గారికీ, శాయి రాచకొండగారికీ సర్వదా కృతజ్ఞతలు. కథలే కాదు వ్యాసాలు కూడా రాయమని నన్ను ప్రేరేపించి, రాయించి,  ప్రచురించిన 'మధురవాణి' ఎడిటర్ దీప్తి పెండ్యాల గారికీ, 'డిజిటల్ ఫ్రెండ్' , 'ఎయిత్ సిన్' కథలని ఆదివారం ఎడిషన్ లో ప్రచురించిన ఆంధ్రజ్యోతి వారికీ, దగ్గరుండి సలహాలిచ్చిన గొరుసు జగదీశ్ రెడ్ది గారికీ, నా మొదటి కథలని ఆదరించి ప్రచురించిన 'గోతెలుగు.కామ్' ఎడిటర్ గారికీ పేరుపేరునా ధన్యవాదాలు.

    కొత్తగా రచనా వ్యాసంగంలోకి అడుగుపెట్టిన నాకు తోడుగా నిలిచిన మిత్రులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత వేంపల్లె షరీఫ్ గారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా నా కథలకి సమయమిచ్చి చదివి, ఓపిగ్గా తన సలహాలని ఎప్పటికప్పుడు పంచుతూ, ఈ సంకలనం తేవడానికి ఎంతో సహాయపడిన షరీఫ్ గారికి కృతజ్ఞతలు. 

    ఎప్పటికప్పుడు నాకు విలువైన సూచలనలిస్తూ, ఆయన అనుభవాల్నే పాఠాలుగా పంచుతున్న సాయి బ్రహ్మానందం గోర్తి గారికీ, రచయితగా, ఫిలిం మేకర్ గా రాణిస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న వేణు నక్షత్రం గారికీ, 'ఇంకా రాయండి' అంటూ ఉత్సాహమిస్తున్న భాస్కర్ పులికల్ (నిర్మలాదిత్య) గారికీ ధన్యవాదాలు. 

    నేనేం చేసినా నాకు తోడుంటూ, నా కథలన్నీ ఓపిగ్గా చదువుతూ తన విలువైన అభిప్రాయాలూ, మార్పులూ సూచిస్తున్న తమ్ముడు ఆదిత్య జన్నాభట్లకీ, నా ప్రయాణాన్ని దగ్గరగా గమనిస్తూ, నిరంతరం ప్రోత్సహిస్తున్న ఆప్త మిత్రులు - సిద్ధార్ధ వింజామరం, శ్రీకాంత్ సురభి, 'మామ' శ్రీధర్ అడ్లూరికీ, నన్నెంతగానో ప్రోత్సహించిన శాంతి పసుమర్తి గారికీ, మా లెక్సింగ్టన్ మిత్రులకీ, వేర్వేరు సామాజిక మాధ్యమాల ద్వారా కథలని చదివి ప్రోత్సహిస్తున్న ఎంతో మంది మిత్రులకీ నా కృతజ్ఞతలు. 

    ప్రింటు పుస్తకం ఇంత అందంగా రావడానికి అద్భుతమైన లే అవుట్, ప్రింటింగ్, మార్కెటింగ్ వరకూ అన్నీ దగ్గరుండి ఓర్పుతో చూసుకున్న అన్విక్షికీ యాజమాన్యమైన మహీ బెజవాడ గారికీ, వెంకట్ సిద్దారెడ్డి గారికీ, అందంగా అచ్చువేసిన అనుపమ ప్రింటర్స్ కీ సదా ధన్యవాదాలు.

    ఏంట్రా ఈ కొత్తపిచ్చి! అని మొదట్లో ఆశ్చర్యపోయినా, తర్వాత ఆశీర్వదించి తమ సలహాలనీ, అభిప్రాయాలనీ ఎప్పటికప్పుడు అందిస్తున్న అమ్మానాన్నలకి నమస్సులు.

    నా మొట్టమొదటి పాఠకురాలూ, విమర్శకురాలూ, సహాయకురాలూ, అన్నిట్లో సమర్ధురాలైన నా అర్థాంగి కిరణ్మయికీ, నాన్న మళ్ళీ టెలుగు ష్టోరీస్ రాస్కుంటున్నారమ్మా అని అమ్మకి ముద్దుగా కంప్లైంట్ చేసే ప్రణవ్, విహాన్ లకీ ప్రేమతో...

    పాణిని జన్నాభట్ల

    లెక్సింగ్టన్, మెసాచుసెట్స్

    02-April-2022

    కొత్తదనం నిండిన కథలకు కేరాఫ్ ఎడ్రస్

    కౌముదిలో ప్రచురణకోసం చాలా కథలు వస్తుంటాయి. చాలాసార్లు కొద్దిరోజుల వ్యవధిలోనే పరిశీలించి నిర్ణయం తెలియజేస్తాము. చాలా కథలు మొదటి పేజీ చదవగానే ఒక అవగాహన వస్తుంది - అంటే - వాక్యనిర్మాణమూ, ఎత్తుగడా, కథాగమనం ఇలాంటివన్నీ మొదటి రెండు మూడు పేజీల్లోనే ఒక అభిప్రాయం కలిగిస్తాయి. ముఖ్యంగా ఎవరైనా ఇది మా కొత్త కథ అని పరిచయం చేసుకుంటే అధికశాతం తిప్పి పంపడమో, చాలా మార్పులు సూచించడమో జరుగుతుంది. ఓపిక ఉన్న రచయితలు మా సూచనలను పాటించి ఎన్నిసార్లైనా మార్చి వ్రాస్తారు. మరికొంత మందికి తెలియజేస్తాం మీ రచన మరీ ప్రాథమింకంగా ఉంది. కొంతకాలం మంచికథలు చదివి, వాటిని విశ్లేషించుకున్నాక అప్పుడు మళ్లీ వ్రాయడానికి ప్రయత్నించండి అని. ఇది నా మొదటి కథ అని చెప్పాక కూడా కథ చదివాక ఇది నిజంగా రచయిత మొదటి కథా..! అని ఆశ్చర్యపోయే సందర్భాలు అతి తక్కువగా ఎదురౌతుంటాయి. అలాంటి సందర్భం, చాలా సంవత్సరాల తర్వాత, 2021 ఫిబ్రవరిలో ఎదురైంది. 2021 ఫిబ్రవరి 13 న కథ అందితే వారంరోజుల్లో ఫిబ్రవరి 20 న కథని ప్రచురణకి తీసుకుంటున్నట్లు, ఐతే చివరి రెండు వాక్యాలూ తీసేస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాం. సమాధానంలో ఇంకో వాక్యం కూడా వ్రాశాం ఇది మీ మొదటి కథ అంటే నమ్మలేకపోతున్నాం అని. ఆ కథే ‘విద్యాదానం’. రచయిత పాణిని గారు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా...అసలు కథలోని మొదటివాక్యమే అదిరిపడ్డాడు రామనాథం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాట విని. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది... ఇది చాలు పాఠకుడ్ని ముందుకు నడిపించడానికి. రచయితగా కూడా ఎంతో మథించి వ్రాస్తే తప్ప అలాంటి హుక్ వాక్యంతో ప్రారంభించలేరు. అందుకే అనిపించింది ఇది నిజంగా మొదటి కథా! అని. 2021 మే నెల కౌముదిలో ఆ కథను ప్రచురించాము. 

    తరువాత జూన్ లో రెండు, మూడు కథలు పంపించి అభిప్రాయం అడిగారు. ఒక్కో కథా దేనికదే విభిన్నంగా ఉన్నాయి. ఎంపిక చేసుకున్న కథాంశాలు ఎక్కడా ఒకదానికొకటి పోలికలేదు. ఇంకా రచనా శైలి కానీ, కథా శిల్పంకానీ చెయ్యితిరిగిన రచయితలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఏవో చిన్నచిన్న మార్పులు తప్ప ప్రతికథా దేనికదే ప్రత్యేకం అనిపించింది. స్పందన తెలియజేయడం ఫోన్ లో ఐతే తేలికగా ఉంటుందని నంబరు అడిగి మాట్లాడాను. కథల్లోనూ, వాక్యాల్లోనూ, కథల్లోని భావాల్లోనూ ఉన్న సంస్కారమే పాణినిగారి మాటల్లో ధ్వనించింది. మొదటి సంభాషణలోనే ఎన్నో సంవత్సరాల పరిచయమున్న మిత్రుడిలా అనిపించారు. అప్పటినుంచీ చాలాసార్లు మాట్లాడుకుని ఉంటాం. ప్రతి ఫోన్ కాల్ ఎంతో ప్రొడక్టివ్ గా ఉంటుంది. సలహాలు చక్కగా అర్థం చేసుకుంటారు. నేను ప్రతి కథనూ ఎంత పొగిడినా పాణినిగారి స్పందనలో వినయమే పూర్తిగా నిండి ఉంటుంది. సెప్టెంబర్ 2021 లో ప్రచురించిన ‘తనలో నన్ను’ మరొక మాస్టర్ పీస్ అనిపించింది మాకైతే. ఈ కథల్లోని కథాంశాల గురించి కావాలనే ప్రస్తావించడం లేదు. కథా రచన ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ‘తనలో నన్ను’ లాంటి కథ వ్రాయడం చాలాచాలా తక్కువమంది రచయితలకే సాధ్యమౌతుంది. 

    రెండోసారో మూడోసారో మాట్లాడినప్పుడు చెప్పాను మీ కథల్లో ప్రతీదీ బహుమతి కథలాగే అనిపిస్తుంది అని. అన్నట్లుగానే ఈ సంవత్సరం చాలా పోటీల్లో వివిధ బహుమతులు పొందారు పాణినిగారు. ఆంధ్రదేశంలోని ఓ ప్రముఖ పత్రికవాళ్ళు కథ పంపిన వారం రోజుల్లోనే అంగీకారం తెలియజేసి, రెండు వారాల్లోనే ప్రచురించినప్పుడు నాతో తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే ఏ కొంచెం అనుభవమున్న ఎడిటర్ అయినా ఐనా మీ కథను వెంటనే ఎంపిక చేస్తారండీ అని చెప్పాను. 

    కేవలం పాణినిగారిని పొగడ్డమే ఈ ముందుమాట ఉద్దేశం కాదు. ఇదంతా ఆయన వ్రాసిన వైవిధ్యభరితమైన కథలు మాపై కలిగించిన ప్రభావమే. కొత్తగా కథలు వ్రాసే రచయితలు సంవత్సరంలోగానే కథాసంపుటి అచ్చువేసే వాళ్ళు చాలామందే ఉండొచ్చు కానీ పాణినిగారి కథల్లాంటి ప్రామాణికమైన, విభిన్న తరహా కథల్ని మొదటి కొద్ది నెలల్లోనే వ్రాసిన రచయితలు అత్యంత అరుదుగా ఉంటారని ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రతి కథకూ ఎంతసేపు ఆలోచిస్తారో, ఎంత కసరత్తు చేస్తారో కానీ ఒక్కో కథా పరిపూర్ణతను సంతరించుకుని పాఠకుడ్ని చేరుతోంది. పాణిని గారిని తెలుగు కథా సాహిత్యంలో స్థిరంగా, ప్రామాణికంగా ఎదుగుతున్న రచయిత అనడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సంపుటిలోని కథాంశాల వైవిధ్యాన్ని, రచనా శిల్పాన్ని గమనిస్తే ఆయనకి కథా రచయితగా మహోజ్వలమైన భవిష్యత్తు ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. పాణినిగారూ...మీ కథల్లోని సంస్కారం, మీ వాక్యాల్లోని సౌమ్యత, మీ ఆలోచనల్లోని వినూత్నత పదికాలాలు తెలుగు పాఠకుల్ని అలరించాలని మనసారా కోరుకుంటున్నాము. 

    కిరణ్ ప్రభ

    కౌముది అంతర్జాల మాసపత్రిక సంపాదకుడు

    టాక్ షో సమర్పకుడు

    డబ్లిన్, కాలిఫోర్నియా

    04-మే-2022

    తనలో నన్ను

    నాలో ఆతృత మొదలైంది. ఆరున్నర దాటినా‌ ఇంకా ఇంటికి రాలేదేంటి వీళ్ళు?. అప్పుడప్పుడూ ఇంతకు ముందిలా జరిగినా తను సర్దుకుంది‌ కానీ ఈ‌ మధ్య వల్ల కావటం లేదు. ఎక్కువ సమయం కూడా దొరకదు సాయంత్రాలు ఇక్కడే చూస్తూ కూర్చోటానికి. 

    ఎక్కడికెళ్ళుంటారో? ఎప్పుడొస్తారో?

    నేనూ నా ఆలోచనలూ. నేను ఒకరు కాదు ఇద్దరనిపిస్తుంది ఒక్కోసారి.‌ నాకు తెలీనిదేదో నాలో ఉందనిపిస్తుంది. అది నాతో కొట్లాడుతుంది, నిలదీస్తుంది, అవమానిస్తుంది. ఎక్కడికెల్తున్నానో తెలియని లోతులకి తీసికెళ్ళి పడేస్తుంది. వెనక్కి రాలేక ఉక్కిరిబిక్కిరౌతున్న నా అసహాయతను చూసి నవ్వుకుంటుంది. నా‌ భర్త అరుపు లాంటి‌ బలమైన శక్తిని‌ చూస్తే దానికి భయం.‌ తెలియని చోటెక్కడికో పారిపోయి దాక్కుంటుంది. పిరికిది.

    చటుక్కున తలెత్తి చూసేటప్పటికి హాల్లో లైటు వెలిగింది. ఇద్దరూ లోపలికొస్తూ‌ సోఫాలో కూలబడ్డారు. అలిసిపోయారు పాపం, ఎందుకింత కష్టపెట్టే ఉద్యోగాలు‌ చెయ్యడం? నా పిచ్చి జాలితనం. రెండు నిమిషాల్లో పైకి లేచింది ఆ‌ అమ్మాయి. హాలు తలుపు తీసుకొని బాల్కనీలోకి‌ వచ్చింది. తెల్ల స్లీవ్ లెస్‌ షర్ట్, ఎరుపు ప్యాంట్. సన్నని శిల్పంలా‌ ఉంది. బాల్కనీ గ్రిల్ మీదకు వంగి ఎదురుగా చూస్తోంది.

    నన్నేనా? నా అనుమానం. లేదు.‌ మా మధ్య దూరం నన్ను కనబడనివ్వదు!

    ***

    సంవత్సరం క్రితమే‌ కట్టారు ఆ లగ్జరీ కమ్యూనిటీని. దానికీ, మా‌ అపార్ట్మెంట్ కీ మధ్య పెద్ద ఖాళీ‌‌ స్థలం, ఒక‌రోడ్డూ, ప్రహరీ గోడలూ. సరిగ్గా ఆర్నెల్ల ముందు ఆ‌ అపార్ట్మెంట్ లో దిగిందా జంట. ఇల్లు‌ ఎక్కువ గ్లాస్ తో మొడరన్ గా కట్టించారు.‌ పొద్దున పూట ఎండ‌ రిఫ్లెక్షన్ వల్ల ఏమీ కనపడదు కానీ రాత్రి లైట్ లో మాత్రం మా కిచెన్ నుంచి‌ వాళ్ళ హాల్ స్పష్టంగా కనబడుతుంది. మొదట్లో పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు కానీ తర్వాత్తర్వాత‌ కుతూహలం పెరిగి రోజూ గమనించడం మొదలుపెట్టాను. ముఖ్యంగా ఆ అమ్మాయిని.

    తను నాజూగ్గా, మోడ్రన్ గా ఉంటుంది. జీన్స్ లు, ఫ్యాషన్ వేర్ ఎక్కువ వేస్తుంది. దూరంగా ఉండటంతో తన మేకప్, జువెలరీ సరిగ్గా కనపడవు. తన కోలముఖం, నడక, డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. జీవితంలో నేనెలా ఉండలేకపోయానో తను అలా ఉంది.

    నేనెందుకలా లేను? అన్న‌ ఈర్ష్య‌ నుంచి తనని చూడకుండా ఉండలేను అనేవరకూ వచ్చింది నా వ్యవహారం ఈ నాలుగు నెలల్లో. 

    తనకీ నాకూ సంబంధం‌ ఏంటి?, తనమీద ఇష్టమంటే, ఎలాంటిదది?, తనని చూస్తూ తప్పు చేస్తున్నానా? - నా మెదడుకు నేనే సంధించుకున్న ప్రశ్నలివి. "నువ్వు టీవీనో, మూవీనో చూస్తున్నావనుకో, దాంట్లోని‌ క్యారెక్టర్ కీ నీకూ సంబంధం ఏంటి? నువ్వెందుకు దాన్ని ప్రేమిస్తావ్?

    Enjoying the preview?
    Page 1 of 1