Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)
Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)
Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)
Ebook396 pages1 hour

Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఏ భాషా సాహిత్యమైనా ఆయా కాలమాన పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. సాహిత్యంలో రచయిత యొక్క శిల్ప, వస్తు, శైలీ విశ్లేషణలే కాకుండా ఆయా సందర్భాల యొక్క సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలను కూడా కవులు, రచయితలు వారి రచనల ద్వారా పాఠకులకి అందిస్తారు. ఇలాంటి రచనల ద్వారానే పాఠకులు ఒక కాలం యొక్క కవులను గూర్చి గానీ, ఆ కవులు లేవనె

LanguageTelugu
Release dateMay 6, 2023
ISBN9788196266714
Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)

Read more from Sudheer Reddy Pamireddy

Related to Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)

Related ebooks

Reviews for Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Kasturi Vijayam-Sahiti Mudralu (Telugu) - Sudheer Reddy Pamireddy

    ప్రౌఢ సాహిత్య దృక్పథం

    మహీధర

    ‘శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే

    లోకానాం స్థితిమావహన్త్య విహతాం స్త్రీపుంసయోగోద్భవాం

    తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై:

    భూయాసు: పురుషోత్తమాంబుజభవ శ్రీకంథరాశ్శ్రేయసే!

    లక్ష్మిని వక్షస్థలమునందు నిలుపుకున్న విష్ణువు, వాణిని ముఖమునందు నిలుపుకున్న బ్రహ్మ, అర్ధభాగమునే పార్వతీ దేవికి ఇచ్చిన పరమేశ్వరుడు అవిచ్ఛిన్నముగా లోకమును నిలుపుతూ వేదత్రయమూర్తులై దేవతలచే పూజింపబడే 'త్రిమూర్తులను ' లోక శ్శ్రేయస్సు కొరకు పూజించుచున్నాను.

    ఇది తెలుగులో ఆదికవిగా పిలువబడే నన్నయ భారతానికి ముందు చేసిన ప్రార్థనా స్తుతి... సంస్కృత శ్లోకముతో ప్రారంభించబడినది.

    ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే మొదటి తెలుగు వ్యాకరణ గ్రంథం సంస్కృతంలో రావడం.

    ఈనాడు మనం ఇతరభాషా విషయాలు తెలుసుకోవడానికి మాతృ భాషను ఆశ్రయిస్తాం. కానీ నన్నయ చేతనే తెలుగు వ్యాకరణం 'ఆంధ్ర శబ్ద చింతామణి' అనే పేరుతో సంస్కృతంలో వ్రాయబడినది.

    కారణం, ఆయన మీద ఆనాడు రెండు బాధ్యతలు మోపబడడం. మొదటిది పండితుల ఆమోదం పొందవలసి రావడం.

    రెండు సామాన్య జనానికి కూడా చేరువ చేసి తృప్తి పరచడం, అదీ రాజుగారి విన్నపంలాంటి ఆజ్ఞతో.వేసిన దారి వెంట వెళ్ళడం తేలిక.  దారి వేసుకు వెళ్ళడం కష్టం.

    నన్నయది రెండవ స్థితి.  నిజానికి ఆనాడు మహాభారతమంతటి ఉద్గ్రంథమును వ్రాయుటకు అవసరమైన భాషా సంపద కూడా తెలుగులో లేదు. కనుక, భాషను సంపన్నవంతం చేసుకోవలసిన బాధ్యత కూడా నన్నయ మీదే కలదు.కనుక తన మిత్రుడు 'నారాయణ భట్టు 'తో కలిసి ఈ మహా యజ్ఞానికి నన్నయ శ్రీకారం చుట్టాడు.ఇప్పుడు విషయానికి వస్తే సాహిత్యమంటేనే హితముతో కూడినది.  ఉన్నత విలువలతో కూడినది.  దాని దృష్టి ఎలా ఉంటుంది?  ఎలా ఉండాలి?  వేదాలు ప్రభుసమ్మితాలు, ఆజ్ఞల వంటివి.  ఆజ్ఞాపాలన కష్టం కావచ్చు. పురాణాలు మిత్రసమ్మితాలు. కొంతవరకూ అంగీకార యోగ్యాలు. కావ్యాలు కాంతా సమ్మితాలు.  తెలియకుండానే అంగీకరింప చేసుకుంటాయి.  నొప్పి తెలియకుండానే ఒప్పిస్తాయి.

    'కావ్యం యశసే, అర్థకృతే, వ్యవహారవిదే శివేతరక్షతయే'

    ఇది ప్రాచీనులు చెప్పిన సాహిత్య దృక్పథం.  ఇందులో అన్నీ ముఖ్యమైనవే.  కానీ 'వ్యవహారవిదే' విద్ జ్ఞానే ...

    ఏ కాలమైనా ఎంతో జనాభా, ఎన్నో మనస్తత్వాలూ, ఎన్నో ఆలోచనా రీతులూ, ఎన్నో జీవన విధానాలూ, ఎన్నో సమస్యలూ, ఎన్నో పరిష్కారాలూ ..ఇంతటి జ్ఞానాన్ని యివ్వడమే దీని ప్రధాన లక్ష్యం.అదీ ప్రియురాలు చెప్పినంత మృదువుగా ... అంగీకరింప చేయడంలోనే ఆనందం. నేర్చుకుంటున్నట్లు తెలియకుండానే నేర్చుకోవడం.  వీటికి అద్భుతమైన ఉదాహరణాలుగా 'రామాయణ, భారతాలను ' పేర్కొనవచ్చు.

    ఈ రచనలు సార్వకాలికాలు.  కష్టాలను నిబ్బరంగా ఎదుర్కోవడం, మనసును నిగ్రహించుకోవడం నేర్చుకోవచ్చు.

    రాముడు సరయూ నదిలో మునిగి అవతార సమాప్తి చెందినా, స్థితప్రజ్ఞత నేర్పిన గీతాకారు డైన శ్రీకృష్ణుడంతటి వాడు వేటగాడి బాణపు ములుకు తగిలి విగత జీవియై అడవిలో నాలుగు రోజులు దిక్కు లేక పడిఉన్నా, అంత గొప్ప విలుకాడు పరమేశ్వరుడినే జయించిన అర్జునుడు కృష్ణ నిర్యాణానంతరం దోపిడీ దొంగల చేతులలో విఫలుడైనా, సీతమ్మ అగ్నిప్రవేశం చేసినా, ద్రౌపది పదేపదే అవమానాలకు గురి అయినా, ఎంతటి వాళ్ళకైనా కష్టాలు తప్పవు, స్థితప్రజ్ఞత నేర్చుకోండి ' అని చెప్పడం.

    భాగవతములోని కృష్ణవర్ణన వలన జీవన మాధుర్యం, భారతంలోని కృష్ణవర్ణన వలన వ్యవహార దక్షతా కలిసి పరిపూర్ణ మానవ స్వరూపము వ్యక్తమవుతుంది.ఇవన్నీ సాహిత్యం జనాలకు నేర్పే జీవన పాఠాలే.

    ఆధునికులు ఈ రోజు ప్రాచీన సాహిత్యం సంస్కృతపదభూయిష్టమని విమర్శించినా కొన్ని వందలనాటి సామాజిక స్థితిగతులను - అది భాషాపరంగా కానీ, విషయపరంగా కానీ చెప్పిన విధానపరంగా కానీ విమర్శించడం న్యాయం కాదు.

    ఆనాడు, ఈనాడు, ఏనాడైనా అప్పటి పరిస్థితులను గమనించి మాట్లాడవలసి ఉంటుంది.

    నన్నయ తన రచనా విధానాన్ని ఇలా పేర్కొన్నాడు.

    సారమతిం గవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో

    నారసిమేలునానితరులక్షరరమ్యతనాదరింప నా

    నారుచిరార్థసూక్తినిథి నన్నయభట్టు తెనుంగునన్ మహా

    భారత సంహితారచన బంధురుడయ్యె జగద్ధితంబుగన్

    ఒకవిధంగా ఇవి ఏ రచనకైనా వర్తించే లక్షణాలే.  ఎందుకంటే పాఠకులందరి మేథాశక్తి ఒకలా ఉండదు.  వారి వారి సామర్థ్యాన్ని విశ్లేషణా శక్తినీ బట్టి కొందరు 'లోనారసి' అర్థం చేసుకుంటారు.

    రెండవ లక్షణం 'ప్రసన్నకథాకలితార్థయుక్తి'... ప్రసన్నమైన కథలతో కలిపి చెప్పే విధానం.

    మూడవది పదాలకుండే నాద సౌందర్యం.  భావం తెలియకపోయినా ఆస్వాదింపకలిగే శక్తి.

    అయితే ముఖ్య దృక్పథంగా 'నానారుచిరార్థసూక్తి నిథిత్వమును ' పేర్కొనవచ్చును.

    ఏం చెప్పాలి? ఎలా చెప్పాలి? అన్నీ ఇందులో వచ్చేసాయి.ఈ పద్యంలో తలమానికమైన మాట 'జగద్ధితంబుగన్ ' - లోకానికి మేలు.  అదీ ప్రాచీన సాహిత్య దృక్పథం.

    ఎవరి ఆలోచనా రీతిని బట్టి అలా కనిపిస్తాయి అంటూ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబనీ, అథ్యాత్మవిధులు వేదాంతమనియూ, నీతి విచక్షణులు నీతి శాస్త్రంబనీ, కవి వృషభులు మహాకావ్యమనియూ పురాణసముచ్చయమనియూ, ఇతిహాసమనియూ, విశ్వజనీనమనియు మహాభారతంలో నన్నయే

    Enjoying the preview?
    Page 1 of 1