Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Dari-Daapu: Nibaddata-Nimagnatalapai aalokana (Telugu)
Dari-Daapu: Nibaddata-Nimagnatalapai aalokana (Telugu)
Dari-Daapu: Nibaddata-Nimagnatalapai aalokana (Telugu)
Ebook321 pages1 hour

Dari-Daapu: Nibaddata-Nimagnatalapai aalokana (Telugu)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

"రచయిత-నిబద్ధత"అనే వ్యాసం రాయడానికి ప్రేరకులు కడప ఆకాశవాణి బాధ్యులు డా. తక్కోలు మాంచి రెడ్డిగారు. ఆ వ్యాసాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రచురించి అలాంటివ్యాసాలు మరికొన్ని రాయమని ప్రోత్సహించిన మిత్రుడు పొనుగోటి కృష్ణారెడ్డి గారు. అప్పటినుండి గత ముప్ఫై ఏళ్ళలో అనేక సాహిత్య భావనలు మీద నేను రాసి

LanguageTelugu
Release dateFeb 6, 2023
ISBN9788196168711
Dari-Daapu: Nibaddata-Nimagnatalapai aalokana (Telugu)

Related to Dari-Daapu

Related ebooks

Reviews for Dari-Daapu

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Dari-Daapu - Rachapalem Chandra Sekhara Reddy

    రచయిత - నిబద్ధత

    కమిట్మెంట్ అనే ఇంగ్లీషు మాటకు సమానార్థకంగా తెలుగులో నిబద్ధత అనే మాటను వాడుకుంటున్నాం. ఒక తాత్విక నేపథ్యానికి, ఒక ఆలోచనా విధానానికి కట్టుబడి ఒక వర్గంపట్ల పక్షపాతం వహించి రచన చెయ్యడమే నిబద్ధత. సమాజాన్ని కొన్ని ఆర్థిక, సాంఘిక, రాజకీయ ఆధ్యాత్మిక సూత్రాలు నడిపిస్తుంటాయని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అందువల్ల సమాజం ఎప్పుడూ నిబద్ధమే. సమాజ జీవితాన్ని ప్రతిబింబించే కళలు కూడా నిబద్ధాలే అవుతాయి. కొన్ని ఆర్థికసూత్రాలకు ఒదిగి నడుస్తున్న సమాజానికి ఉపరితలనిర్మాణాలైన కళలు అనిబద్ధంగా ఉండటం సాధ్యంకాదు, ఉన్నా వికృతంగా ఉంటాయి. అలాంటి కళలకు రచనలకు ఆ వికృతస్థానమే చరిత్రలో లభించేది. రచయిత లేక కళాకారుడు సమాజంలో భాగమే కాబట్టి అతడు కూడా సమాజాన్ని నిబద్ధుడయ్యే దర్శిస్తాడు. కళగా మలిచి ప్రదర్శిస్తాడు. రచయిత ఎంతగా వ్యక్తిగత భావాలను ఆశ్రయించిన వాడైనా నూటికి నూరుపాళ్ళు రచనా జీవితమంతా అనిబద్ధంగా గడపడం సాధ్యంకాదు.

    తెలుగులో విప్లవసాహిత్యం మొదలైనాక 'నిబద్ధత' అనే మాట ప్రచారంలోకి వచ్చింది. మొదట్లో రచయిత నిబద్ధుడు కావడమంటే పీడిత ప్రజలపక్షాన నిలవడమనే అర్థం. ప్రగతిశీల సాహిత్యం మార్క్సిస్ట్ భావజాలంతో ప్రభావితమై వర్గదృష్టితో ప్రజాజీవితాన్ని చిత్రించింది. అందువల్ల ఆరోజుల్లో రచయిత నిబద్ధుడవటమంటే మార్క్సిస్ట్ దృష్టితో శ్రామికవర్గప్రజల పక్షం వహించి సమాజాన్ని చిత్రించడమనే అర్థం. ఆ తర్వాత దానిమీద చాలా చర్చ జరిగింది. నిబద్ధుడంటే రచయిత సమాజానికి సంబంధించిన ఆలోచనా ధోరణుల్లో ఏదో ఒకదానికి చెందినవాడని తర్వాత కాలంలో సాహిత్యమార్గంలో ఉండేవాళ్లు గుర్తించారు. నిబద్ధత అనే మాటకు అర్థవిస్తృతి ఏర్పడింది. ఆ దృష్టితో విశ్వనాథ, శ్రీశ్రీలు ఇద్దరూ నిబద్ధ రచయితలే అనికూడా గుర్తించారు. అంటే నిబద్ధత ఒకరకమైంది మాత్రమే కాదని, అది అనేకరకాలుగా ఉంటుందని, రచయితలు వాళ్ళ వాళ్ళ చైతన్యాన్ని బట్టి ఆయా నిబద్ధతలను పాటిస్తారని అర్ధమౌతుంది.

    ఈదృష్టితో చూచినప్పుడు నిబద్ధత అనేమాట ఇటీవలి కాలంలో ప్రచారంలోకి వచ్చినా కవులు నిబద్ధులై రచనలు చెయ్యడం ప్రాచీనకాలం నుంచే ఉందని తెలుస్తుంది. ప్రాచీన కవుల్లో నిబద్ధరచయితలు ఎందరో ఉన్నారు. నన్నయ్య వాళ్ళలో ప్రముఖుడు. ఆయన వర్ణ వ్యవస్థకు, విధివిలాసానికి, పునర్జన్మకు, రాచరికానికి నిబద్ధుడు, వైదిక ధర్మానికి నిబద్ధుడు. పురాణేతిహాసాలు ఈనాటి ఆలోచనా విధానానికి నిలవకపోయినా ఒకనాటి ఆలోచనా ధోరణిని ప్రతిబింబించాయి. వాటిలో అప్పటి దృష్టితో చూస్తే ఎంతో సమాజం కనిపిస్తుంది. వాటిలో చెప్పబడిన ధర్మాలకు నన్నయ్య నిబద్ధుడు. భారతంలో ప్రతి అంశాన్నీ నన్నయ్య మనసా వాచా నమ్మే చెప్పాడు. ఆయన రాజరాజనరేంద్రుని పొగిడినా, యయాతిని పొగిడినా వాళ్ళు వర్ణధర్మాలను కాపాడారంటాడు. మనుమారగాములంటాడు. అదే ఆయన దృష్టిలో జగద్ధితం. మనిషి కన్నా విధి చాలా గొప్పది అని భావించడం ప్రాచీన ఆలోచనా ధోరణి. ఈ సృష్టి భగవంతుని పని అన్నది నాటి విశ్వాసం. నన్నయ్య ఈవిషయాలను నిర్ద్వంద్వంగా చాలా కథల్లో బోధించాడు. నలుడు 'కలిప్రేరణహతమతియై', ధర్మరాజు 'విధినియుక్తుండయి' జూదం ఆడారంటాడు. పోతన భాగవతంలో

    చేతులారంగ శివుని పూజింపడేని

    నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని

    దయయు సత్యంబు లోనుగా దలపడేని

    కలుగనేటికి దల్లులకడుపుచేటు

    అని స్పష్టంగా పేర్కొన్నాడు. తిక్కన యాదవులందరూ కొట్టుకొని నాశనమైపోతే కాలమూలంబు సర్వంబు అన్నాడు. కవిత్రయంవారు, పోతనాదులు వైదిక ధర్మానికి నిబద్ధులైతే పాల్కురికి సోమన శైవ ధర్మానికి నిబద్ధుడు. గౌరీశుమీద దైవంబు లేడని తలయిచ్చి పడయుదును... శివునిమీద నొకడు గలడన్న నా యరకాలెత్తి వాని నడదల దన్నుదు. నాదు ప్రతిజ్ఞ యెడపక యేను గాలెత్తితి అన్నాడు. తీవ్రమైన నిబద్ధత లేనిదే ఇంత తీవ్ర అభివ్యక్తి రాదు. వైదిక కవులు వర్ణవ్యవస్థను కీర్తించడంలోనూ, శివకవులు దానిని వ్యతిరేకించడంలోనూ నిబద్ధతే కనబడుతుంది.

    అష్టాదశపురాణాలు ప్రాచీనకాలపు సామాజికశాస్త్రాలని పేర్కొనవచ్చు. సృష్టిని గురించి, స్థితిని గురించి మనువులు, చక్రవర్తులు, రాజులు అనే పాలకవంశాల క్రమాన్ని గురించి వివరిస్తాయి పురాణాలు. దైనందిన జీవితంలో సమాజం అనుసరించవలసిన నియమాలను గురించి చెప్పుతాయి. అందుకే వాటిని విషయ ప్రధానాలు అన్నారు. విషయం ఉంది అంటే సమాజం ఉంది అని అర్థం. భారత రామాయణ భాగవతాది పురాణేతిహాసాలు ఆనాటి సమాజాన్ని నడిపించిన ఆర్థిక సాంఘిక రాజకీయ ఆధ్యాత్మిక సూత్రాలపట్ల ఆకవుల నిబద్ధతకు ఆకరాలు.

    పురాణేతిహాసాలలోని చిన్న చిన్న కథల్ని ఆధారం చేసుకొని పుట్టుకొచ్చినవి ప్రబంధాలు. ఇందులో సామాజిక ధర్మాల ప్రబోధంకన్నా వ్యక్తుల శృంగారం ప్రధానం. కాని భక్తి ప్రబంధాలు వీటికి విభిన్నమైనవి. పురాణేతిహాసాలలో లాగా ప్రబంధాల్లో వ్యవస్థ పట్ల విస్పష్టమైన నిబద్ధత కనబడకపోయినా, వాటికన్నా ఇవి భిన్నమైనవికావు. మార్కండేయ పురాణంలో వరూధిని కథ బోధించే స్త్రీ పురుష సంబంధాలనే మనుచరిత్ర కూడా మరోరకంగా బోధిస్తుంది. భారతంలోని ఉపరిచరవస్తువుకథ చెప్పేదాన్నే వసుచరిత్ర చెప్పుతుంది. దేవునిపట్ల, మతంపట్ల, రాజుపట్ల విధేయతనే ఇవి ప్రజలకు బోధిస్తాయి. పురాణేతిహాసాలు ప్రజలు గుడులలో పురాణాలుగా విన్నా, ప్రబంధాలు రాజాస్థానాల్లో పఠింపబడినా అవి బోధించే వ్యవస్థ ఒక్కటే. రాచరిక మత వ్యవస్థ. ఆ కవులు నిబద్ధత అదే.

    పందొమ్మిదో శతాబ్దంలో ఆధునిక తెలుగు సాహిత్యం ప్రారంభమైంది. ఇది సంఘసంస్కరణోద్యమాలు కొనసాగిన కాలం. రచయితలు కూడా సంఘసంస్కరణకు నిబద్ధులై రచనలు చేశారు. సంప్రదాయం పేరుతో అమానుషమైన ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు సంఘాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అవిద్య, అజ్ఞానం రాజ్యమేలు తున్నాయి. అమ్మాయిల్ని డబ్బుతీసుకొని అమ్మడం, డబ్బిచ్చి కనుక్కోవడం, చిన్నపాపను ముసలాడికిచ్చి పెళ్లిచేయడం, స్త్రీలు జీవితాంతం వితంతువులుగా గడపవలసి రావడం మొదలైనవి స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, జాతకాలు, లగ్నాలు మొదలైన విషయాల్లో పురోహితుల మోసాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండితనం ఇలా ఎన్నో సమస్యలలో నాటి సమాజం కూరుకుపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే నాటి సమాజం 'హృదయ రహితమైన సమాజం’ అన్నారు నార్ల. ఆనాటి వైవాహిక వ్యవస్థను నరమాంస విక్రయంగా పేర్కొన్నాడు కందుకూరి. ఈపరిస్థితిని ఎదిరిస్తూ స్త్రీలు చదువుకోవాలని, వితంతువులు మరలా పెళ్లి చేసుకోవాలని, దెయ్యాలు భూతాలు బూటకాలని, సమాజానికి హేతుజ్ఞానం కలిగించే చదువు రావాలని కోరుతూ ఉద్యమాలు నడుపుతూ రచనలు చేశాడు కందుకూరి.

    సమాజంపట్ల తనకొక మహత్తరమైన బాధ్యత ఉందని ఏఒక్కరినీ సంతోష పెట్టడానికైనా దానిని వదులుకోనని ప్రకటించిన గురజాడ ఇంకొంచెం ముందుకెళ్ళి (

    మంచిచెడ్డలు మనుజులందున

    ఎంచిచూడగ రెండె కులములు

    మంచియన్నది మాలమైతే

    మాల నేయగుదున్ -

    అని సమాజంపట్ల తన అవగాహనను నిబద్ధతతో ప్రకటించాడు. తాను మంచివైపు. నిలబడతానని తన నిబద్ధతను ప్రకటించాడు. లోకమంతా చెడు అనుకుంటున్న దానిలో గల మంచిని, మానవత్వాన్ని తన రచనల్లో నిరూపించి అసలైన నిబద్ధరచయిత ననిపించుకున్నాడు. డబ్బు ప్రాధాన్యం వహించే సమాజంలో మానవ సంబంధాలు ఎంత కృత్రిమంగా ఉంటాయో నిరూపించాడు. మహిళలు చరిత్రను తిరుగ రచిస్తారని ప్రకటించాడు.

    కందుకూరి గురజాడలకు వారసులుగా శ్రీపాద, చలం, కొడవటిగంటి కుటుంబరావు వంటి రచయితలు ఎందరో ఉద్భవించారు. కన్యాశుల్క వివాహ వ్యవస్థలోంచి పుట్టుకొచ్చిన బాలవితంతువుల బాధల్ని విమర్శనాత్మకంగా చిత్రించాడు శ్రీపాద. పురుషాధిక్య సమాజంలో కుటుంబ స్త్రీ పడుతున్న బాధల్ని, వాళ్ళ సమస్యల్ని ప్రదర్శించాడు చలం. మానవుల మధ్య సంబంధాల్లో నిరంతరం చోటుచేసుకునే మార్పులను అందుకు గల కారణాలను మార్క్సిస్ట్ అవగాహనతో చిత్రించాడు కొ.కు..

    సంఘసంస్కరణోద్యమం కొనసాగుతుండగానే జాతీయోద్యమం బలం పుంజుకుంది. అప్పుడు తెలుగు రచయితలకు జాతీయోద్యమాన్ని ప్రోత్సహించడం, చిత్రించడం అవసరమైంది. జాతీయోద్యమానికి నిబద్ధులై ఆనాటి రచయితలు రచనలు చేశారు. మనదేశ పురావైభవాన్ని కీర్తించడం, ప్రజలలో బ్రిటీష్ వ్యతిరేక దృష్టిని కలిగించడం, స్వదేశీ భావనను కలిగించడం, వర్తమాన సమాజంలోని లోపాలను సరిదిద్దడం వంటి ఆశయాలతో రచనలు వచ్చాయి ఈ కాలంలో, ఉన్నవ 'మాలపల్లి, గరిమెళ్ళ గేయాలు, కాళ్ళకూరి 'వరవిక్రయం', రాయప్రోలు గేయాలు ఇంకా 'రైతు భజనావళి' మొదలైన రచనలు వచ్చి జాతీయోద్యమం పట్ల రచయితల నిబద్ధతను తెలియజేశాయి. ఈ కాలంలో వచ్చిన ప్రకృతి ప్రణయ కవితలు మాత్రం వ్యక్తిగత భావాశ్రయాలై సామాజిక నిబద్ధతకు అపవాదంగా నిలుస్తాయి. భావకవిత్వం కూడా స్త్రీని గౌరవించడమనే నిబద్ధతతో మొదలైంది. చివరికి స్త్రీని మార్మికవస్తువుగా చేసి తన నిబద్ధతను కోల్పోయింది. శ్రీశ్రీ మహాప్రస్థాన గేయాలతో గురజాడ చూపిన నిబద్ధత తిరిగి స్పష్టమైన రూపంతో వెలుగులోకి వచ్చింది.

    "ఒకవ్యక్తిని మరొక వ్యక్తీ

    ఒకజాతిని వేరొక జాతీ

    పిడించే సాంఘిక ధర్మం

    ఇంకానా? ఇకపై చెల్లదు"

    అని ప్రకటించాడు శ్రీశ్రీ. దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణచేస్తూ పదండి ముందుకు అని విప్లవ నిబద్ధతను ప్రకటించాడు. 'మానవుడా' గేయంలో విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రకటించాడు. 'మిథ్యావాది'లో భౌతిక దృక్పథాన్ని ప్రదర్శించాడు. 'భిక్షువర్షీయసి' 'మహాప్రస్థానం', 'ప్రతిజ్ఞ' వంటి గేయాల్లో శ్రామికజనపక్షపాతం చూపించాడు. గురజాడ పేర్కొన్న మంచిచెడ్డలు అనే రెండు కులాలు శ్రీశ్రీ కవిత్వంలో - రెండు వర్గాలు ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు అయ్యాయి. సమ్మెకట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల హాహాకారాలు విన్నాడు. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు? అని ప్రశ్నించాడు. ఇక్కడ నుండి అధిక సంఖ్యలో రచయితలు విప్లవ నిబద్ధతనే ప్రకటిస్తూ వచ్చారు.

    "ఖ్యాతిగడించే

    గీతం రాసి

    ప్రేయసి కంకిత

    మీయాలంటూ

    మూతి బిగించి

    చేతులు నులుముతు

    కూచున్నానా కవి –" అంటూ భావకవుల్ని తిరస్కరిస్తూ శ్రీరంగం నారాయణబాబు

    "నడవండి నడవండి

    నామీంచి నడవండి

    గడ్డిపరకను గడ్డిపరకను -"

    అని తన శ్రామికవర్గ నిబద్ధతను ప్రకటించాడు.

    "నీ గళమ్మున నిరాకరణసూత్రం

    వైచి నిలువున ఉరితీశారా..

    నాతండ్రీ!"

    అంటూ భగత్‌సింగును పలకరించాడంటే అయన నిబద్ధత ఏమిటో తెలుస్తుంది..

    "తాత వేసిన పుంత

    దైవమేలిన సంత

    పల్లేరు ప్రాకిందిలే

    జిల్లేడు మొలచిందిలే

    అని పురిపండా అప్పలస్వామి భూస్వామ్యవ్యవస్థ పతనాన్ని సూచించాడు. ఇది విప్లవ సంకేతం చిరవాంఛిత సంక్షోభం అని హెచ్చరించాడు.

    "కదలని సమాజ హిమాలయంలో

    కదిలే నవక్రాంతి బడబాగ్ని

    మండించిన నాగీతం.....

    యుగాల నుంచీ నడిచే

    నియమపు రైళ్ళకు పట్టాలను

    పీకేసిన నాగీతం....

    వర్గరహితసంఘ స్వర్గానికి

    పూలనిచ్చెనలు వేసిందట....".

    అని బెల్లంకొండ రామదాసు ఆధునిక సమాజ స్థాపన పట్ల తన మొగ్గును చాటాడు.

    "బంధీకృత ధనికశక్తి పొగగొట్టపు భుగభుగలో

    తెలతెలలై వెలవెలలై పోతున్నది; వొస్తున్నది

    మహాశక్తి ప్రజాశక్తి -. అని ఏల్చూరి సుబ్రమణ్యం ప్రజా పక్షపాతాన్ని ప్రకటించాడు.

    పగిలించి రణభేరి పద్మవ్యూహము త్రెంచి

    శివమెత్తి విస్ఫులింగములు చిమ్ముతు లేచి

    ఈజగతిలో నూత్నజగతి కల్పిస్తాను.

    వచ్చాను వచ్చాను వ్యాసనంతతివాణ్ణి

    అని అనిశెట్టి సుబ్బారావు మరో ప్రపంచంపట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడు. సాహసికానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాదు అని తిలక్ అనడంలో ఆయన నిబద్ధత ధ్వనిస్తుంది. నేను చూశాను నిజంగా ఆకలితో అల్లాడి మర్రిచెట్టు కింద మరణించిన ముసలివాణ్ణి అని తిలక్ అన్నాడంటే నాటి నిబద్ధకవుల ప్రభావం కొంచెం ఆటుఇటుగా ఉండే కవుల మీద కూడా పడిందని అర్ధం.

    1946 -51 మధ్య తెలంగాణాలో జరిగిన ప్రజల సాయుధపోరాటం నిబద్ధ రచయితల్ని మరింత రాటుదేలేటట్టు చేసింది.

    సమసమాజ సంస్థాపనార్థం, కానని కారడవులలో

    దుస్సహకష్టాలు తోడునీడలుగా అజ్ఞాతవాసం చేసే

    అశేష పాండవులెవరు? –

    అని ప్రశ్నిస్తూ గంగినేని వెంటేశ్వరరావు 'ఉదయిని' రచించాడు. ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న రచయిత గంగినేని ఉద్యమకారుల్ని గురించి 'ఎర్రమందారాలు' అనే గ్రంథం రచించాడు.

    ఈపోరాటం భవిష్యత్తు

    మానవసౌభాగ్యం తరువుకు విత్తు

    ఇది కొండలగుండెలతో జలధికి కట్టిన సేతువు

    తుది సత్యధర్మ విజయ ప్రాప్తికి హేతువు –

    అని కుందుర్తి 'తెలంగాణా' అనే మహాకావ్యంలో తెలంగాణా ప్రజల పోరాటాన్ని కీర్తించాడు. ప్రజల పోరాటాన్ని సమర్థిస్తూ

    క్రమక్రమానుగత చైతన్య ధనుష్పాణులు

    ప్రజలునేడు

    సమాజసమిష్టి ప్రయోజన నిశితబాణులు

    ప్రజలు నేడు –

    అని చాటాడు. ఆరుద్ర 'త్వమేవాహమ్', సోమసుందర్ 'వజ్రాయుధం' వట్టికోట ఆళ్వారుస్వామి 'ప్రజలమనిషి' 'గంగు' సుంకరవాసిరెడ్డి 'మాభూమి' మొదలైన రచనలు. ఆఉద్యమానికి రచయితలు నిబద్ధులైన తీరును తెలియజేస్తాయి. ప్రజల ముందు దుష్ట వ్యవస్థను కాపాడే పాలకులు దూదిపింజల్లాగా ఎగిరిపోక తప్పదని ఈ రచయితలందరూ ముక్తకంఠంతో పేర్కొన్నారు.

    1960 తర్వాత దేశంలో రాజకీయంగా సామాజికంగా, ఆర్థికంగా ఆశించిన, రావలసిన మార్పు రాకపోవడంవల్ల, స్వతంత్రం నిరాశని మిగల్చడంవల్ల పెల్లుబికిన అసంతృప్తికి యాంగ్రీయంగ్మెన్ దిగంబర కవులు పుట్టుకొచ్చారు. వర్తమాన సమాజంలో కాలంచెల్లిన అన్ని విలువల్ని ధ్వంసం చెయ్యాలన్న లక్ష్యంతో నూతన సమాజ దర్శనంతో దిగంబర కవిత్వం రాశారు. వీరు గోముఖవ్యాఘ్రం వంటి వ్యవస్థ ముసుగును తొలగించి దాని నగ్నస్వరూపాన్ని ప్రదర్శించి, దానిని నాశనం చెయ్యవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఒకప్పుడు ఎంతో విప్లవాత్మక భావాలతో సమాజాన్ని చైతన్యవంతం చేసిన ప్రగతిశీలవాదులలో క్రమంగా వర్తమాన పరిస్థితులతో సర్దుకుపోవడం మొదలైంది. ఈపరిస్థితి మీద దిగంబర కవులు తిరగబడ్డారు. ప్రపంచం మొత్తం మీద నాగరికత పేరుతో జరుగుతున్న మోసాలను వాళ్ళు బట్టబయలు చేశారు. నన్నయ్య నుండి కుందుర్తి వరకు అందరు కవుల్ని విమర్శించారు. 'సమస్తం కాలనీ' అన్నారు.

    "కాళ్ళు జాచిన

    భరతమాతకు

    బ్రతుకు భారమైంది.

    Enjoying the preview?
    Page 1 of 1