Discover this podcast and so much more

Podcasts are free to enjoy without a subscription. We also offer ebooks, audiobooks, and so much more for just $11.99/month.

Autobiography of a Yogi ఒక యోగి ఆత్మకథ మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

Autobiography of a Yogi ఒక యోగి ఆత్మకథ మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

FromSree Rathnamalika శ్రీ రత్నమాలిక


Autobiography of a Yogi ఒక యోగి ఆత్మకథ మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితం

FromSree Rathnamalika శ్రీ రత్నమాలిక

ratings:
Length:
43 minutes
Released:
Nov 16, 2021
Format:
Podcast episode

Description

ఒక యోగి ఆత్మకథ (ఆంగ్లం: Autobiography of a Yogi) ప్రముఖ భారతీయ యోగి  పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను  పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం  చేసింది.[1] ఇప్పటి దాకా దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన  పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.   ఈ పుస్తకంలో ప్రధానంగా యోగానంద తన గురువు కోసం అన్వేషణ, ఆ ప్రయత్నంలో  భాగంగా ఆయనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలు, అప్పట్లో పేరు గాంచిన ఆధ్యాత్మిక  వేత్తలైన థెరెసా న్యూమన్, శ్రీ ఆనందమయీ మా, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్  ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీతయైన సి.వి. రామన్, అమెరికాకు చెందిన  శాస్త్రవేత్త లూథర్ బర్బాంక్ మొదలైన వారితో గడిపిన ముఖ్యమైన ఘట్టాలు  నిక్షిప్తం చేయబడ్డాయి. ఆయన గురువైన యుక్తేశ్వర్ గిరితో అనుబంధం, గురు  శిష్యుల మధ్య సంబంధాల గురించి కూడా వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఆయన ఈ  పుస్తకాన్ని వీరికే అంకితం చేశాడు.  యోగానంద గురువైన యుక్తేశ్వర్ గిరి, తనకు గురువైన లాహిరీ మహాశయులు  వెల్లడించిన భవిష్యవాణి గురించి శిష్యుడికి తెలియజేశాడు.[2] లాహిరీ  మహాశయులు ఈ విధంగా అంటుండగా యుక్తేశ్వర్ వినడం తటస్థించింది. "నేను గతించిన  యాభై సంవత్సరాల తర్వాత పాశ్చాత్యుల్లో యోగా పట్ల ఏర్పడే ఉత్సుకత ఫలితంగా  నా జీవితం గురించి రాస్తారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా ప్రాభల్యం  పెరుగుతుంది. అందరి పుట్టుకకూ కారణమైన ఒకే పరమాత్మ గురించిన ఆలోచన సర్వ  మానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తుంది". 1895లో లాహిరీ మహాశయుల మరణించిన  సరిగ్గా యాభై సంవత్సరాలకు అంటే 1945లో ఒక యోగి ఆత్మకథ (ఆంగ్లం) పుస్తకం  మొదటి సారిగా ప్రచురణకు సిద్ధం అయింది.  యోగానంద పిన్న వయసులోనే భారతదేశంలోని గొప్ప యోగులను కలవడం తటస్థించింది.  ఉన్నత పాఠశాల విద్య పూర్తి కాకముందే ఆయన కనబరిచిన అనేక ఆధ్యాత్మిక  శక్తులను, గురువు దగ్గర ఆయన శిక్షణ గురించిన విశేషాలు యోగానంద తమ్ముడైన  సనంద లాల్ ఘోష్ రచించిన పుస్తకంలో సవివరంగా వివరించబడ్డాయి.      బాల్యంలోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు     ఆధ్యాత్మిక ప్రభావాలు, వారసత్వం     గురుశిష్య సంబంధాలు     క్రియాయోగం

---

Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Released:
Nov 16, 2021
Format:
Podcast episode

Titles in the series (100)

శ్రీ రత్నమాలిక పాడ్కాస్ట్ ( Podcast ) / బ్లాగ్ / యూట్యూబ్ ఛానెల్ రూపొందించినవారు శ్రీ రత్నమాలిక. ఈ Podcast యొక్క ముఖ్య లక్ష్యం, ప్రధానంగా హిందు దివ్యజ్ఞానం, వ్యాసాలు , సుప్రసిద్ధ హిందూ పుస్తకాలు , పండుగలు , ఆచారాలు , దేవతల స్తోత్రాలు మరియు దేవతల స్వర రూపాన్ని అందించడము.. సనాతన హిందు సాంప్రదాయ జ్ఞానం తెలుసుకోవటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ పాడ్కాస్ట్ ( Podcast ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.