Discover this podcast and so much more

Podcasts are free to enjoy without a subscription. We also offer ebooks, audiobooks, and so much more for just $11.99/month.

Introduction to Soundaryalahari సౌందర్యలహరి పరిచయం

Introduction to Soundaryalahari సౌందర్యలహరి పరిచయం

FromSree Rathnamalika శ్రీ రత్నమాలిక


Introduction to Soundaryalahari సౌందర్యలహరి పరిచయం

FromSree Rathnamalika శ్రీ రత్నమాలిక

ratings:
Length:
7 minutes
Released:
Sep 23, 2021
Format:
Podcast episode

Description

ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. ఇది  స్తోత్రము.భక్తితో భగవంతుని కీర్తిస్తూ ఆరాధించే గాన పాఠము,గురువు అనుగ్రహం  పొంది నిష్టతో జపించుట వలన ప్రత్యేకమైన ప్రయోజనాలు కలిగే అక్షర సముదాయము.  దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు.  ఇందులో మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు  సౌందర్యలహరి అని అంటారు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి  శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి.ఆది  శంకరాచార్యుల అనేక స్తోత్రాలలో శివస్తోత్రంగా శివానందలహరి, దేవీస్తోత్రంగా  "సౌందర్యలహరి" చాలా ప్రసిద్ధాలు. త్రిపుర సుందరి అమ్మవారిని స్తుతించే  స్తోత్రం గనుక ఇది సౌందర్యలహరి అనబడింది. ఈ స్తోత్రం "శిఖరిణీవృత్తం" అనే  ఛందస్సులో ఉంది.  ఇది అసామాన్యమైన వర్ణనా చాతుర్యంతో కూడిన కావ్యం.     అన్ని మంత్ర స్తోత్రాలలాగానే ఈ స్తోత్రాన్ని కూడా జపించడానికి ముందుగా  గురువును స్మరించాలి. తరువాత ఋష్యాదులను స్మరించాలి.తర్వాత అంగన్యాసము,  కరన్యాసము, ధ్యానము, పంచోపచారాదులు చేసి  శ్రద్ధతో, భక్తితో, నిర్మల నిశ్చల  హృదయంతో స్తోత్రాన్ని పఠించాలి.

---

Send in a voice message: https://anchor.fm/sreerathnamalika/message
Released:
Sep 23, 2021
Format:
Podcast episode

Titles in the series (100)

శ్రీ రత్నమాలిక పాడ్కాస్ట్ ( Podcast ) / బ్లాగ్ / యూట్యూబ్ ఛానెల్ రూపొందించినవారు శ్రీ రత్నమాలిక. ఈ Podcast యొక్క ముఖ్య లక్ష్యం, ప్రధానంగా హిందు దివ్యజ్ఞానం, వ్యాసాలు , సుప్రసిద్ధ హిందూ పుస్తకాలు , పండుగలు , ఆచారాలు , దేవతల స్తోత్రాలు మరియు దేవతల స్వర రూపాన్ని అందించడము.. సనాతన హిందు సాంప్రదాయ జ్ఞానం తెలుసుకోవటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది ఈ పాడ్కాస్ట్ ( Podcast ) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.