Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Kavitvamai Kurisina Kavi (Telugu)
Kavitvamai Kurisina Kavi (Telugu)
Kavitvamai Kurisina Kavi (Telugu)
Ebook351 pages1 hour

Kavitvamai Kurisina Kavi (Telugu)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

మాడభూషి ప్రఖ్యాతి చెందిన ఇంటిపేరు. సంపత్‌ కుమార్‌ తనకు తానుగా దిద్ది తీర్చుకున్న పేరు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రీయులకు చెన్నైలో తెలుగు అనగానే మాడభూషి సంపత్‌ కుమార్‌ గారే గుర్తొస్తారు. మద్రాసు యూనివర్సిటీని ఆలంబనగా చేసుకొని వారు నిర్వహించిన సదస్సులు, గోష్ఠులు, కవి సమ్మేళనాలు అటు ఆన్‌లైన్‌లోనూ, ఇటు వేదిక మ

LanguageTelugu
Release dateJan 4, 2023
ISBN9788196087623
Kavitvamai Kurisina Kavi (Telugu)

Related to Kavitvamai Kurisina Kavi (Telugu)

Related ebooks

Reviews for Kavitvamai Kurisina Kavi (Telugu)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Kavitvamai Kurisina Kavi (Telugu) - Kondreddi Venkateswara Reddy

    కవిత్వమై కురిసిన కవి

    (మాడభూషి సంపత్‌ కుమార్‌ కవిత్వ విశ్లేషణ)

    Logo Description automatically generated

    రచన

    కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి

    Kavitvamai Kurisina Kavi

    ( An analysis of Madabhushi Sampath Kumar's Poetry)

    By Kondreddi Venkateswara Reddy (Poet & Critic)

    H.No.8-150, Kothapet, Kanigiri, A.P. 523230, Ph.9948774243

    Published: Kasturi Vijayam

    ISBN (Paerback).: 978-93-95321-01-3

    ISBN(E-Book) : 978-81-960876-2-3

    అంకితం

    ఆచార్య కె. హేమచంద్రారెడ్డి,

    శ్రీమతి కె.ప్రవీణ

    అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి

    మొక్కవోని ఆత్మవిశ్వాసం! మహోన్నత వ్యక్తిత్వం!

    అభ్యుదయమే లక్ష్యం! మానవీయతే మార్గం!

    వృత్తిధర్మానికి వన్నె! పరోపకారమే ప్రవృత్తి!

    మంచితనానికి మరో దీపం! సువర్ణానికి సుగంధం!

    విలువలతో విరాజిల్లు విద్యామూర్తి

    'హేమచంద్రారెడ్డి' గారికి

    ఆయన ప్రావీణ్యతకు ప్రాణమైన

    సహధర్మచారిణి 'ప్రవీణ' గారికి

    ఆత్మీయతాభినందనలతో

    ఈ గ్రంథం

    అంకితం

    విషయసూచిక

    ఇష్టవాక్యాల కూర్పు

    బంగారానికి పరిమళం

    నా మాట

    1. ఉపోద్ఘాతం

    2. ‘మాడభూషి’ జీవన రేఖలు

    4. ‘జీవితం-కవిత్వం’

    4.కవిత్వం మీద కవిత్వమై కురిసిన కవి

    5.మహిళా సాధికారిత మార్గాన్వేషణ

    6. రైతరికానికి రక్షణ

    7.ప్రకృతి పరిరక్షణకు సత్తువ

    8.దళిత దృక్పథమే ఆత్మఘోష

    9.అరాచక రాజకీయాలను

    10. మరణం మీద అక్షరం రణం

    11. వ్యక్తిత్వాన్ని సంభావించిన అక్షరం

    12. ముగింపు

    ఇష్టవాక్యాల కూర్పు

    -డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి

    తొలి కార్యదర్శి,తెలంగాణ సాహిత్య అకాడెమీ

    అదనపు కలెక్టర్‌, మేడ్చెల్‌-మల్కాజగిరి జిల్లా

    ఫోన్‌: 8978869183

    మాడభూషి ప్రఖ్యాతి చెందిన ఇంటిపేరు. సంపత్‌ కుమార్‌ తనకు తానుగా దిద్ది తీర్చుకున్న పేరు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రీయులకు చెన్నైలో తెలుగు అనగానే మాడభూషి సంపత్‌ కుమార్‌ గారే గుర్తొస్తారు. మద్రాసు యూనివర్సిటీని ఆలంబనగా చేసుకొని వారు నిర్వహించిన సదస్సులు, గోష్ఠులు, కవి సమ్మేళనాలు అటు ఆన్‌లైన్‌లోనూ, ఇటు వేదిక మీదా ఇక్కడున్న మాలాంటి వాళ్ళను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ‘చైతన్యమునెవరైనా చేతులు కట్టుకు కూర్చొమ్మనునా’ అని సినారె అన్నది ఇలాంటి వారిని చూసే. స్థిర జీవితానికి కొంత ఆలస్యం జరిగినా నిజస్థిరత్వం సాహిత్యంలోనే ఉందన్న విషయాన్ని మాడభూషి గారు ముందే గుర్తించారు. విద్యార్థిగా మొదలుపెట్టిన పరిశోధనను జర్నలిస్టుగా, ఆచార్యులుగా, విశ్రాంత జీవిగా కూడా కొనసాగిస్తున్నారు. అరడజను పరిశోధన గ్రంథాలు, అరడజను అనువాదాలు, సంపాదకక్రియలతో పాటు తమదైన ముద్రతో ఆరు కవితా సంపుటాలు కూడా ప్రచురించడం చిన్న విషయం కాదు. ఈ పెద్ద విషయమే కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి గారిని ఆకర్షించింది.

    కొండ్రెడ్డి గారు స్వతహాగా కవి, విమర్శకులు. చాలా మంది సాహిత్యకారులకు ఉండని అదనపు అర్హత వీరికుంది. అది నైరూప్య చిత్రకళ. కొండ్రెడ్డి గారు ఒకపూట భోజనమైనా మరిచిపోతారు కాని చదవని రోజు, రాయని రోజు ఆయన జీవితంలో ఉండవు. అలాంటి విమర్శకులకు మాడభూషిగారి పుస్తకాలన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఒక వ్యాస సంపుటి తయారయింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి. మాడభూషిగారి పుస్తకాలన్నింటినీ నెత్తికెత్తుకుంటే పెరిగే బరువు తనకు తెలుసు. అందుకే కవిత్వానికి లిమిట్‌ అయ్యారు. ‘కవిత్వమై కురిసిన కవి’ శీర్షిక దాన్నే సూచిస్తుంది. రేఖామాత్రంగా విమర్శను, పరిశోధనను, అనువాదాలను, సంపదాకత్వాన్ని స్పృశించినా ప్రధానంగా ఇది కవిత్వ విశ్లేషణా గ్రంథం.

    కవిత్వం -జీవితం, శత్రువుతో ప్రయాణం, ఆలోచనలు, చివరకు నువ్వే గెలుస్తావు, మూడో మనిషి, వికారి కవితా సంపుటాల గురించిన లోతైన విశ్లేషణ ఇందులో ఉంది. సాధారణ విమర్శకులు విమర్శనా సౌలభ్యంకోసం సంపుటి వారీగా చర్చిస్తారు. ఆ సంపుటి కాలం, సామాజిక పరిస్థితులు, ఆ సంపుటిలో వాటి ప్రతిఫలనం చెబుతూ అందులోని విశేషణాలు చెబుతూ పోతారు. కానీ కొండ్రెడ్డి గారి పద్ధతి వేరు. మొత్తం సంపుటాలను చదివి ఏకబిగిన క్రోడీకరించుకొని తొమ్మిది భాగాలుగా చర్చించారు.

    నిజానికి కవిత్వాన్ని అనుభవించటం, గుర్తించటం సులభం, కానీ నిర్వచించడం కష్టం. కవిత్వం గురించి మాట్లాడుతూ ‘ఆ విధంగా తప్ప ఇంకే విధంగాను రాయలేనిది ఉత్తమ కవిత’ అంటాడు ఎమర్సన్‌. Poetry is languahe of imagination అంటాడు హాజ్‌లిట్‌. ‘నీ మిత్రులెవరో చెప్పు నీవెలాంటి వాడివో చెబుతా’ అన్న సామెతలానే కవి శైలి (Diction) అతని వ్యక్తిత్వాన్ని చెబుతుంది. ఈ రహస్యం కొండ్రెడ్డి గారికి తెలుసు. అందువల్లే ‘ఇవాళ తెలుగు కవిత్వం నూతన ప్రపంచ సృష్టికి అక్షరాన్ని ఆహుతివ్వకుండా, మూఢవిశ్వాసాలకు మూలమైన బరువును మోస్తుంది’ అని పసిగట్టగలిగారు.

    జీవితానికి, కవిత్వానికి పోలిక చెబుతున్న సందర్భంలో కవిని పూర్తిగా ఏకీభవించలేని సందర్భాలు వచ్చినప్పుడు సున్నితంగా అది కవి వ్యక్తిగతాభి ప్రాయంగా భావించవలసి ఉంటుందంటారు. మొత్తంగా మాడభూషి గారిని అంచనా వేస్తూ ‘కాంక్రీటు సిద్ధాంతాల, రాద్ధాంతాల జోలికిపోకుండా ఆధిపత్య దురహంకార దమన నీతుల మీద దుమ్మెత్తిపోసే కవిత్వం’ గా అభివర్ణించారు. కొండ్రెడ్డి గారు తరుచుగా కవిగారి వాక్యాలతోనే వ్యాసాలను నడిపించడం వారి ఱఅఙశీశ్రీఎవఅ్‌కు మచ్చుతునక. ఒకచోట ‘జీవనయానంలో హేతువే సేతువులా ఉపకరిస్తుందన్న కవితా రహస్య మెరిగిన పండిత కవీయన’ అన్నారు. విమర్శకులు అంతగా ప్రశంసించడానికి కారణమేమిటా అని పరిశీలిస్తే వచ్చే జవాబు ఒక్కటే అది మాడభూషి కవిత్వం.

    ‘మనిషి విలువ రూపాయిలాగా

    పడిపోతూనే ఉంది’

    అనడంలోని నవ్యత

    ‘కవిత్వానికి తెలియకుండా

    జీవితాన్ని ఎలా దాస్తావ్‌’

    అనే హేతుబద్ధతా

    ‘కవిత్వం ఎవరికీ వంగి సలాం చెయ్యదు

    నిలువెత్తు కవిత్వంలో

    జీవితం తలెత్తుకు తిరుగుతుంది’

    అనడంలో నిబద్ధత

    ‘నాతి గౌరవమ్ము జాతికే గర్వమ్ము’

    అన్న ఆటవెలది పాదం కన్నా లోతైన

    ‘వాడు కావాలనుకున్నప్పుడు నేను రావాలి

    వాడు తేవాలనుకున్నప్పుడు నేను తేవాలి

    వాడు తిరగమన్నట్లు, నేను తిరగాలిలా తిరగాలి

    వాడు వాడుగా ఉంటాడు

    నేను నేనుగా ఉండకూడదు

    వాడికి సంతోషం కలిగితే

    నేను సంతోషించాలి

    నాకు దు:ఖం వచ్చినా

    వాడు ఆనందిస్తాడు!’

    అని నడిచే స్త్రీవాద కవితలు.

    ‘ఎవరో ఇచ్చిన విత్తనాలు విత్తాలి

    ఎవడో చెప్పిన ఎరువు వేయాలి

    ఎవడి ఆజ్ఞ ప్రకారమో

    పంటలు పండిరచాలి

    ఎవరో నిర్ణయించిన ధరకు

    అమ్మకాలు సాగించాలి

    రైతు తన భూమిలో తనే కూలి’

    అనే రైతు పక్షపాత కవితలు ఈ గ్రంథ రచయితను రచనకు పురిగొల్పి ఉంటాయి. అందుకే ఇంత ఇష్టంగా ఒక కవి మీద సాధికారికమైన విమర్శ రాయగలిగారు.

    కవులు వచనం రాస్తారు, రచయితలు, విమర్శకులు కవిత్వం రాస్తారు. కొందరు అనువాదం, స్వతంత్ర రచనలూ చేస్తారు. అనేక పార్శ్వాలున్న మాడభూషి గారు కవిత్వం రాయడం ఎప్పుడు ప్రారంభించారో కానీ అన్ని సంపుటాలు 2013 తర్వాతే ప్రచురించారు. అవిభాజ్యంగా కవిత్వాన్ని జీవితంలో భాగంగా చూసిన కవి. నిరంతరం రాస్తూ ఉంటారు. Continuty కవిని నిలబెడుతుంది. ఈ గ్రంథస్ఫూర్తితో ఈ కవి మరింత గొప్ప కవిత్వం నిరంతరం రాస్తారన్న హామీ ఇస్తుందిది.

    బంగారానికి పరిమళం

    డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు

    పూర్వ వైస్‌-ప్రిన్సిపాల్‌,తెలుగు విభాగం అధ్యక్షులు

    ఆంధ్ర లయోలా కళాశాల, విజయవాడ

    ఫోన్‌: 9849265025

    శ్రీ కొండ్రెడ్డి వేంకటేశ్వర రెడ్డి గారు నాకెంతో ఆత్మీయులు. పలు సభల్లో ఆత్మీయంగా పలకరించుకొన్నాం. సాహిత్యపు చర్చలు చేశాం. కొండ్రెడ్డి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పటానికి ఆయన రచనలే కాకుండా ఆయన గీసిన చిత్రాలే సాక్ష్యం. కవిగా, విమర్శకునిగా, చిత్రకారునిగా ఇప్పటికే సహృదయుల మన్ననల్ని అందుకొన్న కొండ్రెడ్డి గారు ఇటీవల కొంత మంది కవుల భావ పరిమళాన్ని పంచుతూ ఆయా కవుల్ని గూర్చి ప్రత్యేక పుస్తకాలు వెలువరిస్తున్నారు. ఈ కోవకు చెందిందే ‘‘కవిత్వమై కురిసిన కవి’’ అనే పుస్తకం.

    కవిపేరు చెప్పకుండా కవిత్వమై కురిశాడని చెప్పటం ద్వారా శీర్షికతోనే ఒక ఉత్సుకతను కలిగింపచేశారు కొండ్రెడ్డి గారు. స్వయంగా కవి కావడం వల్ల ఎదుటి కవి హృదయాన్ని అర్థం చేసుకొని, విశ్లేషించి వివరించగల నేర్పు సొంతం చేసుకొన్నారు. విమర్శకుడు కవి కూడా అయితే ఆ విమర్శ ఎంత గొప్పగా ఉంటుందో చెప్పటానికి ‘‘ఈ కవిత్వమై కురిసిన కవి’’ అనే పుస్తకమే సాక్ష్యం. శీర్షిక ద్వారా ఒక కవి కవిత్వమై కురిశాడని స్పురింపచేశారు. ఆ కవి ఎవరు? అని ప్రశ్నించుకోగా పుస్తకాన్ని తెరవ కుండానే ఆ కవి ‘‘మాడభూషి సంపత్‌ కుమార్‌’’ అని వెంటనే తెలిసేటట్లుగా కింద వివరించారు.

    మాడభూషి సంపత్‌ కుమార్‌ బహుభాషాకోవిదులు. తెలుగును బోధించే ఆచార్యులు. భాషావేత్త, అనువాదకులు, కవి విమర్శకులు, బహుగ్రంథ సంపాదకులు, పత్రికా రచయిత ` ఇన్ని లక్షణాలు, ప్రతిభలు కలిగిన సంపత్‌ కుమార్‌ గారి కవిత్వాన్ని మాత్రమే విశ్లేషించటానికి శ్రీ కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డిగారు పూనుకోవటం ద్వారా సంపత్‌ కుమార్‌ గారి లోని కవితాశక్తి ఎంత ఉత్కృష్టమైందో, ఎంత ప్రతిభావంతమైందో గ్రహించవచ్చు. ఆచార్య సంపత్‌ కుమార్‌ గారు నాకు సోదర సమానులు. నాకంటే వయసులో ఒక ఏడాది చిన్న, ఎప్పుడు కనిపించినా ఆప్యాయంగా పలకరించే స్నేహశీలి. వారు నిర్వహించిన పలు సదస్సుల్లో పాల్గొన్నాను. పుస్తకాన్ని రూపొందించిన రచయిత, ఆ పుస్తకానికి మూల పదార్థ సృష్టికర్త ఇద్దరూ నాకు ఆత్మీయులే. ఈ ఆత్మీయ సంబంధమే నన్ను నాలుగు మాటలు రాయటానికి పురిగొల్పింది.

    కొండ్రెడ్డిగారు ఈ పుస్తక రచనలో ఒక ప్రత్యేక ప్రణాళికను ఏర్పరచుకొన్నారు. ఆయన రాయదలచుకొన్నది సంపత్‌ కుమార్‌ గారి కవిత్వం మీద. అందుకోసం సంపత్‌ కుమార్‌ గారి కావ్యాలను తీసుకొని ఒక్కొక్క సంపుటిని విశ్లేషించే ప్రయత్నం చెయ్యకుండా ఆయా సంపుటాలలో ఉన్న సారాన్ని వివరించే పనికి పూనుకోవటం ద్వారా తన విమర్శ గ్రంథానికి మంచి మార్గాన్ని ఏర్పరచుకొన్నారు.

    ‘ఉపోద్ఘాతం, అధ్యాయం....’విమర్శకుడైన కవి, కొండ్రెడ్డిగారు కవిత్వమై ప్రవహించారనిపిస్తుంది. ‘‘సంపత్‌ కుమార్‌ కవిత్వం వస్తు సత్తువ కలిగి పీడిత జనపక్ష పాతిగా, స్త్రీ జనోద్ధరణ దిశగా సాగుతుంటుంది. అవాస్తవ కట్టుకథల మెట్లక్కని తత్త్వం వీరి కవిత్వంలో గమనించవచ్చును. ప్రకాశించే ప్రతిభకు, ప్రజాస్వామిక ప్రగతి శీలతకు, పరిమళించే పదచిత్రాలకు, ప్రయోజనాత్మక తాత్త్విక భావాలకు సమతూకమైనిల్చే ప్రతిరూపం ఈయన కవిత్వం’’ అన్న మాటలు అక్షర సత్యాలు.

    కష్టాల కన్నీళ్లు తాగి పెరిగిన కవికావటంతో సంపత్‌ కుమార్‌ గారి కవిత్వం అంత బలంగా ఉందని భావించవచ్చు. ఆయన కవిత్వం నిండా మానవత్వం పరిమళించిన తీరును రెడ్డిగారు చక్కగా, వివరించారు. ఒకవైపు సంపత్‌ గారి కవిత్వాన్ని విశ్లేషిస్తూ మరోవంక ఆయా విషయాల్ని సమర్థించటానికి, మధ్య మధ్యలో రెడ్డిగారు అందించిన పద్యాలు ఈ విమర్శను మరింత పుష్టిమంతంగావించాయి. ఈ పద్యాలు రెడ్డిగారివేనని నా నమ్మకం.

    పన్నెండు శీర్షికలతో సాగిన ఈ విమర్శ ఉపోద్ఘాతం తర్వాత మాడభూషి జీవన రేఖల్ని, జీవితం ` కవిత్వాల కల పోతల్ని, కవి కవిత్వం మీద కవిత్వమై కురిసిన తీరును, మహిళాసాధికారతను చిత్రించిన వైనాన్ని, రైతరికానికి రక్షణ కల్పించిన పద్ధతిని, ప్రకృతి పరిరక్షణను ప్రతిబింబింపచేసిన మార్గాన్ని దళితుల ఆత్మఘోషను ఆవిష్కరించిన తీరును, అరాచక రాజకీయాల్ని అంటగాల్చే అగ్నిజ్వాలల్ని, మరణం మీద సాగించిన అక్షరరణాన్ని, వ్యక్తిత్వాన్ని సంభావించిన అక్షరాన్ని ` అద్భుతంగా చిత్రించింది. సంపత్‌ కుమార్‌ కవిత్వాన్ని ఔపోసనపడితే తప్ప ఇది సాధ్యం కాదని రెడ్డిగారు నిరూపించారు. సంపత్‌ గారి కవిత్వ విశ్లేషణ గావించిన రెడ్డిగారి తీరును చూస్తే కాళిదాసు కవిత్వాన్ని విశ్లేషించిన మల్లినాథసూరి కనిపిస్తున్నాడు. బంగారం లాంటి సంపత్‌ గారి కవిత్వానికి, రెడ్డిగారి విశ్లేషణ పరిమళాన్ని అద్దిందని చెప్పటం సముచితమని నాభావం. మిత్రద్వయానికి అభినందనలు.

    నా మాట

    అక్షరాన్ని క్రియాశీల సాహిత్యపు సానువుల్లోకి మళ్లించి, నిబద్ధమైన సాహితీ జీవితం గడుపుతూ, ప్రజా జీవితంలోని అనేక కోణాలను కళాత్మకంగా అక్షరబద్ధం చేస్తున్న కవులంటే నాకిష్టం. జీవితంలో ఎదురయ్యే కష్టాలకు వెరవకుండా, ఉబికొచ్చే కన్నీటికి కలత చెందకుండా, చీకటి మూల పల్లెనుంచి, దుర్భరస్థితిగతులను అధిగమించి అక్షర దివ్వెలను దారిదీపాలుగా చేసుకొని తన జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని కల్పించుకుంటూ, అపురూపమైన వ్యక్తిత్వంతో, సాహిత్య సౌజన్య వాతావరణాన్ని సృష్టించుకునే సృజన శీలురైన సాహితీవేత్తలంటే నాకు ప్రాణం. ఈ మధ్య ఆచార్య మాడభూషి సంపత్‌ కుమార్‌ సాహిత్యాన్ని నిశిత పరిశీలనతో చదివే అవకాశం కలిగినది. అట్లే వారు నిర్వహిస్తున్న ‘జూమ్‌’ మీటింగ్స్‌లో పాల్గొనే అదృష్టం కల్గినది. సాహిత్యం అయితేనేమి, వారితో సంభాషించినప్పుడు సాహిత్యం ఎడల వారికి గల దృష్టి, దృక్పథం అయితేనేమి, నాకనిపించింది, సాహిత్యాన్ని జీవితంలోనూ జీవితాన్ని సాహిత్యంలోనూ దర్శించే దార్శనిక సాహితీవేత్త సంపత్‌ కుమారని. వారి రాతల్లో చేతల్లో, సమాజం పట్ల ఉన్న నిబద్ధత, నిమగ్నత, సామాజిక న్యాయం పట్ల ఉన్న ఆరాటం, చిత్తశుద్ధి, నన్ను బాగా ఆకర్షించాయి. అందుకే వారి సాహిత్యాన్ని సమాజానికి పరిచయం చేయాలనే తలంపు కల్గినది. ఆ తలంపే ‘‘కవిత్వమై కురిసిన కవి’’గా వారి సాహిత్యాన్ని విశ్లేషించడం జరిగింది.

    ‘‘ఆత్మ గౌరవం తాకట్టుపెట్టి/ ఆర్థికంగా ఎదగడం గురించి ఆలోచిస్తున్నారు’’ అనే నేటి సామాజిక దృక్పథాన్ని పసిగట్టిన కవి సంపత్‌ కుమార్‌. అట్లే ‘‘అక్షరాలకు/ అణుశక్తి ఉంది/ భూమ్యాకాశాల మధ్య/ భావాల్ని పంచుతూ/ మనుషుల్ని చేరుస్తాయి’’ అనే విశ్వాసం, నమ్మకమున్న కవి సంపత్‌ కుమార్‌. ఈయన సాహిత్యం చదవడం వలన సామాజిక విధ్వంసక మూలాల మీద, మానవేతర శక్తుల ఆధిపత్య భావాల మీద అవగాహన కలుగుతుంది. మత, కుల వాదుల ఆగడాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కవికి భారతీయ సామాజిక వ్యవస్థ, నిర్మాణ చట్రం తెలియడమే కాదు, దాన్ని నడిపించే చలనసూత్రాల ఆంతర్యము తెలుసు.

    అందుకే సంపత్‌ కుమార్‌ సాహిత్యాన్ని నిశితమైన పరిశీలనతో విశ్లేషనాత్మకంగా విపులీకరిస్తూ ‘కవిత్వమై కురిసిన కవి’ శీర్షికతో రాసి ప్రచురించడం జరిగింది. విజ్ఞులైన పాఠకులు నా కృషిని సహృదయంతో పరిశీలించి ఆశీస్సులు అందిస్తారని ఆశిస్తాను.

    ఈ గ్రంథాన్ని ఓపిగ్గా చదివి

    Enjoying the preview?
    Page 1 of 1