Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Suguna kathabhiramam: An Anthology  of prize  winnig stories (Telugu)
Suguna kathabhiramam: An Anthology  of prize  winnig stories (Telugu)
Suguna kathabhiramam: An Anthology  of prize  winnig stories (Telugu)
Ebook393 pages2 hours

Suguna kathabhiramam: An Anthology of prize winnig stories (Telugu)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

సాహితీ ప్రపంచం ఒక మహా సముద్రం. ఆ సముద్రం లో ఉన్న మంచి రచనలను అంది పుచ్చుకుని చదవటం అనంతసాగరంలో ముత్యాల వేట అంత కష్టం. కష్టం సరే అదృష్టం కూడా కలిసి రావాలి. అను నిత్యం చదివే అలవాటు వున్నా ఎంతోమంది రచయితలు వారి రచనలు మనకు అందవు. కొంతమంది మంచి రచయితల పేర్లు సాహితీ ప్రపంచంలో విరివిగా వినిపించవు. అది పాఠకుల దుర

LanguageTelugu
Release dateJan 4, 2023
ISBN9788196087616
Suguna kathabhiramam: An Anthology  of prize  winnig stories (Telugu)

Related to Suguna kathabhiramam

Related ebooks

Reviews for Suguna kathabhiramam

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Suguna kathabhiramam - Dr M Suguna Rao

    సుగుణ కథాభిరామం

    (బహుమతి కథలు..)

    మొదటి భాగం - ఇరవై ఏడు కథలు.

    Logo Description automatically generated

    డాక్టర్ ఎమ్ సుగుణ రావు

    సుగుణ కథాభిరామం

    (బహుమతి కథలు..)

    మొదటి భాగం ఇరవై ఏడు కథలు.

    Author:  Dr.M.Suguna Rao

    Published by Kasturi Vijayam

    © Kasturi Vijayam

    ISBN(Paperback): 978-81-960876-0-9

    ISBN(E-Book) : 978-81-960876-1-6

    కథలు వరస క్రమంలో

    ముందు మాట

    నాలుగు మాటలు

    1.దేవుడు

    2.నీ సామ్రాజ్యంలో నువ్వే రాజువి!

    3.అనగనగా ఒకడుండేవాడు

    4.ఫ్యునరల్ పార్లర్

    5.ఆకాశంలో రెండు తారకలు

    6.జీవిత పరమార్థం!

    7.సాధించెనే మనసా!

    8.నేటి సతీ సావిత్రి

    9.ముప్పు డాట్కామ్, రెండువేల ముప్ఫై

    10.పోలేరమ్మ

    11.ఎందరో మహానుభావులు!

    12.ప్రాణదీపం

    13.ఎపోకలిప్టిక్‌ 666

    14.గోడ మీద బొమ్మ!

    15.అంతర్ధానం!

    16.చట్టం ధర్మం

    17.కూతురు!

    18.క్షమా బిక్ష

    19.ఒక ‘లగేజి’ కథ

    20.శిఖరం

    21.. హనూ ఈజ్‌ ది బెస్ట్‌!

    22.గురుసాక్షాత్‌ పరబ్రహ్మ

    23.. అంతిమ సంస్కారం

    24.కోడ్‌ రెడ్‌!

    25.కూలిన శిఖరం

    26.పాపికొండలు!

    27.మనసు చూసినవాడు

    ముందు మాట

    సాహితీ ప్రపంచం ఒక మహా సముద్రం.

    A person wearing glasses Description automatically generated with low confidence ఆ సముద్రం లో ఉన్న మంచి రచనలను అంది పుచ్చుకుని చదవటం అనంతసాగరంలో ముత్యాల వేట అంత కష్టం

    కష్టం సరే అదృష్టం కూడా కలిసి రావాలి.

    అను నిత్యం చదివే అలవాటు వున్నా ఎంతోమంది రచయితలు వారి రచనలు  మనకు అందవు.

    కొంతమంది మంచి రచయితల పేర్లు  సాహితీ  ప్రపంచంలో విరివిగా వినిపించవు.

    అది పాఠకుల దురదృష్టం.

    డా. ఎం. సుగుణ రావు గారు ఆ కోవకే చెందుతారు.

    వారు రాసిన కథలు అది వరకే చదివినా కొంతకాలం క్రితం

    ఆధర్స్ అండ్ రైటర్స్ గ్రూప్ లో

    చేరాక సుగుణ రావు గారు రాసిన అన్ని కథలూ చదివాను.

    వారు కృషీవలుడు. విరివిగా రాస్తారు.

    అయినా వాసి తగ్గదు.

    ఎన్నో పోటీలలో విజేతగా నిలిచి బహుమతులు గెలుచుకోవటమే అందుకు దర్శనం

    సులభంగా అర్థమయ్యే శైలి వారిది.

    మానవత్వపు విలువలకు పెద్ద పీట వేస్తారు.

    వీరి రచనల్లో ఆశావహ దృక్పథం కనిపిస్తుంది.

    ఎంతో కాలంగా రాస్తూ ఎన్నో కథలకు బహుమతులు గెలుచుకున్న ఈ రచయిత గురించి ఇప్పుడు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు.

    బహుమతులు గెలుచుకున్న బహుమతి పొందిన కథలతో సంపుటి వేయడం చాలా మంచి నిర్ణయం.

    కథలు పుస్తక రూపంలో వస్తే  వాటి విలువ వేరు.

    ఉన్నత విద్య ను అభ్యసించి ఉన్నత పదవులు నిర్వహించిన

    సార్థక నామధేయులు,

    డాక్టర్ సుగుణ రావు గారి ఆప్తురాలిగా వారిని మనసారా అభినందిస్తున్నాను.

    త్వరలోనే మరికొన్ని బహుమతులు గెలుచుకుని ఆ కథలతో మరొక సంపుటి వేయాలని ఆ సందర్భంలో కూడా నేను నాలుగు మాటలు రాయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

    శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి

    ప్రముఖ కథా నవలా రచయిత్రి

    నాలుగు మాటలు

    Text Description automatically generated

    1.దేవుడు

    వారంతా గుంపులుగా కదులుతున్నారు. గూడెం దాటి మామిడిపల్లి నుంచి టౌన్‌ లోకి అడుగువేస్తున్నారు. వర్షపు చినుకులు టప్‌టప్‌మని లయబద్ధంగా పడుతూ ప్రశాంతతని చెడగొడుతున్నాయి. నీలం, ఎరుపు సిరాలో ముంచినట్టుగా వుంది ఆకాశం. క్షణక్షణానికి మెరుపులతో ఉరుముతోంది.

    ముందు నడుస్తున్న నందయ్య గిరుక్కున వెనక్కి తిరిగేడు. తడవకుండా వుండడానికి, తువాలు నెత్తికి చుట్టుకొని నడుస్తున్న గుంపును ఓసారి పరీక్షిస్తూ.

    ఏందిర ఇంత పెండ్లి నడక నడుత్తన్లు... మబ్బుల లేచిన గూడ మనం పోయేటట్లు లేదేమురా, నడువుండ్లహే. జల్లి... జల్ది నడువుండ్సి, లేకుంటే యాడబోతము.. అన్నాడు.

    నందయ్య అతుకులేసిన తెల్లచొక్కా వేసుకున్నాడు, తొడుక్కున్న ఖాకీ నిక్కరు గంజితో బిరుసుగా వుంది. జులపాలుగా వున్న జుట్టుకు కొబ్బరినూనె దట్టంగా పట్టించేడు, మొహం జిడ్డు కారుతోంది. చంకలో మూట వేళ్ళాడుతోంది.

    నందయ్య మాటలకు నడుస్తున్న గుంపు వేగం పెంచి గబగబా అడుగులు వేయసాగేరు. వర్షంతో నేల తడిసివుండడం చేత అడుగులు కష్టంగా పడుతున్నాయి. నందయ్య పక్కగా నడుస్తున్న లచ్చయ్య ఒరే రాములోరిని ఎన్నడైనా చూసినావురా అన్నాడు. ఆ హోరుగాలిలో ఆ మాటలు నందయ్యకు వినిపించలేదు. చుట్ట తీసి వెలిగించి గుప్పు గుప్పు మంటూ రైలింజనులా పొగవదులుతుంటే ఏందిరా నీకింత పరాకాయె, రాములోరిని చూసినావా, అంటే పలకవాయె అన్నాడు లచ్చయ్య కోపంగా.

    ఓపాలి దూరం నించెలి చూసి ఊరికొచ్చినాను, మా అవ్వశానా బయపడి, పోవద్దు బిడ్డా ఆళ్ళు మనల నంపుతరు, మన కులపోల్లు రాములోరి దగరకు పోవద్దు, పోతే లొల్లి అవుద్ది, మనకు పోశమ్మ, ఉప్పలమ్మ ఉన్నదిరో... అందిరా మా అవ్వ ఆ దినం తన గోడు వెళ్ళబోసుకున్నాడు నందయ్య.

    ఏమో, ఇయాల ఏమైతదో, కుంటుతూ వస్తున్న ముసలోడు పెదవి విరిచేడు. ఇంకా మీ జమానా కాదులే, మన సర్కారు అందర్నీ ఒకే తీరుగా సూత్తాంది అవేశంగా అన్నాడు లచ్చయ్య.

    ***

    దూరంగా స్పీకర్‌లో వినవస్తున్న పాటలకు నందయ్యలో సంతోషం ఎక్కువయింది. రాములోరికి ఏమేం తెత్తన్నావురా, అన్నాడు లచ్చయ్య వంక తిరిగి హుషారుగా.

    ఆ మాటలకు తన చంకలో వేళ్ళాడే మూట చూపిస్తూ కేలపండ్లు, ఊదిబత్తీలు, కొబ్బరి కాయలు తెత్తన్నా ఇవి కొనుక్కొస్తనికి మస్తు పైసలయినయ్‌. బావి దవ్వపోయిన పైసలతోని ఇవ్వన్నీ కొనుక్కొత్తనరా. మల్లబోయినంక మా పటికే లేదురా, ఏం దేవుడోగాని, దేవునికిన్నిత్తనాంగాని మన కట్టాలు ఎపుడు బాపుతడో? అన్నాడు నిర్లిప్తంగా.

    గుడి దగ్గరకంటూ వచ్చేసారు. గుడికెదురుగా సర్విబాదులతో పందిరి వేసుంది. గుడికి డిస్టెంబరు రంగు వేయబడి వుంది. చాలా పురాతనమైన గుడి అది. కొన్ని సంవత్సరాలుగా ఎవరి ఆలనా పాలనా లేక అనాథలా మిగిలివున్న  ఆ గుడి పరిస్థితి చూసి ఆ వూరి కొందరు పెద్దలు చందాలు పోగుచేసి బాగుచేయించారు. శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని ఉత్సవాలు జరుపుతున్నారు. ఏం బాగో ఏమిటో అని ఆ గుడిని చూసి విమర్శించిన వారు లేకపోలేదు. కారణం అది కూలిపోవడానికి సిద్దంగా వున్నట్లే కనిపిస్తుంది. పెచ్చులూడిపోయిన గోడలతో శిధిలాలయంలా వుంది.

    నందయ్య గబగబ అడుగులేస్తూ గుడి పక్కనే వున్న గిలకబావి దగ్గరకు వెళ్ళి కాళ్ళూ, చేతులూ కడుక్కొని ముఖద్వారం వద్ద వచ్చి ఆగి తన వెనక వచ్చిన మిగిలిన పాతిక మందిని ఉద్దేశించి –

    జల్ది జల్ది కాళ్ళు గడుక్కొని. గుళ్ళేకు పోతాము. ఒకల్లెనక ఒకలు రాండి అన్నాడు.

    గబగబా వస్తున్న నందయ్యను, అతడిని అనుసరిస్తున్న పాతిక మందిని చూసి ఒక వ్యక్తి ఉగ్రరూపంతో చేతిలో వున్న బాణా కర్రను అడ్డు పెట్టాడు. అతను పోడుగ్గా, బలంగా వున్నాడు. మీసాలు వంపు తిరిగి వున్నాయి. బనీను వేసుకుని పంచె కట్టుకున్నాడు. మెడలో తాయెత్తు, మొరటు చూపులు కళ్ళు క్రూరంగా తిప్పుతున్నాడు.వారంతా అతన్ని చూసి ఆగిపోయారు. నందయ్య ఏదో చెపుదామని ప్రయత్నించేసరికి బాణాకర్ర అడ్డు పెట్టిన అతని వెనుకగా ఇంకో అతనొచ్చి నుంచున్నాడు. అతను పొట్టిగా వున్నాడు, మొహం గుండ్రంగా వుంది. నెత్తిమీద వున్న కొద్ది జుట్టు ముడివేసి వుంది. బాగా పెరిగిన పొట్ట.. నుదుటి మీద నామాలు, పొట్ట మీద విభూది రేఖలు.

    వాళ్ళందరనినీ చూసి అతను కోపంగా ఎవల్రా మీరు.. మాలమాదిగలం.. దిగున్రా వెనుకకు దిగన్రా, మీకెన్ని గుండెల్రా,... అన్నాడు.

    ఆ మాటలకు నందయ్య రెండడుగులు వెనక్కి వేసి ఏంది బాంచెన్‌ గట్లంటన్లు, మేము రాములోర్ని చూసెతందుకు వచ్చినం.. జరజూడనీ అన్నాడు నందయ్య బాణాకర్ర వ్యక్తి నందయ్యను కర్రతో పక్కకునెట్టి అరేరే ఎక్కకుండ్రీ ముట్టుడైపోతది.. ఎవరైన వూరి వారు జూస్తే నన్ను తిడుతరు ఎందుకు రానిచ్చినావని? అన్నాడు.

    అ మాటలకు హతాశుడై లచ్చయ్య నామాలు వేసుకున్న పూజారి వంక తిరిగి అయ్యవార్లూ మేము శానా దూరం నుంచేలి వచ్చినం మల్ల ఎట్లొత్తం దొర. జరమొక్కనియ్యండి అన్నాడు ప్రాధేయపడుతూ.

    ఏందిరా సచ్చినయిదిని ఊరిబైట బడుండె టోళ్ళు మీకు రాములోరు కావల్నరా? ఊరి బయట ఉప్పలమ్మ, పోశమ్మ వున్నదిరా. నడువుండ్లి ఇక్కణ్లుంచెలి మీరిండ్లకొస్తే మన కర్ణమయ్య నన్ను తిడతడు. అసలు మీకెవడు చెప్పిన్రా, ఇక్కడకు రమ్మని, చల్‌, ఎల్లిపొన్రి. మల్లగిన కానొస్తే బొక్కలు ఇరగ్గొడత అన్నాడు పూజారి కోపంగా. అతను అలా తన తిట్ల ప్రవాహం కొసాగిస్తుండగానే నందయ్య తల పైకెత్తి గర్భగుడి లోని దేవుణ్ణి చూద్దామని ఒక అడుగు ముందుకు వేసాడు. వెంటనే బాణాకర్ర వ్యక్తి కర్రతో నందయ్య నెత్తిమీద కొట్టేడు.

    అబ్బా అని నందయ్య తలపట్టుకొని వెనుకకు తిరిగేడు. నందయ్య వెనకకు తిరిగిన తరువాత ఇంకో నలుగురు ద్వారానికి అడ్డంగా నిలబడ్డారు. పూజారి పొట్ట సవరించుకొంటూ కుక్కకు సందిస్తే మూతి నాకినట్లు, ఏదో గుడిసెలేస్తే ఇంక దేవుని చూసెతందుకు వచ్చినార్రా, పాపమని బతకనిస్తే మీకు దేవుడు కావాల్రా, ఎవరైనా జూస్తే నానోట్లో మన్ను పడతది, మీ ఇల్లు బూదిదైతది పొండి, పొండి అంటూ అరిచాడు.

    ఆ మాటలు పూర్తిగా వినకుండానే నిట్టూర్పు విడుస్తూ అంతా వెనుతిరిగారు. దెబ్బ తగిలిన నెత్తి మీద చేయి ఆనించి నీరసంగా నడవడం ప్రారంభించేడు నందయ్య. అతనితోపాటు మిగతా వారంతా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా వడి వడిగా అడుగులు వేయసాగేరు.

    వానచినుకుల క్రమేపీ పెద్దవై గాలివాన దశకు చేరుకున్నాయి. ఉన్నట్టుండి ఆకాశం ఉరిమింది. క్షణంలో వాతావరణంలో మార్పు.. అంతా పరుగులాంటి నడక ప్రారంభించేరు. ఈదురుగాలి ఎక్కువయింది. చూస్తుండగానే రోడ్డు పక్కనే వున్న చింతచెట్టు ఫెళ ఫెళమంటూ విరిగిపడి నేలకూలింది. దగ్గరలో కనిపించే రైల్వేస్టేషన్‌లో తలదాచుకోవచ్చని అంతా పరిగెత్తేరు. ఫ్లాట్‌ఫారమ్మీద తలో చోటా చతికిలబడ్డారు. నందయ్యలో నీరసం ఆవరించింది. నెత్తిమీద తగిలిన గాయం మంట పెడుతోంది. కళ్ళు మూతలు పడుతుండగా నిద్రకు ఉపప్రమించేడు బయటవర్షం తగ్గేట్లులేదని.

    కుక్క పిల్లిని తరుముతోంది, చూస్తుండగానే నాలుగు వైపుల నించీ పిల్లి పిల్లలు చేరాయి. ఆ పిల్లుల గుంపును చూసి కుక్క తోక ముడిచేసరికి పిల్లులన్నీ దాన్ని చుట్టుముట్టాయి. నందయ్య దిగ్గున లేచాడు. 'ఏమిటీ కల!?' అనుకుంటూ కళ్ళు నులుముకొని చూసాడు.

    ప్లాట్‌ఫామ్మీది తన మనుషులంతా కునికిపాట్లు పడుతున్నారు. తువాలు నెత్తికి చుట్టుకొని బైటకొచ్చి చూసాడు. వాతావరణం ప్రశాంతంగా వుంది. తుఫాను వెలిసింది. మబ్బుల్లోని సూర్యుడు బైటకొచ్చాడు. అరే లెగున్రి, జల్దీ లెగున్రి అంటూ అరిచాడు. అతని మాటలకు అంతా లేచి గబ గబా రైలు కట్ట వెంబడి నడవడం ప్రారంభించేరు

    నందయ్య మనసులో ఎన్నో చిక్కుప్రశ్నలు. తనకొచ్చిన పగటికలలోని అంతర్యం ఏమిటా అనే ఆలోచనతోనే నడుస్తున్నాడు.

    "నాకు తొల్తె సమజయ్యింది. ఆళ్లు మనల గుల్లోనికి తోల్రని, ఛీదూత్‌.. అంటూ ఛీత్కారంగా ఉమ్మేసాడు.

    ఆ మాటలు విని లచ్చయ్య అరే, కూలి పైసలు పాయె, బగ్గ పైసలయినయ్‌ రాములోరికి ముడుపుకట్టె తందుకు అంటూ నిట్టూర్పు విడిచాడు. మిగతా వారంతా మౌనంగా నడుస్తున్నారు. వాతావరణం పొడిగా వుంది. మధ్యాహ్నపు ఎండ పల్చగా వున్నా చురుక్కుమనిపిస్తోంది. మళ్ళీ వస్తాను సుమా అనే హెచ్చరికతో వాన చినుకులు విరామం ఇస్తూ పడుతున్నాయి. అంతా రైలు కట్టదాటి మామిడిపల్లి వైపు తిరిగేరు.

    చేలగట్ల బురదలో కాళ్ళు జారుతున్నాయి. గూడెంకు చేర్చే అడ్డురోడ్డుకు సమీపంగా వచ్చి అటు తిరగబోయేటంతలో ఒకే అగురొరె, మీతో పనిబడినాది, అయ్యగారు కబురంపిన్రు ఆయాసపడుతూ వచ్చి చెప్పేడు బాణాకర్రతో వారిని ఆపిన వ్యక్తి.

    అతని వంక ప్రశ్నార్ధకంగా చూసి, మాతో ఏం పని? అన్నాడు నందయ్య కోపంగా.

    నాకు దెల్వదు. వున్నపట్నే మిమ్మల్ని తోలకు రమ్మన్నరు అయ్యవారు, పోదాంప అన్నాడు బాణాకర్ర.

    ఏందిరా లచ్చిగా ఏం జేద్దాము? అన్నాడు నందయ్య. లచ్చయ్య కొద్ది క్షణాల సేపు ఆలోచించి, ఇద్దరం బోయి సంగతి తెల్సుకుందాం అన్నాడు. మిగతా వారిని అక్కడే ఉండమని ఇద్దరూ బయలుదేరేరు.

    గుడి దగ్గరయ్యే కొద్దీ వారిలో ఉత్సాహం ఎక్కువయింది. గుడి నించి పాటలు వినబడడం లేదు. బాణాకర్ర భయం భయంగా చూస్తూ వీరి వెనకే వస్తున్నాడు.

    తలొంచుకొంటూ వస్తున్న నందయ్య, లచ్చయ్యలకు గుడి సమీపించేసరికి ఆశ్చర్యం కలిగింది. తాము చూసేది కలో, నిజమో అర్థం కాలేదు. గుడి ఒకమూలకు ఒరిగిపోయింది. ఎడమ భాగపు గోడ కూలిపోయి వుంది. వారు ఆశ్చర్యం నించి తేరుకునేటంతలో పూజారి గబగబా వచ్చి. అరే అరే దేవుని గుడి కూలిపోయింది, తుఫానుకి. గాలివానకి గోడలు పడిపోయినయిరా, మళ్లీ కట్టాల.. గోడ పనికి ఒస్తార్రా, దేవుణ్ణి వెంటనే నిలబెట్టకపోతే మన ఊరికి గత్తర ఒస్తాదట, మన పొలాలు పండపంట, చెరువు కట్ట తెగిపోతాదట, మీరు వెంటనే కూలిపనికి రాండి, మీ వాండ్లను తోలుకుని జల్దీ పని చెయ్యాలిరా అన్నాడు.

    నందయ్య ముఖం ఆ మాటలతో మ్లానమయింది. రెండు చేతులు బిగుసుకున్నాయి. లచ్చయ్య భుజం మీద చెయ్యి వేసి, అపుడు గుళ్ళోకొచ్చినపుడు ముట్టుడుంది గానీ గుడి కట్టెతందకు లేదాసామి ముట్టుడు? ఈ గుడి కట్టెతందుకు మేమెదొరికానామా? అవును సామీ, పుట్టిన కాణ్జించేలి, సచ్చేదాకా మేమే మీ గతి, నువ్వు పుట్టినపుడు నీ ఇల్లు కడిగింది మేమే, నీ ఇండ్ల బావి తవ్వింది మేమె, నువ్వు పాలు తాగనీకి పెంచే గొడ్లను సాదేది మేమే, ఇన్నిటి కాడ లేని ముట్టుడు మట్టి బొమ్మ కాడ ఒచ్చినాదా సామీ, ఆ బొమ్మ వున్న గుడి కూలిపోతే కూలి పని చెయ్యనీకి మేమే దారికినామా సామీ, ఛీ ధుత్‌... అంటూ చీత్కారంగా ఉమ్మేసి నిలబడ్డాడు నందయ్య.

    ఆ మాటలు విని ఏమనాలో తెలీక నిశ్చేష్టుడై నిలుచుండిపోయాడు పుజారి. లచ్చయ్య తన చెయ్యి నందయ్య బుజం మీద వేసి, పూజారి వంక తిరిగి ఏం దొరా గత్తర ఒస్తాదా, రానీండి, మాకు పనికిరాని దేవుడోడు మాకెందుకు? మావోడు తన్నుల బడ్డపుడు ఏ దేవుడు అడ్డం వచ్చిండు? ఆడి మనుషులు మావోడి రక్తం జూసినపుడు ఏ దేవుడు రచ్చించ్చిండు? ఆడి గుడి పడిపోతుంటే చూసేటోడు మడుసుల రక్తాలు చూసెటోడు, ఆ దేవుడి కోసం మేమెందుకు తిప్పలు బడేది? మీదేవున్ని మీ కాడనే వుండనీండి సామీ. మా రెక్కలే మాకు దేవుడు, మా కట్టమే మాకు దేవుడు అని నందయ్యను తీసుకొని అక్కడనుంచి నిష్క్రమించాడు. వెళుతున్న వారిద్దరినీ చూసి పూజారి, బాణాకర్ర, కూలిపోయిన ఆ గుడి విస్తుబోతూ, స్థబ్దుగా వెళ్ళిన దిక్కే చూస్తుండగా వారు అదృశ్యమయ్యేరు.

    ********

    మయూరి వీక్లీ 5 ఫిబ్రవరి 93

    1993 మయూరి దసరా కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ

    2.నీ సామ్రాజ్యంలో నువ్వే రాజువి!

    శీతాకాలం పొద్దు. ఇంకా పూర్తిగా తెలవారలేదు. తన దుకాణం ముందు నించున్న చలమయ్య మనసునిండా దిగులు. దుకాణం తెరవగానే వరసగా పేర్చిన పప్పులు, ఉప్పులు, సబ్బులు చూసిన అతడిలో దుఃఖం పెరిగింది. ముందురోజు సంతలో కొని తెచ్చిన ఆకుకూరలు, కాయగూరలు వడలిపోయి కనిపించాయి. చలమయ్య ఎప్పుడూ తెల్లవారకముందే దుకాణం తెరుస్తాడు. వాహ్యాళి కొచ్చిన వాళ్లతో తన దుకాణం సందడిగా ఉండేది. ఏదో జానపదం పాడుతూ బేరాలు సాగించేవాడు. తుపాకీ దెబ్బకు ఆకాశంలో పక్షులన్నీ ఎగిరిపోయినట్టు, నెలక్రితం వెలిసిన ఆ అద్దాల ఎయిర్ కండిషనింగ్ దుకాణం తన దగ్గరకొచ్చే ఖాతాదారులను రెప్పపాటులో మాయం చేసేసింది.

    పట్నానికి, నగరానికి మధ్యస్థంగా నిలిచిన ఆ ఊరు పొలిమేరలో జనపనార మిల్లు ఉంది. అందులో పని చేసే ఉద్యోగులు చిన్నా పెద్దా కలిస్తే వెయ్యిమంది. వారిలో చాలామంది ఉదయాన్నే సరుకుల కోసం అతని దుకాణానికి వస్తారు. చలమయ్య కిరాణా షాపు అంటే ఆ ప్రాంతంలో మంచి పేరు, ఇపుడా పేరు ఏమయ్యింది?చలమయ్యలో ఏదో బాధ, ఉక్రోషం. దుకాణం ముందునుంచే సైకిల్ పై వెళ్తున్నాడు రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్, సరుకులొద్దా?!  ఈ మధ్య షాపుకి రావడం మానేసావేం! అన్నాడు. మా ఆవిడ ఆ షాపింగ్ మాల్లోనే సరుకులు తెస్తోంది. నెలలో ఒకసారి లాటరీ తీసి ఆడవాళ్ళకు పట్టుచీర ఇస్తున్నారంట ! గబగబ చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు పట్టుచీర ఇస్తారట తనేం ఇవ్వగలడు?శుభ్రమైన సరుకులు ఇవ్వడం తప్ప...అనుకున్నాడు. చలమయ్యకు రామ్ ప్రసాద్ ను చూస్తూంటే గతం గుర్తుకొచ్చింది. రెండు సంవత్సరాల క్రితం తను అలా సైకిలు మీద ఆ జనపనార మిల్లులో ఉద్యో గానికి వెళ్ళేవాడు. భార్య వేడివేడిగా వండి క్యారేజ్ కట్టేది. తను ఆ మిల్లులో ఎకౌంట్స్ గుమస్తా, ఉద్యోగుల జీతాలు, ప్రయాణపు ఖర్చులు, మిల్లు రాబడి, నష్టం, ఖర్చులు చూసేవాడు. తన పని లెడ్జరు రాయడం తను రాసే లెడ్జరు చూసి, ఆఫీసరు ముచ్చట పడేవాడు. ముత్యాల్లాంటి అక్షరాలు, ఎక్కడా కొట్టివేతలు ఉండేవి కాదు. కాలిక్యులేటర్ ఉపయోగించేవాడు కాదు. అంతా నోటిలెక్కలే! ఎక్కడా తప్పు దొర్లేది కాదు! తనను పెద్ద గుమస్తాగా పదోన్నతి పొందడానికి పై అధికారులు సమ్మతించే దశలో, తన మీద దెబ్బపడింది. ఫ్యాక్టరీలో కంప్యూటరీకరణ. వేళ్ళమీద లెక్క పెట్టే గుమస్తాలను తీసెయ్యాలనీ ....యాభైమంది చేసే పని ఒక కంప్యూటరు చేస్తుందనీ తన వంటి వారిని గౌరవంగా బయటకు తరిమారు. తన బతుకు రోడ్డు మీద కొచ్చింది. కాలేజీ చదువుతున్న కూతురు, ముసలితల్లి. ఫ్యాక్టరీ వారిచ్చిన క్వార్టరు ఖాళీ చెయ్యాలి. వచ్చే జీతంలో మూడోవంతు పెన్షను ...పాతికేళ్ళ సర్వీసులో దాచుకున్న డబ్బులు ఐదు లక్షలు, ఇంకా ఎనిమిదేళ్ళ సర్వీసుంది. పెద్దకొడుకు బెంగుళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వాడే ఆశాకిరణం అనుకున్నాడు. మరి

    Enjoying the preview?
    Page 1 of 1