Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

శ్రీకామాక్షి దర్శనం
శ్రీకామాక్షి దర్శనం
శ్రీకామాక్షి దర్శనం
Ebook223 pages53 minutes

శ్రీకామాక్షి దర్శనం

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

About the book:
భగవంతుని తెలుసుకోటానికి ఉపయొగపడే పరావిద్యే నిజమైన విద్య. భుక్తికొరకు పనికివచ్చే కర్మలను పురిగొల్పే మిగిలిన విద్యలన్నీ అవిద్యలని వేదం చెబుతుంది. ఈ సమస్త జగత్తు ఓంకారమే. ఆత్మ చలించనిదైనా మనస్సుకన్నా వేగవంతమైనది. ఆత్మ మనస్సుకన్నా ముందే వెళ్లగలదు కనుక అది ఇంద్రియాలకు అందదు. ఆత్మ నిత్యమూ స్థిరమైన దైనా పరుగెత్తే అన్నిటికన్నా వేగవంతమైనది. ఆత్మ సకలప్రాణికోటుల కార్యకలాపాలను నిర్వహింపచేయటానికి ప్రాణశక్తిని సమకూరుస్తోంది.ఇంద్రియాలు బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి.అందుకనే ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవు. ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని ఇంద్రియాలను ప్రపంచముతో కలిపి పనిచేయిస్తుంది. ప్రతీ జీవుడిలో ఉన్న ఆత్మయే బ్రహ్మం. ఓంకార మంత్రం పై ధ్యాసనిలిపి ఉపాసన చేసి అనుష్టించేవాడు క్రమ క్రమంగా వైశ్వనర తైజస ప్రాజ్ఞ స్థితులను దాటి ఆత్మ దర్శనం చేసుకొని అద్వైతస్థితిని అనుభవిస్తాడు. అదే నిజమైన ఆత్మ దర్శనం. నిజమైన కామాక్షి దర్శనం. వాటిలో నాకుకలిగిన ఒక అనుభవం ఈ నా శ్రీకామాక్షి దర్శనం.

LanguageTelugu
PublisherPencil
Release dateMar 19, 2022
ISBN9789356104532
శ్రీకామాక్షి దర్శనం

Related to శ్రీకామాక్షి దర్శనం

Related ebooks

Reviews for శ్రీకామాక్షి దర్శనం

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    శ్రీకామాక్షి దర్శనం - నెమలికంటి శ్రీరామచంద్ర మూర్తి

    శ్రీకామాక్షి దర్శనం

    బాహ్య ప్రపంచాన్ని గ్రహించడానికి ఇంద్రియాలు సృష్టించబడ్డాయి. నేను ఆత్మరూపుణ్ణై ఉన్నప్పుడు ప్రపంచం ప్రపంచమంతా నేనే. ఆత్మ చైతన్యంలో నాకుకలిగిన ఒక అనుభవం ఈ నా శ్రీకామాక్షి దర్శనం.

    BY

    నెమలికంటి శ్రీరామచంద్ర మూర్తి


    pencil-logo

    ISBN 9789356104532

    © NS Rama Chandra Moorthy 2022

    Published in India 2022 by Pencil

    A brand of

    One Point Six Technologies Pvt. Ltd.

    123, Building J2, Shram Seva Premises,

    Wadala Truck Terminal, Wadala (E)

    Mumbai 400037, Maharashtra, INDIA

    E connect@thepencilapp.com

    W www.thepencilapp.com

    All rights reserved worldwide

    No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electronic, mechanical, photocopying, recording or otherwise), without the prior written permission of the Publisher. Any person who commits an unauthorized act in relation to this publication can be liable to criminal prosecution and civil claims for damages.

    DISCLAIMER: The opinions expressed in this book are those of the authors and do not purport to reflect the views of the Publisher.

    Contents

    ప్రథమ అధ్యాయం

    ద్వితీయ అధ్యాయం

    తృతీయ అధ్యాయం

    చతుర్థ అధ్యాయం

    పంచమ అధ్యాయం

    షష్టి అధ్యాయం

    సప్తమ అధ్యాయం

    అష్టమ అధ్యాయం

    నవమ అధ్యాయం

    దశమ అధ్యాయం

    ఏకాదశ అధ్యాయం

    ద్వాదశ అధ్యాయం

    త్రయోదశ అధ్యాయం

    చతుర్దశ అధ్యాయం

    పంచదశ అధ్యాయం

    సప్తదశ అధ్యాయం

    అష్టాదశ అధ్యాయం

    నవదశ అధ్యాయం

    వింశతి అధ్యాయం

    ఉత్తర పీఠిక

    ప్రథమ అధ్యాయం

        సంకల్పబలం గురించి ఛందోగ్యోపనిషత్తులో ఋషిపుంగవుడైన శ్రీసనత్కుమారుడు యోగిపుంగవుడైన నారదుడితో ఇలా అంటాడు

    సంకల్పో వావ మనసో భూయాన్యదా వై సంకల్పయత్కేథ

    మన స్యత్యథ వాచమీరయతి తామునామ్నీరయతి

    నామ్ని ఏకం భవంతి మంత్రేషు కర్మాణి | తాని హవా ఏతాని ...

        మనసుకన్నా సంకల్పం గొప్పది. మనసులోని సంకల్పం మాటద్వారా వ్యక్తీకరింపబడి మంత్రంగా మారుతుంది. మంత్రము, సంకల్పము కలిసి కార్యానికి దారితీస్తాయి. సంకల్పబలం ఎంతధృఢంగా వుంటే లక్ష్యసిద్ది అంత సులువవుతుంది. సంకల్ప బలం లోని మాయాశక్తి దేవతల చేత మనఊహకి అందని అద్భుతాలని చేయిస్తుంది. విరట్పురుషుడైన భగవంతుణ్ణి కొలతలతో కొలవలేము. అలాగే ఆయన మహిమలని తర్కంతో అంచనా వేయలేము.

        అధునిక యుగంలో కొత్త శాస్త్రాలు వంటబట్టిన చదువులతో ప్రతి ఫలితానికి ఒక కారణం వుంటుందని కారణం లేకుండా ఏదీ జరగదని ( Cause and affect theory) నిశ్చితాభిప్రాయంలో ఆధునికులు వున్నారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిర్ణయాత్మకమైనది (Deterministic) అని దానిని మంచి గణితనమోనాలలో(mathematical models) బంధించవచ్చని వారిభావన. ప్రపంచం నిజానికి ఎంత నిర్ణయాత్మకమైనదిగా కనబడుతుందో అంతకంటే ఎక్కువ యాదృచ్ఛికమైనది(Random). వేదకాలం లోని శాస్త్ర విజ్ఞానం క్రమ క్రమంగా కనుమరుగయింది. ఆ కాలపువిజ్ఞానాన్ని పుస్తకాలలో భద్రపరచకపోవటం ఒక ఎత్తయితే తరువాత కాలంలోవచ్చిన స్వార్థకులవ్యవస్త రెండవది. అందుకే భగవతాది వురాణాలలో కనిపించే ఇతివృత్తాలన్ని మనకి కాల్పనికజగత్తులో సృష్టించిన కథలలాగా కనబడతాయి.

        భూమి తనచుట్టుతాను తిరుగుతూ సూర్యునిచుట్టు కూడా తిరుగుతుంది. అంతేకాక భూఅక్షం వంకరగా తిరిగి వుండటమేకాక స్థిరంగావుండకుండా వణుకుకు(wobbling) గురై 26,000 ఏళ్ళ కొకసారి (frequency) మొదటి స్థానానికి వస్తుంది. 1970 దశకంలో ఇప్పటి శాస్త్రజ్ఞులు గుర్తించినదానిని వేలయేళ్ళకిందనే పరాశరమహాఋషి దర్శించాడు. అది ఎలాసాధ్యమయింది ? శని గ్రహం 30 యేళ్ళకొకసారి సూర్యుని చుట్టు తిరుగుతుంది. ఇప్పటి యంత్రసామాగ్రి లేకుండానే పరాశర మహాఋషి దాన్ని ఖచ్చితంగా లెక్కవేయగలిగాడు.

        శ్రీకృష్ణుడు గోవర్ఢనపర్వతం ఎత్తటం మనకి ఒకకధ. ఇప్పుడున్న సూపర్ క్రేనులు కూడా ఎత్తలేని బరువున్నశిలలతో ఈజిప్ట్ లో పిరమిడ్లు ఆకాలంలో ఎలానిర్మిచ్చారో మరి. ఏడ్వర్డ్ లీడిస్కల్నిన్ (1887–1951) అనే శిల్పి 1920 లో అమెరికాలో ఫ్లొరిడాప్రాంతంలో ఒకరాతి కోట నిర్మించాడు (https://en.wikipedia.org/wiki/Coral_Castle). ఇప్పుడున్న సూపర్ క్రేనులుకూడా ఎత్తలేని బరువున్న వేలకొద్దిరాళ్ళని 10మైళ్ళదూరం లోని గనినుంచి ఒక్కడే తవ్వితెచ్చి దాన్ని నిర్మించాడు అతడు. తనపని గోప్యంగా రాత్రివేళల్లొ కానీయటం వలన ఆయనవిజ్ఞానం ఎవరికి తెలియకుండాపోయింది. అక్కడవున్న పిల్లలుకొందరు మాత్రం ఆయన పెద్దపెద్దశిలలని బెలూన్లలాగా తీసుకెళ్ళటం చూశామని చెప్పారు. ఈజిప్ట్ లో పిరమిడ్లు ఎలానిర్మించారో తనకి తెలిసిపోయిందని ఆయన విలేఖరులతో అన్నాడు కానీ ఆరహస్యం ఎవరికి చెప్పలేదు. శ్రీకృష్ణుడు గోవర్ఢనపర్వతం, హనుమంతుడు సంజీవనపర్వతం ఎత్తే టెక్నాలజీ 1920 లో ఏడ్వర్డ్ లీడిస్కల్నిన్ కి ఎలాఅబ్బిందో మరి.

    అలాగే శ్రీకృష్ణుడు ద్వారకలోవుండే హస్తినాపురంలో ద్రౌపతికి జరుగుతున్న మాన భంగాన్ని వీక్షించి రక్షించాడు. టెలిపతి ఒకసైన్స్ అని ఇప్పుడు కొందరు నమ్ముతున్నారు.

        కాలం ఏమిటి ఈ కాల గణన ఏమిటి ? ఒక సూర్యోదయం నుంచి ఇంకొకసూర్యోదయం వరకు లెక్కించి కాలప్రమాణాన్ని ఎంచటం సమంజసమా? ఈ భూమిమీదే ఒకరికి పగలైతే ఇంకొకరికి రాత్రి. ఋతువులని బట్టి సూర్యోదయ అస్తమయ కాలాలు మారుతుంటాయి. వుత్తరార్థంలోని వాళ్ళకి ఒకఋతువు దక్షిణార్థం లోనివాళ్ళకి ఇంకొకఋతువు. అక్షాంశ రేఖాంశాలను బట్టి కూడా సూర్యోదయ అస్తమయాలు మారుతుంటాయి. వేరొక గ్రహంవారికి మనకాలం పట్టనట్లుంటుంది. సుదూరగ్రహవాసులకి మననిన్న వారికి ఈరోజు. వారు మననిన్నని నేడు దర్శించగలరు. ఈ తర్కంతో మనరేపటిని ఇప్పుడు కొందరుచూడగలరా ? అందరికి కాలం ఒకేలా వుంటుందా ? వేదంలో కాలానికి 64పరిగణలు (Dimensions) వున్నట్లు చెప్పబడ్డాయి. 3 పరిగణలకు మాత్రంచూడగల సామాన్యమానవులు మిగిలినపరిగణలను చూడలేరని వేదం అంటున్నది. కాలానికి అతీతులైన మహానుభావులే కాలంగురించి యదార్థం చెప్పగలరు. కాలం ఒక ప్రవాహంలాగా సామాన్యులకి అనిపిస్తుంది. పోయినకాలం మరిరాదని సామాన్యభావన. అసమాన్యులైన మన వేదఋషులు గజఈతగాళ్ళలాగా కాలప్రవాహాన్ని ఎదురుఈది గతకాలాన్ని దర్శించారు, ముందుకు ఈది రేపటినికూడా దర్శించారు. బ్రహ్మంగారు, సహదేవుడు, నోష్టర్ డామస్ వంటివారికి ఆ విద్యఎట్లా అబ్బిందో ?

        మన పూర్వఋషులు రకరకాల బాహ్యవిషయాలని తెలుసుకోవాలంటే మనం ఏది తెలుసుకొంటే అన్ని అవగతమవుతాయో దానికోసం ప్రయత్నించారు. బ్రహ్మండంలో ఏదివుందో పిండాండంలో అదేవుంది అని వారిభావన. బాహ్యప్రపంచం అవగతమవటానికి అంతర్ ప్రపంచశోధన ముఖ్యమని వారు సూత్రీకరించారు. అదే ఆత్మవిద్య. అదే నిజమైన విద్య. అదే నిజమైన సంపూర్ణజ్ఞానం అని వారిసిద్దాంతం. బాహ్యప్రపంచంపై మనసు, ధ్వనియొక్క ప్రభావం మన పూర్వ ఋషులకు తెలిసినంత మన ఆధునికశాస్త్రవేత్తలకు తెలియదనిపిస్తుంది. బాహ్యవిద్యల గురించి పాకులాడుతూ మనం ఆత్మవిద్యలాంటి అసలైనదానిని ఏదో కోల్పోయామో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది.

        ఇంద్రియాలకు అతీతంగా వున్నశక్తుల గురించి మనం కధలుగా విన్నామేగాని వాటిని సాధించటానికి ఏమిప్రయత్నం చేశాము ? అష్టసిద్దులు హనుమంతుడు ఇస్తాడని పాటలుమాత్రం పాడుతాం గాని అష్టసిద్దుల పేర్లయినా తెలుసుకొనే ప్రయత్నంచేయం. ఇంకా వాటిని సాధించటం సంగతి దేముడెరుగు. వాటిని నేర్పే గురువు లెక్కడున్నారు ?

        అప్పుడప్పుడు మనప్రయత్నం లేకుండానే మనజీవితంలో కొన్ని అద్బుతసంఘటనలు జరుగుతుంటాయి. అవి ఎందుకుజరిగాయి ? వాటిని మళ్ళీ ప్రయత్నపూర్వకంగా చేయవచ్చా? అవి జవాబులు లేనిప్రశ్నలు. వాటిలో నాకుకలిగిన

    Enjoying the preview?
    Page 1 of 1