Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Dwadas Jyotirlingallu
Dwadas Jyotirlingallu
Dwadas Jyotirlingallu
Ebook240 pages4 hours

Dwadas Jyotirlingallu

Rating: 3 out of 5 stars

3/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100902
Dwadas Jyotirlingallu

Read more from Sree Chakra Publishers

Related to Dwadas Jyotirlingallu

Related ebooks

Reviews for Dwadas Jyotirlingallu

Rating: 3 out of 5 stars
3/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Dwadas Jyotirlingallu - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    Dwadas Jyotirlingallu

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    శ్రీ గణాధిపతయే నమః

    ద్వాదశ జ్యోతిర్లింగాలు

    పంచారామాలు - పంచభూత లింగాలు

    సంకలనం

    లక్ష్మీగణపతి శాస్త్రి

    శ్రీ చక్ర, 'ఇ' పబ్లిషర్స్

    ఉపోద్ఘాతం

    నమశ్శివాభ్యాం నవయవ్వనాభ్యామ్

    పరస్పరాక్లిష్ట వపుర్దరాభ్యామ్ |

    నగేంద్ర కన్యా వృషకేతనా భ్యామ్ |

    నమో నమశ్శంకర పార్వతీభ్యామ్ |

    జగద్గురువు లయకారుడు అయిన శివుడు మనదేశంలో ఎన్నో ద్వివ్యక్షేత్రాల్లో పుణ్య తీర్థాల్లో వివిధ రూపాల్లో కొలువున్నాడు. శివారాధన అత్యంత ప్రాచీనకాలం నుంచీ మనదేశంలో ఉన్నది. ఆసేతు హిమాచలం ఎన్నో శైవక్షేత్రాలు నిత్యం వేలాది భక్తులతో కళకళలాడుతూ వుంటాయి. ఇలా ప్రతి శైవక్షేత్రం తమతమ ప్రత్యేకతని, వైశిష్ట్యాన్ని కలిగి వున్నప్పటికీ, పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపుడుగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలకి మనదేశంలో ఎంతో విశిష్ఠ స్థానం ఉన్నది.

    ఈ జ్యోతిర్లింగాలు అనేవి మునులు, ఋషులు, రాజులు ప్రతిష్ఠించినవికావు. సాక్షాత్తు సదాశివుడు తన ఆత్మజ్యోతితో స్వయంభూగా వెలసిన దివ్యక్షేత్రాలు. అందుకే జ్యోతిర్లింగాలని ఒక్కసారి దర్శిస్తే చాలు, అనంతమైన పుణ్యం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తాయి. అందుకే పాఠకులందరికీ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించిన విశేష సమాచారాన్ని ఈ గ్రంథం ద్వారా అందిస్తున్నాము.

    ఈ గ్రంథంలో ద్వాదశ జ్యోతిర్లింగాల విశేషాలతో పాటు, శివుడు పంచమూర్తులుగా నిలచిన అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, క్షీరారామం, సోమారామాలనే పంచారామ క్షేత్రాల గురించి. అలాగే పృథివి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలకు ప్రతీకలుగా నిలిచిన సర్వేశ్వరుడి పంచభూతలింగ దివ్యక్షేత్రాలైన శ్రీ ఏకామ్రనాథ, శ్రీ జంబుకేశ్వర, శ్రీ అరుణాచలేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, శ్రీచిదంబరేశ్వర స్వామివార్ల సమాచారాన్ని కూడా అందిస్తున్నాము. వీటితో పాటు శివభక్తులకు నిత్యపారాయణకు అనుగుణంగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివస్తుతులు, శివుడి అష్టోత్తర శతనామ, సహస్రనామ స్తోత్రాలు కూడా అనుబంధంగా ఇస్తున్నాము.

    శివభక్తులందరినీ ఈ గ్రంథం అలరిస్తుందని ఆశిస్తూ. నమస్కారాలతో...

    లక్ష్మీ గణపతి శాస్త్రి

    ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమ్

    సౌరాష్ట్ర సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ |

    ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరమ్ ||

    కేదారం హిమవత పృష్ట డాకిన్యాం భీమశంకరమ్!

    వారణాస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే!!

    వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే|

    సేతుబంధే చ రామేశం ఘుష్ఠశం చ శివాలయే||

    ద్వాదశైతాని నామాని ప్రాతరుత్తాయ యః పఠేత్ |

    సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ధి ఫలం లభేత్ ||

    యం యం కామమపేక్ష్యేవ పరిష్యంతి నరోత్తమాః!

    ప్రాప్స్యుంతికామం కం కంహి పరత్రేహ మునీశ్వరాః||

    యే నిష్కామతయా తాని పఠిష్యంతి శుభాశయాః।

    తేషాం చ జననీగర్భే వాసో నైవ భవిష్యతి||

    ఏతేషాం పూజనేనైవ వర్ణానాం దుఃఖనాశనం |

    ఇహలోకే పరత్రాపి సుఖం భవతి నిశ్చితమ్ ||

    గ్రాహ్య యేషాం చ నైవేద్యం భోజనీయం ప్రయత్నతః |

    తత్కర్రు సర్వపాపాని భస్మసాద్వాంతి వైక్షణాత్ ||

    ఏకం చ పూజితం యేన షణ్మాసం తన్నిరంతరం |

    తస్యదుఃఖం న జాయతే మాతృకుక్షిసముద్భవమ్ ||

    ద్వాదశ జ్యోతిర్లింగాలు - ప్రదేశాలు

    ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రస్తుతం క్రింద సూచించిన రాష్ట్రాలలో వున్నాయి.

    1. సోమనాథ జ్యోతిర్లింగం - గుజరాత్

    2. శ్రీమల్లికార్జున జ్యోతిర్లింగం - ఆంధ్రప్రదేశ్

    3. ఉజ్జయినిమహాకాళేశ్వరజ్యోతిర్లింగం - మధ్యప్రదేశ్

    4. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్య ప్రదేశ్

    5. కేదారనాథేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాంచల్

    6. భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్ర

    7. వారణాసి విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్

    8. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం - మహారాష్ట్ర

    9. వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం - మహారాష్ట్ర

    10. నాగేశ్వర జ్యోతిర్లింగం - మహారాష్ట్ర

    11. రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడు

    12. ఘృప్లేశ్వర జ్యోతిర్లింగం - మహారాష్ట్ర

    ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దేశంలోని నలుమూలలా వున్నాయి. ఆదిశంకరాచార్యులవారు శంకరమఠాలను దేశం నాలుగు మూలల్లో, దేశసమైక్యతను సూచించే విధంగా నెలకొల్పిన విధంగా పరమేశ్వరుడు దేశంలోని నాలుగు దిశలలో దేశ సమైక్యత కోసం వెలసినాడు అనిపిస్తుంది. సోమనాథ్ లోని జ్యోతిర్లింగం మొదటిదని, రెండవది శ్రీశైల మల్లికార్జునస్వామి జ్యోతిర్లింగమనా, మూడవది ఉజ్జయినిలో, 4వది ఓంకారేశ్వరంలో, 5వది కేదారనాథ్ లో, 6వది భీమశంకరంలో, 7వది వారణాసిలో, 8వది త్ర్యంబకేశ్వరంలో, 9వది వైద్యనాథేశ్వరందని, 10వది నాగేశ్వర జ్యోతిర్లింగమని, 11వది రామేశ్వంలో వుందని, 12వది ఘృప్లేశ్వరంలో వుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వరుససంఖ్య అన్ని పురాణాలలో ఏ మార్పు లేకుండా ఒకేరకంగా చెప్పబడింది.

    ###

    1. సోమనాథ జ్యోతిర్లింగ క్షేత్రం

    సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |

    భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే |

    మనదేశంలోని మొదటి జ్యోతిర్లింగం పై నిర్మించిన దేవాలయం సోమనాథ దేవాలయం. ఈ దేవాలయానికి సుదీర్ఘమయిన, విశిష్టమయిన చరిత్ర ఉన్నది. కృతయుగం నుండి ఈ దేవాలయం వుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. రామాయణకాలంలో రావణుడు ఇక్కడ తపస్సుచేసి, శంకరునికి తన దశ శిరస్సులను సమర్పించాడట. ద్వాపరయుగంలో ఈ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఆరాధించాడట.

    ఈ దేవాలయాన్ని విదేశీ మహమ్మదీయరాజులు ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, తిరిగి పునర్నిర్మించారు. మహమ్మద్ బీన్ ఖాసిమ్, గజినీ మహమ్మద్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔఔరంగజేబు, తదితరులు సోమనాథ దేవాలయాన్ని, అందులోని శివలింగాన్ని ధ్వంసం చేశారు. ఎన్నోసార్లు విధ్వంసానికి గురి అయినా ఈ దేవాలయం పునర్నిర్మితమయి, భారత జాతి చైతన్యానికి, పట్టుదలకు, ప్రతీకగా నిలిచింది, ఎంతో మంది చరిత్రకారులు సోమనాథ దేవాలయం, భారతీయుల ఆత్మవిశ్వాసానికి, వారికి దేశభవితలో వుండే విశ్వాసానికి శాశ్వత చిహ్నం అంటారు. భారతీయులందరికీ అత్యంత ప్రీతిపాత్రమయిన దేవాలయాలల్లో సోమనాథ దేవాలయం ఒకటి. గజినీ మహమ్మద్ వెంటవచ్చిన రచయిత అల్ బెరూనీ, "మహమ్మదీయులకు మక్కా ఎంత

    పవిత్రమయిందో, భారతీయులకు సోమనాథదేవాలయం అంత పవిత్రమయింది" అని కొనియాడారు.

    ఆలయ నిర్మాణం : 1947 లో మనదేశం స్వతంత్ర దేశంగా అవతరించేనాటికి, సోమనాథ ఆలయం పూర్వవైభవాన్ని కోల్పోయి, శిథిలాల కేంద్రంగా మిగిలిపోయింది. ఆ దురవస్థనుండి దేవాలయాన్ని దూరంచేసి, ఆ క్షేత్రానికి పూర్వవైభవాన్ని తీసుకురావటానికి కృషి ప్రారంభమయింది. ఆ కార్యక్రమంలో ఆనాటి కేంద్రప్రభుత్వంలో ఉపప్రధాని అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్, కేంద్రమంత్రివర్గంలో ఆయన అనుచరుడు, కనభయాలాల్ ముల్టీ, ముఖ్యపాత్ర వహించారు. 1950, మే 10 వ తేదీ, సోమనాథ దేవాలయం పునర్నిర్మాణం ప్రారంభమయింది. దేశంలోని కొంతమంది నాయకులు, దేవాలయ శిథిలాలను మ్యూజియంలో భద్రపరచాలని, ఆ శిథిలాలను భద్రపరచే బాధ్యత పురావస్తుశాఖకు అప్పగించాలనీ సూచించారు. ప్రజల పట్టుదలతో, ప్రభుత్వ సహకారంతో, దేవాలయ పునర్నిర్మాణం పూర్తి అయింది. 1951 మే 11 వ తేదీ మనదేశ ప్రథమ రాష్ట్రపతి, డా|| రాజేంద్రప్రసాద్ కరకమలాలతో నూతన సోమనాథ దేవాలయంలోని శివలింగానికి శాస్తోక్షంగా ప్రాణ ప్రతిష్ట జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల విధ్వంసానికి గురైన సోమనాథ దేవాలయ ప్రాచీన వైభవపునరుద్ధరణ జరిగింది.

    పురాణ ప్రాశస్త్యం : సోమనాథ క్షేత్రానికి పూర్వం ప్రభాసక్షేత్రం అనే పేరు ఉండేది. భాస్కరతీర్థం, అర్కతీర్థం, అనే పేర్లు కూడా ప్రాచీనకాలంలో, ఈ క్షేత్రానికి వుండేవి. సోమనాథ ప్రాశస్త్యాన్ని, మత్స్య, వామన, గరుడ, శివ, తదితర పురాణాలలో కొనియాడారు.

    పూర్వం దక్షప్రజాపతి, తన 27 గురు కుమార్తెలును చంద్రుడికిచ్చి వివాహం చేశాడట. ఆ కుమార్తెలు పేర్లు 27 నక్షత్రాల పేర్లు. వారిలో చంద్రుడికి రోహిణిపట్ల చాలా ప్రేమ వుండేది. రోహిణిని ఇతర భార్యలకంటే ఎక్కువగా ప్రేమించడంవల్ల ఇతర 26 గురు, తమ తండ్రి దక్షప్రజాపతికి, తమ కష్టాలను వివరించుకున్నారు. ఆపై దక్షప్రజాపతి, చంద్రుడిని మందలించి, అందరి భార్యలను సమానంగా చూసుకోమని సూచించాడు. కానీ చంద్రుడు ఆ హితువులను పాటించక, రోహిణిని అత్యంత ప్రేమ తో చూసుకుంటూ, ఇతర భార్యలకు దూరంగా వున్నాడు. ఈ పరిస్థితిని దక్షునికి తన 26 గురు కుమార్తెలు విన్నవించుకోగా, ఆయన ఆగ్రహంతో చంద్రుని నీవు కుష్టువ్యాధితో బాధపడుదువుగాక! అని శపించాడు. శాపగ్రస్తుడైన చంద్రుడి కాంతి క్షీణించి,

    Enjoying the preview?
    Page 1 of 1