Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Sri Lalithdevi Visesha Pooja Kalpam
Sri Lalithdevi Visesha Pooja Kalpam
Sri Lalithdevi Visesha Pooja Kalpam
Ebook299 pages1 hour

Sri Lalithdevi Visesha Pooja Kalpam

Rating: 4.5 out of 5 stars

4.5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100961
Sri Lalithdevi Visesha Pooja Kalpam

Read more from Sree Chakra Publishers

Related to Sri Lalithdevi Visesha Pooja Kalpam

Related ebooks

Reviews for Sri Lalithdevi Visesha Pooja Kalpam

Rating: 4.5 out of 5 stars
4.5/5

2 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Sri Lalithdevi Visesha Pooja Kalpam - Sree Chakra Publishers

    http://www.pustaka.co.in

    శ్రీ లలితాదేవి విశేష పూజా కల్పం

    Sri Lalithdevi Visesha Pooja Kalpam

    Author:

    శ్రీ చక్ర ప్రచురణకర్తలు

    Sree Chakra Publishers

    For more books

    http://www.pustaka.co.in/home/author//sree-chakra-publishers-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    విషయాలు

    1. శ్రీ లలితాదేవి చరిత్ర

    2. శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి

    3. శ్రీ లలితా త్రిశతీ నామావళి

    4. శ్రీ లలితా త్రిశతీ స్తోత్రం

    5. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావం

    6. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

    7. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం

    8. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవం

    9. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ ఫలమ్

    10. శ్రీ లలితా పంచదశీ స్తోత్రం

    జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత |

    శ్రీ లలితాదేవి విశేష పూజా కల్పం

    చతుషష్టి (64) ఉపచార - శ్రీ సూక్త పూజా విధానం

    శ్రీ లలితా సహస్రనామావళి - స్తోత్రము

    (ఖడ్గమాలా, త్రిశతి, అష్టోత్తరశతనామది స్తోత్రాలు, శ్రీ మణిద్వీప వర్ణన)

    సంకలనం

    రామకృష్ణ శర్మ

    శ్రీ చక, 'ఇ' పబ్లిషర్స్

    శ్రీ లలితాత్రిపురసుందరీదేవి నిత్యపూజు

    సహస్రనామాది స్తోత్ర పారాయణ విధి

    1. అమ్మవారి భక్తులు ప్రతిరోజు శ్రీలలితాదేవిని తమ ఇంటిలో స్వయంగా పూజించుకోవచ్చు.

    2. ఎటువంటి వర్ణ విచక్షణ లేకుండా స్త్రీలు, పురుషులు దేవీ పూజ చేయవచ్చు.

    3. ఈ గ్రంథంలో తెలిపిన 64 ఉపచారాల పూజ చేసుకోలేకపోతే షోడశోపచార పూజనైనా చేసుకోవచ్చు ఫలితం ఒక్కటే.

    4. షోడశోపచార పూజని శ్రీ సూక్త విధానంగా ఇచ్చాము. శ్రీ సూక్తం పఠించలేనివారు ఆ సూక్తం క్రింద ఇచ్చిన శ్లోకాలను పఠించి కూడా పూజచేసుకోవచ్చు.

    5. పూజానంతరం తమ తమ శక్త్యానుసారం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి, బంధుమిత్రులకి, భక్తులకి పంచితే శుభం కలుగుతుంది.

    6. శ్రీలలితాదేవికి పులిహోర, పెరుగన్నం, బెల్లంతో వండిన పరమాన్నం ప్రీతికరమైనవి.

    7. ముందుగా నిత్యపూజచేసి పూజానంతరం శ్రీలలితాసహస్రనామ స్తోత్ర పారాయణ పూర్వభాగ ఉత్తరభాగ సహితంగా చేస్తే మంచిది.

    8. పూజచేసే అవకాశం లేనివారు. ఈ గ్రంథంలో తెలిపిన లలితాసహస్రనామాలు, అష్టోత్తర శతనామాదిస్తోత్రాలు వీటిలో ఏవైనా అభీష్టానుసారం చదువుకోవచ్చు.

    9. స్తోత్రాలను గనుక మీరు పారాయణగా చేయదలుచుకుంటే, శ్రీ లలితాదేవి స్తోత్రాలతో ఏ స్తోత్రాన్నైనా ప్రతిరోజు కనీసం మూడుసార్లు చొప్పున 3,5,7,11,21,40 రోజుల పాటు దీక్షగా చేస్తే మంచిది.

    10. శ్రీ లలితాదేవి పూజను స్తోత్ర పారాయణ ప్రతిరోజు చేస్తే మంచిది. అలా అవకాశం లేనివారు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారాలు, మూలానక్షత్రం వున్నరోజు, అష్టమి, నవమి, దశమి, పౌర్ణమి వంటి తిథులలో చేస్తే శ్రీలలితాదేవి అనుగ్రహం సత్వరమే లభిస్తుంది.

    శ్రీ మాత్రేనమః

    నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం |

    శ్రీ సిద్ధేశ్వరానంద పర్యంతాం వందే గురు పరంపరాం ||

    శ్రీలలితాదేవి పేరుకి తగ్గట్టే ఎంతో లలితమైనది. తననికొలిచిన వారికి, తలచినవారికి, కొండంత అండగా వుండే చల్లని తల్లి. అందుకే వాడ వాడలా ఎంతోమంది మహిళామణులు లలితాదేవిని ఆరాధిస్తున్నారు. అంతేనా శ్రీ లలితా సహస్రనామ పారాయణ మండళ్ళుగా ఏర్పడి ఆ తల్లి దివ్య నామస్తోత్రాన్ని గానం చేస్తూ తరిస్తున్నారు.

    శ్రీలలితాత్రిపుర సుందరీదేవి షోడశోపచార పూజావిధానం శ్రీసూక్త సంపుటితో చేయటం చాలామందికి తెలుసు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి రచనగా ప్రసిద్ధి పొందిన చతుషష్టి ఉపచార (64) పూజాకల్పం కూడా ఎంతో ప్రాచీనమైనది. అందుకే ఆ విశిష్ట పూజావిధానాన్ని నేటితరం వారికి కూడా అందించాలని మా సంకల్పం. ఈ గ్రంథంలో శంకరాచార్య కృత విశేషపూజా కల్పంతో పాటు, శ్రీ సూక్త సంపుటితో చేసే శ్రీ లలితా షోడశోపచార పూజావిధానాన్ని, బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని, నామావళిని పూర్వభాగ ఉత్తరభాగ సహితంగా అందిస్తున్నాము. వీటితో పాటు శ్రీలలితా అష్టోత్తర శతనామ స్తోత్రం, లలితాత్రిశతీ, లలితా పంచదశీ స్తోత్రాలను శ్రీలలితాదేవి నిజనివాసమైన శ్రీమణిద్వీప వర్ణనని (సంక్షిప్తంగా), అందిస్తున్నాం.

    శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావం, ఆ దివ్యస్తోత్రం పారాయణ చేయటం వల్ల లభించే శుభఫలితాలు వంటి విశేషాలని కూడా సవివరంగా, యధామూలం తెలియజేస్తున్నాం. తద్వారా అసలు మనం పారాయణ చేసే స్తోత్రం యొక్క గొప్పదనం తెలిసి మరింతగా ఆ స్తోత్రం మీద భక్తి పెరుగుతుంది. మా ఈ ప్రయత్నం ఆస్తికజనులందరి ఆదరాభిమానాలు పొందుతుందని ఆశిస్తూ శ్రీ లలితాదేవి దివ్యానుగ్రహం అందరికీ లభించాలని కోరుకుంటూ...

    మీ..

    రామకృష్ణ శర్మ

    1. శ్రీ లలితాదేవి చరిత్ర

    మన భారతదేశంలో శ్రీలలితాదేవి ఆరాధన ఎంతోకాలం నుంచి కొనసాగుతుంది. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి ప్రభావంతో దేశమంతా శ్రీలలితాదేవి ఆరాధన, శ్రీలలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో శ్రీ లలితాదేవి ఆరాధకుల సంఖ్య చాలా ఎక్కువ. శ్రీ లలితాదేవి చరిత్ర బ్రహ్మాండపురాణంలో సవివరంగా చెప్పబడింది. ఆ దివ్యచరిత్రని సంక్షిప్తంగా తెలుసుకుందాం.

    పూర్వం భండాసురుడనే రాక్షసుడు వుండేవాడు. భండాసురుడు కేవలం రాక్షసుడేకాదు తనకు అవసరమైన రాక్షసుల్ని సృష్టిచేయగలిగిన గొప్ప సామర్ధ్యం కూడా అతడికుంది. ఒకనాడు తన రాక్షస జాతిని దేవతల బారినుంచి రక్షించటానికి తనకుడి భుజం నుంచి విశుక్రుడనే అసురుణ్ణి ఎడమభుజంనుంచి విషంగుడనే అసురుణ్ణి వారితో పాటు ధూమిని అనే రాక్షస స్త్రీని కూడా సృష్టించాడు. అలా భండాసురుడి సంకల్పంతో ఆవిర్భవించిన విశుక్రవిషంగులు కూడా బలంలో, సాహసంలో, తెలివితేటల్లో భండాసురుడంతటివాళ్ళే కొన్నాళ్ళకి తనకి ఎదురనేది లేకుండా చేసుకోవాలని భావించిన భండాసురుడు దేవతలందరినీ తరిమికొట్టమని విశుక్ర-విషంగుల్ని ఆజ్ఞాపించాడు. అంతే వెంటనే వారిద్దరూ లోకాలన్నిటినీ స్వాధీనం చేసుకోవటం ప్రారంభించారు. ఆ క్రమంలో ఈ బ్రహ్మాండాన్నే పగలగొట్టారు. వీరి ధాటికి త్రిమూర్తులు సైతం తలవంచి పారిపోక తప్పలేదు. ఇక మిగిలిన దేవతల సంగతి చెప్పేదేముంది. అందరూ చెట్టుకి పుట్టకి చెల్లాచెదురయ్యారు. అలా భండాసురుడు తన అజేయమైన శక్తితో దేవజాతిని మొత్తం ఓడించి పద్నాలుగులోకాల్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.

    భండాసురుడిని ఓడించి ఎలాగైనా తమ స్థానాన్ని పొందాలని భావించిన దేవతలంతా నారదుడి ఉపదేశంవిని ఇంద్రుడుతో కలసి ఆదిపరాశక్తిని ప్రార్ధించటానికి గంగాతీరానికి వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు కఠోరంగా దేవిని ప్రార్థించారు. అయినా ఫలితం లభించలేదు చివరికి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఒక మహాయాగాన్ని

    ప్రారంభించి అందులో సమిధలుగా తమ శరీర భాగాల్ని వ్రేల్చటం ప్రారంభించారు. అంతటి ఆఘోరదృశ్యాన్ని చూసి చలించిపోయిన జగన్మాత వెంటనే ఆయాగం నుండి ఆవిర్భవించింది.

    పాత్రుర్భవ పరమం తేజం పుంజమనూపమం |

    కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలమ్ ||

    ఆ దేవి ఎలావుందంటే కోటి సూర్యులకాంతితో, ప్రకాశిస్తూ కోటి చంద్రుల వెలుగుతో విరాజిల్లుతోంది. గొప్ప దివ్య తేజస్సుతో వెలిగిపోతోంది. లోకాల్ని మోహింపచేసే జగదేకసౌందర్యంతో సమస్త ఆభరణాలు ధరించి తన నాలుగుచేతులతో పాశం అంకుశం, చాపం పంచబాణాలు ధరించి దేవతలందరికీ దర్శనమిచ్చింది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన దేవతలందరూ ఆనందోత్సోహాలతో, భక్తి ప్రపత్తులతో....

    జయ దేవి జగన్మాత జయ దేవి పరాత్పరే |

    జయ కళ్యాణ నిలయే జయ కామకళాత్మికే ||

    జయ శ్రీకంఠ దయితే జయ శ్రీలలితాంబికే |

    జయ శ్రీ విజయేదేవి విజయశ్రీ సమృద్ధిదే||

    అని స్తోత్రాలు చేసారు. ఆ తరువాత భండాసురుడి వల్ల తాముపడ్డ బాధల్ని తల్లిముందు ఏకరువు పెట్టారు. దేవతలు చెప్పిన విషయాలన్ని విన్న లలితాదేవి తానే స్వయంగా భండాసురుణ్ణి సంహరిస్తానని అందరికీ అభయం ఇచ్చి, ఇచ్చినమాట ప్రకారం భండాసురుణ్ణి అతడి సైన్యాన్ని సంహరించి దేవతలకి లోకాలన్నిటికీ ఆనందాన్ని చేకూర్చింది.

    లలితాదేవి అంటే ఎవరోకాదు సాక్షాత్తు ఆదిపరాశక్తి, రాజరాజేశ్వరి, శ్రీచక్ర అధిష్టాన దేవత, చింతామణి గృహనివాసిని. ఆదేవిని ఆరాధించినవారు ఆదేవి స్తోత్రాల్ని పఠించినవారు ఐహికాముష్మిక ఫలాలను పొందుతారనటంలో ఎలాంటి సందేహం లేదు.

    మణిద్వీప నివాసిని

    శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి

    జగద్గురు ఆదిశంకరాచార్య విరచిక

    2. శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి

    చతుషష్టి (64) ఉపచార పూజావిధానం

    పురాణపద్ధతి

    చతుషష్టి ఉపచారాలు అంటే 64 ఉపచారములు అని అర్థం. అవి : 1.ధ్యానం, 2.దివ్యమందిరం, 3.రత్నమంటపం, 4. ఆందోళికం, 5. ఆవాహనం, 6. సింహాసనం, 7.వితానం, 8.పాద్యం, 9.అర్ఘ్యం, 10. ఆచమనం, 11. మధుపర్కం, 12. అభ్యంగనం, 13. ఉద్వర్తనం, 14. పంచామృత స్నానం, 15. శుదోదక స్నానం, 16.వస్త్రం, 17.ఉత్తరీయం, 18.దివ్యపాదుకం, 19.కేశపాశ బంధనం, 20.సౌవీరాంజనం, 21. ఆభరణం, 22.శ్రీగంధం, 23. అక్షతలు, 24.హరిద్రాచూర్ణం, 25.కుంకుమ విలేపనం, 26.సుగంధ ద్రవ్యం, 27. సిందూరం, 28.పుష్పం, 29. ధూపం, 30.దీపం, 31.కుంభార్తిక్యం, 32. నైవేద్యం, 33.హస్త ప్రక్షాళనం, 34.పానీయం, 35.ఫలం, 36.తాంబూలం, 37.సువర్ణపుష్ప దక్షిణ, 38. ఛత్రం, 39. చామరం, 40.దర్పణం, 41. నీరాజనం, 42.దివ్యమంత్ర పుష్పం, 43. ప్రదక్షిణం, 44. నమస్కారం, 45.తురంగ వాహనం, 46. గజవాహనం, 47. దివ్యరథం, 48. చతురంగ సైన్యం, 49.దుర్గం, 50.వ్యజనం, 51. ధృక్పానపాత్ర నటనం, 52.నాట్యం, 53.మృదంగ వాద్యం , 54. గంధర్వ కన్యాగానం, 55.వివిధవాద్య శ్రవణం, 56.క్షమాపణం, 57. భక్త గృహ నివాసనం, 58.సువర్ణ పర్యంకోపవేశనం, 59. లాక్షారంజనం, 60. గండూష జలపాత్రం, 61. సుఖశయనం, 62. ప్రార్ధనం, 63.హృదయ నిత్యనివాసం, 64. పూజాఫలం. ఈ 64 రకాల ఉపచారాలని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు లోకానికి అందించారు. అత్యంత విశిష్టమైన ఈ ఉపచారాలతో శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిని అర్చించి ఆ దేవి దివ్యానుహాన్ని అందరం పొందుదాం.

    పూజాకల్పం -

    పూజా సామగ్రి శ్రీ లలితా త్రిపుర సుందరీ చతుషష్టి ఉపచార పూజకు ఈ తెలిపిన సామాగ్రిని ముందుగా సిద్ధం చేసుకోవాలి. 'రాగి గ్లాసు, మంచినీరు, రాగి ఉద్దరిణె, రాగిపళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, యథాశక్తిగా పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార), గోక్షీరము, నైవేద్యమునకు పటికబెల్లం, కిసిమిస్ లేక ద్రాక్ష, అరటిపండ్లు, బెల్లంతో చేసిన పాయసం, యధాశక్తి గారెలు వంటి వండిన పదార్ధములతో మహానైవేద్యము. దీపము, ధూపము, హారతి, కర్పూరము వగైరా....

    తూర్పు ముఖముగా గాని, ఉత్తరముఖముగా దర్భాసనం లేదా చిత్రాసనం మీద గాని కూర్చొని దైవారాధన చేయాలి. మనకు ఎదురు ముఖముగా ఆరాధ్యమూర్తి విగ్రహంగాని, చిత్రపటంగాని ఉండాలి. శిరస్స్నానము చేసి

    Enjoying the preview?
    Page 1 of 1