Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

Mooka Panchasati
Mooka Panchasati
Mooka Panchasati
Ebook333 pages14 hours

Mooka Panchasati

Rating: 5 out of 5 stars

5/5

()

Read preview

About this ebook

Sree Chakra Publishers had published many spiritual, puranam and stotram books in Telugu.
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580306100907
Mooka Panchasati

Read more from Sree Chakra Publishers

Related to Mooka Panchasati

Related ebooks

Reviews for Mooka Panchasati

Rating: 5 out of 5 stars
5/5

2 ratings1 review

What did you think?

Tap to rate

Review must be at least 10 words

  • Rating: 5 out of 5 stars
    5/5
    Each and every sloka is explained very clearly. Great book.

Book preview

Mooka Panchasati - Sree Chakra Publishers

http://www.pustaka.co.in

మూకపంచశతీ

Mooka Panchasati

Author:

శ్రీ చక్ర ప్రచురణకర్తలు

Sree Chakra Publishers

For more books

http://www.pustaka.co.in/home/author/jayanthi-chakravarthi-novels

Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.
All other copyright © by Author.

All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

మూకపంచశతీ

ఆర్య, పాదారవింద, స్తుతి, కటాక్ష, మందస్మిత శతకాలు

మూకపంచశతీ

ఆర్య, పాదారవింద, స్తుతి, కటాక్ష, మందస్మిత శతకాలు
సంస్కృత మూలం
మూక శంకరాచార్య

జిల్లెళ్ళమూడి అమ్మ

మాతృశ్రీ అనసూయాదేవి ఆశీస్సులతో...

భావం: డాక్టర్ జయంతి చక్రవర్తి

గంగణపతయే నమః

ఉపోద్ఘాతం

శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం |

నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ||

నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం |

అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్ ||

అద్వైతమత సిద్ధాంతాన్ని భారతదేశమంతా సంచరించి విశేషంగా వ్యాప్తి చేసిన అపరశంకరులు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. తన అద్వైతమత ప్రచారంలో భాగంగా రాబోయే తరాలవారి కోసం దేశం నలుమూలలా నాలుగు పీఠాలని స్థాపించారు. అవే చతురామ్నాయ పీఠాలు. ఈ చతురామ్నాయ పీఠాలతో పాటు ఆదిశంకరులు తమ దిగ్విజయ యాత్ర ముగించిన తరువాత తమిళనాడులోని సుప్రసిద్ధ క్షేత్రం కాంచీపురంలో శంకరపీఠాన్ని స్థాపించారు. అదే నేడు కంచికామకోటి మఠంగా విశ్వవిఖ్యాతి చెందింది.

జగద్గురు ఆదిశంకరాచార్యుల తరువాత ఈ పీఠాన్ని అధిరోహించినవారు శ్రీ సురేశ్వర సరస్వతీ స్వామి. వారి తరువాత ఎందరో పీఠాధిపతులుగా కంచికామకోటి మఠాధిపత్యాన్ని వహించి ధర్మసంరక్షణ కోసం పాటుపడ్డారు. వారిలో జగద్గురు శ్రీ కృపాశంకరాచార్యులు, శ్రీ మూకశంకరాచార్యులు, శ్రీ అభినవశంకరాచార్యులు, శ్రీ విద్యాశంకరాచార్యులు, శ్రీ పరశివేంద్ర సరస్వతీస్వామి, ఈతరంలో మహాస్వామిగా నడిచే దేవుడుగా పేరు పొందిన పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు ఎంతో ప్రసిద్ధి పొందారు.

కంచి కామకోటి పీఠ పరంపరలో 20వ పీఠాధిపతిగా వున్నవారు శ్రీ ముకశంకరేంద్ర సరస్వతీ స్వామి. వీరినే మూకశంరులు అని కూడా అంటారు. క్రీ||శ|| 398 నుంచి 437 వరకూ వీరు పీఠాధిపత్యాన్ని నిర్వహించారని చెబుతారు.

మూకశంకరుల తండ్రిగారి పేరు శ్రీ విద్యాపతి. ఆయన ఆ కాలంలో ప్రసిద్ధి చెందిన జ్యోతిష్యులు. మూకశంకరులు పుట్టటమే మూగ-చెవుడుతో పుట్టారు. అయితే అమ్మవారి కటాక్షంతో ఆయనకున్న మూగ-చెవిటి అవలక్షణాలు ఆశ్చర్యకరంగా తొలగిపోయాయి.

ఒకనాడు మూకశంకరులవారు కామాక్షీదేవి ఆలయానికి వచ్చారు. అదే సమయంలో మరొక అమ్మవారి భక్తుడు కూడా ఆయనతోపాటే ఆలయంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి అమ్మవారి ముందు ధ్యానం చేయసాగారు. కొంతసేపటికి కామాక్షీదేవి ఆ సాధకుల్ని అనుగ్రహించాలని ఒక సాధారణ స్త్రీగా రూపం ధరించి వీరి దగ్గరికి వచ్చింది. పండు ముత్తైదువులా వున్న ఆ స్త్రీని వారిద్దరూ ధ్యానం నుంచి లేచాక చూసారు. అంతలో ఆమె తన నోటిలో వున్న తాంబూలం ముద్దని కొంచెం చేత్తో తీసి మూకశంకరుల పక్కనున్న సాధకుడికి ఇచ్చింది. ఆ సాధకుడు ఆమె ఇచ్చినది ఎంగిలిగా భావించాడు. ఆమె సాక్షాత్తు అమ్మవారని తెలుసుకోలేక దేవి ఇచ్చిన ప్రసాదాన్ని తిరస్కరించాడు. వెంటనే ఆ ముత్తైదువ తాంబూలాన్ని మూకశంకరులకిచ్చింది. అది మహాప్రసాదంగా భావించిన ఆయన దాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు. అంతే! తక్షణమే ఆయనకి కామాక్షీదేవి అనుగ్రహంతో మాట వచ్చింది. చెవుడూ పోయింది. హృదయంలోంచి కవితాధార పెల్లుబికింది. తనకింత కటాక్షాన్ని ప్రసాదించిన కామాక్షీదేవిని చూస్తూ, ఆశువుగా ఐదువందల శ్లోకాలు పఠించారు. వీటినే మూకపంచశతి అంటారు.

ఆనాటి నుంచి మూకశంకరులు 'మూక కవి'గా విఖ్యాతి చెందారు. అలా తనని స్తుతించిన మూకశంకరుల భక్తి తత్పరతకి చలించిపోయిన కామాక్షీదేవి ఆయనకి ప్రత్యక్షమై వరం కోరుకోమంది. అప్పుడు మూకశంకరులు అమ్మా! నీ అనుగ్రహంతో నోరులేని వాడిని ఈనాడు నీ దివ్యరూపాన్ని దర్శించి నీ స్తోత్రం చేయగలిగాను. నీ దివ్యమంగళ రూపాన్ని వర్ణించిన ఈ నోటితో నేను ఇంకేమీ మాట్లాడలేనమ్మా! అందుకని నన్ను మళ్ళీ మూగవాడిగానే చేయి అని కోరుకున్నారు. ఆయన కోరిన ప్రకారం కామాక్షీదేవి తిరిగి ఆయన్ని మూగవాడిగా మార్చివేసిందంటారు.

కంచి కామాక్షీదేవిని దర్శించి, భావావేశంతో మూకశంకరుల వారు చెప్పిన మూకపంచశతీ కావ్యంలో మొత్తం ఐదు శతకాలున్నాయి. వీటిలో అమ్మవారి దివ్యవైభవాన్ని వర్ణిస్తూ నూటొక్క శ్లోకాలు, అమ్మవారి పాదాల సౌందర్యాన్ని వర్ణిస్తూ నూటమూడు శ్లోకాలు, కామాక్షీదేవి లీలల్ని స్తుతిస్తూ నూటరెండు శ్లోకాలు, దేవి కటాక్షాలని వర్ణిస్తూ నూటొక్క శ్లోకాలు, కామాక్షీ అమ్మవారి చిరునవ్వుని వర్ణిస్తూ నూటొక్క శ్లోకాలు రచించారు. వీటినే వరుసగా, 1. ఆర్యాశతకం, 2., 3.స్తుతి శతకం, 4.కటాక్ష శతకం, 5.మందస్మిత శతకం అంటారు.

కంచి కామాక్షీదేవికి సంబంధించిన స్తుతులలో మూకపంచశతీ ఎంతో గొప్ప స్తుతికావ్యంగా లోకంలో ప్రసిద్ది చెందింది. ఎంతో భక్తి తత్పరతతో మూకశంకరులు రచించిన ఈ శతకంలో ఐహికాముష్మిక ఫలాలను అందించే మహిమాన్వితమైన శ్లోకాలున్నాయి. సాక్షాత్తు అమ్మవారే మూకశంకరుల చేత ఈ దివ్యస్తుతుల్ని పలికించటంతో ఇందులోని శ్లోకాలు మంత్రాల్లా పనిచేస్తాయని భక్తుల విశ్వాసం.

మూకపంచశతీ స్తోత్రం మీద పూర్వం దోర్బల విశ్వనాథ శాస్త్రి గారు 'శ్రీ మూకపంచశతీ సారోల్లాసినీ వ్యాఖ్యా' అనే పేరుతో అద్భుతమైన వ్యాఖ్యానాన్ని ప్రతిపదార్థ భావసహితంగా అందించారు. సంస్కృతాంధ్ర భాషలో మహాపండితులైన విశ్వనాథశర్మ గారి గ్రంథాన్ని సాధన గ్రంథమండలి వారు లోకానికి అందించారు. వారిద్దరికీ శతాధిక నమస్సులు.

ఈ గ్రంథంలోని భావాలకి మూలం మహాపండితులు శ్రీ దోర్బల విశ్వనాథశాస్త్రి గారి మూకపంచశతీ వ్యాఖ్యాన గ్రంథమే. అందులో వారు చెప్పిన భావాలని నేటితరం పాఠకులకి అర్ధమయ్యేలా వీలైనంత సరళమైన భాషలోకి మార్చి తిరిగి మీకు అందిస్తున్నాం. ఎంతో జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని రూపొందించినప్పటికీ ఎక్కడైనా ముద్రణా దోషాలు దొర్లివుండవచ్చు. సహృదయులైన పాఠకులు మన్నించి తెలియజేస్తే వాటిని మలిముద్రణలో సవరించుకుంటామని సవినయంగా మనవి చేసుకుంటూ, ఎంతో మహిమాన్వితమైన ఈ మూకపంచశతిలోని శ్లోకాలను పఠించి శ్రీ కామాక్షీదేవి దివ్యానుగ్రహం పొందవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను.

మూకపంచశతీ అనే ఈ దివ్యగ్రంథాన్ని నేటితరం వారికి అందిస్తున్న 'గొల్లపూడి వీరాస్వామి సన్ పబ్లికేషన్' వారు సర్వదా అభినందనీయులు. ఆర్షధర్మాన్ని ప్రచారం చేసే ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలని సామాన్య ప్రజల దగ్గరకి చేరువగా తీసుకువెళ్తున్న ఘనత వీరిదే. శ్రీ కామాక్షీదేవి అనుగ్రహం వీరిపై సదా వర్షించాలని అమ్మవారిని

ప్రార్థిస్తూ....

నమస్కారాలతో

బుధజనవిధేయుడు

డా॥ జయంతి చక్రవర్తి

విషయసూచిక |

మూకపంచశతీ

1. ఆర్యా శతకం

కారణపరచిద్రూపా

కాంచీపురసీమ్ని కామపీఠగతా

కాచన విహరతి కరుణా

కాశ్మీర స్తబకకోమలాంగలతా.1

కుంకుమపూల గుత్తిలాగా కోమలమైన తీగలాంటి శరీరం కలిగినది, కారణపరచైతన్యస్వరూపిణిగా కామపీఠాన్ని ఆశ్రయించినదీ అయిన ఒకానొక దయారూపిణి కాంచీపురంలో విహరిస్తున్నది.

కంచన కాంచీతిలకం

కరధృతకోదండ బాణసృణిపాశం

కఠినస్తనభర నమ్రం

కైవల్యానందకందమవలంబే.2

ధనస్సుని, బాణాన్ని, అంకుశాన్ని, పాశాన్ని తన బాహువులలో ధరించినది,కఠినమైన స్తనముల బరువుతో కొంచెము వంగినది, కైవల్యం అనే ఆనందానికి కారణభూతమైనది అయిన ఒకానొక కాంచీనగతిలకంగా భాసించే వస్తువుని (శ్రీకామాక్షీదేవిని) ఆశ్రయిస్తాను.

చింతితఫలపరిపోషణ

చింతామణిరేవ కాంచినిలయామే

చిరతర సుచరితసులభా చిత్తం

శిశిరయతు చిత్సుధాధారా.3

కాంచీపురంలో నివసించే కామాక్షీదేవి భక్తులు చింతించిన (ఆలోచించిన) ఫలాలని చక్కగా పరిపోషించి, వారికి అందిస్తుంది. ఆవిధంగా అమ్మవారు చింతామణీ స్వరూపిణే. అలాగే చైతన్యామృత ప్రవాహరూపిణి కూడా అయిన కామాక్షీదేవి నా మనసుని చల్లగా చేయుగాక

కుటిలకచం కఠినకుచం ,

కుందస్మితకాంతి కుంకుమచ్చాయం

కురుతే విహృతిం కాంచ్యాం

కులపర్వతసార్వభౌమసర్వస్వం.4

మనోహరమైన ఆ కాంచీపురంలో అందంగా వంకరలు తిరిగిన ముంగురులతో, గట్టిగా ఉన్నతంగా వున్న స్తనాలతో, మల్లెపూవులాంటి స్వచ్ఛమైన తెల్లని చిరునవ్వుతో, కుంకుమపూవులాంటి ఎర్రని శరీరంతో, కులపర్వతంగా ప్రసిద్ధి పొందిన హిమాలయపర్వతరాజు సర్వస్వం (కుమార్తె) అయిన కామాక్షీదేవి సంచరిస్తోంది.

పంచశరశాస్త్ర బోధన

పరమాచార్యేణ దృష్టిపాతేన

కాంచీసీమ్ని కుమారీ

కాచన మోహయతి కామజేతారమ్. 5

ఆ కాంచీపుర సీమలో, కామశాస్త్రాన్ని చక్కగా బోధించటంలో ఆచార్యస్థానాన్ని వహించినదైన ఒకానొక కుమారి, (కామాక్షీదేవి) తన దృష్టిపాతంతో (చూపుల ప్రవాహంతో) కాముడిని (మన్మథుడిని) జయించిన పరమేశ్వరుణ్ణి సైతం మోహింపచేస్తోంది.

పరయా కాంచీపురయా

పర్వతపర్యాయ పీనకుచభరయా

పరతంత్రా వయమనయా

పంకజసబ్రహ్మచారిలోచనయా.6

సుందరమైన కాంచీనగరాన్ని తన స్థిరనివాసంగా చేసుకున్నది, పర్వతాలకు మారుపేరుగా వున్న కఠినమైన స్తనాల బరువుకలిగినదీ, కమలాలవంటి అందమైన కళ్ళతో ప్రకాశించేదీ, అయిన కామాక్షీ దేవికి మేము దాసులమై వున్నాము.

ఐశ్వర్యమిందుమౌళే

రైకాత్మ్య ప్రకృతి కాంచిమధ్యగతం

ఐందవకిశోరశేఖర

మైదంపర్యం చ కాస్తి నిగమానామ్.7

చంద్రరేఖని తలమీద ధరించిన చంద్రశేఖరుడికి ఐశ్వర్యంలాంటిది శ్రీకామాక్షీదేవి. ఆమెకూడా శివుడిలాగా చంద్రరేఖని శిరస్సు మీద ధరించింది. జీవుడు, ఈశ్వరుడు వీరిద్దరి ఐక్యానికి జ్ఞానహేతువుగా, వేదాలయొక్క తాత్పర్యంగా వెలుగొందే ఆదేవి కాంచీనగరం మధ్యలో ప్రకాశిస్తోంది.

శ్రితకంపాసీమానం

శిథిలిత పరమశివధైర్య

మహిమానం కలయే పాటలిమానం

కంచన కంచుకిత భువనభూమానమ్.

సాక్షాత్తు పరమేశ్వరుడి ధైర్యాన్ని, మహిమని, శిధిలంచేసినది (తగ్గించినదీ), విశాలమైన భువనాలని (లోకాలని) తన కంచుకంగా (వస్త్రంగా) చేసుకొని ధరించినదీ, కంపానదీ తీరభూమి అయిన కాంచీనగరాన్ని ఆశ్రయించినదీ, అయిన ఒకానొక ఎరుపురంగుని (ఎర్రనిశరీరవర్ణం కలిగిన కామాక్షీదేవిని) ధ్యానిస్తాను.

ఆదృతకాంచీనిలయా

మాద్యామారూఢయౌవనాటోపాం

ఆగమవతంసకలికా

మానందాద్వైత కందళం వందే.

మొదటగా యౌవనమనే గర్వాన్ని (పర్వతాన్ని) ఎక్కినది, ఆగమాలు తమ తలలో శిరోభూషణంగా ధరించిన మొగ్గవంటిది, ఆనందాద్వైతం అనే చెట్టుకి మొలకలాగా వున్నదీ, సుందరమైన కాంచీనగరం మీద ఆదరంకలిగినదీ అయిన కామాక్షీదేవికి నమస్కరిస్తున్నాను.

తుంగాభిరామ కుచభర

శృంగారితమాశ్రయామి

కాంచిగతం గంగాధరపరతంత్రం

శృంగారాద్వైతతంత్ర సిద్ధాంతమ్. 10

ఎత్తైన అందమైన బరువైన స్తనాలని చక్కగా అలంకరించుకుని, పరమేశ్వరుడికి విధేయురాలిగా కాంచీనగరంలో నివసిస్తున్న శృంగారాద్వైత తంత్ర సిద్ధాంత రూపిణి శ్రీకామాక్షీ దేవిని ఆశ్రయిస్తాను.

కాంచీరత్న విభూషాం

కామపి కందర్పసూతికాపాంగీం

పరమాం కళాముపాసే పరశివ

వామాంకపీఠికాసీనామ్. 11

మన్మథుడికి పుట్టినిల్లెన కటాక్షం కలిగినది, పరమ శివుడి ఎడమతొడ అనే పీఠం మీద కూర్చొనివున్నది, కాంచీనగరానికి రత్నాలంకారంలాగా విరాజిల్లేది, అయిన ఒకానొక గొప్పదైన కళని (కామాక్షీదేవిని) ఉపాసిస్తాను.

కంపాతీరచరాణాం

కరుణాకోరకితదృష్టిపాతానాం

కేళీవనం మనో మే కేషించి

ద్భవతు చిద్విలాసానామ్. 12

కరుణ అనే మొగ్గతొడిగిన చూపులు కలది, కంపానదీ తీరంలో సంచరించేది, అనిర్వచనీయమైన చిరునవ్వులు చిందించేది అయిన కామాక్షీదేవికి, నా మనసు విహరించే ఉద్యానవనం అగుగాక!

ఆమ్రతరుమూలవసతే

రాదిమపురుషస్య నయనపీయూషం

ఆరబయౌవనోత్సవ

మామ్నాయ రహస్యమంతరవలంబే. 13

మామిడి చెట్టు మూలాన్ని నివాసంగా చేసుకున్నది, ఆదిపురుషుడైన పరమేశ్వరుడి నేత్రాలకి అమృతంలాంటిది, నిండు యౌవనంతో ప్రకాశించేది. అయిన వేదరహస్యాన్ని (కామాక్షీదేవిని) నా మనసులోపల స్థిరంగా పట్టివుంచుతాను.

అధికాంచి పరమయోగి

రాదిమపరపీఠసీమ్ని దృశ్యేన

అనుబద్ధం మమ మానస

మరుణిమసర్వస్వ సంప్రదాయేన.

ఆ దివ్యకాంచీపురంలో, ఆదిపర(శివ) పీఠం మీద ఆసీనురాలై శ్రేష్ఠమైన యోగులచేత చూడబడేది, పూర్ణమైన అరుణ సంప్రదాయంతో అనగా పరిపూర్ణమైన అరుణవర్ణంతో ప్రకాశించేది అయిన కామాక్షీదేవి చేత నామనసు అనుసంధానించబడింది.

అంకిత శంకరదేహా

మంకురితో రోజకంకణాశ్లేషైః

అధికాంచి నిత్యతరుణీ

మద్రాక్షం కాంచిదద్భుతాం బాలామ్. 15

అంకురించిన స్తనాలచేత, కంకణాల కౌగిలింతల చేత గుర్తులుపడ్డ శంకరుడి శరీరం కలిగినదీ, నిత్యయౌవనంతో ప్రకాశించేది, అయిన ఒకానొక బాలను (కామాక్షీదేవిని) కాంచీనగరంలో చూశాను.

మధురధనుషా మహీధర

జనుషా నందామి సురభిబాణజుషా

చిద్వపుషా కాంచిపురే

Enjoying the preview?
Page 1 of 1