Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

ఒక మంచు కురిసిన రాత్రి
ఒక మంచు కురిసిన రాత్రి
ఒక మంచు కురిసిన రాత్రి
Ebook514 pages2 hours

ఒక మంచు కురిసిన రాత్రి

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ప్రతి కధ ఎక్కడో ఒక చోట మొదలుకావాలి. ఈ కధ సిటిలో ఒక పెద్ద సూపర్ బజార్ లో మొదలవుతుంది. ఒక అందమైన అమ్మాయి కాస్మోటిక్స్ తీసుకుని షాపు లోంచి బయటకు వచ్చింది. అంతే ఉన్నట్టుండి ఆమె తన గతం పూర్తిగా మరిచిపోతుంది. అమ్నెషియా వ్యాది సోకుతుంది. గతంమాత్రం కాకుండ తన పూర్తిపేరు కూడా మరిచిపోతుంది. హోటల్ లో అనామిక అని రాసి గది తీసుకుంటుంది.


ఆర్ధరాత్రి ఆ హోటల్ యాజమాని పోలీసుతో ఆమెను బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చెయ్యాలని చూస్తాడు. అనామిక అక్కడనుంచి తప్పించుకుని ఒక చర్చ్ లో తలదాచుకుంటుంది. ఫాదర్ సహయంతో రావు అనే పత్రిక ఎడిటర్ దగ్గరకు వెళుతుంది. ఆయన అనామిక పరిస్ధితికి జాలి పడి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. కొన్ని రోజులకు మల్హోత్ర కంపెనిలో ఉద్యోగం సంపాదిస్తుంది. అనుకోకుండ ఇంద్రజిత్ ఆనే ఇన్ వెస్టిగేటివ్ జర్నలిస్ట్ తో పరిచయం అవుతుంది. అతనితో పావురాలవెళినప్పుడు ఆమెకు అనుకోకుండ గతం గుర్తుకువస్తుంది.

LanguageTelugu
PublisherPencil
Release dateAug 10, 2021
ISBN9789354585159
ఒక మంచు కురిసిన రాత్రి

Related to ఒక మంచు కురిసిన రాత్రి

Related ebooks

Related categories

Reviews for ఒక మంచు కురిసిన రాత్రి

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    ఒక మంచు కురిసిన రాత్రి - కొండగుంట చిత్ర వెంకటేష్

    ఒక మంచు కురిసిన రాత్రి

    BY

    కొండగుంట చిత్ర వెంకటేష్


    pencil-logo

    ISBN 9789354585159

    © Kondagunta Chitra Venkatesh 2021

    Published in India 2021 by Pencil

    A brand of

    One Point Six Technologies Pvt. Ltd.

    123, Building J2, Shram Seva Premises,

    Wadala Truck Terminal, Wadala (E)

    Mumbai 400037, Maharashtra, INDIA

    E connect@thepencilapp.com

    W www.thepencilapp.com

    All rights reserved worldwide

    No part of this publication may be reproduced, stored in or introduced into a retrieval system, or transmitted, in any form, or by any means (electronic, mechanical, photocopying, recording or otherwise), without the prior written permission of the Publisher. Any person who commits an unauthorized act in relation to this publication can be liable to criminal prosecution and civil claims for damages.

    DISCLAIMER: This is a work of fiction. Names, characters, places, events and incidents are the products of the author's imagination. The opinions expressed in this book do not seek to reflect the views of the Publisher.

    Author biography

    నా పేరు కొండగుంట చిత్ర వెంకటేష్. చిత్ర వెంకటేష్ పేరుతో స్వాతిలో నాలుగు సార్లు నవల పోటిలో బహుమతులు పొందాను. మూడు సార్లు అదే ప్రతిక నిర్వహించిన అనిల్ అవార్డ్ తీసుకున్నాను. సుకధ వెబ్ పత్రికలో నా నవలలు అయిదు ప్రచురించబడ్డాయి. గోతెలుగు వెబ్ ప్రతికలో కూడా నా సీరియల్ వచ్చింది. నేను హైదరాబాదులో టాక్స్ కన్స్ ల్ టెంట్ గా ప్రాక్టిస్ చేస్తున్నాను.  ఇంతకు ముందే అనగనగ ఒక తండ్రి ప్రచురించబడి అమెజన్ లో ఉంది. 

    Contents

    భాగం --1

    భాగం --2

    భాగం --3

    భాగం --4

    భాగం--5

    భాగం--6

    భాగం --7

    భాగం --8

    భాగం--9

    భాగం--10

    భాగం--11

    భాగం--12

    భాగం--13

    భాగం--14

    భాగం--15

    భాగం--16

    భాగం--17

    భాగం--18

    భాగం--19

    భాగం--20

    భాగం--21

    భాగం--22

    భాగం--23

    భాగం--24

    భాగం--25

    భాగం--26

    భాగం--27

    భాగం--28

    భాగం--29

    భాగం--30

    భాగం--31

    భాగం--32

    భాగం--33

    భాగం--34

    భాగం--35

    భాగం--36

    భాగం--37

    భాగం--38

    భాగం--39

    భాగం--40

    భాగం--41

    భాగం--42

    భాగం--43

    భాగం--44

    భాగం--45

    భాగం--46

    భాగం--47

    భాగం--48

    భాగం--49

    భాగం--50

    భాగం--51

    భాగం --1

    నాకు ఒక రూమ్ కావాలిఅంది ఆమె.

    కౌంటర్ లో ఉన్న మేల్ రిసప్షనిస్ట్ ఆమె వైపు సాభిప్రాయంగా చూశాడు.

    సింగిల్ రూమ్ కావాలా. డబుల్ రూమ్ కావాలాఅని అడిగాడు.

    సింగిల్ రూమ్ చాలు. ఎంత ఇవ్వాలిబ్యాగ్ తెరుస్తూ అడిగింది ఆమె.

    ముందు వెయ్యిరుపాయలు అడ్వాన్స్ ఇవ్వండి. అలాగే ఈ రిజిస్టర్ లో పేరు రాసి సంతకం పెట్టండిఅని ఒక లావాటి రిజిస్టర్ ను ఆమె ముందుకు తోశాడు. ముందు వెయ్యిరుపాయలు తీసి అతని ముందు పెట్టింది. తరువాత మెల్లగా రిజిస్టర్ తన ముందుకు లాక్కుంది.

    పెన్ తీసుకుని తన పేరు రాయబోయింది. ఎంత ప్రయత్నించిన ఆమెకు తన పేరు గుర్తుకు రాలేదు. ఏం రాయాలో అర్ధంకాలేదు. రిసప్షనిస్ట్ ఆమె వైపు చూస్తున్నాడు. ఏం చెయ్యాలోతోచక అటుఇటు చూసింది. ఆమె చూపులు ఎదురుగా ఉన్న గోడ మీద పడింది. అక్కడ ఒక క్యాలండర్ ఉంది. దాని మీద అనామిక బైండింగ్ వర్క్స్ అని ఉంది.

    ఆమె కళ్ళు మిలమిల మెరిశాయి. వెంటనే తన పేరును అనామిక అని రాసింది.సంతకం చేసి రిజస్టర్ ను రిసప్షన్ ముందుకు నెట్టింది.

    రిసప్షన్ లో ఉన్న మనిషి బాయ్ ను పిలిచి ఏదో చెప్పాడు. బాయ్ ఆమె వైపు చూసి రండి మేడం"అని మెట్ల వైపు దారితీశాడు. ఆమె అనుసరించింది. బాయ్ పదిమెట్లు ఎక్కి ఎడంవైపుకు తిరిగాడు. అక్కడ ఎదురుగా ఒక గది కనిపించింది. దానిమీద 101 అని ఉంది.

    బాయ్ గదితలుపులు తెరిచి లోపలికి వెళ్ళాడు.

    ఇదే మీ గది మేడం. ఏమైనకావాలనుకుంటే బెల్ నొక్కండిఅన్నాడు బాయ్ చేతులు నులుపుకుంటు.

    వాడి ఉద్దేశం ఆమెకు అర్ధమైంది. వెంటనే బ్యాగ్ లోంచి పదిరుపాయలు తీసి వాడికి ఇచ్చింది. అది తీసుకుని వాడు సంతోషంగా వెళ్ళిపోయాడు. బాయ్ వెళ్ళపోయినవెంటనే ఆమె గది తలుపులు మూసి గడియపెట్టింది. నింపాదిగా వెళ్ళి మంచంమీద కూర్చుంది. బ్యాగ్ ను పక్కన పెట్టింది. బ్యాగ్ తో పాటు ఆమె చేతిలో ఒక క్యారిబ్యాగ్ ఉంది. అందులోంచి సామానులు తీసి మంచంమీద పెట్టింది. అవన్ని కాస్మోటిక్స్ సామానులు. అమ్మాయిలు, ఆడవాళ్ళు తమ అందాన్ని పెంపోదించుకోవటానికి ఉపయోగపడే క్రీమ్స్ లోషన్స్. చాల ఖరీదైనవి. ఒక్కోక్కోటి దాదాపు మూడువేలరుపాయలు చేస్తుంది. మాములు మద్యతరగతికి ఏ మాత్రం అందుబాటులో ఉండవు. కేవలం సూపర్ రిచ్ ఆడవాళ్ళు మాత్రమే కొనుక్కునే సౌందర్య సాధనాలు.

    అవి తన దగ్గరకు ఎలా వచ్చాయో ఆమెకు అర్ధంకావటం లేదు. గతం ఆమెకు గుర్తులేదు. గతంతో పాటు తన అసలు పేరు కూడా ఆమె మరిచిపోయింది. సరిగ్గా గంట ముందు ఆమె సూపర్ బజార్ కు వెళ్ళింది. అది కారులో వెళ్ళింది.  ఆమె దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారం కావల్సిన సామానులు కొనుక్కుంది. సామానులు తీసుకుని బిల్ పే చెయ్యటానికి కౌంటర్ దగ్గరకు వెళ్ళింది. బిల్ పే చేసి సామానులు తీసుకుని బయటకు వచ్చింది. అప్పుడే అనూహ్యమైన పరిణామం జరిగింది.

    ఆమె తన గురించి పూర్తిగా మరిచిపోయింది. తను ఎవరో ఎందుకు ఈ ఊరువచ్చిందో కూడా తెలియలేదు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం తన పేరు కూడా మరిచిపోయింది ఆమె. మైండ్ అంతా పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో ఆమెకు అర్ధంకాలేదు. బొమ్మలా అలాగే ఉండిపోయింది. రోడ్డు మీద నడుస్తున్నవాళ్ళు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొందరు ఆమె అద్భతసౌందర్యానికి మెస్మరైజ్ అవుతున్నారు. మగవాళ్ళు మాత్రం ఆమె వైపు చూడకుండ ఉండలేకపోతున్నారు.

    టైం ఎంతయిదో తెలియదు. లైట్ల వెలుగులో నగరం దేదిప్యమానంగా వెలిగిపోతుంది. రోడ్డుమీద వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. ఈ నగరం ఆమెకు చాల కొత్తగా కనిపించలేదు. ఇంతకుముందు ఈ సిటికి వచ్చిందో లేదో తెలియదు. కాని ఇప్పుడు మాత్రం మొదటిసారి చూస్తున్నట్టుగా ఉంది. ఈ నగరానికి ఎందుకు వచ్చిందో అర్ధంకావటం లేదు.

    కాని ఒక విషయం మాత్రం ఆమెకు అర్ధమైంది. తనకు అమ్నేషియా వచ్చిందని ఆమె గ్రహించింది.  అందుకే తన గతంతోపాటు పేరు కూడా మరిచిపోయింది. ఈ నగరంలో ఆమెకు తెలిసినవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. బందువులు కాని చుట్టాలు కాని ఉన్నారో లేదో కూడా తెలియదు. అలాంటప్పుడు ఈ రాత్రి ఎక్కడ తలదాచుకోవాలి. ఎవరిని ఆశ్రయించాలి.

    మాములుగానే సిటిలో ఒంటరి అమ్మాయికి రక్షణలేదు. అలాంటిది అమ్మేషియా వచ్చిన అమ్మాయి క్షేమంగా ఎలా ఉండగలదు. అందుకే ఈ రాత్రి  ఎక్కడైన తలదాచుకోవాలని భావించింది. ఏదైన హోటల్ కనిపిస్తుందా అని చుట్టు చూసింది. అదృష్టవశతు రోడ్డుకు అవతల వైపు ఒక చిన్న హోటల్ కనిపించింది. దాని మీద రాయల్ లాడ్జీ అని ఉంది.

    గతం మరిచిపోయింది కాని తన చదవుమాత్రం మరిచిపోలేదు ఆమె. ఏం చదివిందో జ్ఞాపకం రాలేదు. కాని చదవటం మాత్రం మరిచిపోలేదు. అది ఒకందుకు అదృష్టంగా భావించింది. ఇంకేం ఆలోచించకుండ మెల్లగా రోడ్డు క్రాస్ చేసి హోటల్ చేరుకుంది. ఎలోగో తంటాలు పడి రూమ్ సంపాదించుకుంది.

    ఆలోచనలకు బ్రేక్ వేసి లేచి నిల్చుంది అనామిక. ఒకసారి తనని తాను చూసుకుంది. నీలం రంగు జీన్స్ దాని మీద టీషర్ట్ టక్ చేసుకుంది. దానిమీద నల్లని జెర్కిన్స్ వేసుకుంది. మెల్లగా బాత్రూంలోకి వెళ్ళింది. అద్దంలో తనని తాను చూసుకుంది. తరువాత పైన ఉన్న జెర్కిన్స్ తీసింది. లోపల తెల్లని టీషర్ట్ ఉంది. దానిమీద కుడివైపు ఎర్రగా ఉంది.

    ఒక్కసారిగా షాక్ తో బిగుసుకుపోయింది ఆమె.

    అది రక్తం అని గ్రహించింది ఆమె. అది తన షర్ట్ మీదకు ఎలా వచ్చిందో తెలియలేదు. మెల్లగా బట్టలు మొత్తం విప్పి చూసుకుంది. ఇప్పుడు ఆమె పూర్తిగా నగ్నంగా ఉంది. శరీరంలో ఎక్కడ చిన్న గాయం లేదు. నున్నగా పోతపోసిన విగ్రహంలా ఉందామే.అలాంటప్పుడు ఈ రక్తపు మరక షర్ట్ మీదకు ఎలా వచ్చింది. ఆమెకు అంతా అయోమయంగా ఉంది. ఇంకోవైపు భయంగా కూడా ఉంది.

    కొంపదీసి తను ఎవరిని హత్యచెయ్యలేదు కదా. అందుకే దొంగతనంగా ఇక్కడికి పారిపోయివచ్చిందా. ఆలోచిస్తూ జర్కిన్స్ వైపుచూసింది. జర్కిన్స్ పై జేబులో చాల డబ్బు కనిపించింది.కంగారుగాతీసి లెక్కపెట్టింది. దాదాపు లక్షరుపాయలు ఉన్నాయి. అంత డబ్బు ఎలా వచ్చింది.

    అన్ని ప్రశ్నలే ఒక్కదానికి జవాబు లేదు.

    పదినిమిషాలలో స్నానం ముగించుకుని ఇవతలకు వచ్చింది ఆనామిక. వేసుకున్న బట్టలు తప్ప ఇంకో జత బట్టలు లేవు. తుడుచుకోవటానికి టవల్ కూడా లేదు. ఎదురుగా ఉన్న హంగర్ మీద ఒక మురికి టవల్ కనిపించింది. దాన్ని తీసుకుని తుడుచుకుంది. తరువాత బట్టలు వేసుకుంది. అప్పుడే ఆమెకు విపరీతమైన ఆకలి వేసింది. రూమ్ సర్వీస్ బెల్ నొక్కింది.

    ఏం కావాలి మేడంఅంటు వచ్చాడు బాయ్.

    మంచి భోజనం తీసుకురా అని డబ్బు తీసి ఇచ్చింది.

    పది నిమిషాలలో వస్తాను మేడంఅని డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు బాయ్.

    చెప్పినట్టుగానే పదినిమిషాల తరువాత క్యారియర్ తో వచ్చాడు బాయ్.

    వాడికి పదిరుపాయలు టిప్ ఇచింది. అది తీసుకుని ఆమెకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు అతను. తలుపులు మూసి టేబుల్ ముందు కూర్చుంది. క్యారియర్ తీసి చూసింది. అంతా వెజిటేరియన్ మీల్స్. ఆవురుఆవురు మంటు తినేసింది. అప్పుడు కాని ఆత్మారాముడు శాంతించలేదు. క్యారియర్ నీట్ గా సర్ది టీపాయ్ మీద పెట్టింది. తరువాత చేతులు కడుక్కుని వచ్చి మంచం మీద కూర్చుంది. ఒకసారి జరిగిన దంతా బేరీజు వేసుకుంది.

    ఈ రాత్రి ఎలోగో అలా గడిపేస్తే సరి. రేపుఉదయం ఏం చెయ్యాలో తీరికగా ఆలోచించవచ్చు. ఆలోచిస్తునే అలాగే మంచం మీద వాలిపోయింది. కళ్ళు ముసుకుంది. పదినిమిషాలలో అనామిక గాఢనిద్రలోకి జారుకుంది.ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు. విపరీతమైన దాహం వేసి కళ్ళు తెరిచింది. లేచి జగ్ తీసుకుని చూసింది. అందులో చుక్క నీళ్ళుకూడా లేవు. గది తలుపులు తెరిచి బయటకు నడిచింది. అంతా చీకటిగా ఉంది. మెల్లగా తడుముకుంటు మెట్ల దగ్గరకు వెళ్ళింది. అక్కడనుంచి కింద ఉన్న రిసప్షన్ కౌంటర్ స్పష్టంగా కనిపిస్తోంది.

    కౌంటర్ ముందు ఆమెకు గది ఇచ్చిన వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనికి ఎదురుగా ఎవరో ముగ్గురు వ్యక్తులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎవరో ఆమెకు తెలియలేదు. అంత రాత్రి వేళ ఎందుకు కూర్చుని ఉన్నారో అసలు తెలియదు. అప్పుడే కౌంటర్ లో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతని మాటలు ఆమెకు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

    గదిలో ఒక పిట్టమాత్రమే ఉంది సార్. ఆమె తప్ప ఇంకేవరు లేరుఅన్నాడు రిసప్షనిస్ట్.

    అవతల నుంచి మాట్లాడుతున్న వ్యక్తి ఏదో అన్నాడు. దానికి అతను చిన్నగా నవ్వి అన్నాడు.

    అలాగే ఇన్స్ పెక్టర్. మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఇది నాకు కొత్త కాదు కదా. ఇంకో అరగంటలో మేమందరం హోటల్ నుంచి వెళ్ళిపోతాం. మీరు మీ సిబ్బందితో రెయిడ్ చెయ్యటానికి రండి. బ్రోతల్ కేసులో ఆమెను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకువెళ్ళండి. తరువాత ఏం చెయ్యాలో మీకు తెలుసు. నేను చెప్పవలసిన పనిలేదుఅని నవ్వాడు రిసప్షనిస్ట్.

    ఇన్స్ పెక్టర్ ఏదో అన్నాడు.

    అలాగే ఇంకో అయిదునిమిషాలలో మేమంతా వెళ్ళిపోతాం. తరువాత మీరు రండి. ఉంటాను బైఅని రిసివర్ పెట్టేశాడు రిసప్షనిస్ట్.

     ఆ మాటలు విని ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది అనామిక. ఆమె శరీరం సన్నగా కంపించింది. రక్తం వెచ్చగా మొహంలోకి పాకింది. జరగబోయేది ఏమిటో ఆమెకు అర్ధమైంది. ఇంకో పదినిమిషాలలో రిసప్షనిస్ట్ తనవాళ్ళతో బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ ఏరియా పోలీస్ ఇన్స్ పెక్టర్ తన సిబ్బందితో ఇక్కడికి వస్తాడు. రెయిడ్ చేసే నేపంతో పైకి వస్తాడు. గదిలో ఉన్న ఆమెను చూసి బ్రోతల్ కేసుకింద బుక్ చేస్తాడు. ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్ కుతీసుకువెళతాడు. అక్కడ లకప్ లో పెడతాడు. తరువాత తన సిబ్బందిని బయటకు పంపించి ఆమె మీద అత్యాచారం చేస్తాడు. ఇది వాళ్ళ ప్లాన్.

    దాహం విషయం పూర్తిగా మరిచిపోయింది. వేగంగా తన గదిలోకి వెళ్ళింది. గబగబ తన సామానులు సర్దుకుని మెట్లదగ్గరకు వచ్చి నిలబడింది. అప్పుడే రిసప్షనిస్ట్ కౌంటర్ లోంచి లేస్తున్నాడు. కౌంటర్ డ్రాయర్ మూసి తాళంవేశాడు. తరువాత తన ఎదురుగా కూర్చుని ఉన్న వాళ్ళకు సైగ చేశాడు. వాళ్ళు కూడా ఇది తమకు అలవాటే అని క్యాజువల్ గా లేచారు. తరువాత అందరు గుంపుగా హోటల్ నుంచి వెళ్ళిపోయారు.

    వాళ్ళు వెళ్ళగానే అప్పుడు రియాక్ట్ అయింది అనామిక. వేగంగా మెట్లు దిగింది.  అటు ఇటు చూసింది. చుట్టుపక్కల ఎవరు లేరు. అంతే ఒక్కసారిగా రివ్వుమంటు హోటల్ లోంచి బయటపడింది.  సమయం అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. మెయిన్ రోడ్డు దాదాపు నిర్మానుష్యంగా ఉంది. అప్పుడప్పుడు వాహనాలు వేగంగా దూసుకుపోతున్నాయి. అంతకుమించి చడిచప్పుడు లేదు.

    లేనిశక్తిని కూడదీసుకుని పరిగెత్తుతోంది అనామిక. ఆమె గుండెలు ఆయాసంతో ఎగిరిఎగిరి పడుతున్నాయి.  ఒళ్ళంతా విపరీతంగా చెమటలు పడుతోంది. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. ఎక్కడైన కొంచం సేపు విశ్రాంతి తీసుకోవాలని ఉంది ఆమెకు. కాని ధైర్యం చాలటం లేదు. ఇన్స్ పెక్టర్ తలుచుకుంటే ఆమెకు ఎక్కడలేని భయం కలుగుతోంది.  ఏక్షణంలో వస్తాడో ఎక్కడ పట్టుకుంటాడో అని తల్లడిల్లిపోతుంది. విశ్రాంతి తీసుకోవాలని ఉన్నా ఎక్కడ ఆగలేకపోతుంది. రివ్వున తుపాకి తూటాలా దూసుకుపోతుంది.

    ఎంతసేపు పరిగెత్తిందో ఆమెకు తెలియదు.  ఈ సిటి ఆమెకు పూర్తిగా కొత్త. ఎక్కడ ఉందో తెలియటంలేదు. అతికష్టంమీద ఇంకో అయిదునిమిషాలు పరిగెత్తింది. తరువాత ఆమె కాళ్ళు ముందుకు కదలనని మొరాయించాయి. నీరసంగా నిలబడి చుట్టు చూసింది. ఆ ప్రదేశం నిర్మానుష్యంగా నిస్తేజంగా ఉంది. చుట్టుపక్కల చాల ఇళ్ళు ఉన్నాయి. కాని అవన్ని విసిరేసినట్టుగా దూరదూరంగా ఉన్నాయి.  అప్పుడే ఏదో చప్పుడు అయింది. అనామిక చప్పున పక్కకు తిరిగి చూసింది. అప్పుడే వాచ్ మెన్ చర్చ్ గేటు మూస్తున్నాడు. ఇంకేం ఆలోచించలేదు అనామిక. పరుగులాంటి నడకతో అతని దగ్గరకు వెళ్ళింది. ఉన్నట్టుండి మెరుపులా ప్రత్యేక్షమైన అనామికను చూసి అతను తెల్లబోయాడు. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఏం కావాలని ప్రశ్నార్ధకంగా చూశాడు.

    నేను చాల ప్రమాధంలో ఉన్నానుఆయాసపడుతూ అంది అనామిక. ఈ రాత్రి చర్చ్ లో నాకు ఆశ్రయం కావాలి,"

    గేట్ మెన్ అర్ధంకానట్టుగా చూశాడు. ఈ అనుభం అతనికి కొత్త.

    దయచేసి సందేహించకు. నిజంగానే నేను చాల ఇబ్బందిలో ఉన్నాను. ఈ రాత్రిమాత్రం నన్ను ఇక్కడ తలదాచుకోనివ్వు. రేపు ఉదయమే వెళ్ళిపోతాను. నీకు ఎలాంటి సమస్య రాదుప్రాదేయపూర్వకంగా అంది అనామిక.

    వాచ్ మెన్ సందిగ్ధంగా ఆమె వైపు చూశాడు. తరువాత ఏదో నిర్ణయించుకున్నట్టు తలపంకించాడు.

    మీరు ఇక్కడే ఉండండి. ఫాదర్ తో మాట్లాడివస్తానుఅని చెప్పి లోపలికి వెళ్ళాడు. అనామిక ఆత్రంగా అతనికోసం ఎదురుచూస్తూ నిలబడింది. అప్పడప్పుడు వెనక్కి తిరిగి చూసింది. ఇన్స్ పెక్టర్ కాని అతని సిబ్బంది కాని కనుచూపుమేరలో కనిపించలేదు.

    ఆమె ఎంతో సేపు ఎదురుచూడవలసిన అవసరం లేకుండ పోయింది. రెండుక్షణాలు తరువాత గోడకు కొట్టిన బంతిలా తిరిగివచ్చాడు వాచ్ మెన్.

    ఫాదర్ గారు మిమ్మల్ని లోపలికి రమ్మని చెప్పారుఅన్నాడు.

    బ్రతుకుజీవుడా అనుకుంటు లోపలికి వెళ్ళింది అనామిక. చుట్టు చీకటి ఆవరించుకుని ఉంది. అప్పుడే కారిడార్ దగ్గర లైట్లు వెలిగాయి. గుమ్మం దగ్గర ఫాదర్ కనిపించాడు. తెల్లని గౌన్ లో ఆయన దేవదూతలా ఉన్నాడు. ఆయన మొహం ఎంతో ప్రశాంతంగా ఉంది. కళ్ళలో దయకరుణ కొట్టోచ్చినట్టు కనిపిస్తున్నాయి. పెదవులమద్య చిరునవ్వు మెరిసిపోతుంది.

    ఎవరమ్మా నువ్వు ఏం కావాలిఆప్యాయంగా అడిగాడు ఫాదర్.

    నేను ఎవరో నాకే తెలియని పరిస్ధితిలో ఉన్నాను ఫాదర్. నా గతం పూర్తిగా మరిచిపోయాను. చివరకు నా అసలు పేరు కూడా గుర్తులేదు. ప్రస్ధుతం అనామిక అని పేరు పెట్టుకున్నాను. అదే పేరుతో పిలవండి అంది.

    ఫాదర్ మాట్లాడలేదు. జాలిగా చూశాడు.

    "నీ సమస్య నాకు అర్ధమైంది. ఏం ఫర్వాలేదు. ఆ కరుణామయుడు నీకు తప్పకుండ మేలు చేస్తాడు. ఈ రాత్రికి ఇక్కడే తలదాచుకో. ఆ దేవదేవుడి సన్నిధిలో నీకు తప్పకుండ మేలుకలుగుతుంది. నాతో రా ‘అంటు వెనక్కి తిరిగాడు ఫాదర్.

    ఇద్దరు లోపలికి వెళ్ళారు. లోపల సూడిపడితే వినబడేంత నిశబ్ధం అలుముకుంది. ఫాదర్ తిన్నగా వెళ్ళి ఒక గదిముందు ఆగాడు. ఆ గది చిన్నది కాదు పెద్దది కాదు. ఒక మోస్తరుగా ఉంది. కాని చాల నీట్ గా అందంగా ఉంది. అటాచ్డ్ బాత్రూం కూడా ఉంది.

    ఈ గదిలో హాయిగా పడుకో. విశ్రాంతి తీసుకో. పిచ్చిపిచ్చి ఆలోచనలతో మనస్సు పాడుచేసుకోకు. అన్నట్టు అడగటం మరిచిపోయాను. భోజనం చేశావాఅడిగాడు ఫాదర్.

    చేశానుఅంది అనామిక.

    గుడ్ నేను వస్తాను. రేపు ఉదయం కలుసుకుందాంఅన్నాడు ఫాదర్. తరువాత ఆయన వెళ్ళిపోయాడు.

    అనామిక గది తలుపులు దగ్గరగా వేసింది. కాళ్ళకు ఉన్న బూట్లు విప్పి పక్కన పడేసింది. తన చేతిలో ఉన్న బ్యాగ్ కాస్మోటిక్స్ పాకెట్టును మంచంపక్కన ఉన్న టీపాయ్ మీద పెట్టింది. తరువాత కాళ్ళు చాపుకుని పడుకుంది. సాయంత్రంనుంచి విపరీతమైన టెన్షన్ అనుభవించింది అనామిక. అందుకే కళ్ళు మూసుకున్న వెంటనే గాఢనిద్రలోకి జారుకుంది.

    భాగం --2

    అలారం కొట్టినట్టు చప్పన కళ్ళు తెరిచింది అనామిక. బయట పూర్తిగా తెల్లవారిపోయింది. కాళ్ళకు చుట్టుకున్న దుప్పటిని పక్కకు లాగేసింది. లేచి కూర్చుని చుట్టు చూసింది. రాత్రి జరిగినదంతా ఆమెకు గుర్తుకువచ్చింది. ఏ పరిస్ధితిలో ఇక్కడికి వచ్చిందో అర్ధమైంది. మెల్లగా మంచంమీద నుంచి లేవబోయింది. అప్పుడే తలుపుతోసుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. తెల్లబట్టలు వేసుకున్నాడు. చేతిలో ట్రే ఉంది. అందులో టిఫిన్ ఉంది.

    ఫాదర్ గారు టిఫిన్ కాఫీ పూర్తిచేసి రమ్మని చెప్పారు. ఆయన తన స్డడిరూంలో ఉన్నారుఅన్నాడు ఆ వ్యక్తి.

    ఈ చర్చ్ కు నేను కొత్త. నాకు స్డడిరూం ఎక్కడుందో తెలియదుఅంది అనామిక.

    మీరు టిఫిన్ పూర్తిచేసి రండి. నేను తీసుకువెళ్తానుఅని చెప్పాడు అతను. తరువాత గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు.

    వేడివేడి టిఫిన్ కాఫీ చూడగానే అనామికకు ప్రాణం లేచివచ్చినంతపనిఅయింది. గబగబ వాటిన పూర్తిచేసింది. వేడి కాఫీ తాగగానే ఆమెకు పోయిన ప్రాణం లేచివచ్చినట్టుగా తోచింది. తరువాత శుభ్రంగా మొహం కడక్కుంది. టవల్ తో మొహం తుడుచుకుని తన సామానులు తీసుకుని బయటకు వచ్చింది. గుమ్మం దగ్గర ఒక పక్కగా నిలబడిఉన్నాడు అతను.

    "రండి అని ముందుకు దారితీశాడు. అనామిక అతన్ని అనుసరించింది. అతను ముందుకు నడిచి ఒక గదిముందు ఆగాడు.

    ఇదే ఫాదర్ స్డడిరూం. ఆయన లోపల మీకోసం ఎదురుచూస్తున్నారు వెళ్ళండిఅన్నాడు.

    తలుపు తోసుకుని మెల్లగా లోపలికి అడుగుపెట్టింది అనామిక. లోపల విశాలమైన టేబుల్ ముందు కూర్చుని ఉన్నాడు ఫాదర్. అనామికను చూసి చిరునవ్వు నవ్వాడు.

    రాత్రి బాగా నిద్రపట్టిందా అడిగాడు.

    చాల బాగా నిద్రపోయాను. మీ మేలు ఈ జన్మలో మరిచిపోలేను అంది ఆమె కృతజ్ఞతగా .

    ఇందులో నా గొప్పతనం ఏమి లేదు. అంతా ఆ పరమాత్ముడి దయ. అంతే నేను నిమిత్తమాత్రుడిని. ముందు కూర్చో తరువాత వివరంగా మాట్లాడుకుందాంఅంటు కుర్చిచూపించాడు ఫాదర్.

    సామానులు కిందపెట్టి ఆయనకు ఎదురుగా కూర్చుంది అనామిక.

    రాత్రి నువ్వు చాల కంగారులో ఉన్నావు. అందుకే వివరాలు అడగలేదు. ఇప్పుడు చెప్పు. అసలు ఏం జరిగింది. ఈ ఊరుకు ఎందుకు వచ్చావుఅడిగాడు.

    వెంటనే ఏం మాట్లాడలేదు అనామిక. ఆలోచిస్తున్నట్టుగా కళ్ళు మూసుకుంది. ఫాదర్ ఆమె పరిస్ధితి గ్రహించాడు. అందుకే తను కూడా మౌనంగా ఉండిపోయాడు. రెండుక్షణాలు ఆ గదిలో మౌనం రాజ్యమేలింది. నిశబ్ధాన్ని చిధ్రంచేస్తూ అంది అనామిక.

    ఈ ఊరు ఎందుకు వచ్చానో తెలియదు. ఎప్పుడు వచ్చానో తెలియదు. కాని వచ్చాను. కొన్ని కాస్మోటిక్స్ సామానులు కొనుక్కోవాలని ఒక సూపర్ బజార్ కు వెళ్ళాను. కావల్సినవి కొనుక్కున్నాను. కౌంటర్ దగ్గరకు వెళ్ళి బిల్ చెల్లించాను. తరువాత సామానులు తీసుకుని సూపర్ బజార్ నుంచి బయటకు వచ్చాను. అప్పుడే నా గతం పూర్తిగా మరిచిపోయాను. చివరకు నా పేరు కూడా మరిచిపోయాను. ముందు ఏం చెయ్యాలో నాకు తోచలేదు. భయంతో తల్లిడిల్లిపోయాను. నాకు అమ్మేషియా వ్యాధి సోకిందని అప్పుడు నాకు తెలిసింది.

    "ఇలాంటి పరిస్ధితిలో రాత్రివేళ సిటిలో తిరగటం మంచిది కాదు. అందుకే ఏదైన హోటల్ లో ఉండాలని తీర్మానించుకున్నాను. నాకు ఎదురుగా ఒకహోటల్

    Enjoying the preview?
    Page 1 of 1