Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

SWARNA SIKHARALU
SWARNA SIKHARALU
SWARNA SIKHARALU
Ebook476 pages2 hours

SWARNA SIKHARALU

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

15 సంవత్సరాల క్రితం ఓ పత్రికలో ఓ పెద్దాయన డైలీ న్యూస్ పేపర్ సాహిత్య పేజీలలో.. సాహితీ లోకంలో...'కథ'..పని అయిపోయింది,అటక ఎక్కేసింది..అంటూ వ్యాసం రాశారు..కథ గురించి వినరాని మోటు పదం ఆయన వాడారు.ఆ తర్వాత కూడా ఒకరిద్దరూ అదే రకంగా రాశారు. అప్పటికే నేను రమారమి 250 కథలు రాసి   చాలా విజయాలు సాధించి ఉన్నాను. కానీ కథ

LanguageTelugu
Release dateFeb 6, 2023
ISBN9788196168704
SWARNA SIKHARALU

Related to SWARNA SIKHARALU

Related ebooks

Reviews for SWARNA SIKHARALU

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    SWARNA SIKHARALU - Nallabati RaghavendraRao

    దయచేసి ఇక్కడ ఒకసారి ఆగి చదవండి

    అందరికీ శుభాభివందనం...

    15 సంవత్సరాల క్రితం మాట అనుకుంటాను. ఓ పత్రికలో ఓ పెద్దాయన( పేర్లు గుర్తు  లేవు) డైలీ న్యూస్ పేపర్ సాహిత్య పేజీలలో ఒక వ్యాసం  రాస్తూ సాహితీ లోకంలో... 'కథ'.. పని అయిపోయింది, అటక ఎక్కేసింది.. అంటూ వ్యాసం  రాశారు.. కథ గురించి విన రాని మోటు పదం ఆయన వాడారు. అది ఇక్కడ చెప్పడం నాకు మనస్కరించడం లేదు. ఆ తర్వాత కూడా ఒకరిద్దరూ అదే రకంగా రాశారు.

    అప్పటికే నేను  రమారమి 250 కథలు రాసి   చాలా విజయాలు సాధించి ఉన్నాను. కానీ కథ  మనుగడ గురించి వాళ్ళ వివరణ చదివాక.. కథ పని అయిపోయిందా అంటూ  భయపడ్డాను,బాధపడ్డాను. కొన్ని రోజులు ఏడ్చాను.  అలా రాసిన వాళ్ల మీద కసి కోపం పెంచుకున్నాను. రెండు  సంవత్సరాలు  కథలు రాయడం మానేశాను.

    కానీ ఇప్పుడు ఆలోచిస్తే అప్పటి పరిస్థితులను బట్టి వాళ్ళ స్టేట్మెంట్లు కరెక్టే అనిపిస్తుంది. రచయితల విషయంలో.. పత్రికల యాజమాన్యాలు, ప్రచురణ సంస్థల అధిపతులు, చివరికి కథలను చదివే  పాఠకులు కూడా... పట్టించుకోవడం మానేశారు ఆ సమయంలో.  అలా  కథకు నిజంగా కొన్ని సంవత్సరాలు అన్యాయమే జరిగింది.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. తర్వాత నెమ్మదిగా పరిస్థితులు చక్కబడి కథ పునర్ వైభవాన్ని సొంతం చేసుకోవడం మొదలు పెట్టింది.

    కథా రచయిత డబ్బు సంపాదించలేడు. డబ్బు సంపాదించి తప్పుడు పనులు చేసే వాళ్ళ జీవిత పతనం ఎలా ఉంటుందో తన రచనల ద్వారా సమాజానికి తెలియజేయగలడు. అలాగే కథా రచయిత సమాజంలో సరైన గౌరవం కూడా పొందలేక పోతున్నాడు.

    కానీ గౌరవమైన వ్యక్తులుగా చలామణి అవుతూ కుట్రలు చేసే వ్యక్తుల జీవితాలు ఎలా అధోగతి పాలవుతాయో తన రచనల ద్వారా తెలియజేయగలుగుతున్నాడు. ఆ విధంగా రచయిత అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ప్రజాప్రగతికి  ఆయువు పట్టు అయ్యాడు.

    ఇక ఇప్పటి పరిస్థితి చూస్తే... కథా ప్రపంచం బ్రతికి బట్ట  కట్టడమే కాదు అది మహారాజు వైభోగం అనుభవించడానికి కావలసినన్ని రహదారులు ఏర్పడ్డాయి. కథ మీద ఉన్న అపారమైన అభిమానం తో కథను భుజం మీద ఎత్తుకుని నడుస్తున్న మహానుభావులు, మాధ్యమాలు, సంస్థలు చాలా ఉన్నాయి ప్రస్తుతం.

    గతంలో రచయితల ఇక్కట్లు అగచాట్లు చూసి, అనుభవించి .. గతకాల రచయితలలో చాలామంది ఇప్పుడు కథను బ్రతికించడం కోసం నడుము కట్టుకొని  అది వారి బాధ్యతగా నిర్వహించడం చాలా గొప్ప పరిణామం..వీళ్లంతా మన  అద్భుతమైన తెలుగు కథ '' స్వర్ణయుగం '' లో నడవడానికి పునాదులు వేస్తున్నారు.. వేశారు.

    ప్రస్తుతం చాలా ప్లాట్ ఫామ్  లు కథను అభిమాని స్తున్నాయి, ఆదరిస్తున్నాయి. అఖండఖ్యాతిని అందిస్తున్నాయి. కథలను చదివే పాఠకులు కూడా విపరీతంగా పెరిగారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు  కొన్నాళ్లు పోతే సినిమాలు చూడటం మానేసి కథలే చదువుతారేమో అనిస్తుంది ఇప్పటి పరిస్థితి చూస్తే నాకు.

    ఎటొచ్చీ ఇప్పటి కథకులు యువకులైనా, వృద్ధులైనా కొత్త రక్తం ఎక్కించుకోవలసి ఉంది. సమాజాన్ని తమ రచనల ద్వారా మరింత  సుసంపన్నం చేయవలసిన అవసరం ఉంది.

    ఈ రోజున  కథ... హిమాలయ పర్వతాల మీద విహరిస్తోంది, విమానం కన్నా వేగంగా దూసుకుపోతోంది, సన్నజాజి పందిళ్ల   కింద హాయిగా ఆ మధురిమలను ఆస్వాదిస్తోంది

    ఇందుకోసం నేను సైతం అన్నట్లు కృషి చేస్తున్న వాళ్లలో  మొట్టమొదటి స్థానం ''కస్తూరి  విజయం'' వారిది. వారి యాజమాన్యానికి నా  అభినందనలు.

    ఒక్క కలం చాలు సమాజం తలెత్తుకు తిరిగేలా చేయడానికి

    ఒక్క బలం చాలు మరిన్ని బలగాలను కూడగట్టుకోవడానికి

    ఒక్క విజయం చాలు మరిన్ని విజయాలు పొందే స్ఫూర్తి కి!

    ఒక్క ఆలోచన చాలు మరిన్ని.. మెదళ్ళు...మేల్కొనడానికి!

    ****

    మరొక్కమాట..........

    స్వర్ణ శిఖరాలు ... ఈ నా కథాసంపుటి లోని కథలు చదివిన విజ్ఞులు ఎవరైనా నా కథలు అసలు బాగుండలేదని నాకు మెసేజ్ పెడితే... మీతో చర్చించి మీరు పుస్తకం ఎక్కడ కొన్నప్పటికీ నేను మీకు పుస్తకం రేటు రీఫండ్ చేయగలను...ఛాలెంజ్!!

    ****

    అతి త్వరలో రాబోవు నా కథా సంపుటిలు

    (అన్నీ ఉత్తమ బహుమతి కథలే)

    పసిడి ప్రమిదలు

    బంగారు బొమ్మలు

    మీ కథారచయిత

    నల్లబాటి రాఘవేంద్రరావు

    అమృతం కురిసింది

    హలో! కృష్ణమూర్తి. నేను రా, మీ నాన్నని. నేను ఈరోజు ప్రయాణం పెట్టేసుకున్నాను. రాత్రి 7 గంటలకు ట్రైన్ ఉందట. నువ్వు ఆఫీసు నుండి వచ్చేటప్పుడు, ఉదయం నువ్వు వెళ్ళేటప్పుడు నేను చెప్పిన వాటిని మరిచిపోకుండా పట్టుకురా. గుర్తుందా? సరే ఉంటాను. అంటూ రిసీవర్ పెట్టేసాడు హరిరామజోగయ్య.

    కాఫీ తీసుకోండి మావయ్యగారు. ఈరోజు రాత్రికి ప్రయాణం అంటున్నారు. వచ్చి వారమే కదా అయింది మరో నాలుగు రోజులు ఉండండి.  కాఫీ అందిస్తూ అంది కోడలు లక్ష్మి .

    ఉంటానమ్మా. నాకో మనవడిని ఇచ్చావనుకో అప్పుడు వాడు ఉండమంటే ఉంటాను.

    సరే మీ కాళ్ళ నొప్పులు తగ్గాయా?

    '' రాత్రి నేను కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు నేను అడగకుండానే నా కాళ్లు నొక్కావు. అలా నా మనసును అర్థం చేసుకునే కోడలు పిల్లవి దొరికావు.అది చాలు. నాకు కోట్ల రూపాయల ఆస్తి కన్నా ఎక్కువ ఆనందం కలిగింది' ప్రేమగా  అన్నాడు హరిరామజోగయ్య.

    '' నా కన్న తండ్రి సంపాదనే ముఖ్యంగా విదేశాల్లో ఉన్నా, మీరు నా కన్నతండ్రి కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంజనీర్ చదివినా ప్రపంచ జ్ఞానం తెలియని నాకు పెళ్లయిన ఈ మూడు సంవత్సరాలలో అన్ని విషయాలు నేర్పారు మీరు, అత్తయ్య గారు. మీరిద్దరూ నాకు అత్తమామలు కావడం నిజంగా నా అదృష్టమని నేను ఆనందిస్తున్నాను''. ఆప్యాయంగా అంది కోడలు లక్ష్మి.

    హరిరామజోగయ్యకు కొడుకన్నా, కోడలన్నా చాలా ఇష్టం. కొడుకును ఇంజనీర్ చేయడమే కాదు తన కోడలు కూడా ఇంజనీర్ కావడంతో జీవితంలో ఏదో సాధించిన అనుభూతి పొందాడు ఆయన.

    అయితే చిన్నప్పటినుండి కొడుకుని నేటి విద్యా విధానపు ప్రభావాలకు తలవొగ్గి ఇతర రాష్ట్రాలలో హై లెవెల్ ఎడ్యుకేషన్ విధానంలో చదివించడంతో, తెలుగు ఆచారవ్యవహారపు కట్టుబాట్లకి కొడుకు కాస్తంత దూరమయ్యాడు అన్న బాధ మాత్రం ఉండేది. దానికి తోడు తనకు కాబోయే కోడలు కూడా అదే పరిస్థితిలో ఉందని తెలిసి హరిరామజోగయ్యకు బాధ తగ్గకపోగా రెట్టింపయ్యింది, మొదట్లో.

    చదువు పూర్తి అయిన వెంటనే పెళ్లి, పెళ్లయిన రెండు రోజులకే ఉద్యోగంలో  జాయినింగ్ ఆర్డరు రావడంతో, తప్పక భార్యను కాపురానికి తీసుకెళ్లి పోవాల్సివచ్చింది, తన కొడుకు కృష్ణమూర్తికి.

    దాంతో తమ సాంప్రదాయపు పద్ధతులు అంతగా తెలియని ఆ నూతన దంపతులు ఇద్దరూ ఎలా జీవితయాత్ర సాగిస్తున్నారో అని హరిరామజోగయ్య, అతని భార్య సుమిత్ర తెగ ఆతృత పడేవారు.

    చదువులో జీనియస్ లు అయిన వాళ్ళు ఇద్దరూ జీవితంలో జీరో కాకూడదు అని అతనికి ఆరాటంగా ఉండేది.

    అందుకే అతను ప్రతి పండుగకు తన ఇంటికి కొడుకు, కోడలిని రప్పించుకోవటం, వాళ్లకి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు నేర్పటం తర్వాత తన భార్యతో సహా తను కూడా తరచుగా కొడుకు, కోడలి దగ్గరకు వెళ్లడం మరి కొన్ని  కట్టుబాట్లు, సంస్కృతి నేర్పటం, అలా అలా పెళ్లి అయిన ఈ మూడు ఏళ్లల్లో తను కలలుకన్న కొడుకు కోడలుగా వాళ్ళిద్దరిని మార్చుకొని తన మనసు పరమానందభరితం చేసుకోగలిగాడు హరిరామజోగయ్య. అయినా ఆయనలో నూరుపాళ్ల సంతృప్తి కలగలేదు.

    ఇంకా ఏదో వెలితి ఉన్నట్టు భావించిన ఆయన వారం క్రితం కొడుకు,  కోడలి దగ్గరకి వచ్చాడు.

    అయితే ఈరోజు ఉదయం ఆఫీసుకు వెళ్తున్న తన కొడుకుని పిలిచి, ' ఇప్పుడు విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం మార్కెట్లో కొత్తగా విడుదల చేసిన హిందూ సాంప్రదాయపు వీడియో  సీడీలు  ఎన్నిరకాలు ఉన్నా  మొత్తం తీసుకురమ్మని’ ఉదయాన్నే పురమాయించాడు. కొడుకు వెళ్లాక సడన్ గా తను తిరిగి వెళ్లే ప్రయత్నం రాత్రి  ఏడుగంటలకు ఖరారు చేసుకుని వచ్చేటప్పుడు మర్చిపోకుండా వాటిని  తెమ్మని  ఇప్పుడు కొడుక్కి ఫోన్ చేశాడన్నమాట.

    ****

    తండ్రి చెప్పిన మాట ప్రకారం కృష్ణమూర్తి తను సాయంత్రం ఆఫీసు నుండి వచ్చేటప్పుడు చాలా రకాల వీడియో సీడీలు కొని ఇంటికి తెచ్చి తండ్రికి చూపించాడు ఆనందంగా.  వాటినన్నిటినీ పరిశీలించిన హరిరామజోగయ్య కొడుకు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

    '' కృష్ణమూర్తి! నేను అనుకున్నవన్నీ తెచ్చావు. ఇవి నీకోసమే! నీకు తెలుసుకునే శ్రద్ధ ఉండదని డబ్బులు ఖర్చయినా ఇవన్నీ ఇంట్లో తప్పకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతో తెప్పించాను. సరే, ఇవి కాకుండా ఇంకా అక్కడ మన ఆచార వ్యవహారాలకు సంబంధించిన వేరే  వీడియోసీడీలు ఏమైనా ఉన్నాయేమో వివరంగా  అడిగావా? ''  అంటూ ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా కొడుకుని ప్రశ్నించాడు హరిరామజోగయ్య.

    '' ఇంకేం లేవు నాన్న '' చెప్పాడు కృష్ణమూర్తి.

    ''నువ్వు సరిగ్గా విపులంగా అడిగి ఉండవు. అవునా?'' ఇంకా ఆతృతగా  ప్రశ్నించాడు హరిరామజోగయ్య.

    '' నేను మూడు చోట్ల వెతికాను అందరి దగ్గర ఇవే ఉన్నాయి. వేరే ఏమీ లేవని వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు కూడ.''  అన్నాడు కృష్ణమూర్తి.'' బాగుందిరా! లేనివి నువ్వు మాత్రం ఎలా  తేగలవు.''  తనకు  తానే సర్ది చెప్పుకున్నాడు.. హరిరామజోగయ్య..

    '' ఇవన్నీ ఎందుకు నాన్నా? ఈ మూడేళ్లలో నువ్వూ, అమ్మా మా ఇద్దరికీ నేర్పిన విషయాలకన్నా ఎక్కువ విషయాలు ఉండవు కదా ఈ సీడీలలో.''  అన్నాడు కృష్ణమూర్తి.

    '' హైందవ సంస్కృతి అపారం రా కన్నా. అందులో నువ్వు నేర్చుకొన్నదీ, నేను నీకు నేర్పిందీ  చాలా  స్వల్పం."  అన్నాడు నుదుటిమీద చెమట తుడుచుకుంటూ హరిరామజోగయ్య.

    ***

    రాత్రి  ఏడుగంటలకు ముందుగా...

    ఈసారి తనకు తోడుగా వచ్చిన తన చిన్ననాటి స్నేహితుడు, తోటమాలి అయిన ఏడుకొండలు రెండు సూటు కేసుల్లో నిండా సామానులు సదరగా అందరూ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. ముందుగా రిజర్వ్ చేయకపోయినా టికెట్లు దొరికాయి. హరిరామజోగయ్య,ఏడుకొండలు ఆగి ఉన్న ట్రైన్ లోపలికి వెళ్లి కూర్చున్నారు, లగేజీతో సహా.

    ట్రైన్ ఇంకా  కాసేపట్లో కదులుతుంది అనగా  ప్లాట్ ఫామ్ మీద విండో దగ్గర నిలబడి మాట్లాడుతున్న కొడుకుతో ఇలా అన్నాడు హరిరామజోగయ్య.

    ఒరేయ్ కృష్ణమూర్తి!  రెండు నెలల క్రితం మా తాతగారి ఆబ్దికానికి  మిమ్మల్ని ఇద్దరినీ రమ్మని    ఫోను చేశాను ఎందుకు రాలేదు?  గుర్తుకొచ్చి ప్రశ్నించాడు, కోడలి వైపు కూడా చూస్తూ.

    నాన్నా!  వ్రతాలు, నోములు, ప్రత్యేక పూజలు లాంటి అతి ముఖ్యమైన కార్యక్రమాలకు కంపల్సరీగా వస్తున్నాం కదా! ఇలాంటి మరీ చిన్న విషయాలకు కూడా రావాలంటే కుదరటం లేదు నాన్న అన్నాడు కృష్ణమూర్తి కొంచెం తడబడుతూ.

    రైలు కదులుతోంది నెమ్మది నెమ్మదిగా. హరిరామజోగయ్య కొడుకు అన్న మాటకు ఎక్కడో గాయం తగిలిన వాడిలా బాధపడి, ఏదో గుర్తొచ్చిన వాడిలా కంగారుపడి హఠాత్తుగా నిలబడ్డాడు, ఆ ట్రైనులో. పరిస్థితి అర్థం కాలేదు ఎవరికి.

    ఏటైనాది , అయ్యగారు ఏటైనాది?  ఏడుకొండలు ధైర్యంగా అడిగాడు.

    నెమ్మదిగా కదులుతున్న రైలు నుంచి వేగంగా దిగిపోయి అక్కడున్న సిమెంట్ బల్ల మీద కూర్చుండి పోయాడు హరిరామజోగయ్య. కృష్ణమూర్తి, లక్ష్మిలకు పరిస్థితి అర్థం కాలేదు. రైలు వేగం పెరగకుండానే ఏడుకొండలు కూడా లగేజీతో గబగబా కిందకు దిగిపోయాడు.

    రైలు స్పీడు అందుకుని వేగంగా వెళ్ళిపోయింది.

    కాసేపటికి హరిరామజోగయ్య కు చలనం వచ్చి కళ్ళు తెరిచి నెమ్మదిగా ఊపిరి తీసి వదిలాడు.

    ఏమీ లేదర్ర. మీరంతా కంగారు పడకండి.  రైలు కదిలినప్పుడు సడన్ గా  నాకు అతి ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. మూడు పుష్కరాల నుండి క్రమం తప్పకుండా ఆచరిస్తున్న ఒక పుణ్య కార్యక్రమము రేపు  ఉదయమే చేయాలి. నేను ఇంటికి వెళ్లేసరికి రేపు మధ్యాహ్నం అవుతుంది.  నేను ప్రయాణంలో ఉంటే  ఆ కార్యక్రమం ఆచరించడం కుదరదు. హరిరామజోగయ్య కళ్ళలోంచి నీళ్లు  గంగాప్రవాహంలా కారిపోతున్నాయి. నాన్నా! మాకు అర్థమయ్యేలా చెప్పు, తండ్రి అవస్థను చూసి తను కూడా కొంచెం బాధపడిపోతూ అడిగాడు కృష్ణమూర్తి.

    ఇందులో మీ ఇద్దరి తప్పు ఏమీ లేదురా. తప్పు అంతా నాదే. రేపు మా నాన్నగారి ఆబ్దికంరా.  నా తండ్రి రా. నాకు ఈ ఉత్తమ మానవ జన్మనిచ్చిన నా కన్నతండ్రి  హరిరామజోగయ్య తెగ కృంగి పోతున్నాడు.

    నాన్న, అలాగైతే నిన్ననే నువ్వు వెళ్లి ఉండవలసిందిగా

    అదే నేను చేసిన పెద్ద తప్పురా. మీ ఆప్యాయత అభిమానాలలో పడి ప్రపంచాన్నే మరిచిపోయాను.

    సరే నాన్నా! ఎందుకలా కంగారు పడిపోయి బెంబేలు పడిపోతావు. ఆ కార్యక్రమానికి అమ్మ దగ్గర ఉండకపోయినా పర్వాలేదు అన్నట్లయితే నేను మీ కోడలు ఉంటాం కదా! మేమిద్దరం నీకు సహాయ పడతాం. ఈ మాత్రం అతి చిన్న విషయానికి ఎందుకు అంత కంగారు.  కృష్ణమూర్తి చాలా  సునాయాసంగా అనేశాడు.

    నీ నోటి నుండి మళ్లీ అదే మాట. ఇది చాలా చిన్న విషయమా! ఇదే నా జీవితంలో అతి ముఖ్యమైన చర్య. నా పెద్దలను నేను  స్మరించుకోకపోతే నా బ్రతుకు అనవసరం. ప్రతిరోజు నేను అన్నం ఎలాగైతే తింటున్నానో అలాగే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆచరించవలసిన అతి ముఖ్య కార్యక్రమం ఇది. నా విషయంలో ఈ కార్యక్రమం నా ప్రాణం కన్నా అతి ముఖ్యమైనది.  హరిరామజోగయ్య ముఖం రౌద్రంగా ఉంది. కొడుకు కోడలు కంగారు పడిపోయారు.

    నాన్న! వీలుకానప్పుడు ఆ కార్యక్రమం ఎక్కడ చేసినా తప్పులేదేమో కొంచెం ఆలోచించు.

    బెదురుగా అన్నాడు కృష్ణమూర్తి.

    మావయ్యగారు, మావల్ల అయ్యే పని మాకు చెప్పండి మీరు చెప్పినట్లు చేస్తాం. చేతులు కట్టుకొని మరీ చేస్తాం  వినయంగా అంది కోడలు లక్ష్మి.

    ఇది చేతులు కట్టుకొని చేసేది కాదమ్మా హృదయం కట్టుకొని చేయాలి. మీకు అంత అనుభవం లేదు కదా అన్నాడు ఆయన.

    నాన్న! ఇందులో ఏముంది ఇంటికి వెళ్ళాక ఏమేం తేవాలో ఎవరెవరిని పిలవాలో ఎలా చేయాలో మీరే చెప్పండి. నేను,లక్ష్మి పుస్తకంలో మీరు చెప్పింది వివరంగా రాసుకుని  ఏర్పాట్లు అన్నీ చేస్తాం. ఈ రాత్రి ఇంకా సమయం ఉంది కదా!  రేపటి మీ అవసరాలకు కావలసినవి అన్నీ ఇప్పుడే తెచ్చేస్తాను. మిగిలినవి ఏమైనా ఉంటే రేపు ఉదయం వెళ్తాను. పైగా రేపు నాకు ఆదివారం కూడా కదా!  మీ దగ్గరే ఉంటాను  అన్నాడు తండ్రిని ఒప్పిస్తూ కృష్ణమూర్తి .

    నీకు సెలవు వచ్చిన మాట వాస్తవమే కానీ ఇది మీ వల్ల కాదు. ఇది సాధారణ  కార్యక్రమం కాదు. నా నమ్మకాలకి మీరిద్దరూ తట్టుకోలేరు.

    హిందూ సాంప్రదాయపు ఆ నమ్మకాలను గౌరవించడం మా విధి కదా. అన్నాడు కృష్ణమూర్తి.

    రండి మావయ్య గారు...  అంది లక్ష్మి ప్రేమగా వస్తానమ్మా! అయితే ఈ విషయంలో ఏమాత్రం తేడా లోటుపాట్లు జరిగినా అగ్గి మీద కాలు వేసిన సింహంలా ప్రవర్తిస్తాను. అరుస్తాను, తిడతాను. ఈ కార్యక్రమం విషయంలో నేను ఇంటి దగ్గర మీ అత్తయ్య దగ్గర కూడా అలాగే ప్రవర్తిస్తుంటాను. చిరాకులు,బాధపడడాలు,ఏడవడాలు ఉండకూడదు. శ్రద్ధగా, సంతోషంగా,  ఏకాగ్రతతో ఈ ఏర్పాట్లు అన్నీ చేయాలి. అలాగని నాకు మాట ఇవ్వగలవా? ఆలోచించుకుని  చెప్పండి. అనవసరంగా చెయ్యలేని కార్యక్రమం నెత్తి మీద పెట్టుకోవద్దు నిష్కర్షగా చెప్పాడు హరిరామజోగయ్య.

    మీరు అన్నదగ్గ వారు.  మీరు వెనక్కు వచ్చి, రేపు మీ నాన్నగారి కార్యక్రమం పూర్తిచేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది.. రండి మామయ్య గారు.  ప్రేమగా మామగారి చెయ్యి పట్టుకుంది లక్ష్మి. 

    నీకు మాట ఇస్తున్నాను నాన్న.  కృష్ణమూర్తి తను కూడా తండ్రి చేతులు పట్టుకుని ప్రేమగా అన్నాడు.

    ఏడుకొండలు లగేజీ పట్టుకోగా అందరూ స్టేషన్ బయటకు వచ్చి ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసారు.

    ***

    హరిరామజోగయ్య వాలు కుర్చీలో కూర్చుని తన పక్కనే నిలబడి ఉన్న కొడుకు, కోడలికి  చెప్పటం మొదలెట్టాడు ఆ రాత్రి.

    " కృష్ణమూర్తి! ఈ విషయంలో ప్రతి పైసా నా జేబులోదే ఖర్చు పెట్టాలి. చివరికి నువ్వు వెళ్లే బండిలో పెట్రోల్ ఖర్చు కూడా నాదే. అలాగైతేనే నాకు ఫలితం దక్కుతుందని నా నమ్మకం.

    ఇక మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. ఇది నాకు, నా తండ్రి కి సంబంధించిన కార్యక్రమం. ఏమేం కావాలో  మీకు వివరంగా చెప్పి అవి తెప్పించుకునే ముందు  అసలు ఆబ్దికం అంటే ఏమిటో మీకు తెలియాలి కదా. ఏమీ తెలియకుండా చేసే పనుల మీద ఏకాగ్రత ఉండదు. ఆ విధంగా చేసినా ఫలితం శూన్యం అవుతుంది. అందుకని శ్రద్ధగా వింటూ రాసుకోండి.  మధ్యలో నేను

    తిరిగి ఏదైనా ప్రశ్న వేస్తే దానికి మీరు సమాధానం తడుముకోకుండా చెప్పగలగాలి. లేకుంటే మీరు నన్ను అపహాస్యం చేసినట్లే." అంటూ చెప్పడం మొదలుపెట్టాడు హరిరామజోగయ్య.

    " ఎవరైనా చనిపోయిన తర్వాత, ఆ చనిపోయిన సమయాన్ని గుర్తు పెట్టుకొని తర్వాతి సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అంటే అదే నెలలో అదే తిథినాడు చేసే కార్యక్రమం ఇది. అంటే మా నాన్నగారు ఏ నెలలో ఏ తిథినాడు ప్రాణం వదిలిపెట్టారో అదే నెల,తిథి వచ్చిన ప్రతి సంవత్సరం చేస్తానన్నమాట ఈ ఆబ్దికము.  మనం ఎంత ఖర్చు పెట్టి చేశాము అన్నది కాదు ఇక్కడ విషయం. మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాము అన్నది ముఖ్యం. ఊబిలాంటి సమస్యలలో చిక్కుపడిపోయిన మనకు అలా ఒకసారి చనిపోయిన వాళ్ళను గుర్తుకు తెచ్చుకునే మహోన్నతమైన రోజన్నమాట ఇది.

    కృష్ణమూర్తి! కంప్యూటరో లేక కరివేపాకో చదివేసి గోల్డ్ మెడల్స్ సాధించి  కార్లు,మేడలు,  బంగారాలు పోగు పెట్టుకోవడం ఘనకార్యం అనుకుంటున్నావేమో! ఏమీ కాదు. దానితోపాటు హైందవ సంస్కృతి సంప్రదాయాలు క్షుణ్ణంగా తెలుసుకుని ఆచరిస్తేనే జీవితంలో నూరు మార్కులతో  ఉత్తీర్ణులైనట్లు. గోల్డ్ మెడల్ మించిన జీవిత మెడల్ సాధించినట్లు. వాళ్లే పరిపూర్ణ మానవులు.  నిండు చందమామల్లా  ప్రకాశిస్తారు. అర్థమైందా?

    ఇంకా విను. ఈ  ఆబ్దికము వేదోక్త కర్మ. . ఈ విధానం ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉంది. కొన్నివేల సంవత్సరాల నుండి మహాపురుషులు ఈ పితృకర్మలు ఆచరిస్తున్నట్లు పురాణాలలో ఉంది. మనది పుణ్య భూమి. భారతదేశానికి బ్రహ్మ వేదాలను ఇచ్చాడు. వేదమాత బోధించిన కర్మలను మనం అనుసరించాలి. అందులో భాగమే ఈ కర్మ. కృష్ణమూర్తి! ఇదంతా కల్పితం అను కుంటున్నావా నీ మనసులో.''  ఒక్కసారి కొడుకు కళ్ళల్లోకి చూసి ప్రశ్నించాడు హరిరామజోగయ్య.

    '' లేదు నాన్న, జాగ్రత్తగానే వింటున్నాను.''  వినయంగానే చెప్పాడు  కృష్ణమూర్తి

    '' మరి నీ నుదురు అలా బిగబట్టి ఉంచావేమిటి? సరే, క్రైస్తవులు నవంబర్ 7వ తారీకున చేసేది ఏమిట్రా?''  ప్రశ్నించాడు.

    '' ఆల్ సోల్స్ డే''  చెప్పాడు  కృష్ణమూర్తి .

    '' ఆరోజు, ఆ పేరున వాళ్లు తద్దినాలు లాంటివి పెడతారు. ఇది వివిధ దేశాల సంప్రదాయాలలో ఏదో రూపంలో జరుగుతుంది. మహమ్మదీయ యూదు మతాలలో కూడా  పితరుల ఆరాధన ఉంది. నువ్వు డాక్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి  వ్యాసాలు సంపాదించి చదువు అర్థమవుతుంది.'' అంటూ ఆయన పక్కనే ఉన్న ఏడుకొండలని చూశాడు.

    ,'' ఏడుకొండలు నువ్వేమిటి అలా పెదాలు రెండు టచ్ కాకుండా చూస్తూ ఉండిపోయావు.''  అంటూ అడిగాడు.

    '' మామమ... తత తత..... నన నన్..''

    ''ఆ..అదే నువ్వు కూడా విను.  మామ్మ, తాత, నాన్నల  గురించినదే ఈ కార్యక్రమం. ఏడుకొండలు!  నాలిక మీద మందు వేస్తే మోకాలి నొప్పి ఎందుకు తగ్గుతుంది? ఇక్కడ ఉత్తరం  వేస్తే ఢిల్లీ ఎలా  వెళుతుంది? ఏ పార్టు నిర్వహించే పని ఆ పార్ట్ నిర్వహించబట్టే కదా! అలాగే ఈ ఆబ్దిక  విధానం కూడా. పుణ్యకార్యాల, కర్మల  సువాసనలు చాలా దూరం వ్యాపిస్తాయి. ఇక్కడ మనం ఆబ్దికం పేరుతో చేసే పనుల వల్ల ఎక్కడో ఉన్న మన పితృదేవతలు తృప్తి పొంది సంతోషపడతారన్నమాట. ఆ బలంతో వాళ్లు మనం కోరే కోరికలన్నీ ఇచ్చే శక్తి పొందుతారు. మనం ఉత్తమ కర్మలు ఆచరిస్తే మన పితృదేవతలకు ఉత్తమ గతులు ఏర్పడి సంతోషంతో మళ్లీ మన కుటుంబంలోనే పుట్టాలని భావించి పుడతారు. అలా పుట్టడానికి వాళ్ళకి శక్తి ఏర్పడుతుందన్నమాట.''  అంటూ మళ్ళీ కొడుకు వైపు చూసి "సరే కృష్ణమూర్తి ఇలా చూడు. ఎలక్ట్రిక్ బల్బు లేకపోయినా మనిషి బ్రతకగలడు. ఒకవేళ అది ఉంటే ఇంకా బాగా బ్రతకగలడన్నమాట. అలాగే ఎలక్ట్రిక్ బల్బులాంటి పితృకర్మల శాస్త్రాన్ని ఉపయోగించు కోవడం వల్ల మన బతుకులు కూడా చాలా బాగుంటాయన్నమాట?''  అంటూ కోడలి ముఖంలోకి చూసి ఇలా అన్నాడు.

    "ఏమ్మా లక్ష్మి?  ఇవేవీ ఆచరించని వాళ్ళు కూడా చాలా బాగా బతుకుతున్నారు అని మనసులో అనుకుంటున్నావు కదూ.  నిజమే కాదనను.  కానీ మన వేదమాత  ప్రసాదించిన ఈ కర్మలు ఆచరిస్తే చాలా బాగాకన్నా ఇంకా చాలా బాగా బతకగలరు. పుణ్యకార్యాలు చేస్తూ దైవచింతన ఉండి ప్రశాంత  చిత్తం కలిగిన వాళ్లకు మాత్రమే ఉత్తమమైన సంతానం కూడా లభిస్తుంది. మూర్ఖులకు ఉత్తములు పుట్టడం అరుదు తల్లి.

    నువ్వు కూరలో అన్ని మసాలాలు వేసి వండావు అనుకో సూపర్ గా ఉంటుంది. ఒక్క కారమే బాగా వేసి వండావనుకో  ఆ కూర కారంకారంగానే ఉంటుంది.

    Enjoying the preview?
    Page 1 of 1