Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

అడుగు! పొందు!! స్వీకరించు!!!
అడుగు! పొందు!! స్వీకరించు!!!
అడుగు! పొందు!! స్వీకరించు!!!
Ebook305 pages1 hour

అడుగు! పొందు!! స్వీకరించు!!!

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఈ పుస్తకములో, రచయిత ఆత్మీయ, శారీరక, ఆర్ధిక మరియు వస్తుపరమైన పురోగతి పొందుటకు ఒక ప్రధాన మూలమును చూపును!

LanguageTelugu
Release dateMay 25, 2018
ISBN9781641350020
అడుగు! పొందు!! స్వీకరించు!!!
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to అడుగు! పొందు!! స్వీకరించు!!!

Related ebooks

Reviews for అడుగు! పొందు!! స్వీకరించు!!!

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    అడుగు! పొందు!! స్వీకరించు!!! - Dag Heward-Mills

    అడుగు! పొందు!! స్వీకరించు!!!

    DAG HEWARD-MILLS

    Parchment House

    వేరుగా చెప్పబడని యెడల, లేఖన ఉద్దారములు అన్ని తెలుగు OV బైబిల్ వెర్షన్ నుండి సేకరించబడినవి.

    కాపీరైట్ © 2017 డగ్ హేవార్డ్-మిల్స్

    Dag Heward-Mills గురించి అధిక సమాచారం కొరకు:

    Healing Jesus Campaigan వద్ద తెలుసుకోండి

    evangelist@daghewardmills.org కు వ్రాయండి

    వెబ్ సైట్: www.daghewardmills.org

    ఫేస్ బుక్: Dag Heward-Mills

    ట్విట్టర్: @EvangelistDag

    ISBN: 978-1-64135-002-0

    అంతర్జాతీయ కాపీహక్కులు క్రింద అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి. విశ్లేషణలు లేక వ్యాసాలలో క్లుప్త ఉద్ధారముల కొరకు మినహా ఈ పుస్తకములోని ఏ భాగమునైనా ఉపయోగించుటకు లేక ముద్రించుటకు ముద్రణకర్త నుండి వ్రాతపూర్వక అనుమతి తీసుకొనవలెను.

    విషయ సూచిక

    భాగము I – అడుగుట! పొందుట! స్వీకరించుట! అను వాటిని అర్థము చేసుకొనుట

    పురోగతికొరకైన ప్రథాన తాళపుచెవి

    నిజమైనవిశ్వాసమును వృద్ధిపరచుకొనుట

    అడుగు!

    పొందు!

    నేనుఉన్నాను!నాకు ఉన్నవి!నేను చేయగలను!

    దానినిస్వీకరించుట ఎలా!

    భాగము II – ప్రయోగాత్మక దావాలు మరియు భావార్థక అంగీకారములు!

    ఉపోద్ఘాతము

    నీపురోగతిని సాధించుటకు అంగీకారములు

    జ్ఞానమునుపొందుకొనుటకు అంగీకారములు

    నీవివాహ పరిస్థితులను ఆధీనములో ఉంచుకొనుటకు అంగీకారములు

    వివాహసమస్యలను నిర్మూలించుటకు చేయు అంగీకారములు

    వివాహంలోనికిప్రవేశించుట కొరకు అంగీకారములు

    కుటుంబశాపాలు మరియు బంధకములను జయించుటకు అంగీకారములు

    దుష్టఅజ్ఞాన ప్రజలను అధిగమించుట కొరకు అంగీకారములు

    ఐశ్వర్యమునుఅనుభవించుట కొరకు అంగీకారములు

    పెద్దసంఘమును పొందుకొనుట కొరకు అంగీకారములు

    పరిచర్యలోగొప్ప కార్యాలు సాధించుట కొరకు అంగీకారములు

    సేవకులువిజయం సాధించుట కొరకు అంగీకారములు

    వ్యాపారలోకములో ఆధిపత్యం వహించుట కొరకు అంగీకారములు

    దయ్యములుమరియు చేతబడిని జయించుటకు అంగీకారములు

    జీవితంలోవిజయవంతంగా నడుచుటకు అంగీకారములు

    ప్రతిపక్షాన్నిఅణచివేయుట కొరకు అంగీకారములు

    ఆత్మీయమరియు శారీరక శత్రువులను అణగద్రొక్కుటకు అంగీకారములు

    నిరాశమరియు భావోద్రేక సమస్యలను అధిగమించుట కొరకు అంగీకారములు

    సంక్లిష్టమైనపరిస్థితులు అధిగమించుట కొరకు అంగీకారములు

    మరింతఫలమును పొందుట కొరకు అంగీకారములు

    నిన్నునీవు అభివృద్ధిపరచుకొనుటకు అంగీకారములు

    దేవునియొక్క వాక్యముపై పరిపూర్ణ జ్ఞానము సాధించుట కొరకు అంగీకారములు

    విశ్వాసముద్వారా అప్పులను రద్దుచేయుటకు అంగీకారములు

    నమ్మకత్వమునుమరియు విశ్వాసమును పెంపొందించుకొనుటకు అంగీకారములు

    నిరంతమరియు అలవాటైన పాపములను అధిగమించుట కొరకు అంగీకారములు

    ఒకనీతిగల జీవనశైలిని పెంపొందించుకొనుటకు అంగీకారములు

    విజయముకొరకు అంగీకారములు

    సంతోషమునుమరియు సమాధానమును సంగ్రహించుట కొరకు అంగీకారములు

    నీస్వస్థత కొరకు అంగీకారములు

    ప్రయాణముకొరకు అంగీకారములు

    మంచినిద్ర కొరకు అంగీకారములు

    భాగం I:

    అడుగుట! పొందుట! స్వీకరించుట అనువాటిని అర్థము చేసుకొనుట

    అధ్యాయము 1

    పురోగతి కొరకైన ప్రథాన తాళపుచెవి

    నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును...

    హెబ్రీయులకు 10:38

    అడుగుట, పొందుట మరియు స్వీకరించుట అనగా ఏమి?

    అడుగుట, పొందుట మరియు స్వీకరించుట అంటే ఓకే మాటలో చెప్పాలంటే నీ విశ్వాసమును ప్రయోగించడమే. ప్రతి క్రైస్తవునికి విశ్వాసము ఉండాలి మరియు దానిని ప్రయోగించాలి! మన జీవితాలలో పురోగతికిని మరియు అద్భుతములకు విశ్వాసమే కారణము. ప్రార్థనకొచ్చే సమాధానములకు కారణం కూడా విశ్వాసమే. సాధారణంగా మాట్లాడాలంటే, విశ్వాసముగలవారు విశ్వాసములేని వారికంటే ఎక్కువగా అభివృద్ధి పొందుతుంటారు. విశ్వాసము ద్వారా నడిచే క్రైస్తవులకును మరియు నడవని క్రైస్తవులకును నేను వ్యత్యాసాన్ని చూసాను!

    విశ్వాసముగల ప్రజలు కూడా నిరాశలు, బలహీనతలు మరియు ఇతర లోపాలు అనుభవిస్తారు. కాని, మరీ మాములుగా చెప్పాలంటే, విశ్వసించేవారు తమ జీవితాలలో నేను ఆశీర్వాదము, సమృద్ధి మరియు శాశ్వత జీవితము పొందడం అనే ఒక ఒరవడి చూసాను.

    నా యెదుట నీతిమంతుడైనవాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుకతీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు.

    హెబ్రీయులకు 10:38

    నీవు విశ్వాసమునుండి దూరముగా వెళ్ళిపోయినట్లయితే, నీయందు ఆయన సంతొషించడు అని దేవుడు చెప్తున్నాడు. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది అని నమ్మనివారు కూడా ఉన్నారు. వారు విశ్వాస సందేశము నుండి మరియు విశ్వాసుల నుండి దూరముగా వెళ్లిపోతుంటారు. దీనికంటే కూడా సహనము, మృదుత్వం, పరిశుద్ధత మొదలగు విషయాలను మరింతగా ఉద్ఘాటించాలి అని వారు భావిస్తుంటారు. ఇవి ప్రాముఖ్యం అని నేను నమ్ముతాను, మరియు క్రైస్తవ జీవితములో ఇవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. కాని, క్రైస్తవ జీవితములోని విశ్వాసమునకున్న ప్రాధాన్యతను తక్కువగా చేసి చూడాలని దీని అర్థం కాదు. శరీరమునకు హృదయము అవసరం అంటే మూత్రపిండములు సమానంగా ప్రధానమైనవి కాదు అని కాదు కదా. రెండూ ప్రాముఖ్యమే, మరియు రెండూ కూడా నెరవేర్చవలసిన పాత్రలు శరీరంలో ఉన్నాయి.

    ప్రతియొక్క క్రైస్తవుని జీవితములో చాలా ప్రత్యేకమైన పాత్ర పోషించవలసిన ఒక ధర్మం ఈ విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండడం అసాధ్యం అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది.

    విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

    హెబ్రీయులకు 11:6

    ప్రేమ అనేది లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము కాదు అని లేఖనములు చెప్పడం లేదనే విషయం కొంత ఆసక్తికరమే. సమాధానము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము అని కూడా పరిశుద్ధగ్రంథము చెప్పుటలేదు.

    ఈ సత్యముపై పరిశుద్ధ గ్రంథము చాలా ఖచ్చితముగా ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట్టుడైయుండుట అసాధ్యము!

    అబ్రాహాము దేవునిలో ఉంచిన విశ్వాసము ఆయనకు నీతిగల క్రియగా పరిగణించబడింది. తన వృద్ధాప్యంలో తనకు కుమారుని ఇచ్చుటకు ఎల్-షద్దాయ్ దేవుడు సమర్ధుడు అని అబ్రాహాము విశ్వసించాడు. అబ్రాహామునకు కూడా తన లోపాలు ఉన్నాయి. తన భార్యను గూర్చి అబద్ధం చెప్పాడు మరియు తమ వినోదము కొరకు అవిశ్వాసులైన రాజులకు తన భార్యను రెండుసార్లు అప్పగించాడు.

    అబద్ధము మరియు పిరికితనముతో చేసిన పనులు ఉన్నప్పటికీ కూడా, దేవుడు అబ్రాహామును ఇష్టపడ్డాడు ఎందుకంటే తన ఆజ్ఞలపై అబ్రాహామునకు విశ్వాసము ఉంది.

    బహుశా నీకున్న ప్రమాణముల ద్వారా, అబ్రాహాము అనర్హుడుగా ఉండవచ్చు. బహుశ నీ ఆలోచన ప్రకారం, అబ్రాహాము అంతటి గొప్పవాడేమీ కాకపోవచ్చు. కాని దేవుని దృష్టిలో ఆయన గొప్ప వ్యక్తి. తన యొక్క గొప్పతనం తన విశ్వాస ఫలితమే.

    దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్ధుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.

    రోమీయులకు 4:21, 22

    ప్రియ క్రైస్తవ స్నేహితుడా, నీవు దేవునియందు విశ్వసించినప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడు, నీ పట్ల ఆకట్టుకొనబడతాడు, మరియు ఇష్టత చూపుతాడు. దేవుడు నిన్ను స్వస్థపరచగలడని నీవు నమ్మినప్పుడు నీవు దేవుని సంతోషపెడతావు! దేవుడు నిన్ను వృద్ధిపరచగలడు అని నమ్మినప్పుడు, దేవుడు ఉత్తేజింపబడతాడు. నీ యొక్క పురోగతి రాబోతుంది అని నమ్మినప్పుడు, నీ పట్ల దేవుడు ఎంతో ఇష్టత చూపుతాడు. నీవు దీర్ఘకాలము జీవిస్తావని విశ్వసించినప్పుడు, నీ జీవితమును పొడిగించులాగున దేవుడు ప్రేరేపించబడతాడు. దేవుడు నీకు అభివృద్ధిని మరియు సమృద్ధిని ఇస్తాడు అని నమ్మినప్పుడు, ఎల్-షద్దాయ్ యొక్క అంతరంగమును నీవు ఉత్తేజపరుస్తున్నావు. నీ జీవితములో తన ఆశీర్వాదముల యొక్క పాలను పోయులాగున నీవు ఆయనను చేయగలవు.

    యెహోవా యొక్క గొప్ప ఆశీర్వాదములో నీవు నడవడం నేను చూస్తున్నాను! దేవునిలో సమృద్ధియైన జీవనాన్ని నీవు జీవించుట నేను చూస్తున్నాను! బలహీనత మరియు రోగముల నుండి నీవు విడిపింపబడుట నేను చూస్తున్నాను! నీ జీవితములోని శాపగ్రస్త శక్తులు విరిగిపోవడం నేను చూస్తున్నాను! నీవు దేవునియందు విశ్వాసముంచుతున్నావు గనుక ఆయన నీ యందు ఇష్టపడడం చూస్తున్నాను!

    నేడు మొదలు, దేవుని వాక్యములోని ఏ భాగమును కూడా అనుమానించవద్దు. ఆయన మాట్లాడుతున్న ఆ విజేత నీవే అని నీవు అంగీకరించు. అభివృద్ధి, స్వస్థత మరియు సమృద్ధి అనే సందేశముతో నిండుకొని యుండు. నీవు దేవుని యందు విశ్వాసముంచినప్పుడు ఆయన సంతోషముగా ఉంటాడు అని ఎప్పుడు జ్ఞాపకముంచుకో.

    దేవుడు పేదరికానికి దేవుడు కాడు. నేను ప్రభువును తెలుసుకొనినది మొదలు నేను ఏ విధముగాను తగ్గిపోలేదు. తరిగిపోవడం, విఫలమవడం, ఓడుదుడుకులు మరియు పరిమితులు వీటన్నిటిని గూర్చి పరిశుద్ధ గ్రంథములో మనము చదవము. నా శత్రువులకంటే ఎక్కువ సమృద్ధిని, ఉన్నతిని మరియు విమోచనను మాత్రమే నేను చూస్తున్నాను. ప్రతిదినము దేవుడు నన్ను లేవనెత్తడం చూస్తున్నాను! నిన్ను దిగజార్చి నీకు అవమానమును కలిగించుటకు దేవుడు క్రీస్తులోనికి నిన్ను తీసుకొనిరాలేదు. సమృద్ధి జీవమునకు నిన్ను లేవనెత్తి దానిలో నిన్ను స్థిరపరచుటకు ఆయన నిన్ను క్రీస్తులోనికి తీసుకొనివచ్చాడు. మనకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును యేసు ఈ లోకములోనికి వచ్చాడు (యోహాను 10:10).

    విశ్వాసముగల వారిని యేసు ఆశీర్వదించాడు

    యేసు చేసిన పరిచర్య పరిధిలో, చాలా మంది ప్రజలు వ్యక్తిగత పురోగతిని సాధించారు. వారెవరు? మరియు వారు ఎందుకు ఈ అద్భుతములను అందుకున్నారు?

    రక్తస్రావముగల స్త్రీ విషయములో యేసు ఏమి చెప్పాడో మీరు గుర్తుంచుకొనే ఉంటారు. ఎటువంటి పురోగతి కూడా లేకుండా తన జీవితములో పండ్రెండు సంవత్సరములు బాధ అనుభవించిన స్త్రీ ఈమె. ఈమె యేసునొద్దకు వచ్చి ఒక అసాధారణమైన అద్భుతాన్ని పొందుకొంది. తనకొచ్చిన ఈ పురోగతికి కారణమేమి? మార్కు 5:34లో యేసు జవాబు ఇచ్చాడు.

    ... కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను...

    మార్కు 5:34

    గ్రుడ్డివాడైన బర్తిమయి అద్భుతరీతిగా తన చూపును పొందుకున్నాడు. యేసు యొక్క కార్యక్రమమును చాలా అభ్యంతరపెట్టిన ఒక గోలవాడు ఈ వ్యక్తి. తన రహస్యమేమి? దేవునిలో విశ్వాసమే ఆయన యొక్క రహస్యం. అడుగుట వలన, పొందుట వలన మరియు దానిని స్వీకరించుట వలన ఈయన తన స్వస్థతను పొందాడు. యేసు బర్తిమయితో ఏమి చెప్పాడో చూడండి:

    ...నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను.

    మార్కు 10:52

    యేసు పాదములపై అత్తరు బుడ్డిని పోసిన ఆ పాపాత్మురాలైన స్త్రీ కూడా క్షమాపణ అనే అద్భుతాన్ని పొందుకుంది. యేసు ఎందుకు ఆమెను క్షమించాడు? యేసు ఆమెతో అన్నాడు కదా,

    ...నీ విశ్వాసము నిన్ను రక్షించెను.

    లూకా 7:50

    పక్షవాయువుగలవారు స్వస్థత పొందారు కాని ఒకడు మాత్రమే కృతజ్ఞత చెల్లించడానికి తిరిగివచ్చాడు. తిరిగి వచ్చినవాడు స్వస్థపరచబడ్డాడు. ఈ పక్షవాయువుగలవాడు మాత్రమే అధిక ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకున్నాడు? ఈయనతో కూడా యేసు ఇదే మాటను చెప్పాడు.

    ...నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.

    లూకా 17:19

    ఇద్దరు గ్రుడ్డివారు యేసునొద్దకు వచ్చి దేవుని కరుణ కొరకు వేడుకున్నారు. యేసు వారిని ముట్టుకొని వారిని స్వస్థపరచాడు. కొంతమందికి ఇటువంటి శుభకార్యములు జరుగులాగున చేసేది ఏమిటి? ఈ ఇద్దరి మనుష్యులకు యేసు చెప్పిన మాట ఏమిటి?

    ...మీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో...

    మత్తయి 9:29

    నీ ప్రేమయే నిన్ను స్వస్థపరచినది అని యేసు ఎన్నడు కూడా చెప్పలేదు అనే విషయాన్ని గమనించారా?

    నీ పరిశుద్ధత నిన్ను స్వస్థపరచినది అని ఎప్పుడు యేసు చెప్పలేదు.

    నీ సహనము ప్రకారముగా, నీకు కలుగును గాక అని ఆయన ఎన్నడు చెప్పలేదు.

    నీ మంచి స్వభావము నిన్ను స్వస్థపరచినది అని యేసు ఎందుకు చెప్పలేదు?

    నన్ను అపార్థం చేసుకోకండి! ఈ లక్షణాలు ప్రాముఖ్యం కావు అని నేను చెప్పుట లేదు!

    Enjoying the preview?
    Page 1 of 1