Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

కుమార్తె నీవిది చేయగలవు
కుమార్తె నీవిది చేయగలవు
కుమార్తె నీవిది చేయగలవు
Ebook289 pages1 hour

కుమార్తె నీవిది చేయగలవు

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఈ పుస్తకము కుమార్తెల యొక్క గాయములను స్వస్థపరచును! చాలా కాలముగా ఎదురుచూచుచున్న ఈ పుస్తకములో, వారు ఎదుర్కొనే అనేక అసాధ్యమైన పరిస్థితులను అధిగమించుటకు వారికి దేవుని యొక్క జ్ఞానము సహాయపడాలని స్త్రీలు సవాలుచేయబడెను. ప్రత్యేకముగా కుమార్తెలకు వ్రాయబడిన ఈ శక్తివంతమైన నూతన పుస్తకమును నీవు ఆనందించుచుండగా దేవుడు నీ జీవితమును తాకి నిన్ను బలపరచును.

LanguageTelugu
Release dateMay 25, 2018
ISBN9781683985853
కుమార్తె నీవిది చేయగలవు
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to కుమార్తె నీవిది చేయగలవు

Related ebooks

Reviews for కుమార్తె నీవిది చేయగలవు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    కుమార్తె నీవిది చేయగలవు - Dag Heward-Mills

    స్త్రీలు

    ఈ పుస్తకమును నేను స్త్రీల కొరకు వ్రాస్తున్నాను. అన్ని చోట్లను ఉండే స్త్రీలకు ఇది ఒక సందేశము. పురుషుల కంటే స్త్రీలు వ్యత్యాసముగా సృష్టింపబడ్డారు మరియు వారికి ఒక ప్రత్యేకమైన సందేశము కావాలని నేను నమ్ముచున్నాను.

    రెండు వేరు వేరు విధములలో యేసు స్త్రీలను గూర్చి ప్రస్తావించాడు. ఆయన వారిని స్త్రీలారా అని కాని లేదా కుమార్తె/కుమారీ అని గాని పిలిచేవాడు.

    కుమార్తెకును మరియు స్త్రీకును మధ్య కొంత తేడా ఉంది. ఒకవేళ నేను అమ్మాయినయితే, యేసు నన్ను కుమార్తె అని పిలవాలని అనుకుంటాను. సాధారణంగా కుమార్తె అనునది మరింత ఆదరంగా, మరింత ఉదారంగా మరియు మరింత దీనంగా ఉంటుంది. సహజములో, ఒక వయసైన స్త్రీని ప్రభావితం చేయడం కంటే ఒక కుమార్తెను ప్రభావితం చేయడమే సులువు.

    జీవితము యొక్క చేదుదనం

    తమ జీవితాలలోని అనేకమైన అనుభవాల వలన చాలా మంది స్త్రీలు నీరసపడిపోతారు. వారు కఠినమౌతారు, క్షమించలేక పోతారు మరియు కరుణలేనివారిగా మారతారు. జీవితములోని బాధాకరమైన అనుభవములు వారిలోని విశ్వాసము మరియు నమ్మకము అను గుణముల యొక్క సౌందర్యాన్ని తుడిచివేసాయి. ఎప్పుడూ మగవాడిని నమ్మవద్దు అని వారు అంటుంటారు. మరొక స్త్రీని కూడా నమ్మ వద్దు అని వారిలో వారు అనుకుంటారు. ఎంత మంది స్త్రీలు ఏకాంతంలో జీవిస్తూ ఉంటారో నేను గమనించాను. ఆఖరుకు కనీసం కొంతమంది స్నేహితులు కూడా లేని ఏకాకులు వారు.

    సమరయ స్త్రీతో యేసు ఎలా మాట్లాడాడో గమనించండి. ఆయన చెప్తున్న సంగతులను ఈ స్త్రీ నమ్మునట్లు ఆయన ప్రయత్నిస్తున్నాడు.

    . . . అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు.

    యోహాను 4:21

    వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో యేసు ఎలా మాట్లాడాడో గమనించండి. క్షమించనొల్లని పురుషుల చేతిలో దరిదాపుగా తన జీవితాన్నే పోగొట్టుకోబోయిన స్త్రీ ఈమె. ఆమె మరలా ప్రేమయందు విశ్వసించాలని యేసు భావించాడు.

    . . . అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె – లేదు ప్రభువా అనెను. అందుకు యేసు – నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.

    యోహాను 8:10, 11

    పార్శ్వగూనితో (వంగిపోయిన నడుముతో) పద్దెనిమిది సంవత్సరములు బాధపడుతున్న ఈ స్త్రీతో యేసు ఎలా మాట్లాడాడో కూడా గమనించండి. ఈ స్త్రీ అనేకమైన అనుభవాలను అనుభవించింది. ఆమె ఈ క్రూరత్వంలో మరియు బాధలో ఎంతో కాలంగా ఉంది. ఈమెకు ఒక అద్భుతం అవసరమైయుంది. సమాజ మందిరములో ఉండగా యేసు ఈమెను ఎలా సంబోధించాడో గమనించండి:

    . . . యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి – అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి ఆమెమీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.

    లూకా 13:12, 13

    అధ్యాయము 2

    కుమార్తెలు

    సహజంగా మాట్లాడితే, కుమార్తెలు అంతగా క్రూరత్వంతోను మరియు క్షమించలేనితనముతో నిండుకొని ఉండరు. వారిలో కొంత మాధుర్యం మరియు అమాయకత్వము ఉంటుంది, ఇవే కుమార్తెలకు లక్షణాలుగా ఉంటాయి. వీటన్నిటికి పైన, తన తండ్రి పట్ల ప్రతి ఒక్క కుమార్తెకు ఒక ప్రత్యేకమైన నమ్మకము మరియు విశ్వాసము ఉంటాయి. అదృష్టవశాత్తు, కుమార్తెలు స్త్రీలుగా పరిణతి పొందు కొలదీ వారిలో ఉన్న ఆ నమ్మకం, నిరీక్షణ, మరియు ప్రేమ కొద్దికొద్దిగా హరించుకొనిపోతూ ఉంటాయి.

    కొంత మంది స్త్రీలను యేసు కుమార్తెలారా అని కూడా సంబోధించాడు. ఆయనపై వారికున్న విశ్వాసము వలన కాబోలు ఆయన అలా పిలిచి ఉంటాడు అని నేను నమ్ముతాను. తన పట్ల వారికున్న శుద్ధమైన ప్రేమను ఆయన గమనించాడు.

    యేసు జరిగించిన అతిగొప్ప అద్భుతాలలో ఒకదానిలో, రక్తస్రావముగల స్త్రీని బాగుపరచిన విషయములో, ఆమెను యేసు కుమార్తె అని సంబోధించడం చూడగలం! ఈ స్త్రీ తనకు చుట్టు ఉన్నవారు ఏమీ అనుభవించలేక పోయినను యేసులో ఉన్న ఆ అభిషేకాన్ని ఈమె పొందుకొనగలిగింది.

    . . . తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను.

    మార్కు 5:29

    యేసు – ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలిపోయినదని, నాకు తెలిసినదనెను.

    లూకా 8:46

    ఈ కుమార్తె విషయములో ఒక సంగతిని మీరు గమనించాలి అని నేను అనుకొంటున్నాను. మొదటిగా, యేసు యొక్క సామర్థ్యంలో ఈమెకు గొప్ప నమ్మకం ఉంది. తన రుగ్మతలో మరియు బలహీనతలో, తన వస్త్రపు చెంగును ముట్టునంత వరకు ఈమె ఆ జనములోనుండి చొచ్చుకొని రాగలిగింది.

    కిక్కిరిసియున్న ఆ జనమంతటిని దాటుకొని రావడానికి ఈ స్త్రీకి గొప్ప విశ్వాసం ఉండి ఉంటుంది. ఈమెను గొప్ప కుమార్తె చేసిన సంగతి ఇదియే: విశ్వాసము మరియు నమ్మకం. వివిధ ప్రజలతో ఈమెకు పండ్రెండ్రు సంవత్సరములుగా ఉన్న చేదు అనుభవాలు తన హృదయములో ఉన్న విశ్వాసమును చల్లార్చుటకు సరిపడలేదు.

    స్త్రీలారా జాగ్రత్త

    కొన్నిసార్లు, వివిధ పురుషులతో స్త్రీకున్న పాపసహితమైన అనుభవాల గతము వలన వేరొక పురుషుని నమ్మడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది. తన తండ్రి మీదను, సంఘ కాపరి మీదను లేదా వేరే దైవసేవకుని మీదను చాలా తక్కువ నమ్మకం ఉండునట్లు చేస్తుంది. మంచితనము మరియు పరిశుద్ధత అనువాటి యొక్క మనుగడను ఈమె అంత సులువుగా నమ్మలేదు. కొన్నిసార్లు, సందేహము మరియు కొండెములాడడం అనే వాతావరణంలో పెరుగుట గలన, శాశ్వతముగా అపనమ్మకం అనే బీజాలు నాటబడతాయి. రూపకముగా, నమ్మకము లేని స్త్రీ ప్రేమించడం కూడా కష్టమే. ఆమె భయముతో నిండుకొని ఉంటుంది. పరిపూర్ణ ప్రేమ భయమును పారద్రోలుతుంది. పరిశుద్ధ గ్రంథము చెప్తుంది ప్రేమ అనునది . . .

    . . . అన్నిటిని నమ్మును. . .

    1 కొరింథీయులకు 13:7

    కుమార్తెలు తమ తండ్రుల యొక్క అభిషేకమును పొందుతారు

    ఈ కుమార్తెలో (రక్తస్రావము గల ఈ స్త్రీ) ఉన్న మరొక అసాధారణ విషయం ఏమంటే, ఈమె యేసు యొక్క అభిషేకమునే పొందగలిగింది. అభిషేకము అనునది ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తిలోనికి స్రవించడం మరియు దీనిని ఇరు పక్షాల వారు అనుభవించడం అనేది పరిశుద్ధ గ్రంథములోనే ఇది మొట్టమొదటిసారి. ప్రభావము తనను వదిలి వెళ్ళడం యేసు అనుభవించాడు మరియు ఈ కుమార్తె కూడా ప్రభావం తన శరీరంలోనికి రావడం అనుభవించింది.

    మీరు చూడండి, తన తల్లిదండ్రుల నుండి అత్యంత ప్రశస్తమైన బహుమతులను కేవలం పిల్లలు మాత్రమే పొందుకొనగలరు. తమ తండ్రుల నుండి స్వాస్థ్యాన్ని పొందుకొనేది తన పిల్లలేగాని తమ పిల్లల తోటివారో లేక తమ పిల్లల స్నేహితులో కాదు.

    ప్రతి స్త్రీ జీవితములో ఒక సమయము వస్తుంది, ఆ సమయములో ప్రతి స్త్రీ పురుషుని యొక్క అధికారాన్ని సవాలు చేయడానికి పూనుకుంటుంది. నేను ఈ విషయంలో ఆమెను నిందించడం లేదు ఎందుకంటే ఎంతో మంది పురుషులు తన జీవితంలో భాధ్యతారహితులుగా మరియు అపనమ్మకస్తులుగా ఉన్నారు.

    ఏమైనప్పటికీ, పురుషులకు విరోధముగా పోరాడడం మరియు వారి అధికారమునకు వ్యతిరేకముగా పనిచేయడం అనేది కేవలం నీ అభిషేకమును మాత్రమే తీసివేయగలుగుతుంది. దేవుని వరముల పట్ల నిత్యమూ నీకు విరోధ ధోరణే ఉంటుంది. మీరు చూడండి, దేవుడు వాడుకొనే అనేకమైన ఘటములు పురుషులే.

    నీవు ఒకరిని తండ్రిగా పొందుకొన్నప్పుడు, తన నుండి శ్రేష్టమైన ఒక బహుమతిని కూడా పొందుకొనుటకు నిన్ను నీవు సిద్ధపరచుకొంటావు. బహుశా, ఇందువలననేమో యేసు ఈమెను కుమార్తె అని సంబోధించాడు.

    . . . అందుకాయన, కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని చెప్పెను.

    మార్కు 5:34

    కుమార్తెలు ఎల్లప్పుడూ ఉండేవారు

    మరొక సంఘటనలో, యేసు సిలువతో తన మార్గములో ఉన్నప్పుడు, గొప్ప జనసమూహము ఆయనను వెంబడించారు. ఈ జనములో, ఆయనకు జరిగిన అన్యాయమును గూర్చి బాధతో ఉన్న స్త్రీలు కొంతమంది ఉన్నారు. బహిరంగంగా వారు ఆయనకు మద్దతు పలికారు మరియు ఆయనతో బహిరంగంగా గుర్తింపబడ్డారు.

    పురుషులందరూ మరియు ప్రభువు యొక్క శిష్యులందరు ప్రభువును విడనాడి వెళ్ళిన ఆ తరుణములో, స్త్రీలు బలముతో ఆయన పక్షమున నిలిచున్నారు. యేసు వారి వైపునకు తిరిగి తన హృదయములో నుండి ప్రవచన వాక్కులను అందించాడు. ఆయనకు మద్దతు పలుకుతున్న ఈ స్త్రీలను చూచి ఆయన స్త్రీలారా అని పలుకలేదు, కాని కుమార్తెలారా అన్నాడు.

    . . . యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.

    లూకా 23:28

    యేసు కుమార్తెలాగా పరిగణించే ఒక స్త్రీవలె నేను కూడా ఉండాలని నిశ్చయించుకో. అభిషేకము పట్ల సుముఖముగా ఉండే వ్యక్తిలాగా! దేవుని సేవకులకు కొంత ఊతనిచ్చే వ్యక్తివలె! బహిరంగంగా మరియు భారముతో దర్శనముతో పాటు గుర్తించబడుటకు సిద్ధపడిన వ్యక్తిలా ఉండటానికి నిశ్చయించుకో!

    అధ్యాయము 3

    ముసుగు వేసుకోవడం

    స్త్రీలకు ముసుగు వేసుకోవడం అవసరం

    తమ జీవితములలో ముసుగు అనేది స్త్రీలకు చాలా అవసరం. ఈ ముసుగు ఒక భద్రతావలయములా పని చేస్తుంది. అదృష్టవశాత్తు, ఈ వాస్తవమును గుర్తించని స్త్రీలు అనేకమంది ఉన్నారు. వారు తమను తాము పురుషులతో సామానులుగా మరియు వారివలెనె అన్నిటిలో మనగలిగేవారిగా ఎంచుకొంటారు.

    ఏ స్త్రీ తన తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును . . .

    1 కొరింథీయులకు 11:5

    ఈ వాస్తవాలను నీవు కేవలం దీన స్వభావముతో మాత్రమే అంగీకరించగలవు. ఒక చిన్న పిల్లవానికి ఉండే మనసును కలిగి ఉండడం ద్వారా దేవుని రాజ్యమును తేలికగా అనుసరించవచ్చు.

    . . . మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    మత్తయి 18:3

    ఒక స్త్రీ ఆత్మీయముగా కప్పబడడం అనేది చాలా ప్రాముఖ్యం మరియు ఈ కప్పబడడం అనేది తలపై ముసుకు వేసుకోవడం ద్వారా వస్తుంది. స్త్రీ వివాహిత యైనను కాకున్నను, తనకు కావాల్సిన ముసుకు ఆమె వేసుకోవాలి.

    . . . స్త్రీకి శిరస్సు పురుషుడనియు . . .

    1 కొరింథీయులకు 11:3

    ఈ ముసుకు కొన్నిసార్లు భర్తలచే, కొన్నిసార్లు సంఘకాపరులచే లేదా ఆత్మీయ తండ్రులచే కూడా అందించబడుతుంది. ఆత్మసంబంధమైన ముసుకు వేసుకొనకుండా పరిచర్య చేసే స్త్రీ అవసరం లేదు. సుస్పష్టంగా, నీవు ఒక అవిశ్వాసిని పెండ్లాడినట్లయితే,

    Enjoying the preview?
    Page 1 of 1