Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

కలిగినవానికి ఇయ్యబడును: లేనివాని నుండి కలిగినదియు తీసివేయబడును.
కలిగినవానికి ఇయ్యబడును: లేనివాని నుండి కలిగినదియు తీసివేయబడును.
కలిగినవానికి ఇయ్యబడును: లేనివాని నుండి కలిగినదియు తీసివేయబడును.
Ebook455 pages2 hours

కలిగినవానికి ఇయ్యబడును: లేనివాని నుండి కలిగినదియు తీసివేయబడును.

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

సంపద మరియు ఐశ్వర్యమును పరిపాలించు ఆశ్చర్యకరమైన నియమమును యేసుక్రీస్తు బయలుపరచుచున్నాడు. కలిగినవాడు మరింత కలిగియుంటాడు! అది ఎంత అన్యాయముగా అనిపిస్తుంది! అయినప్పటికీ, ప్రతిరోజు మనముందు వ్యక్తమవుచున్న వాస్తవము అది.
ఈ పుస్తకము కొద్దిగా అర్థమైన లేఖనమును వివరించుటకు ప్రయత్నిస్తుంది. Dag Heward-Mills యొక్క ఈ నూతన పుస్తకమును నీవు అధ్యయనము చేయుచుండగా నీవు సంపన్నత యొక్క మర్మములలోని గొప్ప మెళకువలు పొందు కొంటావు.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641348379
కలిగినవానికి ఇయ్యబడును: లేనివాని నుండి కలిగినదియు తీసివేయబడును.
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to కలిగినవానికి ఇయ్యబడును

Related ebooks

Reviews for కలిగినవానికి ఇయ్యబడును

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    కలిగినవానికి ఇయ్యబడును - Dag Heward-Mills

    కలిగినవాడు మరియు లేనివాడు

    ఇది నిజమా?

    కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడును.

    మార్కు 4:25

    ఇది వినుటకు కొంత ఆశ్చర్యముగా ఉన్న లేఖనభాగమైనప్పటికీ కూడా ఇది వాస్తవమైనదే అయి ఉంటుంది! ఎంతగా అన్యాయంగా కనిపించే వాక్యభాగమో కదా! డబ్బులు ఉన్న వారే మరింత ఎక్కువయైన డబ్బును ఎందుకు పొందుకోవాలి? అసలు ఏమీ లేకుండా ఉన్నవారిదగ్గర నుండే ఎందుకు తమకు ఉన్న కొంచెము కూడా తీసివేయబడాలి? వాస్తవమైన జీవితములో, కలిగియున్నవారికే మరింత ఎక్కువ ఎందుకు ఇవ్వబడుతుంది? మనము ఆశించినదానికి అసలు పూర్తి విరుద్ధముగా ఎందుకు పనులు జరుగుతుంటాయి?

    ఈ వాక్యభాగము కొంతమేర అన్యాయముగా అనిపించినప్పటికీ, రెండు కారణముల వలన ఇది వాస్తవమైనది. యేసు దీనిని పలికాడు గనుక ఇది వాస్తవము. ఆకాశము భూమి గతించిపోవును కాని ఆయన మాటలు ఎన్నటికిని గతించావు (మత్తయి 24:35). ఇప్పటివరకు మాట్లాడబడిన మాటలలో యేసు యొక్క మాటలే అత్యంత శక్తివంతమైన మాటలు.

    ఈ లేఖన వాక్యము వాస్తవమే అనడానికి గల రెండవ కారణము మన చుట్టూ దీనిని చూస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్కరు ఎక్కువ ఆశిస్తారు కాని ఎక్కువ పొండుకోలేరు. కాబట్టి అసలు వాస్తవముగా ఎవరు ఎక్కువ పొందుకుంటున్నారు?

    ఎక్కువగా లేనివారు కూడా ఇతరులతో సమానముగా తేబడాలి అని మనము అనుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరికి కనీసము మౌలిక సదుపాయాలు అయినా ఉండాలి అని మనము అనుకుంటాము. అయినప్పటికీ, కలిగినవాడే ప్రతిదానిలో మరింత ఎక్కువగా పొందుకుంటూ ఉండడం మన జీవితము మరియు చరిత్ర మనకు చూపిస్తుంది. ఒకసారి నీ చుట్టూ చూసి అసలు తమ వద్ద ఏమీ కూడా లేకుండా ఉన్నవారే తమకున్న ఆ కొంచెమును కూడా కోల్పోతున్నారు అని గమనించు! యేసు చెప్పిన మాటలు సత్యమైనవి అని మనందరమూ చూడగలము.

    ఈ పుస్తకము ఆద్యంతము కూడా విచిత్రముగా అనిపించే ఆ వాక్యముపైనే ఉంటుంది. విచిత్రముగా అనిపించే ఈ వాక్యము భౌతికమైన మరియు ఆత్మీయమైన విషయములకు కూడా వర్తిస్తుంది అని మీరు తెలుసుకుంటారు. కలిగియున్నవాడు అంటే అర్థము ఏమిటో చూద్దాం.

    భౌతికమైన సంగతులను కలిగినవాడు

    ధనము, ఇండ్లు మరియు కారులు కలిగియున్నవాడికే ఎక్కువ ధనము, ఎక్కువ ఇండ్లు మరియు ఎక్కువ కారులు ఉంటున్నాయి.

    ధనికులు (కలిగినవారు) మరింత ధనికులుగా అవుతూ అసలు కొదువులేనివారుగా ఉంటుండగా ప్రతిదినము కూడా బీదలు మరింత బీదలుగా అవుతున్నారు.

    ప్రపంచములో పేద ఖండమైన ఆఫ్రికా గడిచిన ముప్పది సంవత్సరములలో నిలకడగా మరింత దారిద్ర్య స్థితిలోకి దిగజారుతున్న ఒకేఒక్క భూభాగము. ఇప్పటికే సంపన్నమైన అమెరికా మరియు ఐరోపా ఖండాలు మరింత సంపన్నమైనవిగా మారి తమ బంగారు నిల్వలను, తమ అదృష్టములను మరియు తమ ఆస్తులను పెంపొందించుకున్నాయి. కాగా మరింత మౌలిక సదుపాయములు అవసరమైన ఆఫ్రికా మాత్రము యుద్ధముల ద్వారా మరియు తెగల మధ్య అలజడులల ద్వారా తమకున్న కొద్దిపాటి మౌలిక సదుపాయాలను కూడా కోల్పోయింది.

    ఒక ఇంటిని నిర్మించిన ఒక వ్యక్తి మరి కొన్ని ఇండ్లను కట్టగలడు అనేది స్పష్టముగా కనబడుతుంది. అసలు ఒక్కసారి కూడా ఇంటిని కట్టలేని వాడు భవిష్యత్తులో ఒక యింటిని కట్టగలడు అనే అవకాశములు చాల తక్కువ. ఇల్లు లేకుండా ఉండే ఒక వ్యక్తియే తనకున్న ప్రస్తుత నివాసమును కూడా కోల్పోటానికి ఎక్కువ అవకాశములు కలిగియున్నాడు. ఇంటిని నిర్మించని ఒక వ్యక్తి తన యింటి యజమానుని ద్వారా బయటకు నెట్టివేయబడే అవకాశములు ఎక్కువగానే ఉన్నాయి.

    కారులు ఎక్కువగా కలిగియున్న ప్రజలే భవిష్యత్తులో మరి ఎక్కువ కారులు కలిగియుండటానికి అవకాశములు ఉన్నాయి. కారులు లేని బీదవారు మరియు ఎప్పుడు కూడా బస్సులలో మరియు టాక్సీలలో పయనించేవారు రానున్న సంవత్సరములలో కూడా అదే బస్సులలో మరియు టాక్సీలలోనే ప్రయాణించే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి.

    ఉద్యోగము కలిగినవాడికే మరెక్కువ ఉద్యోగ అవకాశములు వస్తున్నాయి.

    ఉద్యోగము ఉన్నవాడే మరి ఎక్కువ ఉద్యోగములను పొందుకొనుటకు ఎక్కువ అవకాశములు కలిగియున్నాడు. ఒకవేళ మీరు Golden Tulip అనే హోటల్ లో వంటకానిగా పనిచేస్తున్నట్లయితే క్రొత్తగా పెడుతున్న Sheraton అనే హోటల్ లో కూడా వంట చేయుటకు నీవే ఆహ్వానించబడతావు. దురదృష్టవశాత్తు, స్థానిక కేటరింగ్ స్కూల్ లో అప్పుడప్పుడే వంటకాని కోర్సు పూర్తిచేసిన వాడికి అదే Sheraton హోటల్ లో ఉద్యోగము రావడానికి అవకాశములు చాలా తక్కువే. ఉద్యోగమును కలిగియున్నవాడే మరొక ఉద్యోగమును పొందుకొనే అవకాశము ఎక్కువగా కలిగియున్నాడు. ఒక బ్యాంకులో కోశాధికారిగా పనిచేసే వాడే దీనికంటే మరింత ఉన్నతమైన ఉద్యోగము నిమిత్తము వేరొక బ్యాంకు వారిచే అవకాశము ఇవ్వబడతాడు. విచారమేమంటే, ఒక విశ్వవిద్యాలయములో రెండు డిగ్రీలను పొందినవాడిని కూడా ఈ విధంగా బ్యాంకువారు సంప్రదించరు. ఈ వ్యక్తి చాలా ఆశక్తితో ఉద్యోగము కొరకు వెదకుకోవాలి మరియు అనేక సార్లు నిరాశపరచబడతాడు కూడా.

    బిడ్డను కలిగియున్నవాడికే మరెక్కువ మంది పిల్లలు ఉంటున్నారు.

    బిడ్డలు కలిగియున్న వారే తరువాతి బిడ్డకు జన్మనిచ్చే అవకాశములు ఎక్కువగా కలిగియుంటారు. ప్రస్తుతానికి తల్లులుగా ఉన్నవారే మరొకమారు తాము గర్భవతులు అయినందున కొంచెం విచారముగా ఉండడం సర్వసాధారణం. అట్టివారికి అప్పటికే ఎక్కువమంది పిల్లలు ఉంటారు. విచారంగా, అసలు పిల్లలు అనేవారు లేనివారు మాత్రమే ఒక్కరినైనా కనాలని ఎంతో కష్టపడుతుంటారు. ఇది చాల విచారకరమైన అసంభవము కాని ఇదే మన లోకములో వాస్తవము.

    రాజకీయ అధికారము కలిగియున్నవాడికే మరింత రాజకీయ అధికారము వస్తుంది.

    రాజకీయంగా అధికారము కలిగియున్న కుటుంబాలు మరింత అధికమైన రాజకీయ అధికారమును పొందుకొనుటకు ఎక్కువ అవకాశములు కలిగియున్నారు. బుష్ కుటుంబములో ఇద్దరు అమెరికా అధ్యక్షులు ఎందుకు ఉండాలి? అని మీరు అడగవచ్చు. లేదా కెన్నెడీ కుటుంబములో ఇద్దరు అధ్యక్షులు ఎందుకు ఉండాలి? అని మీరు ఆనుకొనవచ్చు.

    వారొక కుటుంబములో నుండి కూడా ఒక ప్రసిద్ధిగాంచే రాజకీయవేత్తలు లేదా అధ్యక్షులు వస్తే బాగుండునని నీవు ఆనుకొనవచ్చు. కాని అప్పటికే ప్రసిద్ధమైన కుటుంబములో నుండే మరి ఎక్కువ మంది అధ్యక్షులు రావడానికి ఎక్కువ అవకాశములు ఉన్నాయి.

    విద్యను కలిగియున్నవాడే మరింత ఎక్కువ విద్యను కలిగియుంటున్నాడు.

    న్యాయవాదులు మరియు వైద్యులు ఉన్న కుటుంబమే మరికొంత మంది న్యాయవాదులకు మరియు వైద్యులకు జన్మనివ్వడానికి అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. నిరక్షరాస్యులైన కుటుంబము లేదా గ్రామస్తులు న్యాయవాదులు, వైద్యులు మరియు శాస్త్రవేత్తలుగా తరువాతి కాలములో అయ్యే వారికి జన్మనివ్వడం చాలా అసహజం.

    కాబట్టి, మరొకసారి లేఖనము నెరవేర్చబడినది. తన కుటుంబములో విద్యావేత్తలైన వారు ఉంటే తన కుటుంబములో మరి ఎక్కువ మంది విద్యావేత్తలను పొందుకుంటాడు. తన కుటుంబములో విద్యావేత్తలు లేనివాడు తనకున్న దానిని కూడా పోగొట్టుకొనే స్థితిలో ఉన్నాడు.

    ఉన్నతమైన స్థానములో ఉన్న స్నేహితులు కలిగినవాడికే మరెక్కువ మంది స్నేహితులు కలుగుతున్నారు

    ఉన్నతమైన స్థానములో స్నేహితులు కలిగియున్నవాడికి సంవత్సరములు గడచుచుండగా మరింత ప్రాముఖ్యమైన ప్రజలు పరిచయం కావడానికి ఎక్కువ అవకాశములు ఉన్నాయి. ఒక ఇంజినీరునో, వైద్యుడినో లేదా ఒక న్యాయవాదినో ఎరుగని ఒక గ్రామస్తుడు లేదా ఒక బీదవాడిన నిరక్షరాస్యుడు వచ్చే సంవత్సరానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తితో పరిచయం కలిగియుండడానికి అవకాశములు చాల తక్కువ. నిజానికి తన దారిద్ర్యము వలన, తన పట్ల ఉన్న కొంత ఇష్టాన్ని కూడా ప్రజలు కోల్పోతారు మరియు తనకున్న స్నేహితులు తరచుగా తగ్గిపోతూ ఉంటారు.

    ప్రసిద్ధిగాంచినవాడే మరింత ఎక్కువగా ప్రసిద్ధి పొందుతున్నాడు

    ప్రసిద్ధిగాంచిన వాడే తాను చేస్తున్న పనులను చేస్తూ కొనసాగిస్తూ ఉంటే మరింత ప్రసిద్ధమయ్యే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. గ్రామములో ఉండే ఒక అనామకుడు రాబోయే సంవత్సరములో ప్రసిద్ధిగాంచిన వాడు అవుతాడా అంటే అవకాశములు లేవు.

    ఆత్మీయమైన సంగతులను కలిగినవాడు

    దేవుని గూర్చిన జ్ఞానమును కలిగినవాడు ఈ జ్ఞానములో మరింతగా వృద్ధి పొందగలడు. అతడు దేవుని గూర్చిన జ్ఞానములోను మరియు భయములోను వృద్ధిపొందుటకు ఎక్కువ అవకాశములు కలిగియున్నవాడు. అభిషేకించబడిన ఇటువంటి వారు రానున్న సంవత్సరములలో మరింతగా అభిషేకమును పొందుకొనే అవకాశములు ఉన్నాయి.

    అనేకమైన ఆత్మలను సంపాదించిన సువార్తీకుడు రానున్న సంవత్సరములో మరెక్కువైన ఆత్మలను సంపాదించగలడు. ఇటువంటి వాడు మరింత పెద్దవైన సభలను కలిగే అవకాశములు ఉండగా చాల చిన్న చిన్న సమూహమును మాత్రమే ఆకర్షించగలిగిన ఒక సువార్తీకుడు మాత్రము తనకొచ్చే ఆ కొద్దిపాటి సమూహమును కూడా పోగొట్టుకొనే అవకాశములు ఉన్నాయి.

    పెద్ద సంఘమును కలిగియున్న దైవసేవకుడు రానున్న సంవత్సరములో మరింత పెద్ద సంఘమును కలిగియుండగలడు. పెద్ద సంఘము కలిగియున్న సేవకుడు మరింత పెద్దదైన సంఘమును కలిగియుండే అవకాశము ఎక్కువ. చిన్న సంఘము మరింత చిన్నదిగా అవుతుంది. చిన్న సంఘము తనకున్న సభ్యత్వముఉ కూడా నిదానముగా కోల్పోయి పెద్ద సంఘముకంటే కూడా త్వరగా మూతపడే అవకాశము ఉంది.

    అభిషిక్తుడైన దేవుని సేవకుడు మరింత వరములుగల వాడిగా మరియు అభిషిక్తునిగా ఉండగలడు. వారు మరి ఎక్కువ మందికి సువార్త ప్రకటిస్తారు మరియు ప్రభువు కొరకు అనేకమైన ఆశ్చర్యకర కార్యములు చేస్తారు. కానీ వరములు లేనివారు మాత్రము చాలా తక్కువగా ఆకర్షించేవారౌతారు. ఇట్టివారు మరింత అభిషేకము లేనివారిగా మారే అవకాశము ఉంది.

    సంఘ భవనములు కలిగియున్న దైవసేవకులు మరిన్ని భవనములను కట్టగలిగినవారిగా ఉన్నారు. తమ సంఘములు కూడుకొనునట్లు భవనములు లేనివారు వారు అద్దెతో నిర్వహిస్తున్న ఆ భవనము నుండి తోలివేయబడే అవకాశము ఉంది. చిన్న సంఘముల నుండి సంఘ సభ్యులు పెద్ద సంఘముల లోనికి వెళ్లిపోతారు, తద్వారా అప్పటికే చిన్నదిగా ఉన్న ఆసంఘాన్ని మరింత నిర్వీర్యపరచుతారు.

    అధికమైన ఆదాయమున్న సంఘములు రానున్న సంవత్సరములో మరింత అధికమైన ఆదాయమును పొందుతాయి. చిన్న మొత్తములో ఆదాయమున్న సంఘములు సభ్యులను కూడా కోల్పోతూ రానున్న సంవత్సరములో మరింత తక్కువయైన ఆదాయాన్ని పొందే అవకాశము ఉంది.

    అనేకమందిని నాయకులుగా తీర్చిదిద్దిన సువార్త పరిచారకులే మరి ఎక్కువ మందికి తర్ఫీదు ఇవ్వగలరు. ఒక్కసారి కూడా నాయకులకు తర్ఫీదును ఇవ్వలేని సేవకులు తమ తరువాత కనీసము పనిని కొనసాగించే వారు కూడా లేకుండా ఉంటారు.

    ఎందుకు ఇలా జరుగుతుంది?

    కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు తీసివేయబడును అని యేసు ఎందుకు చెప్పాడు?

    కలిగినవానికి ఎందువలన ఎక్కువ కలుగుతుంది

    కలిగినవారు తమకు కలిగియున్న వాటిని పొందుకొనే క్రమములో కొన్ని పనులు చేపట్టారు. కలిగినవారు సాధారణముగా వృద్ధిని పొందుటకు దోహదపడే అవే నియమములను పాటించుతూనే ఉంటారు.

    లేనివాడికి కలిగినదియు కూడా ఎందుకు తీసివేయబడుతుంది?

    ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి

    మత్తయి 25:28

    ఎక్కువగా లేనివారు కొన్ని నియమములను పాటించరు లేదా ఐశ్వర్యమును కూడబెట్టుకొనుటకు దోహదపడే కొన్ని సిద్ధాంతములను అనుసరించరు. సాధారణముగా, లేనివారు వారు ఉన్న ఆ దారిద్ర్య స్థితికి వారిని నడిపించిన ఆ చెడు నియమములను మరియు ఆలోచనలనే అనుసరిస్తూ వాటిలోనే కొనసాగుతుంటారు. దీనివలన వారి దరిద్రత మరింత ముదిరి వారి సమస్యము మరింత జటిలమౌతాయి.

    ఆఫ్రికా దేశములను మరియు వాటి ఆర్ధిక పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే ఏబది సంవత్సరముల క్రితము వారికున్న కడు దారిద్ర్య స్థితి మరియు మరింత జటిలమైన సమస్యలు మనకు తెలుస్తాయి. ఆఫ్రికా దేశములను వాటి వలసవచ్చినవారి దారిద్ర్యము నుండి బయటకు తీయుటకు ఏబది సంవత్సరములు పట్టియుండగా, ఇప్పుడు ఆఫ్రికా ఉన్న స్థానము నుండి దానిని పైకి లేవనెత్తుటకు మరిన్ని వేయి సంవత్సరములు పడతాయి. దీనికి కారణము ఆఫ్రికాలో కష్టములు మరియు సవాళ్లు పెరిగినవి, హెచ్చించబడినవి మరియు చాలా జటిలమైన పరిష్కారములు కలిగిన జటిలమైన సమస్యలుగా వృద్ధిపొందాయి.

    విపత్తులో, కష్టాలలో మరియు పేదరికములో ఉండి అణగారుతున్న పరిచర్యకు సహజమైన చూపుకు కూడా అందని ఎన్నో సమస్యలు తరచూ ఉంటుంటాయి. తరచూ, వాటికి పాతుకుపోయిన, జటిలమైన మరియు సుదీర్ఘకాలముగా ఉండిన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు కొన్ని సందర్భములలో జటిలమైన సమస్యలు మరింత జటిలమవ్వడం వలన సంభావించేవిగా ఉంటాయి. ఇందువలననే యేసు చెప్పాడు: కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు తీసివేయబడును అని.

    మనమేమి చేయాలి?

    మనము చేయవలసినది ఏమిటి? ఈ లోకములో – ఆత్మీయ లోకము మరియు ఆర్ధిక లోకము – ఇప్పటికే ప్రస్థానమైయున్న అసమానతలకు గల కారణములను గుర్తించాలి. మనము చూస్తున్న పెద్దపెద్ద తేడాలకు కారణమైన చిన్నచిన్న తేడాలను మనము తుర్గించాలి. కలిగినవాడు నేర్చుకొనియున్న ఆ పాఠములను మనకు కూడా అన్వయింపజేసుకోవాలి. దారిద్ర్యము నుండి ఐశ్వర్యములోనికి వెళ్ళుటకు త్వరితిగతియైన మార్గములు లేవు.

    ఇది ఐశ్వర్యము మీద వ్రాయబడిన పుస్తకము కాదు. ఆ విధంగా ఐశ్వర్యముపై వ్రాయబడిన పుస్తకముల వలన తప్పేమీ లేదు. నేను కూడా ఐశ్వర్యమందు వృద్ధిని నమ్ముతాను. యేసు పలికిన రహస్యమైన మాటలను అర్థము చేసికొనుటకు సహాయపడే పుస్తకము ఇది: కలిగినవానికి మరింత ఇయ్యబడుతుంది మరియు లేనివానికి, వాని దగ్గర ఏమి ఉందో అది కూడా తీసివేయబడుతుంది. ఈ పుస్తకములోని నియమములను నీవు అనుసరించినట్లయితే నీవు కూడా కలిగినవాడవు అవుతావు.

    ఆశ్చర్యముగా, లౌలౌకికమైన పరిశోధకులు చేపట్టిన పరిశోధనలు యేసు మాటల సత్యాన్ని ధృవీకరిస్తున్నాయి. లౌకిక ప్రజలు కనుగొన్న విషయములను విశితముగా పరిశీలిస్తే కలిగినవాడు మరెక్కువగా పొందుకోవడానికి మరియు లేనివాడు ఉన్నదాన్ని కూడా పోగొట్టుకోడానికి గల కారణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.

    యేసు యొక్క మాటలు చాలా ఉన్నతమైనవి. పరిశోధన లేకుండా కూడా, ఈ లోకములో ఉన్న కలిగినవారు మరియు లేనివారు అను వర్గములు ఎలా పుట్టాయో వివరించే మాటలు యేసు మాటలు.

    ఈ పుస్తకములో బయలుపరచబోవుచున్న జ్ఞానమును తృణీకరింపకూడదు. దేవుని యొక్క ఆత్మ జ్ఞానముగల ఆత్మ గనుక ఈ పుస్తకమును శ్రద్ధగా చదవండి.

    నిజానికి, యేసువంటి జ్ఞానము కాని ఆయన వంటి మాటలుగాని ఎక్కడా లేవు. ఆకాశము మరియు భూమి గతించిపోవునేమో గాని కలిగినవాడు మరింత ఎక్కువగా స్వీకరించడం మరియు లేనివాడు తనకున్న ఆ కొంచెమును కూడా పోగొట్టుకోవడం నీవు చూస్తావు.

    అధ్యాయము 2

    కలిగినవానికి భావార్థక లక్షణములు మరియు స్వభావాలు ఉంటాయి గనుక వాడు ఇంకా పొందుకుంటాడు

    ఆ హేతువుచేత మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును,

    జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని,

    భక్తియందు సహోదరప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.

    ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండజేయును

    2 పేతురు 1:5-8

    నీలో కొన్ని విషయములు ఉన్నట్లయితే, నీవు గొడ్డుబోతుగా, నిష్ఫలునివిగా లేదా నిష్ప్రయోజకుడివిగా ఉండవు అని పైని వాక్యభాగము మనకు తెలుపుతుంది. పేతురు ఇక్కడ ప్రస్తావిస్తున్న అ విషయములు ఏవంటే పూర్ణజాగ్రత్త, సద్గుణము, ఆశానిగ్రహము, సహనము, జ్ఞానము, భక్తి మున్నగునవి. ఒక వ్యక్తి గుణములోని ఈ నిశ్చయమైన లక్షణాలే ఒకరిని ఫలభరితముగా లేదా ప్రయోజకునిగా చేస్తాయి.

    నిష్ఫలమైన, నిష్పప్రయోజనమైన మరియు ఫలములు లేని ఒక మండలము నుండి తప్పించుకొని బయటకు రావడానికి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వములో ఉన్న ఈ నిశ్చయమైన లక్షణాలే దోహదపడతాయి. గొడ్డుబోతుతనము అనేది చాలా తక్కువైన ఫలములు ఇచ్చే బీడు నేలను సూచిస్తుంది. లేనివానికి ఉన్న ఎండిన మరియు బీడు పొలములు ఆ వ్యక్తిలో కొన్ని నిశ్చయమైన లక్షణములు లేవు అని సాక్ష్యమిస్తాయి. ఒకనిని కలిగినవానిగా చేసే నిశ్చయమైన లక్షణాలు ఆ వ్యక్తిలో ఉండవలసినవి ఏవి? ఈ అధ్యాయము దీనిని గురించే మాట్లాడుతుంది. ఫలభరితము, ప్రయోజనము మరియు సమృద్ధి అనే లక్షణములకు సంబంధించిన నిశ్చయమైన లక్షణములు తొమ్మిది ఉన్నాయి.

    ఈ నిశ్చయమైన లక్షణములను దేవుని వాక్యములోను మరియు పైన పేర్కొనిన వాక్యభాగములో కూడా గుర్తించవచ్చు. ఎవరినైనను సంపన్నులనుగా చేయగల వ్యక్తిగత లక్షణములు అవి.

    ఈ నిశ్చయమైన లక్షణములు ఏవనగా, పూర్ణజాగ్రత్త, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదరప్రేమ మరియు దయ. ఈ లక్షణములు చాల ప్రాముఖ్యమైనవి గనుక వీటిలో ఒక్కొక్కదాని గూర్చి నీవు తెలుసుకోవడం మరియు అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం.

    భావార్థక లక్షణము: పూర్ణజాగ్రత్త

    పూర్ణజాగ్రత్త యొక్క నిర్వచనము: పూర్ణజాగ్రత్త అనునది ఒక సమస్యను పరిష్కరించుటకు, లేదా కష్టాలను అధిగమించి గొప్ప పనులను సాధించుటకుగాను ఒక వ్యక్తీలో ఉండే స్థిరత్వము మరియు అలుపెరుగని ప్రయత్నము.

    పూర్ణజాగ్రత్తను గూర్చి మీరు తెలుసుకొనవలసిన నాలుగు విషయములు

    ఒక వ్యక్తిని సంపన్నునిగా చేసే వ్యక్తిగత లక్షణము ఈ పూర్ణజాగ్రత్త.

    దరిదాపుగా ధనికుడైన ప్రతి ఒక్కడు కూడా పూర్ణజాగ్రత్త గలవాడే.

    బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును.

    సామెతలు 10:4

    ఒక వ్యక్తిని నాయకునిగా చేసే వ్యక్తిగత లక్షణము ఈ పూర్ణజాగ్రత్త. చాల మంది నాయకులు సంపన్నులు మరియు వృద్ధిపొందినవారు ఎందుకంటే వారు నడిపిస్తున్న ప్రజలందరికీ పైగా ఉంటారు.

    శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టిపనులు చేయవలసి వచ్చును.

    సామెతలు 12:24

    ఒక వ్యక్తిని పూర్ణఫలములోనికి మరియు సంపదలోనికి నడిపే ఆలోచనలను ఒక వ్యక్తికి ఇచ్చే వ్యక్తిగత లక్షణము పూర్ణజాగ్రత్త.

    శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.

    సామెతలు 21:5

    ఒక వ్యక్తిని పదోన్నతిలోనికి నడిపించే వ్యక్తిగత లక్షణము పూర్ణజాగ్రత్త

    తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.

    సామెతలు 22:29

    చరిత్రలో, విజయవంతులైన ప్రజలను తయారుచేసినది పూర్ణజాగ్రత్తయే. నాయకులను, లక్షాధికారులను మరియు సమృద్ధిగల మనుష్యులను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎంతో పూర్ణజాగ్రత్త మరియు కష్టపడే తత్వము మనకు బయలుపడుతుంది. KFC అనే సంస్థ యొక్క స్థాపనను

    Enjoying the preview?
    Page 1 of 1