Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14)
పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14)
పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14)
Ebook662 pages3 hours

పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

మీరు నిజమైన క్రైస్తవులైతే, మీరు దేవుని ప్రేమను కేవలం సంక్లిప్తంగా కాకుండా మరింత ఎక్కువగా తెలుసుకొనవలెను. యేసును తమ రక్షకునిగా తెలుసుకొని విశ్వసించే వారు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యం ద్వారా నెరవేర్చబడిన పాప విమోచనలో దేవుని యొక్క ప్రేమను ఖచ్చితంగా తెలుసుకొనవలెను. దేవుని ప్రేమను లోతుగా తెలుసుకోవాలంటే మనం ఈ నిజమైన సువార్తను విశ్వసించవలెను. ఈ నిజమైన సువార్తలో దేవుని యొక్క ప్రేమ నిశ్చయంగా మరియు వివరంగా వ్యక్తమగును. దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే మనకు జ్ఞానం కావలెయును. కావున నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యంలో వెల్లడి చేయబడిన మనపై దేవుని కున్న ప్రేమ నిశ్చయమైనది,కావున మనం దీనిని బట్టియో ఇతరులను మనం దేవుని యొక్క నిజమైన ప్రేమ వైపుకు నడిపించగలము, నీరు, రక్తం మరియు పరిశుద్ధాత్మ, ద్వారా వచ్చిన వాడు యేసుక్రీస్తు రక్షకుడు మరియు దేవుడే, అని అపొస్తలుడైన యోహాను సాక్ష్యమిస్తున్నాడు. అతని సాక్ష్యం యొక్క సారాంశం పాప విమోచన సత్యమును గూర్చి, ఇది నీరు, రక్తం మరియుపరిశుద్ధాత్మకు చెందినది. ఇది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా, నీరు బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు పొందిన బాప్తిస్మమును సూచిస్తుంది, రక్తము మన పాపముల నిమిత్తము ఆయన పొందిన తీర్పును సూచిస్తుంది. అలాగే, రక్షణకు సంబంధించిన సాక్ష్యం పరిశుద్ధాత్మ, నీరు మరియు రక్తంలో ఉన్నది (1 యోహాను 5:8). నీరు, రక్తము మరియు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలు దేవునికి సంబంధించినవి, వాటి ద్వారా పాపులను వారి సమస్త పాపముల నుండి విడిపించియున్నాడు.

LanguageTelugu
PublisherPaul C. Jong
Release dateSep 21, 2023
ISBN9788965322658
పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14)

Related to పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14)

Related ebooks

Reviews for పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3 - యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I) (Telugu14) - Paul C. Jong

    paul_Tel14_cover.jpgFrontflap_Tel141st_page

    పాల్ సి. జాoగ్ గారి యొక్క ఆధ్యాత్మిక వృద్ధి ప్రచురణ 3

    యోహాను వ్రాసిన మొదటి పత్రిక (I)

    Smashwords Edition

    Copyright 2022 ది న్యూ లైఫ్ మిషన్

    అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. కాపీరైట్ ప్రచురణకర్త మరియు యజమానుల ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఈ ప్రచురణలోని ఏ భాగాన్ని పునరుత్పత్తి చేయలేము, తిరిగి పొందే వ్యవస్థలో నిల్వ చేయలేము, లేదా ఏ రూపంలోనైనా లేదా ఎలక్ట్రానిక్, మెకానికల్, ఫోటోకాపీ, రికార్డింగ్ లేదా ఇతరత్రా ప్రసారం చేయలేము.

    ఈ పుస్తకంలో ఉపయోగించిన స్క్రిప్చర్ కొటేషన్స్ న్ (తెలుగు బైబిల్ సొసైటీ అఫ్ ఇండియా వర్సిన్) నుండి

    ISBN 978-89-6532-265-8

    Design by Min-soo Kim

    Illustration by Young-ae Kim

    Printed in Korea

    Hephzibah Publishing House

    A Ministry of THE NEW LIFE MISSION

    Seoul, Korea

    విషయసూచిక

    ముందుమాట

    అధ్యాయము 1

    • యేసుక్రీస్తుదేవుడు (1 యోహాను 1:1-10)

    • మీరు నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నారా? (1 యోహాను 1:1-10)

    • రెండు విధములగు ఒప్పుకోలు (1 యోహాను 1:8-10)

    • సత్యమునందు ఒప్పుకోలు (1 యోహాను 1:8-10)

    అధ్యాయము 2

    • యేసుక్రీస్తు నిజమైన దేవుడు (1 యోహాను 2:1-5)

    • మనకు ఉత్తరవాదిగా మారిన మన ప్రభువు (1 యోహాను 2:1-17)

    • మీరు దేవుని ఆజ్ఞల యందు జీవిస్తున్నారా? (1 యోహాను 2:7-11)

    • లోకమును లేదా లోకములో ఉన్న వస్తువులనైనను ప్రేమించకుడి (1 యోహాను 2:15-18)

    • క్రీస్తు యొక్క శత్రువులు ఎవరు? (1 యోహాను 2:18-29)

    0preface.jpg

    ముందుమాట

    క్రైస్తవ మతంలో అపొస్తలుడైన యోహాను గొప్ప ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. అతను వ్రాసిన మూడు పత్రికలు ఇప్పటికీ దేవుని సంఘములోని పరిశుద్ధులకు అత్యంత సాధారణ మరియు ఆధ్యాత్మిక సత్యాన్ని సాక్ష్యమిస్తున్నాయి. కానీ కొన్ని భాగాలు అర్థం చేసుకోవడం మరియు వాఖ్యానించటం కొంత కష్టంగా ఉన్నవి.

    యోహాను పత్రికలలోని కష్టతరమైన భాగాలు మొదటి ఉదాహరణగా 1 యోహాను 1:8వచనాన్నిమనం చూడవచ్చు: మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు. ప్రత్యేకించి మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్త విశ్వాసులకు దీనిని అన్వయించినప్పుడు, ఈ భాగాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.

    రెండవ ఉదాహరణ 1 యోహాను 1:9, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. పాపులు తమ యొక్క పశ్చాత్తాప ప్రార్థనలు బైబిల్ ప్రకారం చేయుటకు ప్రయత్నించినప్పుడు ఇది చాలా తరచుగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకోబడిన భాగాలలో ఒకటి. అలాంటప్పుడు, పాపులు తాము చేసిన పాపమును బట్టి పాప క్షమాపణ పొందేందుకు తమ పాపములను ఒప్పుకోవాలని ఈ వచనం యొక్క అర్థమా? లేదా, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే నీతిమంతులు తమ పాపములను ఒప్పుకోవాలని దీని యొక్క అర్థమా? బైబిల్ గ్రంథకర్తయైన పరిశుద్దాత్మ యొక్క వివరణ ప్రకారం మరియు అపొస్తలుడైన యోహాను యొక్క ఉద్దేశ్యం ప్రకారం మనం ఈ భాగాన్ని విశ్వసించవలెను.

    కష్టతర భాగమైన మూడవ ఉదాహరణ 1 యోహాను 2:22, యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి. దేవునికి శత్రువులు ఎవరు అనే దాని గురించి ఈ భాగం మాట్లాడుతోంది. యేసు దేవుడని నమ్మని వారే దేవునికి శత్రువులు అని ఈ వచనం స్పష్టం చేస్తోంది. మరియు వారు యేసుక్రీస్తు యొక్క తండ్రిని దేవుడిగా అంగీకరించరని కూడా దీని యొక్క అర్థం.

    నాల్గవది 1 యోహాను 3:6, ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడనులేదు ఎరుగనులేదు. ఇక్కడ, ఆయనయందు నిలిచియుండువాడెవడును అనే మాటలను మనం చూసినప్పుడు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా వారి పాపములన్నిటి నుండి శుద్ధి చేయబడిన నీతిమంతులకు ఈ భాగం చెప్పబడింది. నీతిమంతులు తమ విశ్వాసాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించలేరుఎందుకనగా వారు సత్య సువార్తను విశ్వసించెదరు కాబట్టి. సాధారణంగా తమ దేహంతో వాస్తవంగా పాపములు చేయని వారు ఎవరైనా ఉన్నారా? అందరూ పాపం చేయుదురు. కానీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మువారు సత్య సువార్తను తిరస్కరించడం వంటి పాపమును చేయలేరు.

    నేడు యేసుక్రీస్తును తమ పరిపూర్ణ రక్షకునిగా నిజమైన దేవునిగా విశ్వసించే వారు ఎవరు? అట్టి వారు తమ హృదయాలలో నీటి సువార్తను మరియు ఆత్మను విశ్వసించడం ద్వారా వారి సమస్త పాపముల నుండి విమోచన పొందిన వారు. వారు ఈ సత్య సువార్తను విశ్వసించినందున వారు పాపము చేయని పరిశుద్ధులు. నేడు, చాలా మంది ప్రజలు దేవుని శత్రువులుగా మారియున్నారు, వారు యేసును దేవుడిగా విశ్వసించని వారు. వారి అవిశ్వాస కారణంగా, ఈ లోకం ఇప్పుడు యేసు యొక్క తండ్రిని దేవుడని నమ్మని వ్యక్తులతో నిండిపోయింది. యేసు నిజమైన దేవుడు మన పాపములన్నిటి నుండి ఒక్కసారిగా మనల్ని రక్షించాడని నమ్మని పాపులు.

    చివరి కష్టతరమైన భాగం 1 యోహాను 5:5-8 ఇలా చెప్పుచున్నది, యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమేగాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి యున్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.

    ఇక్కడ నీరు యొక్క అర్ద మేమిటి? ఇది మానవజాతి యొక్క సమస్త పాపములను ఒకేసారి తీసుకోవడానికి యేసు స్వీకరించినబాప్తిస్మమును సూచిస్తుంది (మత్తయి 3:15). దీని యొక్క అర్థం, మరో మాటలో చెప్పాలంటే, యొర్దాను నది వద్ద బాప్తిస్మ మిచ్చు యోహాను నుండి యేసు పొందిన బాప్తిస్మమే. మన పాపములన్నిటిని తుడిచివేయడం ద్వారా సమస్త మానవాళిని అనగా మనలను రక్షించడానికి యేసు యొక్క బాప్తిస్మమే ఏకైక మార్గం అని ఈ సత్యం చెప్పుచున్నది (1 పేతురు 3:21).

    ఇప్పుడు నేను గెలీలియో యొక్క సాదృశ్య రూపక స్థితి ద్వారా, సిలువ రక్తాన్ని మాత్రమే విశ్వసించే వారి యొక్క తప్పుడు విశ్వాసాల ఫలితాన్ని వివరించాలనుకుంటున్నాను, ఇది నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై ఉన్న విశ్వాసానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఇది అపోస్తుల కాలం నుండి ఉద్భవించింది.

    గెలీలియో కేసు మనకు ఏమి బోధిస్తుంది?

    గెలీలియో గెలీలీ (1564-1642) గురించి మీకు బాగా తెలిసి ఉండవచ్చు, అయితే అతను భూమి కదులుచున్నదనే ప్రసిద్ధ వ్యాఖ్యను అతను చెప్పియున్నాడు. అతను ఇటలీ యొక్క భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త మరియు పరిశోధకుడు.

    భూమి విశ్వానికి మధ్యలో ఉందని గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పే భూకేంద్రీకరణ సిద్ధాంతాన్నిప్రతి పాదించిన అతని రోజుల్లో ప్రజలు విశ్వసించారు. కానీ, ఖగోళ పరిశీలనకు తనను తాను అంకితం చేయడం ద్వారా, గెలీలియో భౌగోళిక కేంద్రీకరణను బహిరంగంగా వ్యతిరేకించే కోపర్నికన్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని సమర్ధించాడు. ఇది పోపుల యొక్క కోర్టు ఆగ్రహాన్ని రేకెత్తించింది మరియు ఫలితంగా, అతను అనేక కష్టాలు మరియు హింసలను అనుభవించాడు. కానీ దీని కారణంగా, అతను ఆధునిక విజ్ఞాన అభివృద్ధికి దోహదపడిన గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందాడు.

    అతని రోజుల్లో చాలా మంది ప్రజలు భూకేంద్రీకరణ సిద్ధాంతాన్ని విశ్వసించారు మరియు ఇది వారి మతం పట్ల గుడ్డి విశ్వాసంతో మద్దతునిచ్చే సంపూర్ణ సత్యంగా గుర్తించబడింది. మరోవైపు, అనేక భౌగోళిక మరియు ఖగోళ ఆవిష్కరణలు భౌగోళిక కేంద్రీకరణ యొక్క తప్పులను ఒకదాని తర్వాత ఒకటి బహిర్గతం చేశాయి, అయితే ఆ రోజుల్లో ప్రజలు దాని గురించి ఏమీ చెప్పలేకపోయారు ఎందుకంటే ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవారిని దేవుని శత్రువులుగా పరిగణించారు దాని వాళ్ళ వారు కష్టాలను మరియు హింసలను తప్పించుకోలేక పోయారు. అయినను గెలీలియో తన కొత్త సిద్ధాంతాన్ని ధైర్యంగా ప్రకటించాడు. వాస్తవంగా, అతను ఆ కాలంలో ప్రధాన మతాలు ద్వారా తీవ్రంగా హింసించబడ్డాడు, అయినను సత్యాన్ని బలవంతంగా లేదా దాని ప్రత్యర్థుల యొక్క సంఖ్యతో వక్రీకరించడం కానీ విస్మరించలేము చేయలేము. గెలీలియో కేసు మనకు ఏమి బోధించుచున్నది?

    వాస్తవానికి, నేటి క్రైస్తవులలో ఎక్కువమంది సిలువ రక్తమును మాత్రమే విశ్వసిస్తున్నారు. బాప్తిస్మ మిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం పొందడం ద్వారా సత్య దేవుడైన యేసు ఈ లోకములోని సమస్త పాపములను ఒక్కసారిగా తీసుకున్నాడనే సత్యం వారికి తెలియదు. వారు యేసును తమ రక్షకునిగా విశ్వసించెదరు, ఎందుకనగా నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ఏమిటో వారికి తెలియదు. ఇది భూకేంద్రీకరణ సిద్ధాంతము ఒక గుడ్డి నమ్మకం లాంటిది. అటువలె, సిలువ రక్తాన్నిమాత్రమే విశ్వసించే నేటి క్రైస్తవ మతం యొక్క నిర్ణయాత్మక తప్పిదనమును మనం ప్రకటించినచో, గెలీలియో పరిస్థితి వలె ఒక గొప్ప కలవరం ఏర్పడుతుంది.

    సామాన్య జ్ఞానాలుగా పదిలపరచబడిన విషయాలపై మనం ఎన్నడూ రెండుసార్లు ఆలోచించవలెనన్న అని ఒక సామెత ఉంది. ఆలా, చాలా మంది క్రైస్తవులు తమ విశ్వాసముల యొక్క తప్పిదములు గురించి కూడా ఆలోచించరు, ఎందుకనగా సిలువ రక్తమే తమ రక్షణకు ఏకైక సత్యమని వారు ఖచ్చితంగా విశ్వసించారు. అందుకే నేటి క్రైస్తవం అటువంటి గుడ్డి విశ్వాసులతో నిండి ఉన్నది.

    నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ఏమైయున్నది మరియు తప్పుడు ప్రవక్తలు ఎవరో తెలుసుకొనుటకు మొదటి యోహాను పత్రిక మనకు బోధిస్తుంది. కాబట్టి, మొదటి యోహాను పత్రికను తెలుసుకొనుటకు మరియు లోతుగా అర్థం చేసుకోవడానికి మనం మొదట నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను సరిగ్గా నేర్చుకోవాలి.

    ఆయన మనందరికీ వివక్ష యొక్క జ్ఞానాన్ని, రక్షణకు సంబంధించిన సత్యాన్ని మరియు ఖచ్చితంగా విశ్వసించే విశ్వాసమును ప్రసాదించాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను.

    నా దేవునికి సమస్త కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. హల్లెలూయా!

    CHAPTER1_01.gif1-1.jpg

    యేసుక్రీస్తుదేవుడు

    < 1 యోహాను 1:1-10 >

    జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియ జేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.మన సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడ సహవాసముగల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనమ బద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల. మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపములేని వారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చు కొందుము; మరియు మనలో సత్య ముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

    అపోస్తులుడైన యోహాను ఆది నుండి ఉన్నయేసుక్రీస్తు గురుంచి ఎందుకు మాట్లాడవలసి వచ్చెను?

    మనము మొదటి యోహాను పత్రికను అర్థం చేసుకొనుటకు, మనమందరం మొదటగా, యేసునుతనంతట తానే దేవుడని సరిగ్గా తెలుసుకొనవలెను. మనమందరం ఈ విశ్వాసం యొక్క బండపై దృఢంగా నిలబడాలి, అట్టి విశ్వాసం యేసుక్రీస్తును దేవుడని నిజంగా తెలుసుకొని మరియు విశ్వసించును. యేసును మన రక్షకునిగా తెలుసుకోవడం మరియు విశ్వసించడం అనగా మనల్ని సృష్టించిన దేవుడని ఆయనను మనం తెలుసుకోవడం. మనందరికీ, యేసుక్రీస్తు ప్రాథమికంగా సృష్టికర్తయైన దేవుడు మరియు మన పరిపూర్ణ రక్షకుడు. కాబట్టి తండ్రియైన దేవునికి, యేసు ఏకైక కుమారుడు, మన కొరకు, ఆయన మన నిజ రక్షకుడయ్యాడు. మనమందరం యేసుక్రీస్తును దేవుడిగా తెలుసుకున్నప్పుడు,రక్షణకు సంబంధించిన నిజమైన వెలుగును మనం ఎదుర్కొని విశ్వసించగలము.

    మరోవైపు, యేసుక్రీస్తు దేవుడని మీకు తెలియకపోతే, మీరు ఆధ్యాత్మిక గందరగోళంలో ఉందురు. కాబట్టి, యేసుక్రీస్తు నిజ దేవుడని,మనకు నిత్యజీవాన్ని ప్రసాదించిన వ్యక్తి అనే సత్యంపై మనం దృఢంగా నిలబడాలి.

    మొదటి యోహాను 5:20లో, అపొస్తలుడైన యోహాను యేసుక్రీస్తు నిజమైన దేవుడని సాక్ష్యమిచ్చాడు, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, మనందరికీ యేసుక్రీస్తు దేవుడు, మరియు మనకు నిత్యజీవాన్ని ఇచ్చినవాడు. అలాగే, యేసు దేవునిపై మన యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా అనగా ఈ రక్షకునిపై విశ్వాసం ఉంచడం ద్వారా, మనం మన పాపముల నుండి శుద్దిచేయబడి దేవుని పిల్లలుగా మార్పు చెందవలెను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మనకు రక్షణను అనుగ్రహించిన యేసు దేవుని సరిగ్గా తెలుసుకోవడం మరియు విశ్వసించడం ద్వారా మనం మన పాపములన్నిటి నుండి రక్షించబడవలెను.

    మొదటి యోహాను పత్రిక నుండి ఈ నాటి వాక్యం భాగం మనకు చెప్పుచున్నది ఎక్కడ నుండి నిజ సహవాసం వచ్చును

    మొదటి యోహాను 1:3 మనము యేసుక్రీస్తుయైన దేవునితో నిజమైన సహవాసం కలిగి ఉండాలంటే, మనము మొదట ఆయనను మన రక్షకునిగా తెలుసుకోవడం మరియు విశ్వసించడం ద్వారా ప్రారంభించాలి.

    యేసు దైవత్వం గురించి అపొస్తలుల యొక్క అవగాహన ప్రకారం, మరో మాటలో చెప్పాలంటే, ఆయనకు ఎలాంటి అసంపూర్ణత లేదు. మరియు అపొస్తలుడైన యోహాను కూడా మొదటి యోహాను 1:6-7లో ఇలా చెప్పాడు, ఆయనతోకూడ సహ వాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులును గా చేయును.

    యేసును మన రక్షకునిగా మనం యథార్థంగా విశ్వసిస్తే, ఆయన మనకు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త విశ్వసించడం ద్వారా ఆయనతో నిజమైన సహవాసాన్ని కలిగి ఉండగలమని ఈ భాగం చెప్పుచున్నది.అపొస్తలుడైన యోహాను ఇక్కడ సాక్ష్యమిస్తున్నాడు,దేవునితో ఈ నిజమైన సహవాసం కలిగి ఉండాలంటే యేసు దేవుడని మరియు తండ్రి అయిన దేవుని కుమారుడని విశ్వసించడం ద్వారా యేసుక్రీస్తు ఈ లోక పాపములను తీసివేసియున్నాడని విశ్వసించడం ద్వారా మనం మన పాపములనుండి శుద్దిచేయబడితిమి. బాప్తీస్మం ద్వారా యేసు యొర్దాను నదిలో బాప్తీస్మం మిచ్చు యోహాహాను నుండి బాప్తీస్మం పొందాడు మరియు అయన విలువైన రక్తాన్ని సిలువపై చెందించెను. ఎందుకంటే నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం ద్వారా దేవుడు స్వయంగాయేసుక్రీస్తుగా మన పాపములన్నిటి నుండి శాశ్వతకాలంగా మనలను రక్షించాడు.

    ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం మన సమస్త పాపముల నుండి మనలను శుద్ధిచేయును అని చెప్పు ఈ భాగం ఈ క్రింది వాటిని తెలియజేస్తుంది: యేసు బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నందున, ఆయన లోకములోని పాపములను తీసివేయగలడు; అందువలన, యేసు సిలువ వేయబడి ఆయన విలువైన రక్తమును సిలువపై చిందించడం అనునది ఆయన యొక్క పుణ్యకార్యంగా మారి, అది ప్రజల పాపములను శుద్ధిచేసెను. మన దైవమైయున్న మన ప్రభువు బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తీస్మం పొంది,మన పాపములన్నిటిని స్వీకరించి పాపం యొక్క సమస్త నిందలను భరించడానికి ఆయన సిలువ వేయబడి సిలువపై తన రక్తాన్ని చిందించాడు. కావున, యేసుక్రీస్తు సిలువపై చిందించిన ఈ రక్తము పాపులందరి పాపములను మరియు దోషములను పరిహరించి మనకు రక్షణగా మారియున్నదని నేటి లేఖన భాగము మనకు చెప్పుచున్నది.

    యేసుక్రీస్తుపై మనం విశ్వాసం ద్వారా మన పాపములన్నిటి నుండి శుద్ది చేయబడ్డాము. యేసుక్రీస్తు, దేవుడే, మానవ దేహంలో అవతరించిన రక్షకునిగా ఈ భూమ్మీదకు వచ్చాడని మనం నమ్మవలెను; మన పాపములను తుడిచివేయడానికి, ఆయన బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా బాప్తీస్మం పొందడం ద్వారా లోకములోని పాపములను తనపైకి తీసుకొని, సిలువ వేయబడి ఆ సిలువపై ఆయన రక్తమును చిందించి మృతులలో నుండి లేచాడు;ఈ విధంగా ఇవన్నీ చేయడం ద్వారా ఆయన మనకు నూతన జీవితాన్ని యిచ్చియున్నాడు (మత్తయి 3:13-17, యోహాను 19:30). యేసుక్రీస్తు పరిపూర్ణమైన రక్షణను నెరవేర్చాడు కాబట్టి, ఈ ప్రభువైన యేసుక్రీస్తును మన దేవునిగా మరియు రక్షకునిగా తెలుసుకోవాలంటే, మనం మొదట ఆయన బాప్తీస్మం మరియు రక్తమును చిందించుటను తెలుసుకోవాలి మరియు వాటిపై మన విశ్వాసం ఉంచడం ద్వారా, మనలను శుద్ధిచేయు మన పాపముల నుండి మనం ఒకే సారి విమోచించబడాలి.

    1 యోహాను 1:9 సాక్ష్యమిస్తూ, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పుట్టిన నాటి నుండి పాపంతో జన్మించిన పాపపు స్వభావికలమని మనం ఒప్పుకుంటే (మార్కు 7:21-22), మరియు ఎల్లవేళలా పాపం చేయుటయో తప్ప సహాయం చేయలేని వారమని మనల్ని మనం ఒప్పుకొని, ఈ సత్య సువార్తను విశ్వసించడం ద్వారా మనం మన పాపముల నుండి పాప విమోచన పొందగలమని ఈ భాగం మనకు చెప్పుచున్నది. ప్రభువైన దేవుడు బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి యేసు పొందిన బాప్తిస్మముతో మన పాపములన్నిటిని ఇదివరకే శుద్ధిచేసి ఆయన తన యొక్క రక్తాన్ని సిలువపై చిందించడం ద్వారా పాపం యొక్క సమస్త అవమానాలను భరించాడు. మరో మాటలో చెప్పాలంటే, మనకు నరకం తప్ప వేరొక మార్గము లేని అలాంటి పాపులమని అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు తన బాప్తిస్మముతో సిలువపై ఆయన రక్తం చిందించటం ద్వారా మన పాపములన్నిటిని ఇదివరకే శుద్దిచేసాడు అనే సత్యాన్ని విశ్వసించినప్పుడు. దేవుడు మన యొక్క ఈ విశ్వాసాన్ని చూసి,మన పాపముల నుండి మనలను శుద్ధిచేయును. ఇది సాధ్యపడింది, ఎందుకంటే మన ప్రభువు సత్య దేవుడు, ఆయన తన బాప్తీస్మం మరియు రక్త ప్రోక్షణతో మన పాపములన్నిటిని ఇప్పటికే శుద్దిచేసియున్నాడు.

    కాబట్టి, మనము మొదట మన ప్రభువైన దేవునికి ఈలాగు చెప్పవలెను, మనము ఎల్లప్పుడు పాపము చేయు దుర్మార్గులము. మరియు మన ప్రభువు ఈ యోహాను నుండి పొందిన బాప్తిస్మముతో మరియు ఆయన సిలువపై చిందించిన విలువైన రక్తంతో మన పాపములన్నిటిని ఇదివరకే ఒకే సారి తుడిచి వేసియున్నాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి మరియు విశ్వసించాలి. యేసుక్రీస్తు మనందరికీ నిజమైన రక్షకుడు మరియు సత్య దేవుడు కావున పాపం యొక్క ఈ పరిపూర్ణమైన శుద్దీకరణ సాధ్యమైంది. మన ప్రభువు యొక్క దైవత్వం అనునది నీరు మరియు ఆత్మ సువార్త యొక్క సత్యం ద్వారా పాపం యొక్క సంపూర్ణ శుద్దీకరణను గుర్తించి, తెలుసుకునేలా దేవుడు మనందరికి సామర్థ్యం కలుగజేసాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మనపాపముల యొక్క సంపూర్ణ విమోచనను తెలుసుకోవడం మరియు విశ్వసించడం మన దేవుడైన యేసుక్రీస్తు ద్వారా సాద్యపరచెను. ఇప్పుడు, మనం చేయాల్సిందల్లా మన ప్రభువు బాప్తిస్మముతోను మరియు సిలువపై రక్త తన ప్రోక్షణతో మన పాపములన్నిటిని ఒకేసారి శుద్దిచేసాడని తెలుసుకోవడం మరియు నమ్మడం.ఈ దైవస్వరూపియైన ప్రభువు మనకు సత్యవంతుడైన దేవుడును మరియు నిజమైన రక్షకుడైయున్నాడు.

    అపొస్తలుడైన యోహాను 1 యోహాను 1:10లో ఇలా చెప్పాడు, మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువార మగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.మనము ఎల్లవేళలా పాపము చేయకుండా ఉండలేము. మన శరీరంలో పాపం చేయకూడదని మన దేవుడైన యేసుక్రీస్తుతో చెప్పినచో, దేవుడు మన కోసం చేసిన రక్షణ కార్యాన్ని తృణీకరించడం మరియు వ్యతిరేకించడం అనే పాపమునకు మనం నిజంగా పాల్పడుచున్నామని మనం గ్రహిచవలెను. ఏది ఏమైనప్పటికీ, మనం మన జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు మనం చేసే ఈ పాపములు కూడా ప్రపంచ పాపములతో చేర్చబడ్డాయి, అందువల్ల మన ప్రభువైన దేవుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మనకు అనుగ్రహించి మన పాపములన్నిటిని శుద్దిచేసియున్నాడని దీని యొక్క అర్థం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని ఎరుగని లేదా విశ్వసించని వారు ఈ సత్యాన్ని విశ్వసిస్తే తప్ప పాపం నుండి సంపూర్ణ శుద్దీకరణ యొక్క బహుమతిని పొందలేరు కావున, మన ప్రభువు ఇలా చెప్పియున్నాడని కూడా మనం గ్రహించవలెను.

    యేసు దేవుడని దేవుని కుమారుడని మీరు ఇప్పుడు నిజముగా తెలుసుకొని విశ్వసిస్తే, ఆయన ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మం మిచ్చు యోహాను చేత బాప్తిస్మం పొంది, ఆయన రక్తం చిందించుట వలన మనందరినీ మన పాపముల నుండి విమోచించియున్నాడని మీరు విశ్వసించగలరు. వాస్తవానికి, మనం మొదట మన దేవుడైన యేసుక్రీస్తును తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు మాత్రమే, మన ప్రభువు మనకు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం మనందరికీ సులభమగును. ఈ సత్యమైన సువార్తను విశ్వసించడం అందరికీ అంత కష్టమైన విషయం కాదు, ఎందుకంటే నిజదేవుడైన యేసుక్రీస్తు ఈసత్యాన్నినెరవేర్చియున్నాడని బైబిల్ స్పష్టంగా చెప్పుచున్నది. అది సత్యవంతుడైన యేసు చేసిన పని అయితే, అది సత్యముగాను మరియు పరిపూర్ణముగా ఉండవలెను.ఇది అబద్ధముగాను లేదా అసత్యముగా ఉండనేరదు, ఆయన దాని గురించి పశ్చాత్తాప పడువాడుకాడు, ఎందుకంటే ఇది సంఖ్యాకాండము 23:19 లో వ్రాయబడింది,

    "దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు

    పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు

    ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?"

    యేసు, మన సత్య దేవుడు, తన బాప్తీస్మం మరియు సిలువపై ఆయన రక్తప్రోక్షణ ద్వారా మన పాపములన్నిటి నుండి మనందరినీ రక్షించినవాడు. ఆయన మృతులలో నుండి పునరుత్థానం చేయబడి, నిజ దేవునిగా తన అసలు స్థితిని వెల్లడించడానికి పరలోకానికి ఎక్కుట ద్వారా నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నందు విశ్వాసులకు నిజ రక్షకుడయ్యాడు. నిజమే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త నుండి వచ్చిన యేసుక్రీస్తు దేవుని పట్ల మన యొక్క విశ్వాసం ద్వారా, ఈ సత్య సువార్త యందు మనం అచంచలమైన విశ్వాసమును కలిగి ఉండగలము.

    యేసు,నిజమైన దేవుడు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో మనలను రక్షించాడని మనం తెలుసుకోవాలి

    నేటి క్రైస్తవులు వారి విశ్వాస ప్రయాణమును నిజదేవుడైన యేసుపై సరైన జ్ఞానం మరియు విశ్వాసము నుడి ప్రారంభించినట్లయితే, వారు బాప్తీస్మం మిచ్చు యోహాను ద్వారా యేసు బాప్తీస్మం పొంది మానవజాతి యొక్క పాపములను స్వీకరించడనే సత్యాన్నివారు సహజంగా అంగీకరించగలరు (మత్తయి 3:15). అయినను, చాలా మంది ప్రజలు యేసు నిజమైన దేవుడు అని నమ్మలేక పోవుచున్నారు, ఫలితంగా, వారు ఆయన బాప్తీస్మం మరియు రక్త ప్రోక్షణ ద్వారా నెరవేర్చబడిన రక్షణ యొక్క కృపను ఇంకను పొందలేదు.

    కాబట్టి, మీరు మరియు నేను దేవునితో నిజమైన సహవాసాన్ని కలిగి ఉండాలంటే, యేసును నిజమైన దేవుడిగా విశ్వసించే విశ్వాసం నుండి మనం ప్రారంభించాలి. దీనిని మరోసారి పునరావృతం చేద్దాం. మనమందరం ఈ విశ్వాసం నుండి మన విశ్వాసాన్ని ప్రారంభించకపోతే, మన విశ్వాసం పూర్తిగా వ్యర్థమగును. మీరు యేసు యొక్క దైవత్వంలో ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నచో, మీరు నీరుమరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం సులభమగును. మరియు ఈ నిజమైన సువార్తపై మనకున్న విశ్వాసం ద్వారానే మనం పరిపూర్ణంగా ఉండగలం. మన పాపములన్నిటి నుండి మనలను రక్షించిన దేవుడు యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా, మనమందరం మన పాపముల నుండి మనం ఒకేసారి శుద్దిచేయబడవచ్చును.

    యేసు దేవుడని మనం గుర్తించకపోతే, ఆయనను మన రక్షకునిగా విశ్వసించడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ దైవమైయున్న యేసు అనుగ్రహించిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మీరు విశ్వసించకపోతే, మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ మీరు యేసును రక్షకునిగా మరియు దేవునిగా మొదటి విశ్వసించి, ఆతరువాత ప్రభువు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా, మీ హృదయంలో ఉన్న పాపం నుండి మీరు శుద్దిచేయబడి శాశ్వత జీవితాన్ని పొందగలుగుతారు.

    యేసుక్రీస్తు, దేవుడే, నిన్ను మరియు నన్ను మన పాపముల నుండి రక్షించడానికి ఈ భూమ్మీదకు వచ్చి, బాప్తీస్మమిచ్చు యోహాను చేత యేసు బాప్తీస్మం పొంది, సిలువ వేయబడి, సిలువపై మరణించి, మృతులలో నుండి తిరిగి లేచి, ఆయన మనలను సంపూర్ణంగా రక్షించాడు. దేవుని కుమారునిగా మరియు నిజమైన దేవునిగా మీ పాపములన్నిటి నుండి మీరు రక్షించబడుటకు మీకు అవకాశం కల్పించిన ఈ యేసుక్రీస్తును మీరందరూ విశ్వసించవలెనని నా హృదయపూర్వకమైన ఆశ మరియు ప్రార్థన.

    అయితే, సమస్య ఏదనగా, నేటి క్రైస్తవులలో చాలా మందికి యేసు గూర్చి సరిగ్గా తెలియదు. క్రైస్తవ మతం యొక్క తప్పుడు బోధకులు ఆది సంఘ కాలం నాటి నుండి ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని గందరగోళపరిచారు (అపోస్తుల 15:24), ఎందుకనగా వారికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త అస్సలు తెలియదు. విశ్వాసములో గలిబిలిగా ఉన్నవారు, మన దేవుడైన యేసుక్రీస్తును అస్పష్టంగా విశ్వసించే వారి పాపముల నుండి బయటపడటానికి, నిజ దేవుడైన యేసును మన రక్షకునిగా మనం మరింత పట్టుదలతో విశ్వసించవలెను. ప్రజలందరికీ నీరు మరియు ఆత్మ సువార్త యొక్క సత్యానమును గూర్చి సాక్ష్యమివ్వడి. మన దేవుడైన యేసుక్రీస్తు విశ్వమును దానిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అనియు ఆయనే నిజ రక్షకుడని ఇప్పుడు మీరు నేను తెలుసుకొని నమ్మవలెను.

    సృష్టికర్తయైన యేసు నిజదేవుడను, ఆకాశం మరియు భూమిని సృష్టించిన విశ్వం యొక్క ప్రభువైయున్నాడు

    ఆదికాండము 1:1-3లో, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.దేవుడువెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు కలుగును గాక అని చెప్పిన ఈ దేవుడు మరెవరో కాదు, యేసుక్రీస్తు.

    మనం యోహాను సువార్త 1:1-3 వైపుకు తిరుగుదాం: ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు. ఆది యందు దేవుడు ఈ విశ్వమును వాక్యంతో సృష్టించి యున్నాడని ఈ వాక్య భాగం చెప్పుచున్నది. కాబట్టి దేవుడు సమస్తమును సృష్టించినవాడు, ఆయన ఎవరైయున్నారని ఎవరైనా అడిగితే, ఆయన స్వయాన యేసుక్రీస్తు, దేవుడే అని సమాధానం వస్తుంది.

    యోహాను సువార్త 1:10 కూడా ఇలా చెప్పుచున్నది, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగాకలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. ఇక్కడ ఉపయోగించిన సర్వనామం అతను అనేది ఏకైక దేవుడు అయిన యేసుక్రీస్తును సూచిస్తుంది. నిజమైన దేవుడు యేసు పాపులను రక్షించడానికి మానవ శరీరంలో అవతరించి ఈ భూమ్మీదకు వచ్చియున్నాడు.

    విశ్వమును అందులో ఉన్న సమస్తమును సృష్టించిన వాడు యేసుక్రీస్తు. మరోమాటలో చెప్పాలంటే, ఆయనే దేవుడు. మానవుని యొక్క శరీరములో

    Enjoying the preview?
    Page 1 of 1