Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

యోహాను సువార్త
యోహాను సువార్త
యోహాను సువార్త
Ebook772 pages3 hours

యోహాను సువార్త

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

జాన్ యొక్క సువార్త

పుస్తక వివరణ

జాన్ సువార్త గురించి Dr.Bailey ద్వారా అద్భుతమైన మరియు సులభంగా చదవగలిగే వ్యాఖ్యానం.
ఈ సువార్త యేసు యొక్క అత్యంత అందమైన బోధలలో కొన్ని లోతైన సత్యాలను తన శిష్యులకు తెలియజేస్తుంది.
గొర్రెల కోసం తన ప్రాణాలను అర్పించిన మంచి కాపరి క్రీస్తు
మనము జీవమును కలిగియుండునట్లు, మనకు సమృద్ధిగా లభించునట్లు పరలోకమునుండి దిగివచ్చిన జీవపు రొట్టెగా క్రీస్తును చూసినప్పుడు మనము దేవుని హృదయమును గ్రహిస్తాము.
LanguageTelugu
Release dateFeb 7, 2024
ISBN9781596653955
యోహాను సువార్త

Related to యోహాను సువార్త

Related ebooks

Reviews for యోహాను సువార్త

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    యోహాను సువార్త - Dr. Brian J. Bailey

    యోహాను సువార్త

    డా. బ్రయాన్ జె . బెయిలీ

    ఇంగ్లీష్ భాషలో ఈ పుస్తకము యొక్క పేరు  Gospel of John

    © 1998 డా. బ్రయాన్ జె . బెయిలీ

    ఇంగ్లీష్ అనువాదము  2.1

    యోహాను సువార్త

    © 2020 డా. బ్రయాన్ జె . బెయిలీ

    తెలుగులో వెర్షన్ 1.0

    తెలుగులోకి అనువదించినది : జియాన్ ఫెలోషిప్ ఇండియా

    తెలుగు అనువాదానికి ఎడిటర్:  యం.డేనియల్, హైదరాబాద్

    కవర్ పేజి డిజైన్:

     © 2006 జియాన్ ఫెలోషిప్

    సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి

     జియాన్ క్రిస్టియన్ పబ్లిషర్స్ ద్వారా ప్రచురించబడినది

    జియాన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ®  

    సంక్షిప్తమైన వ్యాసాలూ మరియు  సమీక్షల విషయంలో మినహా, ప్రచురణకర్త నుండి వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఈ పుస్తకంలోని ఏ భాగమునూ  ఏ రూపంలోనైననూ  లేదా ఏవిధమైన ఎలక్ట్రానిక్  మార్గముల ద్వారా పునరుత్పత్తి చేయరాదు.

     ఈ పుస్తకంలో వాడిన అన్ని బైబిల్ వాక్యములు బి.ఎస్.ఐ వెర్షన్ నుండి తీసికొనబడినవి.

    2023 లో తెలుగు భాషలో ఈ-బుక్గా ప్రచురించబడింది.

    ఇ బుక్ ISBN # 978-1-59665-395-5

    ఇంగ్లీష్ వెర్షన్ సాధారణ విచారణల కొరకు, సంప్రదించవలసిన చిరునామా

    జియాన్ క్రిస్టియన్ పబ్లిషర్స్

    పి.ఓ. బాక్స్ 70

    వేవర్లీ, న్యూయార్క్ 14892, యు.ఎస్.ఎ

    ఫోన్: (607) 565 2801,

    ఫ్యాక్స్: 607-565-3329

    http://www.zcpublishers.com

    తెలుగు వెర్షన్ పుస్తకాలు మరియు విచారణల కొరకు సంప్రదించవలసిన చిరునామా:

    జయాన్ ఫెలోషిప్ ఇండియా

    ఫోన్ : 8008257755, 8008267755

    http://www.zionfellowship.in

    యోహాను సువార్త

    కృతజ్ఞతలు

    సంపాదకీయ బృందం: కార్లా బోర్గెస్, సారా హేయర్, మేరీ హంఫ్రీస్, డేవిడ్ క్రాప్, జస్టిన్ క్రాప్, కరోలిన్ థామ్, సుజన యింగ్.

    పేర్కొనబడిన ప్రియులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గంటలకొలది వారు చేసిన అమూల్యమైన సహాయం లేకుండా ఈ పుస్తకం సాధ్యం అయ్యేది కాదు. దేవుని మహిమ కొరకు ఈ పుస్తక సంకలనంలో వారి జ్ఞానం, సృజనాత్మకత, శ్రేష్ఠతకు మేము నిజంగా కృతజ్ఞత కలిగియున్నాము.

    పరిచయం

    యోహను  సువార్తను జబదయి కుమారుడు, యాకోబు సోదరుడు అయిన ప్రియుడైన యోహాను వ్రాశాడు. ప్రభువైన యేసు భూసంబంధమైన పరిచర్యలో యోహాను ఆయనకు అత్యంత సన్నిహితుడైన శిష్యుడు, చివరి రాత్రి భోజనం సమయంలో ఆయన రొమ్ము మీద ఆనుకొన్నవాడు (యోహాను 13:23). యేసు ప్రేమించిన శిష్యుడిగా యోహానును గురించి అనేకమార్లు చెప్పబడింది(యోహాను 13:23; 19:26; 20:2; 21:7,20).

    యోహాను సువార్తను ఆదిమ సంఘ పితరులు ఆధ్యాత్మిక సువార్త అని పిలిచారు. ఏకదృష్టి (సినోప్టిక్) సువార్తల  ముగ్గురు రచయితలు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రత్యక్షతను పూర్తి చేయడానికి ఇది ఆఖరులో వ్రాయబడింది.  ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ముద్రించబడిన, ప్రసిద్ధమైన బైబిలు పుస్తకం ఇది.

    యోహాను సువార్త చాలా సరళమైన పద్ధతిలో 1,500 పదాల గ్రీకు పదాలతో వ్రాయబడింది. నూతన విశ్వాసులందరూ మొదట చదువవలసిన పుస్తకంగా ఇది సిఫారసు చేయబడింది ఎందుకంటే చిన్న పిల్లలు సహితం ఈ పుస్తకంలోని సందేశాన్ని చదవగలరు, సులభంగా అర్థం చేసుకోగలరు. అయితే ఈ సరళతలో దాచబడిన ధననిధులు, లోతైన అంశాలు ఉన్నాయి, ఎంతటి గొప్ప వేదాంత పండితుడైనా తన పూర్తి జీవితకాలంలో వాటిని అర్థం చేసుకొని ఆ లోతుల్లోకి  పూర్తిగా వెళ్లలేడని అంగీకస్తాడు.

    ఈ సువార్త సప్త సముదాయ అంశాలతో నిండి ఉందని తెలుసుకున్నప్పుడు అందులోని క్లిష్టమైన అంశాలను ప్రశంసించవచ్చు. సంపూర్ణత  పరిపూర్ణతలను గురించి ప్రస్తావించే ‘ఏడు’ సంఖ్య ప్రకటన గ్రంథంలో కూడా ఆధిక్యతను కలిగియుంది. యోహాను మొదటి అధ్యాయంలో కూడా ప్రభువైన యేసు యొక్క ఏడు బిరుదులు ఉన్నాయి.

    యెహెజ్కేలు 1:5 లో దేవుని సింహాసనాన్ని ఆవరించియున్న నాలుగు జీవులు మనకు పరిచయం అవుతున్నాయి. వాటి నాలుగు ముఖాలు మనిషి, సింహం, ఎద్దు, పక్షిరాజు ముఖాలుగా ఉన్నాయి. అవి క్రీస్తు స్వభావమును కనుపరుస్తున్నాయి. సింహం ముఖం క్రీస్తును రాజుగా చూపిస్తుంది, ఎద్దు ముఖం ఆయనను ఒక యాజకునిగా వెల్లడిస్తుంది. ఎందుకంటే ఎద్దు యాజకుని చేత బలిగా అర్పించబడిన జంతువు. మనిషి ముఖం క్రీస్తు యొక్క మానవత్వాన్ని చూపిస్తుంది. క్రీస్తును మనుష్యకుమారునిగా ఇది ప్రకటిస్తుంది. పక్షిరాజు దేవుని కుమారుడైన క్రీస్తుకు సాదృశ్యంగా వుంది. పక్షిరాజు ఆకాశములో పైకి ఎగురుతుంది. ఈ నాలుగు అంశాలలో నాలుగు సువార్తలు ప్రభువైన క్రీస్తును ఏవిధంగా చూపిస్తున్నాయో చూద్దాం.

    క్రీస్తులోని నాలుగు అంశాలు నాలుగు సువార్తల ద్వారా బయలుపరచబడ్డాయి

    మత్తయి సువార్త   ఒక సింహం    క్రీస్తు రాజు

    మార్కు సువార్త    ఒక ఎద్దు  క్రీస్తు మన ప్రధాన యాజకుడు

    లూకా సువార్త   ఒక మనిషి   క్రీస్తు మనుష్యకుమారుడు

    యోహాను సువార్త   పక్షిరాజు    క్రీస్తు దేవుని కుమారుడు

    యోహను సువార్తలో క్రీస్తు చేసిన ఏడు ప్రధాన ‘బహిరంగ బోధలు’

    1. నూతన జన్మ (3:1-36)

    2. జీవ జలము (4:1-42)

    3. దైవ కుమారుడు (5:19-47)

    4. జీవాహారము (6:22-66)

    5. జీవాత్మ (7:1-52)

    6. లోకమునకు వెలుగు (8:12-59)

    7. మంచి గొర్రెల కాపరి (10:1-42)

    ఈ కారణంగా యోహాను సువార్తను ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు అధ్యయనం చేసినా తరిగిపోని సత్యాలు అందులో ఉన్నాయి. ఈ దృక్ఫథంలో మేము ఈ గ్రంథాన్ని వణుకుతోనూ, వినయంతోనూ మీకు అందిస్తున్నాము. ఈ అద్భుతమైన సువార్తలో ఉన్న కొన్ని సత్యాలను వివరించి వ్యాఖ్యానించడానికి మేము ప్రయత్నించామని మాకు  తెలుసు. అయినప్పటికీ ఇది ఒక సమగ్రమైన అధ్యయనం అని చెప్పడానికి  ఏ విధంగానైనా  ఏ రీతిలోనైనా ఏ రూపంలోనైనా కూడా మేము సాహసించడం లేదు.

    యోహాను సువార్త ఉద్దేశ్యం

    యోహాను సువార్త ఉద్దేశ్యం యోహాను 20:31 లో వివరించబడింది, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

    యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించునట్లునూ, ఆ విధంగా విశ్వసించి ఆయన నామం ద్వారా సమృద్ధియైన జీవాన్ని పొందునట్లునూ యోహాను సువార్త వ్రాయబడింది (యోహాను 10:10). యోహాను సువార్త క్రీస్తు ప్రభువులోని ఇతర దైవలక్షణాలన్నిటికంటే  ఆయన దేవుని కుమారుడనే అంశాన్ని గురించే అధికంగా మాట్లాడుతుంది. ఇతర సువార్తలలో చెప్పబడినదాని కంటే క్రీస్తు దేవుని కుమారుడని యోహాను ఎక్కువ సార్లు చెప్పాడు.

    యోహాను సువార్తను అనేక విధాలుగా విభజించి అనేక విధాలుగా అధ్యయనం చేయవచ్చును. యోహాను సువార్తలో ప్రభువైన యేసు నేను అని ఏడుసార్లు తనను తాను వివరించుకోవడం గమనించదగినది. ప్రతీ సందర్భంలోనూ ‘నేను’ తరువాత తనకు ఆపాదించబడిన నిర్దిష్టమైన సుగుణాన్ని తెలియపరుస్తున్నాడు. నేను అని ఆయన చెప్పినప్పుడు, ఆయన దైవం అని అర్థం. యోహాను 18:5 లో, వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. (ఆయన పదం ప్రాచీన గ్రీకులో లేదు, అయితే కింగ్ జేమ్స్ అనువాదకులు ఈ పదాన్ని చేర్చారు). ఆయన ఇలా చెప్పినప్పుడు, సైనికులు నేలమీద పడడానికి కారణం ఉన్నవాడను అనే అయన పేరులో ఉన్న శక్తి. తరువాత ఆయన యోహాను 18:8 లో నేను అని మళ్ళీ చెప్పాడు. క్రీస్తు ఉన్నవాడను అనువాడను అని చెపుతున్నాడు.

    యోహాను సువార్తలోని నేను పదం యొక్క ప్రాముఖ్యత, మోషే మండుతున్న పొద వద్ద దేవుణ్ణి కలుసుకుని, ఆయన పేరు ఏమిటని అడిగినప్పుడు, దేవుడు నేను ఉన్నవాడను అనువాడను (నిర్గమకాండము 3:14) అని జవాబు ఇచ్చిన సత్యమును బట్టి వివరించబడింది. కాబట్టి నేను అని ప్రభువైన యేసు చెప్పినప్పుడు, ఆయన నేను దేవుణ్ణి; నేను యెహోవాను. అని చెపుతున్నాడు. నేను అనే పదంలో ఉన్న ప్రాముఖ్యత ఇదే.

    యోహాను సువార్తలోని మూడు సప్తసముదాయ అంశాలు  

    1. క్రీస్తు పలికిన ‘నేను’ తో మొదలయ్యే ఏడు వాక్యాలు

    2. క్రీస్తు చేసిన ఏడు ‘పూర్వ పునరుత్థాన అద్భుతాలు’

    3. క్రీస్తు బోధించిన ఏడు ప్రధాన ‘బహిరంగ బోధలు’

    క్రీస్తు ‘నేనే’ అని పలికిన ఏడు అంశాలు

    1. జీవాహారము (6:35, 48)

    2. లోకమునకు వెలుగును (8:12; 9:5)

    3. ద్వారమును (10:7, 9)

    4. మంచి గొర్రెల కాపరి (10:11, 14)

    5. పునరుత్థానము, జీవము (11:25)

    6. మార్గము, సత్యము, జీవము (14:6)

    7. నిజమైన ద్రాక్షావల్లి (15:1)

    క్రీస్తు చేసిన ఏడు ‘పూర్వ పునరుత్థాన అద్భుతాలు’

    యోహాను సువార్తలో ఏడు పూర్వ పునరుత్థాన అద్భుతాలు ఉన్నాయి, పునరుత్థానం తరువాత జరిగిన ఒక అద్భుతం ఉంది. అవి కేవలం అద్భుతాలు మాత్రమే కాదు, వాస్తవానికి అవి గ్రీకులో సూచకక్రియలు అని పిలువబడ్డాయి. ప్రతి అద్భుతం ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడించడాన్ని మనం చూస్తాము.

    ఏడు పూర్వ పునరుత్థాన అద్భుతాలు:

    1. క్రీస్తు నీటిని ద్రాక్షరసముగా మార్చడం (2:1-11)

    2. క్రీస్తు ప్రధాని కుమారుని స్వస్థపరచడం (4:46-54)

    3. క్రీస్తు పక్షవాయువుగలవానిని స్వస్థపరచడం (5:1-9)

    4. క్రీస్తు ఐదువేల మందికి ఆహారం పంచడం (6:1-14)

    5. క్రీస్తు నీటిపై నడవడం (6:15-21)

    6. క్రీస్తు పుట్టుగ్రుడ్డి అయిన వానిని స్వస్థపరచడం (9:1-41)

    7. క్రీస్తు చనిపోయిన లాజరును లేపడం (11:1-44)

    పునరుత్థానం తరువాత క్రీస్తు చేసిన అద్భుతం:

    8. 153 గొప్పచేపలు అద్భుతంగా వలలో పడటం (21:11)

    ముందు మాట  – 1:1-18 – మొదటి భాగము యోహాను సువార్త  మొదటి అధ్యాయము

    వాక్యము మరియు దేవుడు (1:1-2)

    1:1-2. "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. యోహాను దేవునినుండి పొందుకొన్న ఈ అద్భుతమైన ప్రత్యక్షతను మనము సరిగా అర్థము చేసుకోవడము చాల ముఖ్యమైన విషయం. క్రీస్తు యేసు ప్రభువు ఆదినుండి దేవునియొద్ద ఉన్నాడు. ఆయన నిత్యుడగు ప్రభువు. యేసు క్రీస్తు ప్రభువే వాక్యమై యున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధమైన వాక్యము ఎంతమాత్రమును పాడు చేయబడదు, ఎందుకంటే  అది దేవున్నే పాడుచేయడంతో సమానం అవుతుంది. మత్తయి 5:18 లో ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నేరవేరువరకు దానినుండి ఒక పొల్లయినను సున్నయైనను తప్పిపోదని మీతో చెప్పుచున్నా"నని యేసు క్రీస్తు సెలవిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యములో అంత గొప్ప శక్తి వుంది. బైబిలు గ్రంథము దేవుని వాక్యమై యున్నది, ఆ వాక్యమే దేవుడై యున్నాడు, గనుక బైబిలు గ్రంథము వంటి శక్తిగలిగిన మరొక  గ్రంథము ఈ లోకములో లేదు.

    వాక్యము మరియు సృష్టి (1:3-5)

    1:3 "సమస్తము ఆయన మూలముగా కలిగెను: కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు." దేవునికిని వాక్యమునకును మధ్య గల సంబంధము ఈ వాక్యము ద్వార మనకు పరిచయము చేయబడింది. యోహాను దేవుని వాక్యమును గురించి మాట్లాడుతూ  ఈ ప్రపంచమంతటిని తన వాక్కు ద్వార దేవుడు సృజించాడని చెప్పుతున్నాడు. తండ్రి కుమారులు విశ్వమంతటికి సృష్టికర్తలు. (ఆదికాండము 1;26 లోని బహువచనాన్ని గమనించండి). సృష్టియంతా దేవుని నోటి మాట ద్వార ఉనికిలోనికి వచ్చింది.

    అపోస్తలుడైన పౌలుకు కలిగిన అసాధారణమైన ప్రత్యక్షతలో విశ్వమంతటి సృష్టికర్తగా క్రీస్తు యేసును చూశాడు. కొలస్సీ 1:16 లో వాక్యమునకు గల శక్తిని గురించి ఒక భావనను పౌలు మనకు యిస్తున్నాడు: ఏలయనగా ఆకాశమందున్నవియు, భూమి యందున్నవియు, దృశ్యమైనవిగాని అదృశ్యమైనవిగాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారను ఆయనను బట్టియు సృజింపబడెను. సామెతలు 8:22-31 కూడ క్రీస్తు సకలసృష్టిని సృజించడములో సహ-సృష్టికర్త యనే భావనను బలపరస్తుంది .

    దేవుని వాక్యము వాస్తవముగా సృజనాత్మకమైనది. హెబ్రీ 11:3 లో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణ మైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించు కొనుచున్నాము. అని వ్రాయబడియున్నది. ఆదికాండము ఆదియందు అనే మాటతో ప్రారంభ మవుతుంది. యోహాను సువార్త కూడ అదే మాటతో ప్రారంభింపబడుతుంది. ఆదికాండము మొదటి అధ్యాయమంతా, యెహోవా దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి, వెలుగు కమ్మ’ని (పలుకగా వెలుగు కలిగెను), జలముల మధ్యనొక విశాలము కలిగి, గడ్డిని విత్తనముల నిచ్చు చెట్లను ...భూమి మొలిపించును గాక అనే వాక్యాలను పలుకుతూ సర్వ సృష్టిని ఉనికిలోనికి తెచ్చినట్లు మనం చూస్తాము.

    దేవుడు కేవలం తన నోటితో కలుగునుగాక అని పలికిన మాటను బట్టి ఆకాశములు యింకా సకల ప్రపంచములు సృజింపబడ్డాయి. దీనినిబట్టి దేవుని వాక్యము అద్భుతమైన శక్తిని కలిగియున్నదని మనము గ్రహించగలము. అదేవిధంగా, మనము దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు స్త్రీ పురుషులను బాలబాలికలను మార్చివేసే శక్తి గల సృజనాత్మకమైన వాక్యాన్ని ప్రకటిస్తున్నాము.   

    అందుకే ప్రభువు స్వయంగా మార్కు 11:23 లో ఇలా చెప్పగలుగుతున్నాడు, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి, తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని వాక్యం అత్యంత శక్తివంతమైనది, మనం దానిని ప్రకటించినప్పుడు, కార్యాలు జరుగుతాయి. ఈ సత్యాన్ని మనసులో పెట్టుకుని, కీర్తన 107:20 లోని మాటలను మనం అర్థం చేసుకుంటున్నాము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను. ఆయన వాక్కు నా నోట ఉండే విధంగా మనం ప్రార్థించాలి. (2 సమూయేలు 23:2).

    కాబట్టి దేవుని సేవకులముగా, ఆయన సందేశంతో నింపబడటానికీ, ఆయనతో ఎప్పుడూ సహవాసం కలిగియుండటం మన భాధ్యతయైయున్నది.  అందుకే పరిచర్య చేసే ప్రతి ఒక్కరూ ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను అని పేతురు చెప్పినట్లు బోధించాలి. మరో మాటలో చెప్పాలంటే, దేవుడే స్వయంగా మాట్లాడుతున్నట్లుగా మనం మాట్లాడాలి (1 పేతురు 4:11). యిర్మీయా 5:14 లో యిర్మీయాకు ఇలా చెప్పబడింది, కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు. మనం పరిశుద్ధాత్మచే అభిషేకించబడినప్పుడు, ఆయన వాక్యం మన పెదవుల నుండి ప్రవహిస్తుంది.

    1:4 - "ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ప్రభువైన యేసు ప్రతి మనిషికి వెలుగుగానూ, మనస్సాక్షిగానూ ఉన్నాడు. ఆయనలో మన సమస్త జీవన మూలం ఉంది. అపొస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు 3:6 లో ఇలా వ్రాశాడు, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును." ఇది జీవాన్ని తీసుకువచ్చే వాక్యం. మృతమైన అక్షరం కాదు, అభిషేకించబడినదీ, ప్రేరేపించు వాక్యమునై ఉన్నది. వాక్యం మనలోనికి ప్రవేశించినప్పుడు, దానిని మన సహజ కళ్ళతో చూడలేము, అయితే మన ఆధ్యాత్మిక కళ్ళతో దానిని చూడగలుగుతాము. మన కళ్ళు దేవునిచేత అభిషేకించబడినప్పుడు, వాక్యాన్ని స్వీకరించిన వారిలో మనం వెలుగును చూడగలము. రక్షించబడిన వారు, రక్షించబడని వారిమధ్య గొప్ప వ్యత్యాసం ఉంది.

    చాలా సంవత్సరాల క్రితం, ఒక సంఘానికి కాపరిగా బాధ్యతలు చేపట్టిన మూడు వారాల తరువాత, మా ఆదివారపు బడి సూపరింటెండెంట్ మరణించారు. ఈ మహిళ తాను బయటకు జీవించినట్లు కనిపించినంత నీతియుక్తంగా జీవించలేదు. ఆమె చనిపోయిన రాత్రి, ఆమె ఆత్మ నాకు కనిపించింది. నేను ఆమెతో, నేను ఇప్పుడు మీ కోసం ఏమీ చేయలేనని మీకు తెలుసు. అని అన్నాను.

    దీని గురించి ఆలోచిస్తూ, ఆమె మరణించిన తరువాత ఆమె నా దగ్గరకు ఎందుకు వచ్చింది? అని ప్రభువును అడిగాను. ప్రభువు నాతో, చిమ్మటపురుగులు వెలుగు వద్దకు వస్తాయి. అని చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆమె చనిపోయినప్పుడు ఎవరి వద్ద వెలుగు ఉందో ఆమె చూడగలిగింది, ఆమె వచ్చి ఆ వెలుగులో పాలుపంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. సహజంగానే, ఆమె క్రీస్తుచే తిరస్కరించబడింది, శాశ్వతమైన చీకటిలో పడవేయబడింది. ఇది గంభీరమైన ఆలోచన, కాదా?

    ప్రజలు ఏదైనా ఒక సమయంలో ప్రభువును తెలుసుకున్నప్పటికీ, వారు ఆయనపై తిరుగబడి, పాప జీవితాన్ని కొనసాగించాలని ఎంచుకుంటే, ప్రభువువైపుకు వారు పునరుద్ధరించబడకపోతే వారు తమ శాశ్వతమైన రక్షణను కోల్పోవచ్చు. మనం తిరిగి జన్మించిన తరువాత నూతన  ‘జీవితాన్ని జీవించాలి’.

    1:5 - ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన సత్యం. చీకటిలో ప్రకాశిస్తున్న వెలుగు అను ఆలోచన మనల్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. ఒక చీకటి గది గురించి ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఆ గదిలో ఒక అగ్గిపుల్లను వెలిగించినప్పుడు, అగ్గిపుల్ల చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ, ఆ అగ్గిపుల్ల నుండి వచ్చే వెలుగు చీకటిని తొలగిస్తుంది. చీకటి వెలుగును ముంచెత్తేదిగా ఉండదు. ఈ సత్యం మనల్ని ప్రోత్సహించాల్సిన సత్యంగా ఉండాలి. లోకానికి వెలుగు మనలో ఉంది. చీకటి మనలను ముంచెత్తదు, కానీ దానికి విరుద్ధంగా, అది మన నుండి పారిపోవాలి. మనం చీకటిలో ఉన్నప్పుడు, దీనిని జ్ఞాపకం ఉంచుకొందాము, ప్రభువులో మనల్ని మనం ప్రోత్సహించుకొందాం.

    వాక్యము, బాప్తిస్మమిచ్చు యోహాను (1:6-8)

    1:6  దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. క్రీస్తు కోసం ప్రజల హృదయాలను సిద్ధం చేయడం ద్వారా మెస్సీయకు మార్గం సరాళము చేయడానికి వచ్చిన ప్రభువు దూతగా బాప్తిస్మం ఇచ్చు యోహాను దేవుని చేత పంపబడ్డాడు. ఇది మలాకీ 3:1 వచనం నెరవేర్పు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

    జెకర్యా, ఎలిజబెతు (యోహాను తల్లిదండ్రులు) దేహాలను దేవుడు శక్తివంతంగా చేసాడు, తద్వారా వారి వృద్ధాప్యంలో వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఎలిజబెతు గొడ్రాలు అయినప్పటికీ, ఆమె యోహానుకు జన్మనిచ్చేలా దేవుడు ఆమె పట్ల ఒక అద్భుతకార్యాన్ని జరిగించాడు.

    1:7-8 అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై యుండలేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. ప్రభువైన యేసు లోకానికి వెలుగు (యోహాను 8:12, యెషయా 9:1-2, మత్తయి 4:14-16 చూడండి). యోహాను పరిచర్య చాలా కాలం కొనసాగలేదు, బహుశా 15 నుండి 18 నెలలు మాత్రమే కొనసాగింది. ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుకు సాక్ష్యమివ్వాలని యోహాను పిలువబడ్డాడు.

    క్రీస్తుకు మార్గాన్ని సిద్ధం చేయడం, ఆయనను మెస్సీయగా గుర్తించడం అనే ఏక ఉద్దేశం కోసం యోహాను 30 సంవత్సరాలు సిద్ధపడ్డాడు. అపొస్తలుల కార్యములు 13:25 ప్రకారం, బాప్తిస్మంఇచ్చు యోహాను తన బాధ్యతను నెరవేర్చినప్పుడు చెప్పాడు, యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను.

    వాక్యం శరీరధారి అయ్యింది (1:9-14)

    1:9 నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఏది మనలను వెలిగిస్తుంది? అది మన మనస్సాక్షి. పుట్టిన ప్రతి ఒక్కరికీ క్రీస్తు మనస్సాక్షిని ఇస్తాడు (రోమా 2:14-15). అందుచేతనే కీడు చేయటానికి ఎవరికీ సాకులు ఉండవు, పది ఆజ్ఞలు కూడా తెలియని వ్యక్తులకు మనస్సాక్షి ఉంది. అందువల్ల, వారు తప్పు చేసినప్పుడు, వారు పాపం చేస్తున్నారని వారికి తెలుసు. అనేక సంవత్సరాల క్రితం, నేను, నా భార్య పశ్చిమ ఆఫ్రికా పీఠభూమి ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నాము. ఈ సదస్సులో మాట్లాడటం నా వంతు రాకముందు, మేము ఒక ఆఫ్రికన్ బోధకుడి సందేశాన్ని వింటున్నాము, అతను మా మాజీ విద్యార్థి ద్వారా ప్రభువుని తెలుసుకొన్నవ్యక్తి. మేము అతని సందేశాన్ని వింటున్నప్పుడు, ప్రజలు ఆఫ్రికా అడవులలోనుండి బయటకు రావడాన్ని చూశాము. వారు ఆయన బోధను వినడానికి సమావేశం జరుగుతున్న ప్రదేశం వైపు నడచి రావడం మేము చూసాము.

    ఆతడు (తరచుగా పిడ్జిన్ ఇంగ్లీషులో) వ్యభిచారం, తప్పు అని మీకు తెలుసు. ఇది తప్పు అని మీకు ఎందుకు తెలుసు? ఎందుకంటే దీనిని మీరు చీకటిలో చేస్తారు. ఆమేన్? అని అనడం నాకు జ్ఞాపకం ఉంది. దానికి అందరూ ఆమేన్ అన్నారు. ఇది చాలా స్పష్టంగా ఉంది. కొంతమంది ఆఫ్రికన్ బోధకుల సందేశాలను వినడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కొన్నిసార్లు వారి వ్యాకరణం సంక్రమంగా ఉండదు. అయితే వారి వేదాంతశాస్త్రం నిజానికి చాలా మంచిది. చాలా వరకు, ప్రతిఒక్కరికీ మంచి, చెడుల మధ్య వ్యత్యాసం తెలుసు ఎందుకంటే వారికి అంతర్గత సాక్ష్యం ఉంది - వారి మనస్సాక్షి, ఆ అంతర్గత వెలుగు.

    1:10 ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. క్రీస్తు లోకంలో ఉన్నాడు. మరో మాటలో చెప్పాలంటే, లోకానికి వెలుగు లోకంలో ఉంది. క్రీస్తు తనచేత సృష్టించబడిన ప్రపంచానికి సేవ చేయడానికి మనిషిగా వచ్చాడు. మీరు ఈ వచనాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, దేవుడు తానే తన స్వంత సృష్టిని కాపాడటానికి మనిషిగా భూమిపైకి రావడం గురించి ఆలోచిస్తున్నప్పుడు, క్రీస్తు, తండ్రి వినయాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మనలను రక్షించడానికి తండ్రియైన దేవుడు తన కుమారుడిని మానవునిగా మనకు అనుగ్రహించాడు.

    క్రీస్తు భూమిని సృష్టించాడు, రూపొందించాడు. ఆదాము హవ్వలను ఆయన సృష్టించాడు. అయినప్పటికీ ఆయన ఈ భూమి మీద ఉండడానికి తన్ను తాను తగ్గించుకున్నాడు, మనుష్యులు, జంతువులు, కూరగాయలు, ఖనిజ రాజ్యాలతో కూడిన తన సృష్టి ఆధీనంలో తననుతాను ఉంచుకొన్నాడు. చలికీ, వేడిమికీ, ప్రకృతిలోని అంశాలన్నిటికీ బహిరంగపరచుకొన్నాడు. అయితే విచారకరం, ఆయన చేసిన సృష్టి తన సృష్టికర్తను గుర్తించలేదు.

    నేను చదివిన కళాశాలలో పని చేసిన ఒక ప్రొఫెసర్ భారతదేశానికి మిషనరీగా వచ్చాడు, అక్కడ ఆయన మహాత్మాగాంధీని కలిశారు. ఆయన, మరికొందరు గాంధీతో అనేక గంటలు మాట్లాడారు. మహాత్మా గాంధీ బైబిలును పూర్తిగా తన జ్ఞాపకశక్తి నుండి ప్రస్తావించినట్లు ఆయన మాకు చెప్పారు.

    చివరికి మా ప్రొఫెసర్ గాంధీగారిని చాలా సూటిగా ఒక ప్రశ్న అడిగే వరకు వారు కొద్దిసేపు మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రశ్న మత్తయి 16:13 లో ఉన్నదే, యేసు మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. ఆ ప్రొఫెసర్ గారు గాంధీగారిని నేరుగా సూటి ప్రశ్న అడిగారు, యేసు దేవుని కుమారుడని మీరు నమ్ముతున్నారా? మహాత్మా గాంధీ ఇలా జవాబిచ్చాడు, నేను దేవుని కుమారుడిగా ఉన్నట్టుగానే యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నాను అని సమాధానం ఇచ్చారు. ఇది గాంధీ చేసిన అసాధారణ ప్రకటన. మరో మాటలో చెప్పాలంటే, యేసు దేవుని ఏకైక కుమారుడు అనే ప్రత్యక్షత ఆయనకు లేదు. యేసు దేవుని కుమారుడని తెలుసుకోవడంలో మన అవగాహన వెలిగింపబడిన అద్భుతమైన ఆధిక్యత కోసం ప్రభువుకు మనం ఎంతో కృతజ్ఞత కలిగియుండవలసిన అవసరం ఉంది.

    క్రీస్తు దేవుని కుమారుడని ఎవరైనా తెలుసుకోడానికి దేవుని ప్రత్యక్షత కావాలి. క్రీస్తు శిష్యులు సహితం, మనుష్యకుమారుడు ఎవరని జనులు అనుకొనుచున్నారని ప్రభువు అడిగినప్పుడు, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని శిష్యులు స్పందించారు.

    అప్పుడు క్రీస్తు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు ‘నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను.’ అందుకు యేసు ‘సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనే కాని నరులు నీకు బయలు పరచలేదు." అని పేతురుతో చెప్పాడు (మత్తయి 16:13-17).

    ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు భూమిమీద ఉన్న కోటానుకోట్ల మంది మనుష్యులలో, ఆయన తన సార్వభౌమత్వంలో తన చేతిని చాచి, ఆయన పేతురు విషయంలో చేసినట్లే ప్రభువైన యేసును దేవుని కుమారుడిగా మనకు వ్యక్తిగత ప్రత్యక్షత అనుగ్రహించాడు. మనపట్ల ఆయనకున్న కరుణ, దయ కొరకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగియుందుము గాక!

    1:11 ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇశ్రాయేలీయులను చేరుకోవడం ప్రభువైన యేసు పరిచర్య (మత్తయి 15:24). ఆయన తన స్వకీయుల (ఇశ్రాయేలు) వద్దకు వచ్చాడు. అయితే వారు ఆయన స్వీకరించలేదు. బదులుగా, వారు దేవుని చేత యెంచుకోబడిన జనులు అయినప్పటికీ, యెహోవాను తమ రక్షకుడని  యెరిగినప్పటికీ వారు యేసును తిరస్కరించారు.

    క్రీస్తు పరిచర్యను గురించి యెషయా 49:5 వచనం మనకు చెపుతుంది, యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు. రోమా గవర్నర్, న్యాయాధిపతి అయిన పిలాతు యూదులను నజరేయుడైన యేసును నేను ఏమి చేయాలి? అని అడిగినప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఆయనను సిలువ వేయండి (మార్కు 15:12-13) అని బదులిచ్చారు.

    యూదులు తాము ఏమి చెబుతున్నారో వారికి తెలియదు. తమ రక్షకుడిని, రాజును సిలువ వేయాలని వారు గట్టిగా కోరుతున్నారు. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, అతను యూదులతో (ద్వితీయోపదేశకాండము 32:40, భావానువాదం), నేను ఇక్కడ ఉన్నాను; నేను శాశ్వతం జీవిస్తాను. అని చెపుతాడు, వారి సమాధానం యెషయా 25:9 లో కనిపిస్తుంది, ఆ దినమున జనులీలాగు నందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణనుబట్టి సంతోషించి ఉత్సహింతము. ఇక్కడ సీయోను రక్షకుల నుండి అత్భుతమైన ఆనందాన్ని చూస్తాము, వారు యెరూషలేము అంతిమ ముట్టడిలో నగరం విచ్ఛిన్నమైపోవడం చూసారు, అయితే సీయోను కూలిపోదు.

    జెకర్యాలో మనం ఒలీవ పర్వతంపై ప్రభువు ప్రత్యక్షం కావడం గురించీ, సీయోను రక్షకులు, క్రీస్తు మధ్య జరుగబోవు సంభాషణ గురించీ మనం చదువుతాము. వారు ఆయన చేతులు చూసినప్పుడు వారి ఆనందం తల్లడిల్లిపోతుంది, నీ చేతులకు గాయములేమని వారడుగగా అయన ఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. (జెకార్యా 13:6).

    ఆ సమయంలో, దేవుడు యూదుల మీద కృప, విజ్ఞాపనా ఆత్మను కుమ్మరిస్తాడు. వారు తమ ఏకైక కుమారుని కోసం ప్రలాపించునట్లు వారు ప్రలాపిస్తారు. క్రీస్తు రాకడలో వారి కళ్ళు తెరవబడినప్పుడు, వారు ఎదురుచూస్తున్నవానిని వారు సిలువ వేయబడిన వ్యక్తి అని వారు గుర్తించినప్పుడు వారు ప్రలాపిస్తారు.

    ఎంత విచారం - క్రీస్తు తన స్వకీయుల వద్దకు వచ్చాడు, కాని వారు ఆయనను స్వీకరించలేదు. ప్రియమైనవారలారా, జీవిత సత్యం ఇదే. అనేకసార్లు మన స్వంత ప్రజలు మనల్ని తిరస్కరిస్తారు. ఇతరులు మన పరిచర్యనూ, మనలనూ స్వీకరిస్తారు. మనం నిరుత్సాహపడవద్దు. అలాంటి సమయాల్లో మన ఆదరణ కోసం ప్రభువు వైపు చూద్దాం.

    1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు, అయితే ఆయనను విశ్వసించడం ద్వారా మనం దేవుని దత్తపుత్రులుగా, క్రీస్తుతో సహవారసులుగా మార్పుచెందుతాము. (రోమా. 8:17). యేసు నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. (అపొస్తలుల కార్యములు 4:12). మనం క్రీస్తును స్వీకరించినప్పుడు, దేవుని కుమారులుగా మారడానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడు. తన నామమునందు విశ్వాసముంచిన వారికి అనే వాక్యంలో, యేసు నామమందు మనం విశ్వసించినట్లయితే, మనకు నిత్యజీవము ఉందని చూడగలం.

    1:13 వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు.

    ఈ వచనంలోనాలుగు విధములైన పుట్టుకలను  గురించి చదువుతున్నాము:

    1. రక్తంద్వారా జన్మించినవారు

    2. శరీరేచ్చ ద్వారా జన్మించినవారు

    3. మానవ చిత్తం ద్వారా జన్మించినవారు

    4. దేవుని ద్వారా జన్మించినవారు

    రక్తం ద్వారా ప్రమాదవశాత్తూ పిల్లలు జన్మించవచ్చు. ఎందుకంటే శరీరం ఆధిపత్యాన్ని తీసుకొంటుంది, లేదా తల్లిదండ్రుల సంకల్పం ద్వారా, సంతానం కలిగియుండాలని వారు తీసుకొనే నిర్ణయాన్ని బట్టి పిల్లలు జన్మించవచ్చు. వివాహిత దంపతులు ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి, తాము పిల్లలను కలిగియుండడం దేవుని చిత్తమా అని దేవుణ్ణి అడగాలి.

    కొంతమందికి పిల్లలు పుట్టడం దేవుని చిత్తం కాదు, ఎందుకంటే పిల్లలను పెంచడానికి వారి గృహాలలో తగిన పరిస్థితులు ఉండవని ఆయనకు తెలుసు. అయితే ఇతరులు పిల్లలను కలిగియుండడం దేవుని చిత్తం. అందుచేత దంపతులు తాము పిల్లలను కలిగియుండాలని, ఎంతమందిని కలిగియుండాలని, ఎప్పుడు కలిగియుండాలని మొదట దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. ఈ విషయాలన్నిటిలో మనం ప్రభువు నడిపింపును తీసుకోవాలి.

    1:14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రభువైన యేసు మనుష్యావతారియైన దేవుని వాక్యం. ప్రభువైన యేసు వచ్చినప్పుడు వాక్యం శరీరం అయ్యింది, మానవుని రూపమును ఆయన ధరించాడు.

    ఆయన వాక్యం మనలో శరీరం కావాలనేది మన విషయంలో దేవుని చిత్తం. మరో మాటలో చెప్పాలంటే, ఆయన వాక్యం మనలో ఒక భాగం కావాలని ఆయన కోరుకుంటాడు, తద్వారా మన అంతరంగంలో సత్యాన్ని కలిగియుంటాము (కీర్తన 51:6). దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగియుండడం, మన హృదయాలలోనూ, మనస్సులలోనూ రాయబడడం అంటే అర్థం ఇదే (యిర్మీయా 31:33).

    వాక్యం శరీరధారి అయ్యింది, మన మధ్య నివసించింది. ఆ వాక్యం యేసుక్రీస్తే - ఇమ్మానుయేలు, అంటే దేవుడు మనతో ఉన్నవాడు (మత్తయి 1:23). ఆయన తన ప్రజలతో నివసించడానికి వచ్చాడు.

    క్రీస్తు మహిమను, తండ్రి ఏకైక కుమారుని మహిమను తాను చూశానని యోహాను చెప్పాడు. ఆయన దేవుని స్వభావ స్వరూపం (హెబ్రీయులు 1:3). శిష్యులు ఆయనను చూసినప్పుడు, అది తండ్రిని చూడటం లాంటిదే, ఎందుకంటే యేసు తన తండ్రిలాగే ఉన్నాడు. యోహాను 14:9 లో యేసు ఫిలిప్పుతో ఇలా అన్నాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు ...

    క్రీస్తు కృప సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు, కృపా, సత్యంతో నిండిన నూతన యుగాన్ని ఆయన తీసుకొనివచ్చాడు. ఆ విధంగానే మనము కృప సత్యములతో నిండియుండాలని ప్రభువు కోరిక. కృప అంటే దైవిక సామర్ధ్యాన్నివ్వడం, అనర్హమైనవారికి దయ చూపించడం. ఫిలిప్పీయులకు 4:13 వచనంలో పౌలు ఇలా చెపుతున్నాడు, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు మనల్ని కృపతో  నింపు తున్న ప్రకారం మనకు అప్పగింపబడిన ప్రతి పనిని చేయగలుగుటకు సామర్థ్యమునిస్తున్నాడు.

    మనం కూడా సత్యంతో నిండి ఉండాలి. దావీదు రాజు కీర్తన 51:6 లో ఇలా అన్నాడు, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. దేవుని వాక్యం మన హృదయాలలోనికి వేరుపారి ఉండాలనీ, మన జీవితాలలో ఫలాలను ఫలించాలని దీని అర్థం. యోహాను పదే  పదే ఈ విషయాన్ని చెప్పడం మనం చూడగలం. సత్యమును గురించిన మానసిక జ్ఞానం కలిగియుండడం లేదా దాని గురించి మాట్లాడటం మాత్రమే కాదు గాని మన జీవితాల ద్వారా సత్యాన్ని వ్యక్తపరచాలి.

    శారీరధారియైన వాక్యము అందరికంటే ముందటి వాడయ్యాడు (1:15-18)

    1:15 యోహాను ఆయనను గూర్చి సాక్ష్య మిచ్చుచు నా వెనుక వచ్చువాడు నా కంటె ప్రముఖుడు గనుక ఆయన నా కంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. దేవుని సృష్టికి ఇది కీలకం. మొదటివాడు ఎవరు? తండ్రియైన దేవుడు. అందుచేత ఆయన సర్వోన్నతుడు. కుమారుడైన దేవుడు తండ్రి నుండి వచ్చాడు. కాబట్టి ఆయన అధికారంలోనూ, స్థానంలోనూ రెండవ వ్యక్తిగా ఉన్నాడు, ఆయన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. దేవుడు మనిషిని దేవునికంటె (ఇంగ్లిషు బైబిలు –దేవదూతలకంటే) వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. అని కీర్తన 8:5 చెబుతోంది, ఎందుకంటే మనిషి దేవదూతల తరువాత సృష్టించబడ్డాడు. ఈ విధంగా, దేవదూతలు దేవుని స్థాయిల వరుస క్రమంలో  తదుపరి స్థానంలో ఉన్నారు, తరువాత మానవజాతి వస్తుంది.

    ఆదాము తరువాత ఎవరు సృష్టించబడ్డారు? స్త్రీ. 1 తిమోతి 2:11 వచనంలో, స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను అని పౌలు రాశాడు. దీనికి కారణం 1 తిమోతి 2:13 లో మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? అని ఉంది. అందుచేత, పురుషుడి అధికారం క్రింద స్త్రీ ఉంది. పురుషుడు స్త్రీ కంటే ముందు సృష్టించబడ్డాడు అనే సత్యాన్ని బట్టి అతడు స్త్రీకు శిరస్సుగా ఉన్నాడు (ఎఫెసీ 5:23). ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను తన కంటే క్రీస్తు ముందటివాడు అని చెపుతున్నాడు, ఎందుకంటే ప్రభువైన క్రీస్తు యోహాను కంటే ముందుగా ఉన్నాడు.

    1:16 "ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను

    Enjoying the preview?
    Page 1 of 1