Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

కొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు
కొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు
కొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు
Ebook561 pages2 hours

కొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

కరోనావైరస్ మహమ్మారి సమయంలో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనం ఏమి చేయాలి?

యేసుక్రీస్తు ఈ భూమ్మీదకు తిరిగి వచ్చునని పాపులకు తెలియదు. కానీ ప్రస్తుత కాలంలో జరుగుచున్న సూచనలు నీతిమంతులమైన మనము బాగుగా ఎరిగినవారమే.లోకం దిమ్మతిరిగే వేగంతో విపరీతమైన మార్పులను ఎదుర్కొంటోంది. ఏది ఏమైనప్పటికీ, శత్రువులు ప్రపంచంపై పూర్తిగా అధికారం పొందే సమయానికి ఇది ఇంకా చాలా దూరంలోనె ఉన్నది. ఇది జరగాలంటే, ఆచరణాత్మకంగా ఈ ప్రపంచంలోని ప్రతి చట్టాన్ని తిప్పికొట్టాలి.

అటువంటి అసాధారణ సమయాలలో జీవిస్తూ, మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించు విశ్వాసులు మహమ్మారితో ఎలా వ్యవహరించవలెను?

LanguageTelugu
PublisherPaul C. Jong
Release dateSep 15, 2023
ISBN9788965325772
కొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు

Related to కొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు

Related ebooks

Reviews for కొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    కొరోనావైరస్ కాలమందు మన యెడల దేవుని యొక్క వాక్కులు - Paul C. Jong

    మనము పరలోకానికి చెందినవారిమే కానీ, ఈ లోకానికి చెందిన వారము కాము

    < ప్రకటన 4 >

    "ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వనివలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచెదననెను

    వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనము నందు ఒకడు ఆసీసుడై యుండెను, ఆసీనుడైన వాడు, దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు; మరకతము వలె ప్రకాశించు ఇంద్ర ధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను. సింహాసనము చుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని యేడు ఆత్మలు.

    మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసన మునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది; నాలుగవ జీవి యెగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండి యున్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు

    పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,

    అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.

    ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి

    యుగయుగములు జీవించుచున్న వానికి

    మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగును గాకని

    ఆ జీవులు కీర్తించుచుండగా ఆ యిరువది నలుగురు పెద్దలు సింహాసనము నందు ఆసీనుడై యుండువాని యెదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు

    ప్రభువా, మా దేవా,

    నీవు సమస్తమును సృష్టించితివి;

    నీ చిత్తమునుబట్టి అవి యుండెను;

    దానిని బట్టియే సృష్టింపబడెను గనుక

    నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు

    తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి.

    ఈ మధ్య కాలములో మా వెబ్‌సైట్‌ను దర్శించిన సందర్శకులు మా ద్వితీయ భాషా ఇ-పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకొనియున్నారని నేను విన్నాను. మేము మొదటి సారిగా ద్వితీయ భాషా పుస్తకాలను ప్రవేశపెట్టినప్పుడు, వాటిని డౌన్‌లోడ్ చేసేవారు చాలా మంది ఉన్నారు, కానీ నిన్న ఒక్కరోజే పద్నాలుగు మంది వాటిని డౌన్‌లోడ్ చేసుకొని యున్నారని వినడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు వారి స్వతగా ప్రత్యేక భాషలను కలిగి ఉన్నారు అయితే మేమును మా ద్వితీయ భాషా పుస్తకాలను ఒకచోట చేర్చాము, తద్వారా ప్రజలు ఒకే సమయంలో రెండు భాషల మధ్య వచనాలను సరిపోల్చి చదవగలరు. ఈ పుస్తకాలు ప్రపంచం వ్యాప్తంగా నలుమూలల నుండి మంచి ప్రాచుర్యం పొందాయి కావున, రాబోయే రోజుల్లో మరిన్ని ద్విభాషా పుస్తకాలను ప్రచురించాలని నేను ఆశిస్తున్నాను. వాస్తవానికి ప్రపంచంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ భాషలను ఉపయోగించే వ్యక్తులు ఎక్కువగానే ఉన్నారు. ఒకే కుటుంబంలోని పిల్లలు మరియు తల్లిదండ్రులు వేర్వేరు భాషలు మాట్లాడే దేశాలు కూడా అనేకం ఉన్నాయి, కావున మా యొక్క రెండు విధములగు భాషా ఇ-పుస్తకాలు అటువంటి కుటుంబాలకు చాలా సహాయకారిగా ఉండునని నేను భావిస్తున్నాను. మేము ఈ రెండు రకముల యొక్క భాష ఇ-పుస్తకాలను ఎంత ఎక్కువగా ప్రచురిస్తున్నామో, ప్రపంచ వ్యాప్తంగా అంత ఎక్కువ మంది వ్యక్తులు వాటిని డౌన్‌లోడ్ చేసుకొనుచున్నారు అటువలె వారి యొక్క ఆత్మలు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యాన్ని బట్టి నేను కృతజ్ఞతలు కలిగి ఉన్నాను. ఇక్కడ ప్రతి విషయమును గూర్చి నేను మాట్లాడలేను, కానీ కొందరు వ్యక్తులు డజన్ల కొద్దీ ఇ-పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకున్నారు, కావుననే నాకు వాటిని గూర్చిన అంచనాలు ఎక్కవగా ఉన్నవి. కావున అన్నింటికంటే, ఎక్కువగా మా ఇ-పుస్తకాలను డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఈ వ్యక్తులు ఏమి చేయుదురు? వారు వాటిని చాలా మంది వ్యక్తులతో పంచుకొందురు. ఆ ప్రజలు కూడా తమ హృదయాలను మార్చకోవడానికి ప్రయత్నించెదరు. అందుకనే మేము మరింత కష్టపడి పని చేయుచున్నాము, ఈ నీతివంతమైన కార్యమునకై ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుదము.

    మేము ఇప్పుడే ఈ ప్రకటన 4వ అధ్యాయాన్ని పూర్తిగా చదివి యున్నాము. కొంతకాలం క్రితం, ఆసియాలోని ఏడు సంఘము కోసం అపొస్తలుడైన యోహాను అందించిన సందేశాన్ని పంచుకోవడానికి మేము ఆశీర్వదించబడ్డాము. ప్రకటగ్రంధమును వ్రాసిన అపొస్తలుడైన యోహాను, ఆధారిత సువార్తలైన నాలుగు సువార్తలలో ఒకటైన యోహాను సువార్త మరియు 1, 2 మరియు 3వ యోహాను పత్రికలను కూడా యేసు శిష్యుడు యోహానే వ్రాసెను.

    ఇతను యేసుకు అత్యంత ప్రియమైన శిష్యుడు, అతని యొక్క జీవిత చరిత్ర చివరిలో, అతను రోమన్ చక్రవర్తిచే హింసించబడి పత్మోస్ ద్వీపానికి బహిష్కరించబడ్డాడు. అపొస్తలుడైన యోహాను యొక్క స్వస్థలమైన ఇజ్రాయెల్ ఆ సమయంలో రోమా చేత పాలించబడినందున, రోమన్ పాలనను ధిక్కరించిన వారు ఖైదు చేయబడటం మరియు శ్రమలను భరించడం సర్వసాధారణం. అపొస్తలుడైన యోహాను చక్రవర్తి ఆరాధనలో పాల్గొనడానికి నిరాకరించడం ద్వారా రోమ్‌ను ధిక్కరించాడు మరియు రోమన్ అధికారులు అతన్ని పత్మోస్ ద్వీపానికి బహిష్కరించి అక్కడే అతన్ని ఖైదీగా ఉంచిరి. అయితే, అతను పత్మోస్ ద్వీపంలో బహిష్కరించబడినప్పుడు, అపొస్తలుడైన యోహాను యేసుతో లోతైన సహవాసాన్ని పంచుకొనెను, కావున ఈ శ్రమ అతనికి ఒక ఆశీర్వాదం, అతను ఇక్కడే ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసెను. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో దేవుడు అపొస్తలుడైన యోహానుకు ఈ ద్వీపంలో చూపించాడు. ఇలా, నీతిమంతులు కూడా అప్పుడప్పుడు శ్రమలను ఎదుర్కొనుచుండగా, వారు ఈ శ్రమల నుండి ఆశీర్వదించబడాలని దేవుడు అన్ని సమయాలలో పని చేయును.

    అపొస్తలుడైన యోహానుకు చూపబడిన ఆయన గూర్చిన ప్రత్యక్షత ఈ రోజు మనకు అందజేయబడిన దేవుని యొక్క సంరక్షణ. అపొస్తలుడైన యోహాను తనను గూర్చి స్పష్టమైన అవగాహనతో వ్రాసిన ప్రత్యక్షత లేఖను మనం చదివినప్పుడు, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడో తెలుసుకుని మనం నిశ్చింతగా ఉండగలము. మనం భరించే శ్రమలు ప్రభువును అనుసరించడానికి మనకు మరింత సహాయం చేయును.

    జరగవలసిన వాటిని నేను మీకు చూపించెదను

    పత్మోస్ ద్వీపంలో, ఈ లోకం ఎలా మార్పు చెందుతుందో దేవుడు అపొస్తలుడైన యోహానుకు చూపించాడు. తన ప్రవాసం నుండి విసిగిపోయిన, అపొస్తలుడైన యోహాను దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు అతను దేవుని యొక్క ఆత్మచే నడిపించబడి పరలోకం యొక్క ప్రత్యక్షతను విని మరియు చూడగలిగెను. కావున ఇది ఇలా వ్రాయబడింది, దీని తర్వాత జరగవలసిన వాటిని నేను నీకు చూపించెదను (ప్రకటన 4:1).

    ప్రకటన 4:1-11లో, అపొస్తలుడైన యోహాను, పరిశుద్ధాత్మచే ప్రేరేపించ బడినవాడై, తన దృష్టితో మరియు హృదయంతో చూసిన పరలోక యొక్క ఆధిపత్యం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ, అతను దేవుని యొక్క సింహాసనాన్ని, ఇరవై నాలుగు మంది పెద్దలు సింహాసన ఆసీనులై తలపై బంగారు కిరీటాలతో కూర్చుండుట, మరియు నాలుగు జీవులు ఆరు రెక్కలు మరియు చుట్టూ కళ్ళుతో నిండి ఉండుట చూచెను. పగలనక మరియు రాత్రినక, ఈ జీవులు విశ్రాంతి లేకుండా ఇలా చెప్పుచున్నవి :

    "సర్వాధికారియు దేవుడునగు,

    ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!" (ప్రకటన 4:8). బైబిల్ ఇక్కడ రాబోవుచున్న... వారి గూర్చి చెప్పబడింది అది ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుంది. ఇది మానవులమైన మనందరినీ ఈ లోక పాపముల నుండి నీరు మరియు ఆత్మ ద్వారా రక్షించుటకు వచ్చిన రక్షకుని సూచిస్తుంది.

    మానవ జాతి యావత్తు ఈ లోక పాపములలో పడి నశించవలసి వచ్చినప్పుడు, ప్రభువు యేసు ఈ భూమ్మీదకు వచ్చి, నీరు మరియు రక్తము యొక్క సువార్త ద్వారా మానవజాతి యొక్క పాపముల నుండి ఒక్కసారిగా రక్షించెను. ప్రభువైన యేసుక్రీస్తు. ఈ పని అంతయు పూర్తి చేసి, మృతులలో నుండి లేచిన తర్వాత తన శిష్యుల యెదుట ప్రత్యక్షమై, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధి కారము ఇయ్య బడియున్నదని చెప్పాడు. (మత్తయి 28:18). ప్రభువు పరలోకమును మరియు భూమికిని అధిపతియైన వాడు. ఆయన పాపులకు రక్షకుడు మాత్రమే కాదు గాని, ఆయన సాతాను మరియు నీతిమంతులపై ఆధిపత్యం కలిగినవాడు. యేసు యొక్క పాలన గురించి మనకు స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం, ఈ అవగాహనతో మనం ప్రభువును కలిసే రోజు వరకు విశ్వాసంతో జీవించవలెను.

    పాత నిబంధన యొక్క పురాతన దినాలలో, యెహోవా దేవునికి మాత్రమే ప్రార్థనలు చేయబడేవి, కానీ కొత్త నిబంధన కాలంలో, మన దేవుడైన యేసు క్రీస్తుకు ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకు సమాధానం లభించునని మనకు తెలుసు. యేసుక్రీస్తు నీరు, రక్తము మరియు ఆత్మ యొక్క సువార్తను నమ్మిన మనకు ఈ దీవెనలన్నింటినీ అనుగ్రహించునని చెప్పెను.

    ప్రకటన 4వ అధ్యాయంలో, ప్రభువు పరలోక యొక్క ఆధిపత్యం నుండి భూసంబంధమైన ఆధిపత్యం వరకు ప్రతి దానిని ఎలా నడిపించుచున్నాడో ఎలా క్రమ పరచుచున్నాడో మనకు చూపుతున్నాడు. మానవులందరూ యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యానికి మరియు ఆయన యొక్క శక్తికి తల వంచి, ఆయనను స్తుతించి ఆరాధించవలెను. మనం దేవుని ప్రేమను ధరించుకున్నందున, విశ్వాసంతో ఆయనను ఆరాధించగలము.

    వాస్తవానికి యేసుక్రీస్తు సమస్త జీవరాసులు మరియు దేవదూతల ద్వారా స్తుతించబడుటకు యోగ్యుడు. పాత నిబంధన కాలములో, దేవుడు వెల్లడి చేసిన పేర్లు చాలా ఉన్నవి, వాటిలో యెహోవా, అనగా నేను నేనే, అలాగే ఎలోహిమ్ (אֱלהִים), అనగా దేవుడు సర్వ శక్తిమంతుడు. యేసుక్రీస్తు పరలోకమును మరియు భూమిపై నున్న సమస్తమును సృష్టించిన దేవుడు, ఆయన సమస్త జీవులను నడిపించేవాడు మరియు పాలించువాడు. కావున నేటి లేఖన భాగము మనందరికీ ఇదే తెలియపరుస్తున్నది. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో ఉన్న విశ్వాసుల యొక్క స్తుతులకు మరియు ఆరాధనకు యేసు యోగ్యుడైన దేవుడని ఇది మనకు చెప్పుచున్నది. ఆయనను ఆరాధించడానికి ఎటువంటి ఆక్షేపణ లేదు, ఎందుకనగా ఆయన నీరు మరియు రక్తం యొక్క సువార్త ద్వారా మనలను రక్షించియున్నాడు కావున ఆయన కీర్తి మరియు ప్రభావం నిత్యమనివి.

    ప్రభువు ఈ భూమ్మీదకు తిరిగి వచ్చినప్పుడు, ఈ లోకంలో జీవించు నీతిమంతులను ఆయన యొక్క రాజ్యానికి- అనగా పరలోక రాజ్యానికి తీసుకెళ్లును - అదే సమయంలో యేసుక్రీస్తు నిజమైన పాలకుడని నమ్మని వారందరికీ ఆయన తీర్పు తీర్చును. దీనికి బదులుగా ఆయనకు వ్యతిరేకంగా నిలబడిన ఈ ప్రజలు యొక్క క్రియలు మరియు అవిశ్వాసమును బట్టి తగిన తీర్పు ఉండును.

    యేసుక్రీస్తు మనలను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలడు, కారణం ఈ లోకములోని సమస్త పాపముల నుండి ఒక్కసారిగా మిమ్మును మరియు నన్ను రక్షించే శక్తి ఆయనలో ఉన్నది. ఆయన 30 సంవత్సరాల వయస్సులో బాప్తీస్మం మిచ్చు యోహాను నుండి పొందిన బాప్తీస్మం ద్వారా లోకములోని పాపములను ఒక్కసారిగా భరించి తన రక్తమును సిలువపై చిందించడం ద్వారా మన పాపములన్నిటికి వెల చెల్లించాడు కావున, ఆయన మనలను పరిపూర్ణులుగా చేయగలడు. కావున ఈసత్యాన్ని విశ్వసించి ఈ భూమిపై ఉన్న వారందరినీ పునరుత్థానం చేయుటకు ఆయన తన రక్షణ కార్యాన్ని పూర్తి చేసెను. ఇప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తన పరలోకపు సింహాసనంపై కూర్చుని, తన ప్రజలందరికీ పరలోక ర్తాజ్యాన్ని సిద్ధం చేసి మన కొరకు ఎదురు చూస్తున్నాడు.

    యేసు పరలోక మందును మరియు భూమి పై ఉన్నసమస్తమునకు ఆయన అధిపతి, అలాగే ఆయన పరలోకానికి మరియు భూమికిని కూడా ప్రభువే. యేసుక్రీస్తు మానవజాతి యొక్క రక్షకుడు మాత్రమే కాదు, ఆయన విశ్వాసులందరి నుండి ఘనత మరియు కీర్తిని పొందవలసిన నిజమైన దేవుడు కూడా.

    యేసు మన నిజమైన పరిపాలకుడని మనం నమ్మవలెను. యేసుక్రీస్తు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో విశ్వాసులమైన మన ద్వారా మహిమపరచబడడం సరైనదే, ఎందుకనగా ఆయన ఈ భూమిపై దేవుని యొక్క నీతివంతమైన కార్యామును మన కొరకు జరిగించెను. ఈ యుగంలో మరియు కాలంలో, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనమందరం ఆయన ప్రజలుగా మరియు ఆయన యొక్క సేవకులుగా మనం మారుట ఆయనకు మరింత సంతోషం. ప్రభువు పాపుల వెతుక్కొంటూ ఈ లోకానికి వచ్చాడు, ఆయన నీరు మరియు ఆత్మ ద్వారా వారిని రక్షించి యున్నాడనే ఈ సత్యాన్ని విశ్వసించే మనందరినీ ఆయన ప్రేమించి ఆశీర్వదించును.

    యేసుక్రీస్తుకు పరలోక మందును మరియు భూమిపై సర్వాధికారం ఉన్నది

    అంతం సమీపిస్తున్నకొలది, మనకు యదార్ధ పాలకుడైన యేసుక్రీస్తును గూర్చిన సరైన జ్ఞానాన్ని కలిగి ఉండడం ఆయనపై ఆధారపడడం మరియు విశ్వాసంతో ఆయనను అనుసరించడం మీకు మరియు నాకు ఖచ్చితంగా అవసరమే. కాబట్టి మనమందరం ఈ దేవుని ప్రార్థించవలెను. మన పరిపాలకుడైన యేసుక్రీస్తుకు మన సమస్తమును ఆయన అప్పగించి మనం మన శాంతితో జీవించవలెను. ఇప్పుడు, అంతం సమీపిస్తున్న కొద్దీ, మన పరిపాలకుడైన యేసును ఆయన నీతిని మన జీవితాల్లో మరింతగా పెంచుకొనవలెను.

    ప్రభువు ద్వారా రక్షింపబడిన మనము ఇక నుండి దేవుని యొక్క మహిమతో ఎలా జీవించెదమో ప్రకటన గ్రంథం మనకు చూపుచున్నది. ఇప్పుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తున్న మనందరికీ యేసుక్రీస్తు యొక్క నీతి నిజమైన రక్షణ మనకు తీసుకరాబడింది అలాగే యేసుక్రీస్తు మన దేవుడనే నమ్మకంతో జీవించడానికి ఇది మనల్ని ఆశీర్వదించింది. ఈ అంత్య కాలంలో ఆయన మనకు పాలకుడుగా ఉండటం ఎంత అద్భుతమో మనందరం గ్రహించవలెను.

    కొందరు వ్యక్తులు యేసును తమ రక్షకునిగా విశ్వసిస్తున్నట్లు చెప్పుకొందురు, అయితే వాస్తవానికి, యేసుక్రీస్తు పరలోకానికి మరియు భూమికి అధిపతియని వారు గుర్తించలేరు. కాబట్టి, వారి విశ్వాసం వాస్తవానికి వారి స్వంత మనస్సులను విశ్వసించడం తప్ప మరేమీ లేదు. యేసును తమ మతపరమైన దైవభక్తితో మాత్రమే విశ్వసించే వారు తండ్రియగు దేవుని గొప్ప దేవుడని భావించెదరు, కానీ ప్రతి ఒక్కరి నుండి ఘనత, మహిమ, కృతజ్ఞతలు మరియు స్తుతులు పొందేందుకు యేసుక్రీస్తు యోగ్యుడై దేవుడని వారికి తెలియదు. ఫలితంగా, వారు యేసుక్రీస్తు యొక్క పనిని మరియు ఆయన యొక్క పాలనను విస్మరిస్తున్నారు. ఇది ఎంతటి విషాదకరమైనది. యేసుక్రీస్తుకు తండ్రియైన దేవునితో ఉన్న సమానమైన అధికారం లేదా అదే శక్తి లేదని వారు తప్పుగా ఆలోచించెదరు. అందరికి యొక్క పాలకుడైన యేసుక్రీస్తును మనలో ఎవ్వరూను ఎన్నడును అపార్థం చేసుకోకూడదు మరియు తప్పుగా విశ్వసించకాడదు. ఇలాంటి ఘోరమైన తప్పు చేయడానికి మనం ఎప్పుడూ అవకాశం ఇవ్వకూడదు.

    కావుననే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మన యొద్దకు వచ్చిన యేసుక్రీస్తు మనందరికీ, రాజు, ప్రధాన యాజకుడు మరియు మనకు నిజమైన ప్రవక్త అని మనం గుర్తించవలెను. బైబిల్ చెప్పుచున్నది ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి (రోమా 11:36) అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటో మనం గ్రహించడం తప్పనిసరి. పరలోకమును మరియు భూమిపై ఉన్న సమస్తాన్ని సృష్టించిన ఈ దేవుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మిమ్మును మరియు నన్ను ఈ లోకములోని సమస్త పాపముల నుండి ఒకేసారిగా మరియు శాశ్వతంగా మనలను రక్షించడమే కాకుండా, ఆయన నిజమైన దేవుడని మనం గ్రహించవలెను. విశ్వాసులమైన మనకు. మరో మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు పరలోకమును మరియు భూమిని పరిపాలించువాడు.

    దేవువుని యొక్క అధికారాన్ని తృణీకరించే వారి యొక్క పాపములకు దేవుడు తీర్పు తీర్చును, అయితే ఆయన తన అధికారమునకు మరియు సత్యానికి లోబడే వారికి ప్రతి ఫలమిచ్చును. రెండు నిబంధనల్లో కూడా, దేవుడు విశ్వంలోని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా మనతో మాట్లాడెను మరియు పడిపోయిన దేవదూతల యొక్క పాపములను శిక్షించే న్యాయధిపతిమరియు పాలకుడని మన ప్రభువు మనకు కనపరచుకొనెను. ఆయన పరిపాలకుడు నీతిమంతుడు మరియు న్యాయవంతుడు కావున, దేవుడు తన కృపను కోరుకొనని వారి యొక్క పాపములకు తీర్పు తీర్చునని కూడా మనకు తెలియపరచెను అటువంటి నీతిమంతుడైన దేవుడు నిరాడంబరమైన మరియు నీచమైన జీవుల కంటే ఎన్నికలేని మనలను లోకములోని సమస్త పాపముల నుండి ఒక్కసారిగా రక్షించుట కేవలం దేవుని యొక్క మహా కృప వలెనే జరిగింది. అందుకే మనం ఇప్పుడు దేవుని యొక్క కృప పై ఆధారపడి నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించు వారు మనలో ఈ దేవుని మన రక్షకుడు మరియు మం పరి పాలకుడని పిలిచెదరు.

    యేసుక్రీస్తు మనందరికీ నిజమైన సంరక్షకుడు మరియు దేవుడు. కాబట్టి ఆయన మన నుండి సమస్త మహిమను పొందాలని కోరుకుంటున్నాడు. కావున మనం ఆయన అంచనాలకు అనుగుణంగా జీవించవలెను. యేసుక్రీస్తు మన చేత మహిమపరచబడుటకు యోగ్యుడైన దేవుడు, ఆయన లోక పాపముల నుండి మనలను రక్షించిన దేవుడు. ప్రస్తుత యుగంలో కూడా ఈ దేవుడే మన పరిపాలకుడు. మనం ఆయన సన్నిధిలో నిలబడే రోజు వరకు దేవుని యొక్క కరుణ కొరకు తపిస్తున్న పాపులందరికీ ఆయన కనికరం చూపడానికి విశ్రాంతి లేకుండా కృషి చేయవలెను. ఇలా, విశ్వాసం ద్వారానే పాలకుడి యొక్క నీతిని విశ్వసించే వారు తమ జీవితాల్లో ఆయనను కీర్తించగలరు.

    మనం విశ్వసించే దేవుడు తన నీతికి వ్యతిరేకంగా నిలబడిన ప్రత్యర్థులను ఓడించాలని కోరుకోడు, కానీ ఆయన తన కృప గల ప్రేమ మరియు నీతితో వారిని జయించాలనుకుంటున్నాడు. దేవుడు తన కృప ద్వారా పాపులు రక్షించబడాలని కోరుకుంటున్నాడు.

    ఈ కారణంగానే యేసుక్రీస్తు దేవదూతలు మరియు పెద్దలచే ఆరాధించబడటానికి అర్హుడని ప్రకటన గ్రంథం మనకు చెప్పుచున్నది. ఇది ఇలా వ్రాయబడింది, "ఇరువది నలుగురు పెద్దలు సింహాసనంపై కూర్చుండి ఆయన యెదుట పడిపోయి, శాశ్వతంగా జీవించుచున్న ఆయనను ఆరాధించుచు సింహాసనం యెదుట తమ కిరీటాలను ఉంచిరి:

    ‘ప్రభువా, మా దేవా,

    నీవు సమస్తమును సృష్టించితివి;

    నీ చిత్తమునుబట్టి అవి యుండెను;

    దానిని బట్టియే సృష్టింపబడెను గనుక,

    నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నర్హుడవని చెప్పెను"

    (ప్రకటన 4:10-11).

    ఇప్పుడు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనందరికీ ప్రభువు ఎంత గొప్పవాడో తెలుసు, ఈ అవగాహనతో మనం విధేయతతో ఆయనకు సమర్పించుకొందుము. ఎందుకనగా సర్వోన్నతుడైన దేవుడు మన నిజమైన రక్షకుడే కాదు గాని మన నిజమైన పాలకుడు కూడా.

    నిజమైన పాలకుడు ఎవరు?

    చాలా కాలం క్రితం, కొంతమంది దేవదూతలు దేవుని యొక్క అధికారాన్ని సవాలు చేశారు, కానీ దేవుడు తన శక్తితో ఈ విరోధులను నాశనం చేయాలని కోరుకోలేదు దానికి బదులు ఆయన తన యొక్క నీతి, కృప మరియు న్యాయంతో వారిని జయించాలని కోరుచున్నాడు. మన సంరక్షకుడైన దేవుని యొక్క చిత్తంలో ఆయన నీతిని విశ్వసించి నిజమైన ఆశీర్వాదాలను పొందాలనేదే ఆయన ఉద్దేశం. మానవజాతి యొక్క సంరక్షకుడైన ఆయన కృపగల ప్రేమను దేవదూతలపై చూపుట కాదు గాని, మానవులమైన మనపై ప్రసాదించాలని ఆశించియున్నాడు.

    మన పరిపాలకుడైన యేసుక్రీస్తు, సాతాను యొక్క ప్రలోభంలో పడిపోయి, దేవునికి వ్యతిరేకంగా నిలిచిన ఆదాము యొక్క వారసులకు తన నీతిని ప్రసాదించి; దేవుని యొక్క బహుమతి అయిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా ఈ ఆశీర్వాదాన్ని వెల్లడించడానికి యేసు సంతోషించెను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో విశ్వాసులను ఈ లోకములోని సమస్త పాపములను నుండి శాశ్వతంగా రక్షించడానికి ఆయన సంతోషించుచున్నాడు. దేవుని యొక్క న్యాయమైన ప్రేమ ద్వారా మానవులు యొక్క అవిధేయత యొక్క సమస్త పాపముల నుండి రక్షించబడాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే దేవుడు తన యొక్క జీవులు తమ పాపములను గ్రహించి, తన నీతిని విశ్వసించేవారిని తన నిజమైన పిల్లలుగా చేసుకొనుటకు అవకాశమిచ్చెను.

    ఈనాటికి కూడా వదూతల వలె చాలా మంది ప్రజలు దేవుని యొక్క నీతికి వ్యతిరేకంగా నిలబడుచున్నారు. కావున, సార్వభౌమ దేవుడు తన ఇష్టానికి వ్యతిరేకంగా నిలబడి పాపములో పడిపోయిన దేవదూతలను శిక్షించాలని కోరెను. అయితే, దేవుడు ఈ దేవదూతలకు భిన్నంగా మానవుల పట్ల వ్యవహరించెను. వారిని శిక్షించే బదులు, వారిని రక్షణకు సంబంధించిన తన నిజమైన కృపను వెల్లడి చేయుటకు ఆయన సంతోషించెను. ఈ రక్షణ యొక్క కృప యేసుక్రీస్తు మనకు ప్రసాదించిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలో వెల్లడి చేయబడింది. దేవుడు ఈ సువార్తలో తన న్యాయమైన ప్రేమను కనపరచియున్నాడు కావున, దానిని విశ్వసించువాడు దేవుని యొక్క మహిమను చూడగలడు.

    కావున, ఇప్పుడు, మన కృపగల దేవుడు ఆయన ప్రేమ మరియు నీతికి అనుగుణంగా మనకు ఇచ్చిన రక్షణను మనమందరం విశ్వసించవలెను. లోక పాపముల నుండి మనలను విడిపించిన రక్షకుడు యేసుక్రీస్తు ఒక్కడే అని సమస్త జీవులు విశ్వసించి ఒప్పుకొనవలెను. మన పరిపాలకుడు యేసుక్రీస్తు యావత్తు మానవ జాతిని లోక పాపముల నుండి విడిపించెను. ఆయన అలా చేయకపోతే, మనమందరం దేవుని యొక్క నీతికి వ్యతిరేకంగా నిలబడి ఆయనకు శత్రువులుగా మిగిలి ఉండేవారిమీ.

    కాబట్టి మనలను నీతిమంతులుగా చేసిన మన సంరక్షకుని యొక్క ప్రేమను మనం విశ్వసించవలెను ఈ విశ్వాసం ద్వారా మనము మన యొక్క రక్షణను చేరుకొనవలెను. ఈ విశ్వాసంతో మనం మన ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పవలెను. మన సార్వభౌముడైన దేవుడు మనలను పాపము లేనివారిగా చేసెను, మన ప్రభువు, మన యజమాని మరియు రక్షకుడు, పడిపోయిన దేవదూతలతో వ్యవహరించినట్లుగా మనతో వ్యవ హరించనందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు చెప్పవలెను. కాబట్టి, మనం మన జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు, మనం నిష్కపటమైన విశ్వాసంతో దేవుని స్తుతించడం సరైనది. మన యొక్క సంరక్షకుడైన దేవుని యొక్క స్వరూపంలో మనం సృష్టించబడి ఈ సార్వభౌముడైన దేవుడు మన పాపములన్ని నుండి ఒక్కసారిగా మనల్ని రక్షించడానికి ఈ భూమ్మీదకు వచ్చెను. అందుకే మనం ఆయన యొక్క రక్షణను విశ్వసించవలెను అలాగే మన జీవితాల్లో ఆయన అధికారమును విశ్వసించవలెను. అన్నింటికంటే, ముందుగా మన రక్షకుడు ఈ లోక పాపముల నుండి మనలను విడిపించి యున్నాడనే వాస్తవాన్ని బట్టి, ఈ దేవునిచే మనం ఎలా పాలించబడలేము?

    యేసుక్రీస్తు దేవుని యొక్క సింహాసనంపై కూర్చున్నట్లు ప్రకటన గ్రంథం తెలియపరచినట్లు, ఇప్పుడు విశ్వాసం ద్వారా రక్షించబడిన మనమందరం కూడా ఆయన రాజ్యంలో జీవించెదము. దేవుడు ఈ భూమిపై చేసిన యావత్తును విశ్వసించు వారందరూ కూడా యేసుతో పాటు పరలోకంలో జీవించే మహిమను పొందుదురు. ఈ మహిమాన్వితమైన ఆశీర్వాదం సంరక్షకుని యొక్క కృపను విశ్వసించే వారికి దేవుని యొక్క దీవెనగా ఉన్నది. మన సంరక్షకునితో పాటు పరలోక సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవించే ధన్యత పొందితిమి. నీతిమంతుల సంరక్షకుడైన దేవుని యొక్క న్యాయమైన ప్రేమను ఎవరు విశ్వసిస్తే, వారు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు శాశ్వత కాలం జీవించెదరు. దేవుడు తన ప్రజలను శాశ్వతమైన ఐశ్వర్యముతో మరియు ఆయన మహిమలో ఆనందించునట్లు ఆశీర్వదించెనని మీరు ఎప్పటికీ మరచిపోకూడదు. కాబట్టి, మన రక్షకుడను మరియు సంరక్షకుడైన దేవునికి, మనము సమస్త కృతజ్ఞతలు, ఘనత మరియు మహిమలను తెలియజేయుదుము. అలా చేయాలంటే, మనం మన ప్రభువు కొరకు విశ్వాసంతో జీవించవలెను.

    పరలోకం యొక్క పాలకుని ద్వారా, అపొస్తలుడైన యోహాను పరలోకం యొక్క ఆశీర్వాదాలను పొందువారు ఎవరో మనకు చూపించాడు. యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా రక్షింపబడిన మనకు ఎలాంటి ఆశీర్వాదాలు ఎదురు చూడునో ఆయన మనకు చూపించాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా ప్రభువు మనలను లోక పాపముల నుండి ఒకసారి మరియు సమస్తము నుండి రక్షించినందుకు మేము ఇప్పటికే కృతజ్ఞులమై ఉన్నాము. అయినను, ఇది చాలదన్నట్లుగా, మనం కూడా మన సంరక్షకునితో పాటు పరలోక రాజ్యంలో శాశ్వతంగా జీవించెదము, కావున మనం దేవునికి కృతజ్ఞతలు మహిమలు చెల్లించకుండా ఉండలేము.

    యేసుక్రీస్తు మన దేవుడని విశ్వసిస్తూ, మనమందరం ఆయనను ఇప్పుడు మన జీవితాల్లో మహిమపరచగలము. దేవుడు మనందరికీ పరలోకపు ఆశీర్వాదాలను ఇచ్చియున్నాడు కావున, మన శేష జీవితాన్ని మన సర్వోన్నతుడైన దేవునికి అప్పగించుకొని మరియు అంకితం చేసుకొనవలెను. దేవుడు మన కొరకు ఉద్దేశించినట్లుగా విశ్వాసంతో జీవించడం తప్ప మనకు వేరే మార్గం లేదు.

    ప్రభువు ఈ భూమికి తిరిగి వచ్చును

    దేవుడు అపొస్తలుడైన యోహానుకు ఈ ప్రత్యక్షతను ప్రకటన గ్రంధములో చూపించాడు, ఎందుకనగా యోహాను మరియు అనేకమంది ఇతర క్రైస్తవులు ఆ సమయంలో దేవుని యొక్క శత్రువుల నుండి తీవ్రమైన హింసను ఎదుర్కొనిరి. కావున, ఆదిమ సంఘం కాలములో కూడా, ప్రభువు యొక్క అనుచరులు ఆయన రెండవ రాకడ కొరకు వేచి ఉన్నారు. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో జీవిస్తున్నప్పటికీ, మనం కూడా మన ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నామని గుర్తుంచు కొనవలెను.

    ఇప్పుడు ఇది 2021, అయితే 2035 నాటికి, శిలాజ ఇంధనాలను కాల్చడం, అంతర్గత దహన యంత్రాలు అన్నీకూడా నిషేధించబడును. అప్పుడు వాహనాలకు

    Enjoying the preview?
    Page 1 of 1