Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

మన ప్రేమ అమరం! | Mana Prema Amaram!
మన ప్రేమ అమరం! | Mana Prema Amaram!
మన ప్రేమ అమరం! | Mana Prema Amaram!
Ebook96 pages31 minutes

మన ప్రేమ అమరం! | Mana Prema Amaram!

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

మనం నిత్యజీవితంలో కాలేజీలలో, మన ఇంటి వీధుల్లో, ఆఫిసుల్లో, ఎన్నో ప్రేమకథలు చూస్తుంటాం, వింటుంటాం. వాటిల్లో కొన్ని మర్చిపోతాం, కొన్ని మాత్రం అలా గుర్తుండిపోతాయి. ఇప్పుడు మీరు చదవబోయేది కూడా అలంటి ఓ ప్రేమకథే! గొప్పదని నేను చెప్పను గానీ, చదువుతున్నప్పుడు మంచి అనుభూతిని, చదివేసాక మంచి జ్ఞాపకాల్ని మిగులుస్తుంది. నేను వీలైనంత వరకూ ఈ కథని ఎంతో సహజమైన శైలిలో రాయడానికి ప్రయత్నించాను.
అలాగే, కథలో వచ్చే సందర్భాలు గానీ, సంఘటనలు గానీ చదువుతున్నప్పుడు మీలో ప్రతీ ఒక్కరు అవి మీకో, లేదా మీకు తెలిసిన వారికో జరిగాయి కదా అన్నట్టుగా అనుభూతి చెందుతారు. ఎందుకంటే నేను నా చుట్టూ ఉండే మనుషులని గమనిస్తూ రాస్తాను ఏ కథ రాసిన! ముఖ్యంగా ఈ కథలోని ముఖ్య పాత్రలైన తేజ, గీతికలకు మీలో చాలామంది దగ్గరవుతారు. వాళ్లిద్దరి మధ్య సాగే ప్రేమాయణం ఎంతో సరదాగా, హుందాగా, మనసుకి హత్తుకునే విధంగా ఉంటుంది! ఇందులో 'తేజ' కి కవితలు రాసే అలవాటు ఉండటం వలన తన భావాలను, గీతిక మీద తను పెంచుకునే ప్రేమను, ఆశలను కవితల ద్వారా వ్యక్తపరిచే తీరు మీ అందరినీ ఆకట్టుకుంటుందని నేను దృఢంగా నమ్ముతున్నాను.

LanguageTelugu
Release dateAug 12, 2020
ISBN9781005347031
మన ప్రేమ అమరం! | Mana Prema Amaram!
Author

Hemant Karicharla

Hemanth Karicharla pursued Bachelor's of Technology in Ramachandra College of Engineering, in the stream of Electricals and Electronics in the year 2016. Even though I'm a B.tech graduate, I'm very much passionate in writing and so literature. He is an evolution of journey from careless to responsible. I treat myself as a continuous learner. Through this wonderful journey, I underwent many transformations and struggled a lot to be a complete man. "What I'm today" is undoubtedly originated from "What I was yesterday." So, my only aim is to share the lessons I learnt, with you through my writings. Besides, my motto is to represent the different issues that are badly morphing our Mother India. And I strongly believe that a good book will always shows a great impact on the reader's mind. So, as a responsible Indian writer I always try to deliver useful, meaningful and purposeful projects which can not only emotionalize them but also make them think regarding good and bad within them.

Related to మన ప్రేమ అమరం! | Mana Prema Amaram!

Related ebooks

Reviews for మన ప్రేమ అమరం! | Mana Prema Amaram!

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    మన ప్రేమ అమరం! | Mana Prema Amaram! - Hemant Karicharla

    Hemanth Karicharla

    Mana Prema Amaram!

    మన ప్రేమ అమరం!

    రచన:

    హేమంత్ కారిచర్ల

    పోషకులు

    రవిచంద్ర దీదువాని

    గణేష్ ఇంద్రగంటి

    అంకితం

    నిజాయితీగా ఒకరిని ప్రేమించి,

    ఎన్నో కష్టాలను జయించి,

    అవరోధాలను దాటుకుని,

    తమ ప్రేమను గెలిపించుకునే…

    ప్రతీ ప్రేమ జంటకి...

    ఈ కథ అంకితం!

    ఎడబాటు

    పేరు మోసిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ;

    అందులో పూర్తిగా అద్దాలతో నిర్మించిన ఓ గది. ఆ గదిలో ఒక టేబుల్ ఉంది. టేబుల్ కి అవతలి వైపు ఉన్న మూడు కుర్చీలలో ముగ్గురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. ఇవతలి వైపు ఉన్న ఒక కూర్చీలో ఓ కుర్రాడు కూర్చొని ఉన్నాడు. అతను విశాలమైన నుదురుతో, ఆకర్షించే కళ్ళతో, ఆకట్టుకునే నవ్వుతో, చూడటానికి ఎంతో చక్కగా, హుందాగా ఉన్నాడు.

    ఆ ముగ్గురు ఇతనిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇతను వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాడు. ఇంటర్వ్యూ పూర్తి అయ్యింది. అడిగిన ప్రతీ ప్రశ్నకు తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని తడబడకుండా సమాధానాలిచ్చిన అతనిలోని నిజాయితీ, ఆత్మవిశ్వాసం చూసి, వాళ్ళు అతనికి ఉద్యోగమిస్తారు. అందుకు అతను ఎంతో సంతోషంతో వారికీ థ్యాంక్స్ చెబుతాడు.

    అప్పుడు, రేపటి నుండి జాబ్ లో జాయిన్ అయిపోతారుగా? అని ఆ ముగ్గురిలో ఒకరు అతన్ని అడుగుతారు.

    అందుకు తను, సర్, అది… ఒక ముఖ్యమైన పని ఉంది, అది చూసుకుని ఒక వారంలో జాయిన్ అవుతాను సర్! ఇఫ్ యూ ప్లీజ్ డోంట్ మైండ్! అభ్యర్థనగా అడుగుతాడు.

    అప్పుడు ఆయన, సరే! కానీ మీరు చెప్పినట్టు కచ్చితంగా వారంలో రాకపోతే ఈ ఉద్యోగం మీ తరువాత మెరిట్ ఎవరున్నారో చూసి వాళ్లకి ఇచ్చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి! అని సుస్పష్టంగా చెబుతారు.

    అందుకు అతను సరే సర్! అంటూ ఆ గది నుండి రెట్టింపు ఉత్సాహంతో బయటకి వస్తాడు.

    ***

    బయటకి రాగానే ఒక కార్నర్ లోకి వెళ్లి ఫోన్ తీసి ఇంటికి ఫోన్ చేస్తాడు...

    కిచెన్ లో ఉన్న ఆక్వాగార్డ్ మీద మొబైల్ రింగవుతూ ఉంటుంది... ఒక 10 - 15 సెకన్లకు వాళ్ళమ్మ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.

    ఏరా నాన్న! ఇంటర్వ్యూ ఏమైంది? ఎంతో కుతూహలంగా అడుగుతుంది ఆమె.

    సెలెక్ట్ అయ్యాను అమ్మ! ఆనందంగా చెబుతాడు.

    చాలా సంతోషం రా...! మీ నాన్నకి చెప్పేవా? అడుగుతుంది పట్టరాని సంతోషంతో.

    లేదమ్మా, ముందు నీకే చెబుతున్నాను!

    సరే త్వరగా ముందు ఆయనకీ ఫోన్ చేసి చెప్పు మరి, ఆయన పైకి కనపడరు గాని నాకన్నా కంగారు ఎక్కువ!

    సరే అమ్మ, ఇప్పుడే చేస్తాను! అంటూ ఫోన్ కట్ చేసి, వెంటనే నాన్నకు కాల్ చేస్తాడు.

    ఆయన తన ఆఫీసులో తన కేబిన్ లో కూర్చొని ఏవో ఫైల్స్ చూస్తుండగా, మొబైల్ రింగ్ అవ్వటంతో, చేసింది తన కొడుకే అని గమనించి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏరా తేజ, ఇంటర్వ్యూ ఏమైంది? అని అడుగుతారు.

    సెలెక్ట్ అయ్యాను నాన్న ఎంతో హుషారుగా చెబుతాడు తేజ.

    ఓహ్! వెరీ గుడ్, కంగ్రాట్స్ మై సన్, ఐ అమ్ సో హ్యాపీ. వెంటనే ఈ విషయం మా కొలీగ్స్ అందరికీ చెప్పాలి. ఆ నాన్న, నువ్విప్పుడు ఎటెళ్లినా, సాయంత్రం మాత్రం త్వరగా ఇంటికి వచ్చేసేయ్. నువ్వు, మీ అమ్మ, నేను కలిసి ఈ అకేషన్ ని సెలెబ్రేట్ చేసుకుందాం, సరేనా! పుత్రోత్సాహంతో వెలిగిపోతున్న ముఖంతో చెబుతారు.

    సరే నాన్న, సీ యూ... అంటూ కాల్ కట్ చేసి లిఫ్ట్ వైపు వెళ్తాడు తేజ.

    ***

    లిఫ్ట్ వస్తుంది, డోర్స్ తెరుచుకుంటాయి, లోపలకి వెళ్తాడు. తనతో పాటు ఓ అమ్మాయి కూడా లిఫ్ట్ ఎక్కుతుంది. వీరున్న ఐదవ ఫ్లోర్ నుండి లిఫ్ట్ కిందకి దిగుతుంటుంది. ఆ లిఫ్ట్ ని, తన పక్కన నించున్న ఆ అమ్మాయిని చూడగానే తేజకి ఒక సంఘటన గుర్తుకువస్తుంది...

    ***

    ఆ సంఘటన: అది వేరే బిల్డింగ్, వేరే లిఫ్ట్, వేరే అమ్మాయి, తన పక్కన తేజ నుంచున్నాడు. ఆ అమ్మాయి కళ్ళు చాలు, ఎవరైనా రెప్ప ఆర్పకుండా తననే తన్మయత్వంతో చూస్తూ ఉండటానికి. పొడవాటి కురులతో, నక్షత్రాల్లాంటి కళ్ళతో, చంద్రబింబం లాంటి

    Enjoying the preview?
    Page 1 of 1