Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

దయ్యములు మరియు వాటితో వ్యవహరించడం ఎలా
దయ్యములు మరియు వాటితో వ్యవహరించడం ఎలా
దయ్యములు మరియు వాటితో వ్యవహరించడం ఎలా
Ebook263 pages1 hour

దయ్యములు మరియు వాటితో వ్యవహరించడం ఎలా

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dag Heward-Mills గారి ఈ ఉత్తమమైన నూతన పుస్తకములో దయ్యముల కార్యక్రమాలు యొక్క ముసుగు తొలగించబడెను. గెరాసీయుడైన దయ్యముపట్టిన వాని యొక్క సాక్ష్యమును వాడుతు, దయ్యములపై మరియు దురాత్మలపై విజయము సాధించు మార్గమును చూపును

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641348003
దయ్యములు మరియు వాటితో వ్యవహరించడం ఎలా
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to దయ్యములు మరియు వాటితో వ్యవహరించడం ఎలా

Related ebooks

Reviews for దయ్యములు మరియు వాటితో వ్యవహరించడం ఎలా

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    దయ్యములు మరియు వాటితో వ్యవహరించడం ఎలా - Dag Heward-Mills

    దయ్యములు చేయు కార్యమునకు ఉత్తమ మాదిరి

    వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.

    ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను.

    వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచునుండెను.

    వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి – యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పెరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలువేసెను. ఎందుకనగా ఆయన – అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.

    మరియు ఆయన – నీ పెరేమని వాని నడుగగా వాడు – నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి తమమును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. గనుక – ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను.

    యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదరిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్లి

    యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి.

    ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవియ్యక – నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్లి, యేసు తనకు చేసినవన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి.

    మార్కు 5:1-20

    గెరాసేనుల ప్రాంతమునకు చెందిన ఈ పిచ్చివానిని అధ్యయనం చేస్తే దయ్యపు కార్యముల యొక్క వ్యాధి నిర్ణయ శాస్త్ర అధ్యయనము చేసినట్లే. ఈ ఒక్క సందర్భాన్ని అధ్యయనం చేయడం ద్వారా సాతాను మరియు దయ్యములను గూర్చి ఎన్నో విషయాలను మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వ్యాధి నిర్ణయ శాస్త్రం ఏమిటోయని చాలామంది ఆశర్యపడిపోతుంటారు. శవాలను అధ్యయనం చేయడంలో కొంతమంది తమ కాలాన్ని ఎందుకు వెచ్చిస్తారో అని కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతుంటాం. వైద్య విద్యార్ధిగా, చనిపోయిన వారిని కోసి అధ్యయనం చేయడం అనేది వైద్యులకు ఎంతటి ప్రాముఖ్యమో నాకు అర్థమయ్యేది కాదు. ఒకసారి వారు మరణించిన తరువాత, వారు చచ్చినవారు గనుక వారిని ఒంటరిగా వదిలేయాలి అని నేను తలంచేవాడిని.

    కానీ, వ్యాధి నిర్ణయ శాస్త్రము అనేది వివిధ బలహీనతలు మానవ శరీరంపై చూపే ప్రభావాన్ని అధ్యయనం చేస్తుందని తరువాత నాకు తెలిసొచ్చింది. ఒక రోగము యొక్క అంతిమ ప్రభావాన్ని ఇది అధ్యయనం చేస్తుంది. వేరొక మాటలలో చెప్పాలంటే, ఆ రోగము అలానే వదిలేస్తే ఏమి జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు వ్యాధి నిర్ణయ శాస్త్రము చదవాలి. తరచుగా, రోగములకు మానవ శరీరంపై ఉండే అంతిమ ప్రభావాన్ని చచ్చిన శవాలపైనే తెలుసుకోవడం జరుగుతుంది.

    ఉదాహరణకు, సుదీర్ఘ అధిక రక్తపోటుకు గురై మరణించినవాని శరీరమును కోసిచూస్తే, తన గుండెలోను, తన రక్త కణాలలోను మరియు తన మూత్రపిండములలోను కొన్ని మార్పులను గమనించవచ్చు. ఈ మార్పులను గమనించడం వలన ఇదే వ్యాధితో ఇంకా జీవిస్తున్న వారిపై ఎటువంటి ప్రభావము ఈ అధిక రక్తపోటు చూపుతుందో మీరు తెలుసుకొనగలుగుతారు.

    ఒక రోగము యొక్క పూర్తిస్థాయి పర్యావసానమును అనుభవించిన ఆ పార్ధివ దేహమును అధ్యయనం చేయడం ద్వారా, రోగములను గూర్చి వైద్యులు మరింత ఎక్కువగా తెలుసుకొనగలుగుతారు. ఇదే విధంగా, గెరాసేనుల ప్రాంతమునకు చెందిన ఆ పిచ్చివానిని అధ్యయనం చేయడం ద్వారా, మానవులలో దయ్యపు కార్యముల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొనగలుగుతారు.

    గెరాసేనుల ప్రాంతమునకు చెందిన పిచ్చివాని యొక్క కథనము దయ్యముల చొరబాటు యొక్క ఉన్నత రకమును గూర్చిన అధ్యయనంగా ఉంది. సాతానుకు అవకాశము దొరికినట్లయితే వాడు నీకు ఏమి చేయాలి అనుకుంటున్నాడో అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. ఈ పిచ్చివాని మనుగడలో ఉన్న ప్రతియొక్క లక్షణము ఒక దయ్యపు లక్షణాన్ని బయలుపరుస్తుంది. వాడి పరిస్థితి చూస్తే నీయెడల మరియు నాయెడల సాతాను కలిగియున్న దర్శనములోని అనేక కోణాలు తెలుస్తాయి. ఒకవేళ సాతాను తన మార్గములో క్రియచేస్తే, నీవు మరియు నేను అదే పరిస్థితిలోనికి నెట్టివేయబడతాము.

    అధిక మంది ప్రజలు గెరాసేనుల ప్రాంతమునకు చెందిన పిచ్చివానివలే సంపూర్ణంగా లేకపోయినప్పటికీ, ఈ పిచ్చివానిలో వెల్లడిపరచబడిన ఆ దయ్యపు లక్షణములలో కనీసము కొన్నిటిని మనము అనుభవిస్తాము.

    గెరాసేనుల ప్రాంతమునకు చెందిన ఈ పిచ్చివాని సాక్ష్యము మనకు మూడు విషయాలను తెలుపుతుంది:

    అవకాశము ఇవ్వబడినట్లయితే దయ్యములు నీకు ఏమి చేయాలని అనుకుంటున్నాయి.

    ఒక పథకము ప్రకారం క్రమక్రమంగా దయ్యములు ప్రజలకు ఏమి చేస్తున్నాయి.

    దయ్యములు పూర్తిస్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి యొక్క అంతిమ స్థితి.

    నీవు ఈ పుస్తకమును చదువుతుండగా, దయ్యముల క్రియలను గూర్చిన అనేక విషయాలను, మరియు అవి నిన్ను ఎలా ప్రభావితము చేయగలవో, దేవుడు నీకు బయలుపరుస్తాడు.

    నీవు ఈ పుస్తకమును చదవడం ముగించేలోపు నీవు దయ్యముల క్రియలనుండి విడిపించబడతావు.

    గెరాసేనుల ప్రాంతమునకు చెందిన ఈ పిచ్చివాని యొక్క సాక్ష్యము ఒక విధమైన మానసిక వ్యవస్థతో బాధపడుతున్నవెఱ్ఱివాని కథవలె చాలామంది భావిస్తుంటారు. నేను పిచ్చివాడిని కాదు కాబట్టి, ఈ కథతో నాకు ఎటువంటి సంబంధము లేదు అని వారిలో వారు అనుకుంటారు. కాని విషయం ఏమంటే, ఈ సాక్ష్యము మనందరికీ సంబంధించినదిగానే ఉంది.

    నీ శత్రువు యొక్క క్రియలను మరియు ఆలోచనలను అర్థం చేసుకోవడం అనేది ఏ విధమైన యుద్ధమునైనను జయించుటకు ప్రాముఖ్యము. అపవిత్రాత్మలపై పోరాటాన్ని నీవు గెలవాలని అనుకుంటే, నీ శత్రువు ఎక్కడ ఎలా పని చేస్తున్నాడో నీకు తెలిసి ఉండాలి. నీకు విరోధముగా నీ శత్రువు ఏమి ప్రణాళిక చేస్తున్నాడో నీవు తెలుసుకోవాలి.

    సాతాను మనలను మోసపరచకుండునట్లు, . . .; సాతాను తంత్రములను మనము ఎరుగనివారముకాము.

    2 కొరింథీయులకు 2:11

    అధ్యాయము 2

    చీకటి – దయ్యముల యొక్క గృహము

    ...మనము పోరాడునది...ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాధులతోను...

    ఎఫెసీయులకు 6:12

    ఈ లోకములోని చీకటి అపవిత్రాత్మలకు ఒక స్థావరము. చీకటి అనేది చెడుతనము పెచ్చరిల్లే ఆ వాతావరణమును గూర్చి మాట్లాడుతుంది. ఈ లోకపు చీకటిలో సాతాను రాజ్యము చేస్తున్నాడు. మోసగించడం అనేది ఒక విధమైన ఆత్మీయ చీకటి. ఎందుచేతనంటే మోసపూరితమైన వాతావరణము అనేది అపవిత్రాత్మలకు సంతానోత్పత్తి చేసే ప్రదేశము.

    చీకటి అనేది కేవలం సాతాను క్రియాశీలకముగా ఉండే ఒక మోసపూరితమైన వాతావరణమే. ఓడించబడిన మన శత్రువు అగాధమైన అంధకారములో పెరుగుతుంటాడు. మనము వెలుగులోనికి వచ్చినప్పుడు వాడికి ఎట్టి అవకాశము కూడా ఉండదు. ఇందువలననే సాతాను దేవుని యొక్క వాక్యమును ఎంతగానో ద్వేషిస్తుంటాడు.

    మనుష్యులపై సాతాను యొక్క ప్రభావాన్ని నాశనం చేసే వెలుగు యేసే. ఆయన దేవుని యొక్క వాక్యము. చీకటిలో ప్రకాశించే వెలుగే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము బోధించబడే చోట దయ్యముల క్రియలు చాలా తగ్గించబడతాయి.

    ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.

    యోహాను 1:5

    సంఘముపై సాతాను యొక్క శక్తిని నేటి ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన యుద్ధములతోను పోరాటములతోను పోల్చవచ్చు. ఒక అగ్ర శక్తి ఒక బలహీనమైన సైన్యముపై పోరాడేటప్పుడు, ఆ విధమైన బహిరంగ సాంకేతికమైన యుద్ధములో గెలుచుటకు తమకు ఎట్టి అవకాశములు ఉండవు అని బలహీన వర్గమునకు మాములుగా తెలుస్తుంది. కాబట్టి, వాడు దాగుకొని రహస్యములో, మోసములో మరియు చీకటిలో ఉండి దెబ్బతీయాలని భావిస్తాడు. ఇది తరచు బందిపోటు యుద్ధతంత్రమునకు మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు దారితీస్తుంది.

    ఉదాహరణకు, ఇశ్రాయేలు దేశముయొక్క సైన్యము పాలస్తీనా సైన్యముతో పోల్చితే చాలా ఉన్నతమైనవి; ఇశ్రాయేలీయుల యొక్క సైన్య బలము క్రింద పాలస్తీనా యుద్ధ బలము చాలదు. ఇశ్రాయేలులో అణుశక్తి కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. పాలస్తీనాకు గెలిచే అవకాశము లేనందున, వారు దిగ్భ్రాంతి గొలిపే ఆత్మాహుతి దాడులకు మరియు ఉగ్రవాద కార్యకలాపాలకు పూనుకుంటున్నారు. విమానాలను హైజాక్ చేయడం మరియు ఇశ్రాయేలు దేశమునకు చెందిన ఒలింపిక్ సభ్యులను హతము చేయడం అనేవి బలహీనమైన సైన్యము చేయతలపట్టే విధమైన యుద్ధతంత్రములకు కొన్ని ఉదాహరణలు.

    బలహీనమైన మరియు చిన్నదైన సైన్యము మిక్కిలి పెద్దదైన సైన్యముతో ముఖాముఖిగా పోరాడడంలో విఫలమైనప్పుడు చేపట్టే కుయుక్తులకు సెప్టెంబరు 11వ తేదీన జరిగిన ఉగ్రదాడులు ఉదాహరణలు. ఇదే విధంగా, సంఘమునకు వ్యతిరేకముగా కొలువుదీరిన దయ్యముల యొక్క సైన్యము, దేవుని శక్తికి అసలు సరితూగగలిగినది కానేకాదు. మన యుద్ధోపకరణములు బహుబలమైనవి.

    (మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవునియెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి)

    2 కొరింథీయులకు 10:4

    యేసు అనే పేరు చెప్పుటతోడనే సాతాను వణకుతాడు. రక్తమును గూర్చి మనము పాడినప్పుడు దయ్యములు వణకుతాయి. అవి రక్తమును చూచినప్పుడు, అవి దాటి వెళ్ళిపోతాయి. దేవుని వాక్యము బలమైన ఖడ్గము,

    Enjoying the preview?
    Page 1 of 1