Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

ఒక మంచి సైన్యాధిపతి
ఒక మంచి సైన్యాధిపతి
ఒక మంచి సైన్యాధిపతి
Ebook915 pages7 hours

ఒక మంచి సైన్యాధిపతి

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ఈ భూమిపై మానవుని యొక్క జీవితము ఒక యుద్ధము లాంటిది అని మీకు తెలుసా? మనము కావాలనుకున్నా వద్దనుకున్నా మనము యుద్ధములోనే ఉన్నాము. నీ జీవితము ఒక యుద్ధము లాంటిది అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. నీవు మంచి పోరాటమును పోరాడి ఈ యుద్ధాన్ని గెలవాలి. యుద్ధమును గూర్చి వ్రాయబడిన ఈ పుస్తకము నాయకులందరూ తప్పక చదవవలసిన పుస్తకము.

LanguageTelugu
Release dateMay 24, 2018
ISBN9781641347563
ఒక మంచి సైన్యాధిపతి
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to ఒక మంచి సైన్యాధిపతి

Related ebooks

Reviews for ఒక మంచి సైన్యాధిపతి

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    ఒక మంచి సైన్యాధిపతి - Dag Heward-Mills

    మంచి సైన్యాధిపతి యుద్ధం గురించి తెలుసుకుంటాడు

    ...ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.

    ప్రకటన 19:11

    యుద్ధములో అధిక హత్య, ధుఃఖం, బాధ మరియు మరణములు వుంటాయి. యుద్ధము వలన నరులకు ఆధిక దుస్థితి కలుగును. కనుక యుద్ధమునకు మరియు దేవునికి మధ్య ఎటువంటి సంబంధము ఉండదు. యుద్ధములో దేవుడు ఏలాగున చేరగలడు? ప్రజలు చనిపోవాలని దేవుడు ఎందుకు కోరతాడు? అసలు ప్రజలను దేవుడు చంపుతాడా? అసలు ప్రజలకు దేవుడు హాని చేస్తాడా? ఖచ్చితముగా చేయడు!

    దేవునికి అటువంటి దుష్ట ప్రణాళికలు ఏమియు లేవు. హెచ్చుతున్న శత్రువును అణచుటయే యుద్ధమునకు కారణం. దేవుడు నీతితో యుద్ధము చేయుచు ఆయన శత్రువులను అణచును. క్రైస్తువులుగా, మనలను అణచివేయుటకు మరియు పరాజేయపరచుటకు మనకు ఒక శత్రువు వున్నాడు. సువార్త పరిచారకులుగా, మనకు అధిక శత్రువులు వున్నారు గనుక వారిని ఏలాగున జయించాలో, అణచివేయాలో మరియు తుడిచివేయాలో మనము తెలుసుకోవాలి. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు, అని వాక్యము తెలుపుచున్నది. యుద్ధము చేయుటకు దైవమార్గము వున్నది. యుద్ధము చేయుటకు జ్ఞానమార్గము వున్నది. ఆయన మార్గములో మరియు ఆయన జ్ఞానములో యుద్ధము చేయాలని దేవుడు కోరుతున్నాడు.

    దైవమార్గములో, ఆత్మీయమార్గములో మరియు జ్ఞానమార్గములో ఏలాగున యుద్ధము చేయాలో ఈ పుస్తకము తెలియజేయుచున్నది. ఎవరైతే మేము యుద్ధము కొరకు కాదు అంటారో వారు తెలివి లేని వారైయున్నారు. సమాధానకర్త క్రింద శాంతి కలిగి వున్నారు అని సాతాను మిమ్మును భ్రమపరుస్తుంటాడు. దేనిగురించి చింతించనవసరము లేదని సాతానుడు మిమ్మును ప్రేరేపిస్తుంటాడు. కాని దేవుని వాక్యము ఖచ్చితముగా చెప్పేదేమంటే యుద్ధరంగంలో మంచిగా యుద్ధము చేయాలని మరియు మంచి పోరాటం పోరాడాలని!

    యుద్ధము నేర్చుకొనుటకు పది కారణాలు

    యేసు క్రీస్తు పరలోకములో సైన్యమును నడుపుతూ నీతితో యుద్ధము జరిగించుచున్నాడు.

    చాలామంది ప్రజలు పరిచర్యలో ఏమియు చేయరు ఎందుకంటే వారికి పోరాటము ఇష్టముండదు. నీవు యేసుని వెంబడించాలనుకుంటే, నీవు తప్పకుండా ఆయన సైన్యములో చేరి పోరాడాలి.

    మరియు పరలోకము తెరువబదియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱము ఒకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాలవంటివి, ఆయన శిరస్సుమీద అనేక కీరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు; రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.

    ప్రకటన 19:11-15

    యేసు క్రీస్తు యుద్ధముచేయు ఒక గొర్రెపిల్ల.

    దేవుని గొర్రెపిల్ల (యేసుక్రీస్తు) ఆయనకు విరోధముగా ఐక్యమైన పది రాజులతో యుద్ధము చేసి వారిని ఓడించెను. యుద్ధము చేయు ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు. యేసువలె వుండాలని మీకు లేదా? యేసువలె వుండాలని మీకు వుంటే యుద్ధములో పోరాడటం మీరు నేర్చుకోవాలి!

    నీవు చూచిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వారిదివరకు రాజ్యమును పొందలేదు గాని యొకగడియ కౄరమృగముతో కూడా రాజువలె అధికారము పొందుదురు.

    వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.

    వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతో కూడా వుండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.

    ప్రకటన 17:12-14

    మన చేతులకు యుద్ధం నేర్పువాడు దేవుడే.

    యుద్ధములో ఎలా పోరాడాలో మీకు నేర్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు నమ్మినట్లైతే, యుద్ధము చేయటకు మహాద్భుతముగా ప్రోత్సహింపబడి నడుపబడతారు.

    నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు పెట్టును.

    కీర్తన 18:34

    మంచి పోరాటము పోరాడుటకు ఆదేశించబడియున్నాము.

    మీరు ఖచ్చితముగా పోరాడాలని పరిశుద్ధ గ్రంథములో ఒక వాక్యము తేటతెల్లగా వున్నది. మీరు పోరాడాలని దేవుడు విజ్ఞప్తి చేస్తున్నాడు! మీరు గెలచినందున ఒక మంచి పోరాటము మంచి పోరాటమై యున్నది. ఒక మంచి పోరాటము మంచి ఉద్దేశముతో కూడిన పోరాటమై యున్నది.

    విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.

    1 తిమోతి 6:12

    యుద్ధములో మంచిగా పోరాడాలని మనము ఆదేశించబడియున్నాము.

    యుద్ధములో మంచిగా పోరాడాలని మనము ఆదేశించబడియున్నాము. ఇది సువార్త చేయు ప్రతి సేవకునికి ఇవ్వబడిన ఆదేశము. సంఘ చరిత్రలో తిమోతిగ మొదటి కాపరుల పట్టికలో వున్నాడు. ఆయన మంచి పోరాటము పోరాడినవాడై యున్నాడు.

    నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.

    1 తిమోతి 1:18

    యేసు క్రీస్తు యొక్క పరిచర్య యుద్ధముగా వర్ణించబడింది.

    ఆపొస్తులుడైన పౌలు ఆయన పరిచర్యను యుద్ధముగా పరిగణిస్తూ ఒక ముఖ్యమైన ప్రశ్నను అడిగారు. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా?

    ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా? ద్రాక్షతోటవేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగనివాడెవడు?

    1 కొరింథీయులకు 9:7

    పౌలు తన జీవితమును మరియు పరిచర్యను పోరాటముగా వివరించాడు.

    పౌలు విరామము లేకుండ నిత్యము పోరాడుతుండేవాడు. మీరు పరిచర్యలో వున్నట్లైతే, మీరు కూడా ఖచ్చితముగా పోరాడుతున్నారు! మీరు దేవునికొరకు పనిచేస్తున్నట్లైతే, మీరు మంచి సైనికులైవున్నారు! మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు మీ జీవితములో పోరాడుతూనేవున్నారు. నేను నా జీవుతములో ఎప్పుడు పోరాడుతున్నానని అనుకుంటుంటాను.

    కాబట్టి నేను గురి చూడనివానివలె పరుగెత్తు వాడనుకాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు

    1 కొరింథీయులకు 9:26

    మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.

    2 తిమోతి 4:7

    యుద్ధముకు కావలసిన ఆయుధములను కలిగివుండాలని ఆదేశించబడియున్నాము.

    దేవుని పరిచారకుడైన పౌలు దగ్గర మంచి పోరాటము పోరాడుటకు కావలసిన ఆయుధములు వున్నవి. పౌలుగలాంటివారికే ఆయుధాలు అవసరమైనప్పుడు, మరి మీకు కూడా ఆయుధములు అవసరమైవున్నవి.

    మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీరప్రకారము యుద్ధము చేయుము. (మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి.)

    2 కొరింథీయులకు 10:3-4

    బలము పొందుకొని సాయుధులముగా వుండాలని ఆదేశించబడియున్నాము.

    పోరాడనవసరము లేనప్పటికీ మనం కవచము ధరించుకొని ఎందుకు వుండాలి? మనము పోరాడునది ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాధులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సముహములతోను పోరాడుచున్నాము. కాబట్టి మీరు మీ వస్త్రములను ధరించుకొని క్లిష్టమును మరియు అతి పెద్దదైన పోరాటమును మంచిగా పోరాడుటకు సంసిద్ధత కలిగి వుండుము!

    తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.

    ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్ముల సముహములతోను పోరాడుచున్నాము.

    ఎఫెసీయులకు 6:10-12

    ఘటసర్పముతో యుద్ధము వున్నది మరియు ఆ యుద్ధములో మనము పాలివారమై వున్నాము.

    దేవుని ఆజ్ఞలను గైకొనుచున్న ప్రజలకు విరోధముగా ఆ ఘటసర్పము యుద్ధము చేయుచున్నది. మీరు దేవుని ఆజ్ఞలకు విధేయులైవుంటారా? మీరు దేవుని ఆజ్ఞలకు విధేయులైయున్నయెడల, ఘటసర్పము మిమ్ములను ఎదిరించి మీతో పోరాడునని తెలుసుకొనుము.

    అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్షమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను.

    ప్రకటన 12:17

    అధ్యాయము 2

    మంచి సైన్యాధిపతి మూర్ఖపు పోరాటాలను పట్టించుకోడు

    విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము....

    1 తిమోతి 6:12

    మంచి సైన్యాధిపతి యుద్ధ పోరాటములో నైపుణ్యత గలవాడైనప్పటికి తాను ఏమాత్రమును మూర్ఖపు పోరాటాలలో పాల్గొనడు. మంచి పోరాటమును పోరాడాలని పరిశుద్ధ గ్రంథము (బైబిల్) భోధిస్తుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుట చాలా శ్రేష్టము. పోరాడుట అనగా ఏదైనా పొందుటకు బలముగా ప్రయత్నించుట. ఏదేమైనప్పటికీ, ఒక మనుష్యుడు పోరాడుటకు చాలా మూర్ఖపు పోరాటములు వున్నాయి. మరి మీరు మూర్ఖపు పోరాటములో వున్నారా లేక మంచి పోరాటములో వున్నారా?

    సైన్యాధిపతియైన పౌలూస్ మరియు అతని మూర్ఖపు పోరాటము

    1942లో జర్మనీ దేశపు నాయకుడైన ఆడోల్ఫ్ హిట్లర్, సోవియట్ యూనియన్ (రష్యా)ను రెండవ సారి ముట్టడివేసి ఆక్రమించిన తరువాత, అతిప్రాముఖ్యమైన స్టాలిన్గ్రాడ్ పట్టణమును స్వాధీనపరచుకొనుటకు ప్రయత్నించాడు. బలమైన సైన్యాధికారులు ఆడోల్ఫ్ హిట్లర్ మరియు స్టాలిన్ (రష్యా దేశ నాయకుడు), వీరిద్దరు స్టాలిన్గ్రాడ్ పట్టణములో ఎదురు పోటి పడినట్లుగా అగుపడుచున్నది. జర్మన్ దళాలు సైన్యాధిపతి అయిన పౌలుస్ అధికారము క్రింద ఉన్నాయి.

    స్టాలిన్ తన దళాలకు యీ విధముగా ఆజ్ఞ జారీ చేశాడు: ఎవరును వెనుకకు తిరుగకుడి! ప్రతి ఒక్కరు తమ మరణము వరకు పోరాడాలి. పై అధికారుల అనుమతి లేకుండ యేయొక్క అధికారియైనను ఈ ఆజ్ఞను ఉల్లంఘించిన యెడల వాడు సైన్యపు న్యాయవిధానములో చిక్కును. యే సైనికుడైనను నేరస్తుడుగా పట్టబడితే పటాలముల శిక్ష క్రింద బలాత్కారము చేయబడాలని ఈ ఆజ్ఞ సూచిస్తుంది. అదేమనగా యుద్ధము జరుగునప్పుడు వీరిని అతి ప్రమాదకరమైన మొదటి వరుసలోకి పంపుతారు. ఈ ఆజ్ఞ భయముతో వెనుకకు పారిపోతున్న సైనికులను కాల్చిచంపమని రష్యా సైనికులకు సూచిస్తుంది. ఈ ఆజ్ఞ జారిచేయబడిన రెండు నెలలకే, వారి శత్రువులు వెయ్యి దళాలను కాల్చి చంపారు మరియు 130,000 దళాలు పైబడి పటాళముల శిక్ష కు పంపబడ్డారు.

    హిట్లర్ కూడా తన దళాలను ఏ పరిస్థితిలోనూ వెనుకకు తిరగనివ్వలేదు. ఈ కారణముచేత, యద్ధము వీధి నుండి వీధికి మరియు నివాసము నుండి నివాసముకు వెళ్ళుచు నగరమంతయు భూత పట్టణము వలె మారిపోయింది. జర్మన్లు ఒకేసారిగా 1,000 విమానాలను పంపిస్తూ వాయువులో దాడిని చేయగలరు. యిరువైపుల దళాలు భవనాలను పేల్చుతుండగా వారి స్నిపర్లు(యుద్ధములో రహస్యముగా దాడి చేయువారు) మాత్రం శిధిలాలలో దాగొని వారి శత్రువుల సైనికులను ఏరిపారేశారు.

    జనవరి 24 న, సైన్యాధిపతి అయిన పౌలూస్ లొంగిపోవుటకు అనుమతిని వేడుకొనెను. అతడు ఆడోల్ఫ్ హిట్లర్ కు ఈ విధముగా వర్తమానము పంపెను, దళాలకు ఆహారము మరియు యుద్ధ సదుపాయములు లేవు. సమర్ధవంతమైన ఆజ్ఞలు ఇక ఎన్నటికిని సాధ్యము కానేరవు. ఔషధములు కానీ వైద్యము కానీ సరఫరాలు లేక 18,000 మంది సైనికులు గాయపడ్డారు. ఇంకా ఎదిరించడం అజ్ఞానంతో కూడుకున్న పని. పతనము అనివార్యమైనది. మిగిలియున్న దళాలను రక్షించుకొనుటకు మరియు లొంగిపోవుటకు వెనువెంటనే అనుమతిని పొందాలని సైన్యము విన్నవించుకుంటుంది.

    అయితే హిట్లర్ జర్మన్లు లొంగిపోవుటకు నిరాకరించెను, ఆఖరి సైనికుడు చనిపోయేంత వరకు యుద్ధము కొనసాగించమన్నాడు. సైన్యాధిపతి అయిన పౌలూస్ యొక్క విన్నపమును ఆడోల్ఫ్ హిట్లర్ తిరస్కరించుట, సాధారణముగా, మూర్ఖపు పోరాటాములు పోరాడుటకు ఉదాహరణగా వున్నది.

    కాని సైన్యాధిపతి అయిన పౌలూస్ మాత్రం అదేమియు పట్టించుకొనలేదు. హిట్లర్ తనను ఉన్నత పదవి (ఫీల్డ్ మార్షల్)తో సత్కరించినను, పౌలూస్ మాత్రం మూర్ఖపుపోరాటాన్ని కొనసాగించకుండా తిరస్కరించాడు. ఈ మూర్ఖపుపోరాటాన్ని కొనసాగించమని ఆడోల్ఫ్ హిట్లర్ ఆదేశించినప్పటికీ, 31 జనవరి 1943న పౌలూస్ లొంగిపోయాడు. జర్మన్ కేంద్ర కార్యాలయములో విరిగిపోయిన సామగ్రి గదిలోనికి రష్యా సైనికులు వచ్చినప్పడు, ఫీల్డ్ మార్షల్ అయిన పౌలూస్ మరియు మిగిలియున్న అతని అధికారులు బయటకు వచ్చి నిశ్శబ్దముగా వారికి లొంగిపోయారు. ఆఖరి సైనికుడు చనిపోయేంత వరకు మూర్ఖపు పోరాటమును పోరాడమన్న హిట్లర్ ఆజ్ఞను వారు పూర్తిగా తిరస్కరించారు.

    అర్ధములేని మూర్ఖపు పోరాటమును పోరాడకుండా తిరస్కరించిన సైన్యాధిపతి పౌలూస్ తో స్టాలిన్గ్రాడ్ యుద్ధము ముగిసింది. స్టాలిన్గ్రాడ్ లో ఓటమి పాలైన తరువాత, ద్వేషముతో సైన్యాధిపతి పౌలూస్ హిట్లర్ కు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసెను. అతడు (పౌలుస్) జర్మన్ ప్రజలను విడుదల చేయుటకు రష్యన్లు తో యేకమై జాతీయ సభను ఏర్పాటు చేసెను మరియు జర్మన్ దళాలను హిట్లర్ కొరకు పోరాడవద్దని మాస్కో (Moscow) నుండి రేడియో ప్రసారము చేసెను.

    నా మూర్ఖపు పోరాటము

    చాలా సంవత్సరాలు క్రితం నేను పాఠశాలలో చదువుతున్నపుడు కొట్లాటల్లో పాల్గొనేవాడిని. కొట్లాట అనంతరం రెండు సంగతులు జరుగుతుండేవి. మొట్టమొదటిగా నా ప్రత్యర్ధి పై గెలిచాను లేక సమానముగా పోరాడాను అనుకొనేవాడిని. కానీ నాకే దెబ్బలు తగిలాయని నా చుట్టూ వారంతా నవ్వుతూ చెప్పుకొనేవారు.

    రెండవదిగా, అంత ప్రయాస పడినప్పటికీ నా కంటిచుట్టూ నల్లగా కమిలిపోయేది. నా కంటిచుట్టూ నల్లగా కమిలిన గుర్తు దాదాపు వారం రోజులు అలాగే ఉండేది. ఈ పోరాటము అనంతరము నా మల్ల యుద్ధమును (Boxing) మరియు పోరాట నైపుణ్యాలను అభినందించని నిష్ప్రయోజుకులైన ప్రేక్షకుల ఎదుట మరియు పనికిరాని వారితో ఇలాంటి నిష్ప్రయోజనమైన పోరాటాలను పోరాడుటవలన ఎటువంటి ప్రయోజనము లేదని నిర్ధారించుకొనేవాణ్ని!

    అప్పటినుండి, అవసరమైన చోట మంచి పోరాటాలను మాత్రమే పోరాడాలని నిర్ణయించుకున్నాను. మంచి కారణాలకు మాత్రమే పోరాడుతుంటాను మరియు మంచి ఫలితము నిచ్చే వాటి కొరకు మాత్రమే పోరాడుతుంటాను. అందుచేతనే ఈరోజున రాజకీయ పోరాటాలలో కానీ ఆర్థిక పోరాటాలలో కూడా నేను పూనుకొనలేదు. ఇలాంటి మూర్ఖపు పోరాటాలను విస్మరించుకొనుట చాలా సంవత్సరాలు క్రితమే నా పాఠశాలలో నేను నేర్చుకొన్నాను. ఈరోజున, పోరాడుటకైన చాలా మంచి కారణాలను నేను కనుగొన్నాను. పోరాటం యొక్క శ్రేష్టతను గూర్చిన చాలా మంచి సంగతులను దేవుని వాక్యము నాకు తెలియపరచింది. ఈ సంగతులు ప్రయాసపడుటకు లేదా పోరాడుటకు యోగ్యమైనది. మీరు ఏదైనా మంచిదాని కొరకు లేక ఏదైన వ్యర్ధమైనదాని కొరకు పోరాడవచ్చు. చాలా మంది ప్రజలు వ్యర్ధమైన లేక మూర్ఖపు పోరాటాలలో పాల్గొనుచున్నారు.

    అధ్యాయము 3

    మంచి సైన్యాధిపతి మంచి పోరాటం పోరాడుతుంటాడు

    విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము....

    1 తిమోతి 6:12

    పోరాడవలసిన సమయము వచ్చునప్పుడు మీరు వెనుకకు పారిపోకుండా వుండుటకు మంచి పోరాటములను గుర్తించుట అతి ప్రాముఖ్యము. మీరు పోరాటాలలో పాల్గొనుటకు సిద్ధముగా వుండునిమిత్తము, పోరాటాల పట్టికలు ఈ దిగువున ఇవ్వబడినవి. మీరు క్రైస్తవులు గనుక పోరాడుటకు మీకు మీరే సంసిద్ధత కలిగి వుండాలి. మీరు సువార్త పరిచారకులు గనుక మరి అధికముగా పోరాడుటకు సంసిద్ధత కలిగివుండాలి.

    పద్దెనిమిది మంచి పోరాటాలు

    బలమైన క్రైస్తవులవుటకు పోరాడుము.

    చాలా మంది క్రైస్తవులు ప్రభువు నందు బలముకలిగి లేరు. బలమైన విశ్వాసిగా అవుటకు చాలా కృషి అవసరమై యున్నది.

    తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.

    ఎఫెసీయులకు 6:10

    పరిశుద్ధాత్మతో నడిపించబడుటకు మరియు దేవుని చిత్తములో వుండుటకు పోరాడుము

    మనలను ప్రభావితము చేయ ప్రయత్నిస్తున్న వివిధ స్వరాలను విశ్లేషించుట ఒక పెనుగులాట. మనసుయొక్క స్వరమునుండియు మరియు ఆత్మయొక్క స్వరమునుండియు శరీరస్వరమును వేరుచేయుటయే పోరాటము యొక్క ముఖ్య లక్ష్యము. జీవించుటకు అతి ప్రాధాన్యమైన స్థలము ఏదనగా దేవునియొక్క చిత్తములో జీవించుటయే. చాలా స్వరాలు మీ లక్ష్యమునకు విరోధముగా పనిచేయును. మిమ్ములను దారిమళ్ళించుటకు చాలా దయ్యములు పోరాడుతుంటాయి. దేవుని చిత్తములో వుండుటకు ఇది నిజమైన పోరాటము. కొన్నిసార్లు మీ జీవిత భాగస్వామి యొక్క స్వరమై ఉండవచ్చు లేక చాలా బలముగా ప్రేరేపించు మీ స్వంత స్వరమై వుండవచ్చు, అయితే వాటిని మీరు తిరస్కరించాలి. మీరు దేవుని చిత్తములో వుండు నిమిత్తము మీ సన్నిహితులతో పోరాడుటకు సంసిద్ధముగా వున్నారా?

    లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టముకానిదై యుండదు.

    1 కొరింథీయులకు 14:10

    పోరాటము శరీరానుసారము గాక అత్మానుసారమై యుండవలెను. ఇది ఆత్మీయ వ్యక్తిగా వుండుటకైన పోరాటము.

    మీ శరీర బలహీనతలకు వొదిగిపోవుట చాలా సహజము. తినుట, పడుకొనుట, విశ్రాంతి తీసుకొనుట, మరియు శృంగారములో పాల్గొనుట ఇవన్నియు చాలా సహజమైనవి, వీటిని విసర్జించలేము. నీ జీవిత కాలమంతయు ఆత్మీయుడుగా వుండుటకు పోరాడుము. ప్రార్థనాపరులుగా వుండుట గొప్ప పోరాటమై వున్నది. వేకువనే లేచి దేవుని కొరకు కనిపెట్టుట సహజమైనది కాదు. ఆత్మీయలోకములోనికి ప్రవేశించుట దేవుని కృపయు మరియు శక్తియునై యున్నది

    శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.

    రోమీయులకు 8:6

    ఆత్మఫలము కొరకు పోరాడుము. ప్రేమలో నడుపుటకు పోరాడుము.

    ప్రేమ, సంతోషము, మరియు సమాధానము అను అత్మఫలము ఫలించుట చాలా కష్టతరము. కోపపడుట, కౄరముగా వుండుట మరియు అసంతృప్తి కలిగి వుండుట చాలా సహజమైనది. ప్రేమ, సంతోషము, మరియు సమాధానము అను అత్మఫలము ఫలించుట కొరకు నీ సహజత్వమునకు విరోధముగా పోరాడుము.

    అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియులేదు.

    గలతీయులకు 5:22-23

    పరిచర్యలోనికి ప్రవేశించుటకు పోరాడుము.

    పరిచర్యలోనికి ప్రవశించుట అన్నది పోరాటాలలోకెల్ల గొప్ప పోరాటమై వున్నది. ఇది యుద్ధాలలోకెల్ల గొప్ప యుద్ధమై వున్నది. యాజకత్వము కొరకు మంచి వృత్తులను వదులుకొనుట సహజత్వమునకు విరోధముగా వున్నది. మీరు దేవుని వెంబడించుటకు సంసిద్ధత కలిగియుండి మంచి పోరాటము పోరాడాలని వుంటే, ప్రభువైన యేసు క్రీస్తుయొక్క పరిచర్యలోనికి ప్రవేశించుటకు పోరాడుము.

    అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను.

    లూకా 9:59-60

    నీ పిలుపులో నిలచియుండుటకు పోరాడుము.

    మీరు ఒక్కసారి పరిచర్యలోనికి వచ్చినట్లయితే, పరిచర్యలో సరైన విధముగా నిలిచియుండుట చాలా కష్టము. కొంతమంది యవ్వన మిషనరీలు (సువార్త పరిచారకులు) తమ్ముతాము పోషించుకొనుటకు తర్ఫీదు లేని పాస్టర్లుగా పనిచేస్తున్నారు. చాలా కొద్ది సమయములోనే వారి హృదయములు నిజమైన పరిచర్య నుండి లౌకిక వ్యాపారాల వైపునకు తిరిగిపోయినవి. మీరు పరిచర్యలో వున్నప్పుడు, నిజమైన పిలుపు నుండి చాలా సులువుగా జారి పడెదరు మరియు వైదొలగిపోయెదరు. దేవుడు మీ పరిచర్యను దీవించిన తరువాత మీకు పెద్ద సంఘము వుంటే, అర్ధరహితమైన ప్రసంగికులగుట చాలా సహజము. మీకు పెద్ద సంఘము వున్నప్పుడు, దేవుని వాక్యములోవున్న ప్రాథమిక సత్యములు ప్రసంగించుట చాలా ప్రాథమికముగా వుందని మీరు భావిస్తారు. కనుక మీరు ప్రోత్సాహ వక్త (మొటివేషనల్ స్పీకర్) గా మారకుండునట్లు మీరు పోరాడుట అత్యవసరము.

    దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను, క్రేస్కే గలతీయకును తీతు దల్మతియకును వెళ్లిరి.

    2 తిమోతి 4:10

    గొప్ప దైవజనులతో సహవాసము చేయుటకు పోరాడుము.

    దైవజనులకు దగ్గరవుట అంత సులభమేమి కాదు. నేను చాలా దైవజనులతో దగ్గరవుటకు ప్రయత్నించాను గాని విజయవంతుడను కాలేకపోయాను. అభిషేకించబడిన దైవజనులకు దగ్గరవుటకు చాలా సంవత్సరాల పోరాటము, చేరువ, కొనసాగుట, మరియు తన్నుతాను తగ్గించుకొనుట చాలా అవసరము. చాలా మంది ప్రజలు ఈ పోరాటమునకు సిద్ధముగా లేరు. దైవజనులకు దగ్గరవుటకు పోరాటమును చేయాలని మరియు పోరాటమును కొనసాగించాలని గ్రహించిన చాలా మంది ప్రజలు వారితో సహవాసము చేయుట మానివేసియున్నారు. సహవాసము చేయుట అంత సులభమేమి కాదు. ఏలీలాకు దగ్గరవుటకు ఎలీషా పోరాడవలసి వచ్చింది. ఆ పోరాటములో తాను గెలిచాడు. అటువంటి అభిషేకము కొరకు పోరాడుటకు మీరు సిద్ధముగా వున్నారా?

    యెహోవా సుడిగాలిచేత ఏలీయాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలీయాయు ఎలీషాయు కూడి గిల్గాలునుండి వెళ్లుచుండగా

    2 రాజులు 2:1

    ఏలీయా - యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి యున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా - యెహోవా జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి.

    2 రాజులు 2:2

    పిమ్మట ఏలీయా - ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువననెను గనుక వారిద్దరు యెరికోకు ప్రయాణము చేసిరి.

    2 రాజులు 2:4

    అంతట ఏలీయా - యెహోవా నన్ను యొర్దానునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి యిక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు - యెహోవా జీవముతోడు నీ జీవముతోడు, నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్లిరి.

    2 రాజులు 2:6

    అభిషేకించబడుటకు పోరాడుము.

    ఇది అభిషేకించబడుటకు పోరాటమై వున్నది. అందుచేతనే ఏలీయా, నీవు అడుగునది కష్టతరముగా నున్నది అని ఎలీషాతో చెప్పెను. అభిషేకము పొందుటయు మరియు అభిషేకింపబడుటయు చాలా క్లిష్టమైనవి. మీరు పోరాటముకొరకు సంసిద్ధత కలిగియుండకపోతే, మీరు అభిషేకమును పొందలేరు. ఎవరైతే అభిషేకము కొరకు పోరాడుతుంటారో వారు మాత్రమే అభిషేకమునకు అర్హులు!

    వారు దాటిపోయిన తరువాత ఏలీయా ఎలీషాను చూచి - నేను నీయొద్దనుండి తీయబడకమునుపు నీకొరకు నేనేమి చేయకోరుదువో దాని నడుగుమని చెప్పగా ఎలీషా - నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్లు నా మీదికి వచ్చు నట్లు దయచేయుమనెను.

    అందుకతడు - నీవు అడిగినది కష్టతరముగా నున్నది; అయితే నీయొద్దనుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడినయెడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడనియెడల అది కాకపోవునని చెప్పెను.

    2 రాజులు 2:9-10

    మీరు మంచి జీవిత భాగస్వామిని కనుగొనుటకు పోరాడుము.

    ఇది జీవిత భాగస్వామిని కనుగొనుటకొరకైన పోరాటము. బోయజు దృష్టిని సాధించుటకు రూతు గట్టిగా పోరాడినది. ఇది వివాహము చేసుకొనుటకైన పోరాటము. చాలా జంతువులు ఒకే భాగస్వామిని కలిగి వుండవు. మనలో వున్న మృగస్వభావము మనలను చాలా భాగస్వాములను కోరుకొంటుంది. మీరు అటువంటి బహుళ భాగస్వామ్యత్వముకు దూరముగా వుండుటకు ఖచ్చితముగా పోరాడాలి.

    ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేసెను. బోయజు మనస్సున సంతోషించునట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.

    రూతు 3:6-7

    ఐశ్వర్యము కొరకు పోరాడుము. ఐశ్వర్యము అంత సులువుగా కలుగదు.

    మీరు ఐశ్వర్యవంతులగుటకు పోరాడుతుంటారు. ధనము రహస్య స్థలములలో దాచబడియున్నది. నిధి చీకటి స్థలములలో దాచబడి యున్నది. పోరాడకుండా, ఈ ప్రపంచములో వున్న ధనమును మీరు ఎన్నటికిని కనుగొనలేరు. జడులు, మందగమనులు మరియు సోమరులు అంత సులువుగా ధనికులవ్వలేరు. ఎందుకనగా ఈ భూమిని ఫలింపచేయుటకు చాలా బలమైన పోరాటము అవసరమై యున్నది. మీరు పాఠశాలకు పోవుటకు పోరాడాలి. మీరు పరీక్షలలో ఉత్తీర్ణులగుటకు పోరాడాలి. తరువాత మంచి ఉద్యోగం వచ్చుటకు పోరాడాలి. అటుతరువాత ఉద్యోగములో ఉన్నతస్థాయికి వెళ్ళుటకు పోరాడాలి. మీ డబ్బును సరైన విధముగా ఉపయోగించుటకు జ్ఞానము కొరకు పోరాడుతుండాలి.

    కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.

    మార్కు 4:25

    గృహము కట్టుటకు పోరాడుము. మీరు గృహము కట్టుకొనుటకు పోరాడాలి.

    చాలా మంది ప్రజలకు స్వంత గృహము లేదు మరియు ఇంక ఎప్పటికిని స్వంత గృహము కలిగి వుండలేరు. ఇది గృహ యజమానులగుట కొరకైన పోరాటమైనప్పటికి ఇది విలువైన పోరాటమై యున్నది.

    జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును.

    సామెతలు 24:3

    దీర్ఘాయువు కలిగి జీవితాంతము ప్రభువుని సేవించుటకు పోరాడుము.

    ఇది మంచి ఆరోగ్యము కలిగి, బ్రతికి యుండి, మరియు ఎక్కువ కాలము ప్రభువుని సేవించుట కొరకైన పోరాటము.

    వారు - ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవచేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తర మిచ్చినయెడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.

    1 రాజులు 12:7

    మీ స్వభావములో వున్న ప్రతికూల కోణాలకు విరోధముగా పోరాడుము.

    మీ ఆవేశ స్వభావము, మీ కోప స్వభావము, మీ విసుగు స్వభావము, మరియు వీరరసముగల (కోరికలుగల) స్వభావము యివన్నిటికి ప్రతికూల కోణములే వున్నవి.

    మందబుద్ధి మరియు మందగతి కలిగివున్న మీ ఆవేశ స్వభావము పరిచర్యలో ఏదైనా సాధించే మీ సామర్థ్యతకు విరోధముగా పోరాడును. అటువంటి స్వభావము మిమ్ములను కదలనివ్వకుండా లేక పోరాడనివ్వకుండా చేస్తుంది.

    మీలోవున్న వీరరసములు (కోరికలు) మిమ్ములను ఛిన్నాభిన్నము చేయుటకు, గందరగోళములోనికి, శరీర పాపము వైపునకు మిమ్మును నడుపును.

    దిగులు మరియు సంక్షోభం గల విసుగు స్వభావములు బాంధవ్యాలను పాడుచేసి చు ట్టూ ఉన్న వాతవరణాన్ని మందగింపజేస్తాయి. ఈ స్వభావము కలిగి ఉంటే యితరుల తప్పులను పట్టుకునేవారిగా ఉంటూ ఎవరైనా చిన్న తప్పు చేసినయెడల వారినుండి దూరమైపోతుంటారు.

    దుష్టత్వము, ఆగ్రహము మరియు అసభ్యత గల కోప స్వభావము మీ సంబంధాలను పాడుచేస్తాయి. ఈ కోపములో ఆత్రుతతో తీసుకొన్న ఏ నిర్ణయమైన తిరుగుబాటునకు దారి తీస్తుంది. ఈ కోప స్వభావము ఆ వ్యక్తిని దేవునిపై వేచియుండుట నుండి దూరం చేస్తుంది.

    ఈ పోరాటము సహజసిద్ధముగా మీరు ఏమి చేయగోరుచున్నారో దాని విషయములో మిమ్మును మీరు త్యజించుకొనుటకు సంబంధించినది! తమ్మును తాము త్యజించుకొనుట అనేది చాలా మందికి చాలా కష్టమైన పోరాటమని నేను కనుగొన్నాను. సహజసిద్ధముగా సంక్రమించిన స్వభావమును ప్రక్కన పెట్టుటకు మంచి పోరాటమును పోరాడుము.

    అంతట ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి - నన్ను వెంబడింప గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువయెత్తికొని నన్ను వెంబడింపవలెను.

    మార్కు 8:34

    మీ లైంగిక బేధముకు విరోధముగా పోరాడుము.

    ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

    గలతీయులకు 3:28

    నీవు పురుషుడవైతే, ఒక్క భాగస్వామితో వుండుటకు ఇబ్బంది పడతావు. కాని మీరు ఇటువంటి పురుష్య పర్యావసానమునకు విరోధముగా పోరాడి ఒకే ఒక్క వ్యక్తితో ఎలా జీవించాలో గుర్తించాలి. నమ్మకముగా వుండుటకు ఇది పురుషులకు పోరాటమై వున్నది. కాని ఈ పోరాటము తప్పకుండా గెలువవలసి యున్నది! ఒక వ్యక్తి యొక్క మగతనము తన శృంగార కోరికలను బట్టి వ్యక్త పరచబడుచున్నది. శృంగారము కొరకైన ఈ అధిక కోరికలు నీలిచిత్రాలు, హస్తప్రయోగాలు, జారత్వము, మరియు వ్యభిచారమునకు దారి తియ్యును. మిమ్మును మీరు ఉపేక్షించుకొనుటకు పోరాడకపోతే, మీరు పరిచర్యలో చాలా ప్రమాదకరమైన స్థితిలో వుంటారు.

    స్త్రీలు కూడా భయాలు, అసూయ, మరియు ఆరోపణములు కలిగి వుంటారు. మీరు మీ ఆడతనమును విడచిపెట్టాలి లేకుంటే అవి మిమ్ములను పరిచర్య నుండి రద్దు చేస్తాయి. మీరు స్త్రీలైనప్పటికీ లేక పురుషులైనప్పటికి, లింగ బేధములు లేనంతవరకు మీ ఆడతనమును మరియు మగతనమును నియంత్రించుకొనుట చాలా ప్రాముఖ్యము.

    ప్రాంతీయ మరియు జాతీయ మూఢనమ్మకాలకు విరోధముగా పోరాడుము.

    వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను - క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునై యున్నారు.

    ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువుచేత వారు యూదుల కల్పనాకథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.

    తీతుకు 1:12-14

    ప్రతి తెగకు, కుటుంబమునకు మరియు దేశమునకు వాటి అభిప్రాయములు వుంటాయి. ఘానా దేశములో, అశాంటిస్ తెగ వారు కొన్ని విషయాలకు ప్రసిద్ధి చెందిన వారు మరియు ఈవెస్స్ తెగ వారు కూడా వేరే విషయాలకు ప్రసిద్ధి చెందినవారు. మీరు పరిచర్యలోనికి వెళ్ళునప్పుడు, మేము అశాంటిస్ వారమని లేక ఈవెస్స్ వారమని మీ ప్రదర్శన లో ప్రస్తావించకూడదు. ఏదో ఒక తెగకు మక్కువ చూపుతున్నట్లైతే, మీ పరిచర్యలో ఫలించే సామర్థ్యాన్ని కోల్పోతారు. కొంత మంది పాస్టర్లు (దైవసేవకులు) జాతీయ భావముతో ఉంటారు వారి దేశమును విడిచిపెట్టి బయటకు వెళ్ళరు. చాలా మంది ఆమెరికా దేశస్తులు జాతీయ భావముతో ఉండిపోతు వేరే దేశాలకు వెళ్లి సేవ చేయలేక పోతున్నారు. ప్రపంచ జనాభాలో కేవలం ఐదోవంతు మత్రమే ఉత్తర అమెరికావారు. అనేక అమెరికా దైవసేవకులు ప్రస్తుతము కేవలం ప్రపంచములోని ఐదోవంతుకి సేవ చేయుటకే పరిమితమైపోయారు. ఆశ్చర్యకరముగా, ఈ ఐదోవంతు ప్రజలు తొంభై శాతం సువార్త సేవకులను కలిగియున్నారు.

    నైజీరియన్లు చాలా గొప్ప సంఘాలను స్థాపించారు. కొన్ని విషయాలలో నైజిరియన్లు కూడా కీర్తిని కలిగి వున్నారు. మీరు నైజీరియ పరిచారకులైతే, నైజీరియ మూఢత్వమునకు దూరముగా వుండాలి. ఇది అన్నిటికి మించి కేవలము క్రైస్తువులుగా వుండుటకైన శ్రేష్టమైన పోరాటము.

    ఫ్రెంచ్ భాష మాట్లాడు దేశాలు కొన్ని పద్ధతులకు గుర్తించబడినవి. ప్రతికూల మూడత్వముకు మీరు దూరముగా వుండుట చాలా ప్రముఖ్యమైనది.

    శరీర రంగుల మూఢత్వముకు విరోధముగా పోరాడుము.

    కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.

    మరియు అతడు - షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.

    దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.

    ఆదికాండము 9:25-27

    అభివృద్ధి లేకపోవడం, పేదరికం, వస్త్రహీనత, మురికి లేక రోత, గందరగోళం, చిన్నాభిన్నము, మరియు వృద్ధి చెందుటకు అసమర్ధత; వీటన్నిటినిబట్టి నల్ల జాతి ప్రజలు గుర్తించబడుచున్నారు! డబ్బు ప్రీతి, సంబంధాలు లేకపోవడం, స్వలింగ సంపర్కం, విడాకులు, స్వలింగ వివాహాలు, నాస్తికత్వం, ధూమపానం, మద్యపానం, మరియు అధిక ఆత్మహత్యలు; వీటిని బట్టి తెల్ల జాతి ప్రజలు గుర్తించబడుచున్నారు!

    వాస్తవానికి, మనము పోరాడుటకు ఇవే నిజమైన మూఢత్వములు. మీరు తెల్లవాళ్ళైనా లేక నల్లవాళ్ళైనా, ఈ మూఢత్వముల నుండి వేరగుటకు పోరాడాలి. ఇటువంటి మూఢత్వములకు దూరముగా వెళ్లిపోవాలి. తెల్లవాళ్ళ పాత్ర లేక నల్లవాళ్ళ పాత్ర కన్నా క్రైస్తవ పాత్రనే తీసుకోవాలి. అదే శ్రేష్టమైన మంచి పోరాటము!

    కామానికి విరోధముగా పోరాడుము.

    నీవు ¸యవ్వనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.

    2 తిమోతి 2:22

    కామము నీలోవున్న పరిశుద్ధతను కాల్చివేస్తుంది. మిమ్ములను ఆత్మీయతనుండి దూరం చేస్తుంది. అందు చేతనే పౌలు భక్తుడు కాలిపోవుట కన్నా వివాహము చేసుకొనుటే మంచిదని చెప్పాడు. మీరు కాలిపోతున్నట్లైతే, ఏదో చెడుని మీరు అనుభవిస్తునట్లే. లైంగికత అధ్బుతమైనది, ఎందుకంటే ఇది మనుష్యులలో వున్న మానవాతీత ప్రభావమై వున్నది. ఆధిక లైంగిక కోరికలు ప్రతికూలమై వున్నవి కనుక అవి మీ ఆత్మీయత నుండి దూరము చేయును. మీ పూర్ణ హృదయముతో మరియు పూర్ణ ఆత్మతో కామముకు విరోధముగా తప్పక పోరాడాలి.

    కామముకు విరోధముగా పోరాడుటకు మొదటి మార్గమేమనగా ఆ కోరికలు పొందకుండా మీకు మీరే దూరముగా వుండాలి. ఒక్కసారి ఆ కోరికలను పొందినట్లయితే, వాటిని నియంత్రించుకొనుట చాలా కష్టము.

    రెండవదిగా, మీరు ఇప్పటికే నీలిచిత్రాలు, హస్తప్రయోగాలు, మరియు స్వలింగ సంపర్కాలు అనే కోరికలను పొందినట్లయితే, వాటికి విరోధముగా మరియు మీ శేష జీవితము కొరకు ప్రార్థన చేయాలి

    మూడవదిగా, కామమునకు విరోధముగా పోరాడుట మీరు లైంగిక భావోద్వేగం కలిగియుండుట. ఈ భావోద్వేగం మీ వివాహము నుండి మొదలైనందున మీరు క్రమమైన లైంగిక సంభోగంలో పాల్గొనగలుగుతున్నారు. అనుకోని రీతిగా మీ భార్య చెడ్డదైతే, మీ లైంగిక భావోద్వేగమునకు హామీ లేక పోవచ్చు. ఏదేమైనప్పటికి, మీ మిగిలిన జీవితము కొరకు కామమునకు విరోధముగా పోరాడాలి.

    ఫలించుట కొరకు పోరాడుము.

    ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞానవిషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలు లైనను కాకుండ చేయును.

    2 పేతురు 1:8

    ఆత్మీయ గొడ్డుతనముకు విరోధముగా పోరాడుట చాలా కష్టము మరియు ఎక్కువ కాలము పట్టును. మీరు ప్రభువుని సేవ చేస్తుండగా మీలో దాగి వున్న నైపుణ్యాలను మెరుగుపరుస్తు మీ జీవితాలను సక్రమపరచుకోవాలి. ఫలించుట అనునది శ్రద్ధ, విశ్వాసము, దైవత్వము, నిగ్రహము, జ్ఞానము, సద్గుణం, మరియు ఓర్పుకు సంబంధం వున్నట్లు మీరు గ్రహించగలరు. ఈ ఆత్మీయ నైపుణ్యాలకు మరియు ఫలించుటకు సంబంధమేమియు లేనట్టుగా కనిపిస్తాయి. కాని సంబంధాలున్నాయి! అవి మీరు ఫలించుటకు అసలైన నిశ్చయతగా వున్నాయి. మీ జీవిత కాలమంతయు, శ్రద్ధ, నిగ్రహము, విశ్వాసము, జ్ఞానము, కృతజ్ఞత భావము మరియు దాతృత్వము కొరకు పోరాడుతారు.

    ఇది ఫలించుట కొరకైన పోరాటము గనుక ఈ పోరాటము శ్రేష్టమును మరియు మంచిదియునై యున్నది.

    అధ్యాయము 4

    యుద్ధ వాతావరణమునకు అలవాటుపడుట

    యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును.

    యెషయా గ్రంథము 9:5

    మనుష్యుల ఆత్మలను సంపాదించుటకు మనము ఆఖరి యుద్ధములో వున్నాము. మనము ఆ యుద్ధ వాతావరణముకు అలవాట పడకపోతే, సరిగ్గా పని చేయలేము. యుద్ధపుసందడిచేయు యోధులందరి జోళ్లును రక్తములో పొరలింపబడిన వస్త్రములును అగ్నిలో వేయబడి దహింపబడును, అని బైబిల్ చెప్పుచున్నది. ఇది శాంతి, సామరస్యము, మరియు సంతోషము గల ప్రశాంత వాతావరణము కాదు.

    ఇది ప్రమాదకరము, అపాయము, కలవరము, గాభరా, స్థితిరాహిత్యం, ఒత్తిడి, ఉద్రిక్తత, విచారము, భయము, మరణము, బాధ, నొప్పి, నిరాశ, మరియు అవరోధాలు గూర్చిన యుద్ధ వాతావరణమై యున్నది. దేవుడు మనలను తన వాక్యమును వ్యాప్తి చేయుటకు మరియు చాలా మందిని నరకమునకు తీసుకొని వెళ్తున్న మాయలు మోసాలుకు విరోధముగా పోరాడుటకు వాడుకొనుచున్నాడు. దేవుని రాజ్యవ్యాప్తి చెందుటలో సంతోషించని ఒక శత్రువు మనకున్నాడు. యేసు ఈ సందర్భములోకి రాగానే, ఆయన తరచుగా దయ్యము చేత దాడి చేయబడ్డాడు. యేసు క్రీస్తు యుద్ధ వాతావరణంలో నివసించేవారు. దెయ్యము ఆయన నుండి ఎప్పుడు దూరముగా ఉండేవాడు కాదు. ఆయన పెద్దవాడవ్వకుండా వుండుటకు, ఆయనను తుడిచివేయుటకు హత్య ఆత్మతో యేసు దాడి చేయబడ్డాడు. ఆయన అరణ్యములో ఉపవాసముండి ప్రార్థన చేసేటప్పుడు దాడి చేయబడ్డాడు. ఆయన పరిసయ్యుల ద్వారా దాడి చేయబడ్డాడు, చివరకు యుదా ఇస్కారియోతు ద్వారా దాడి చేయబడ్డాడు.

    పరిచర్య యొక్క వాతావరణము యుద్ధ వాతవరణమై యున్నది

    ఒక్క సారి దేవుని యొక్క ఉన్నత పిలుపునకు చెవియొగ్గినట్లైతే, దేవుని రాజ్యముయొక్క చిట్టచివరి యుద్ధములోనికి ప్రవేశిస్తున్నారు. యేసు సిలువలో మరణించుట వలన దుష్టుడైన సాతాను మరియు వాడి దూతలు నుండి ఈ ప్రపంచమును రక్షించుటకు తీవ్రమైన ప్రచారాలు మొదలైనవి. చాలా సంవత్సరాలు నుండి ప్రపంచమును మోసము చేస్తున్న ఆ

    Enjoying the preview?
    Page 1 of 1