Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

యోహాను సువార్తపై ప్రసంగములు (I) - అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I)
యోహాను సువార్తపై ప్రసంగములు (I) - అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I)
యోహాను సువార్తపై ప్రసంగములు (I) - అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I)
Ebook774 pages4 hours

యోహాను సువార్తపై ప్రసంగములు (I) - అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I)

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

యేసు క్రీస్తు ద్వారా దేవుని ప్రేమ వెల్లడి చేయబడింది
“ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయకుమారుడే ఆయనను బయలుపరచెను” (యోహాను 1:18).
దేవుని ప్రేమను యేసు మనకు ఎంత చక్కగా బయలుపరిచాడు! యేసు మనలను ఎంత పరిపూర్ణంగా విడిపించాడు! నీరు మరియు ఆత్మ యొక్క సువార్త రక్షణ ఎంత పరిపూర్ణ సత్యం! నీరు మరియు రక్తము ద్వారా వచ్చిన యేసుపై మన విశ్వాసం ద్వారా మన రక్షణను పొందినందుకు మేము ఎన్నడూ చింతించలేదు (1 యోహాను 5:6).
దేవుని ప్రేమను బయలుపరచిన యేసుక్రీస్తును మీరందరూ విశ్వసించి, ఆయన ప్రేమపై విశ్వాసాన్ని మీ హృదయాలలో ఉంచుకుని, ఆ ప్రేమను వ్యాప్తి చేయడం కోసం ప్రతిరోజు జీవించాలని నేను ఆశిస్తున్నాను. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా దేవునితో కలవడం ద్వారా మీరు పాప విముక్తి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను.

LanguageTelugu
PublisherPaul C. Jong
Release dateJul 6, 2019
ISBN9788928223701
యోహాను సువార్తపై ప్రసంగములు (I) - అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I)

Related to యోహాను సువార్తపై ప్రసంగములు (I) - అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I)

Related ebooks

Reviews for యోహాను సువార్తపై ప్రసంగములు (I) - అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I)

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    యోహాను సువార్తపై ప్రసంగములు (I) - అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I) - Paul C. Jong

    paul_Tel18_coverFrontflap_Tel18.gif1st_page

    యోహాను సువార్తపై ప్రసంగములు (I)

    అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా బయలుపరచబడిన దేవుని ప్రేమ (I)

    Smashwords Edition

    Copyright 2023 by Hephzibah Publishing House

    అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. కాపీరైట్ ప్రచురణకర్త మరియు యజమానుల ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా ఈ ప్రచురణలోని ఏ భాగాన్ని పునరుత్పత్తి చేయలేము, తిరిగి పొందే వ్యవస్థలో నిల్వ చేయలేము, లేదా ఏ రూపంలోనైనా లేదా ఎలక్ట్రానిక్, మెకానికల్, ఫోటోకాపీ, రికార్డింగ్ లేదా ఇతరత్రా ప్రసారం చేయలేము.

    ఈ పుస్తకంలో ఉపయోగించిన స్క్రిప్చర్ కొటేషన్స్ న్ (తెలుగు బైబిల్ సొసైటీ అఫ్ ఇండియా వర్సిన్) నుండి

    ISBN 978-89-282-2370-1

       విషయసూచిక   

    ముందుమాట

    అధ్యాయము 1

    • యేసు క్రీస్తు, మన జీవము (యోహాను 1:1-4)

    • మనం దేవుని వలన జన్మించాలి (యోహాను 1:12-18)

    • అద్వితీయ కుమారుడైన యేసు ద్వారా దేవుని ప్రేమ ప్రత్యక్షపరచబడింది (యోహాను 1:15-18)

    • బాప్తిస్మమిచ్చే యోహాను సాక్ష్యమిచ్చిన సత్యమిదే (యోహాను 1:19-28)

    • యేసు లోక పాపములను భరించాడనటానికి బైబిల్ సాక్ష్యం (యోహాను 1:29-39)

    • దేవుని వాక్యాన్ని మాత్రమే నమ్మే విశ్వాసం (యోహాను 1:1-8)

    • మనము ఇంతకన్నా సంతోషంగా ఉండలేము (యోహాను 1:29-31)

    • మన సృష్టికర్త ఎలాంటి రూపంతో మనల్ని సందర్శించాడు? (యోహాను 1:1-13)

    • బాప్తిస్మమిచ్చు యోహాను ఎవరు? (యోహాను 1:19-42)

    అధ్యాయము 2

    • మనము యేసును మన హృదయాలలో అంగీకరించినట్లయితే మనము సంతోషిస్తాము (యోహాను 2:1-11)

    • మనం దేవుని వాక్యానికి లోబడితేనే మనం దేవుని ఆశీర్వాదాలను రుచి చూడగలం (యోహాను 2:5)

    అధ్యాయము 3

    • ఈ విధంగా తెలుసుకోవడం మరియు నమ్మడం ద్వారా మనం క్రొత్తగా జన్మించాలి (యోహాను 3:1-6)

    • దేవుడు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మీరు నమ్ముతున్నారా? (యోహాను 3:1-8)

    • మనం క్రొత్తగా జన్మించడం ఏలా సాధ్యమైంది? (యోహాను 3:1-15)

    • దేవుని ప్రేమ మీకు నిజంగా తెలుసా? (యోహాను 3:16)

    • విశ్వాసం ద్వారా ఆధ్యాత్మిక పని చేద్దాం (యోహాను 3:16-17)

    0preface

    ముందుమాట

    యేసు శిష్యులు, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి? ఆయన మాటలను ఎవరు అర్థం చేసుకోగలరు? ఎందుకంటే ప్రభువు తనను తాను జీవాహారముగా చెప్పుకున్నాడు, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను (యోహాను 6:51). మరల, యేసు ఇట్లనెను–మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవముగలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవముగలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది (యోహాను 6:53-55). ఆయన ఇలా ముగించాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము (యోహాను 6:56).

    నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే విశ్వాసంతో మనం ప్రభువు శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగగలమని ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రభువు శరీరమును తిన్నప్పుడు మనం పాపరహితులమని తెలుసుకుంటాం. మీరు విశ్వాసంతో ప్రభువు శరీరమును తింటే, మీరు పాపరహితులు అవుతారు. నా తోటి విశ్వాసులారా, మీరు యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను నుండి బాప్తిస్మము పొందిన యేసు మన పాపములన్నింటినీ తీసుకున్నాడనే విశ్వాసంతో మీరు ప్రభువు శరీరమును తింటే, అప్పుడు మనం పాపముల విముక్తి యొక్క కృపను పొందగలుగుతాము. విశ్వాసం ద్వారా ప్రభువు తన శరీరముతో చేసిన కార్యమును తింటే మనం పాపరహితులం అవుతాము. అయితే, విశ్వాసంతో యేసు శరీరమును తినని వారి సంగతేంటి? ఆయనను ఎంత మతోన్మాదంగా నమ్మినా పాపులుగానే మిగిలిపోతారు. ఆధ్యాత్మిక విశ్వాసంతో ప్రభువు శరీరమును భుజించే వారు పాపరహితులు అవుతారు.

    మనం ఆహ్వానించిన చోట రుచికరమైన ఆహారపదార్థాలు తయారవుతాయని అనుకుందాం. ఎంత ఘనంగా విందులు చేసినా అవి తినకపోతే మనం నిండుగా ఉండలేము. అలాగే, మన ప్రభువు మనలను పాపరహితులుగా చేసి, తన శరీరంతో బాప్తిస్మము పొందడం ద్వారా మనల్ని పాపరహితులను చేసాడు అని మనస్ఫూర్తిమైన నమ్మకముతో మనం తిన్నప్పుడే మనకు నిజమైన పాప విముక్తి లభిస్తుంది. ఇదిలా ఉంచితే, ‘యేసు బాప్తిస్మం పొందడం ద్వారా మన పాపములను తుడిచిపెట్టాడు’ అనే విశ్వాసంతో ప్రభువు శరీరమును తిన్నప్పుడే మన పాపములు తుడిచిపెట్టుకుపోతాయి.

    నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే విశ్వాసంతో మనం తరచుగా ప్రభువు శరీరమును తినాలి. అప్పుడే మన ఆధ్యాత్మిక కడుపు నిండుతుంది. మరియు దాని ఆధ్యాత్మిక అర్థాన్ని విశ్వసించడం ద్వారా మనం ప్రభువు రక్తాన్ని త్రాగినప్పుడు సమాధానమును పొందుతాము. ఈ మాటలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది, అయితే ఈ అలంకార రూపకాలన్నీ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. ప్రభువు మనకు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించినప్పుడే మనం ప్రభువు శరీరమును తినగలము మరియు ఆయన రక్తాన్ని త్రాగగలము. ఈ సువార్తను విశ్వసించడం ద్వారా నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను నెరవేర్చడానికి ప్రభువు తన జీవితాన్ని మనకు ఇచ్చాడని చెప్పే సత్యాన్ని మనం తినవచ్చు అని నా ఉద్దేశ్యం.

    నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మాత్రమే తెలుసు కానీ దానిని తినని కొందరు అవిశ్వాసులు మీలో ఉన్నారా అని నేను మీతో మరోసారి మాట్లాడుతున్నాను. మీరు ఈ వర్గంలో ఉన్నట్లయితే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సిద్ధమైనప్పుడు, ఎటువంటి సంకోచం లేకుండా విశ్వాసంతో తినమని నేను మీకు సలహా ఇస్తున్నాను. మీరు చల్లని పానీయాన్ని ఆస్వాదించినట్లు ఆయన రక్తాన్ని త్రాగాలని మరియు మీరు ఆధ్యాత్మిక ఆహారంగా యేసు శరీరమును తినాలని నేను కోరుకుంటున్నాను. బాప్తిస్మము ద్వారా మన పాపములను ప్రభువు తన శరీరంలోకి తీసుకొని సిలువపై తన రక్తంతో వాటిని చెల్లించడం ద్వారా వాటిని తుడిచిపెట్టాడని తెలుసుకోవడం ద్వారా మీరు నిత్యజీవమును తింటూ మరియు త్రాగాలని నేను కోరుకుంటున్నాను. మరియు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించడం ద్వారా ప్రభువు శరీరమును తినడానికి మరియు ఆయన రక్తాన్ని త్రాగడానికి మనము ఎన్నుకోబడ్డాము అనే హామీ మీకు ఉండాలని నేను కోరుకుంటున్నాను.

    యేసు తన శిష్యులకు తన శరీరమును తినమని మరియు ఆయన రక్తాన్ని త్రాగమని చెప్పాడు. తన శరీరమును జీవహారముగా తినమని యేసు చెప్పినప్పుడు ప్రజలు చాలా కఠినముగా ఉందని భావించారు. ఈ మాటలను ఎవరు అర్థం చేసుకోగలరు? అనే ఈ మాటలతో వారు చాలా కలత చెందారు. అదేవిధంగా, ఈ రోజుల్లో దాదాపు అందరు క్రైస్తవులు కూడా వారి ఆధ్యాత్మిక అజ్ఞానం కారణంగా లేఖనాలలోని ఈ వాక్య భాగంతో ఇబ్బంది పడుతున్నారు.

    కాబట్టి, మన ప్రభువు ఇలా అన్నాడు, ఆలాగైతే మనుష్యకుమారుడుమునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినయెడల ఏమందురు? ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి (యోహాను 6:62-63). ఈ వాక్యభాగానికి అర్థం, మీరు నా వాక్యాన్ని ఆధ్యాత్మికంగా వినాలి. లోక పాపముల నుండి మీ ఆత్మలను రక్షించడానికి నేను యోర్దాను నదిలో మీ పాపములన్నింటినీ తీసివేసాను. నేను, మనుష్యకుమారుడను, బాప్తిస్మమిచ్చు యోహాను నుండి నేను పొందిన బాప్తిస్మము ద్వారా మీ పాపములన్నింటినీ తీసుకున్నాను. మరియు నేను మీ స్థానంలో చనిపోయాను; నీ కోసం నా ప్రాణాన్ని ఇచ్చాను. మరియు నేను చనిపోయిన 3 రోజులలో నేను ఇంతకు ముందు కూర్చొని ఉన్న నా సింహాసనానికి తిరిగి వెళ్లానని చెబితే మీరు ఏమి ఏమ్మంటారు? అయితే, యేసు ప్రభువు కుమారుడని లేదా ఆయన ప్రభువు అని నమ్మని యేసు శిష్యులలో చాలా మంది ఉన్నారు. విశ్వాసంతో యేసు శరీరమును తినే ప్రజలు ధన్యులు.

    మీరు ఈ క్షణంలో నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తూ ప్రభువు శరీరమును తింటున్నారా మరియు ఆయన రక్తాన్ని త్రాగుతున్నారా? ప్రతిరోజూ ఆయన ఆశీర్వాదములను తిని త్రాగండి. మీరు ప్రతిరోజూ శరీరానికి సంబంధించిన ఆహారాన్ని తినవలసి ఉంటుంది, అలాగే విశ్వాసంతో ఆధ్యాత్మిక ఆహారాన్ని కూడా తినండి. మీరు ఒక్కసారి మాత్రమే ఆధ్యాత్మిక ఆహారాన్ని తింటే, మీరు మూడు రోజుల్లో ఆధ్యాత్మికంగా ఆకలితో ఉంటారు. అప్పుడు మీరు వాటిని మళ్లీ తినాలి. నా తోటి విశ్వాసులారా, మీరు వీలైనంత తరచుగా ఆధ్యాత్మిక ఆహారాన్ని తినాలి.

    యేసు శరీరమును భుజించే వారు జీవాన్ని-నిత్య ఆహారాన్ని స్వీకరించడానికి వస్తారు

    యేసు శరీరమును తిన్నవారు పాపరహితులుగా మారారు. నా తోటి విశ్వాసులారా, మీరు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించినప్పుడు మీరు పాపరహితులుగా మారారని మీకు తెలుసా? విశ్వాసం ద్వారా యేసు శరీరమును తిని మరియు రక్తాన్ని త్రాగడం ద్వారా మనం పాపరహితులమయ్యాము. ప్రభువు శరీరమును తిని ఆయన రక్తాన్ని త్రాగడం ద్వారా మనం పాపరహితులుగా మారగలమని చెప్పే నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను ఇవ్వడం ద్వారా ప్రభువు మనకు రక్షణను ప్రసాదించాడు. కాబట్టి, మనం మన ప్రభువైన యేసు శరీరమును తిని మరియు రక్తాన్ని త్రాగడం వలన మనం నిజంగా పాపరహితులుగా క్రొత్తగా జన్మించాము.

    తన శరీరాన్ని మనకు ఇచ్చిన మన ప్రభువు ఎంత కృపతో నిండి ఉన్నాడు? ప్రభువు తన శరీరమును మనకు ఇవ్వకపోతే మనం ఏమి చేస్తాం? ఆయన ఇచ్చిన శరీరమును మనం రోజువారీ ఆహారంగా తినడం వల్ల మనం పాపరహితులమని మన మనస్సాక్షి ఎంత శుద్దిగా భావిస్తుంది? నా తోటి విశ్వాసులారా, మనం పాపం చేయని వ్యక్తులుగా మారడం ఎంతగానో ఆకట్టుకునేది మరియు సంతోషకరమైనది.

    మనం పాపం చేయని ప్రజలం అని ఎలా చెప్పగలం? దానికి డబ్బు చెల్లించి మనం పాపరహితులం కాగలమా? పుణ్యకార్యాలు చేసి పాపరహితులం కాగలమా? లేదా, చక్కగా జీవించడం ద్వారా మనం పాపరహితంగా ఉండగలమా? మన క్రియలు లేదా సామర్థ్యాల ద్వారా మనం పాపరహితంగా ఉండలేము. యేసు యొక్క శరీరముతో తప్ప మనం పాపం లేని వ్యక్తులుగా ఉండలేము. యేసు శరీరమును భుజించడం ద్వారా మనం పాపరహితులమయ్యాము ఎందుకంటే యేసు తన శరీరమును మనకు ఇచ్చాడు. నీకు పాపములు ఉన్నాయా? - లేదు, నాకు పాపములు లేవు. నాకు పాపములు లేవు అని మన స్వరంతో చెప్పుకుందాం. అవును, మనకు పాపం లేదు, ఎందుకంటే మనం యేసు శరీరమును తిన్నాము. ప్రజలు మనల్ని చూస్తే, అహా, ఇలాంటి వింత వ్యక్తులు కూడా ఉన్నారా అని అనవచ్చు. కానీ, మీరు పాపరహితులు, వీరిలో దేవుడు సంతోషిస్తున్నాడు.

    నా తోటి విశ్వాసులారా, మనం ప్రభువు శరీరమును తిన్నందున మనకు పాపములు లేవు. యేసు తన శరీరమును మనకు ఇచ్చాడు. ఆయన తన రక్తాన్ని కూడా మనకు అందించాడు. ఆయన తన బాప్తిస్మము ద్వారా ఆ శరీరముతో మన పాపములన్నింటినీ తీసుకున్నాడు మరియు సిలువపై తన రక్తాన్ని చిందించడం ద్వారా వాటి వెలను చెల్లించాడు. కాబట్టి, ఈ నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై విశ్వాసం ఉంచడం ద్వారా మనం పాపరహితులమయ్యాము.

    ప్రభువు ఇలా అన్నాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము (యోహాను 6:63). దేవుడు మనకు చేసిన దానిని మన మనస్సులో విశ్వసించినప్పుడు మనం క్రొత్తగా జన్మించగలము. ఇలా మన మనస్సులో పాపములు లేని వ్యక్తులుగా మారాము. అలాగే, మనము మన ఆత్మలో పాపము లేని వ్యక్తులము అయ్యాము. మీరు అంగీకరిస్తారా, లేదా? మీరు అంగీకరిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కాబట్టి, ప్రభువు ఇలా అన్నాడు, ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్‌ప్రయోజనము. మనం శారీరకంగా ఆలోచిస్తే, మనం నిజంగా ఎవరి శరీరమునైనా తిని రక్తమును త్రాగగలమా? మనము అలా చేయలేము. మరి మనం ఇతరుల శరీరమును శారీరకంగా తింటే, మనం నరమాంస భక్షకుల తెగకు చెందినవారమని చెప్పుకుంటున్నామా? మనం ఈ మాటలను అక్షరాలా పాటించినట్లయితే, బైబిల్ మనం అనాగరికమైన క్రియలను చేయమని ఆజ్ఞాపిస్తుంది. అందుకే భౌతికంగా ఆలోచించవద్దని చెప్పాడు.

    ప్రభువు మన ఆత్మలను పాపం నుండి రక్షించి మనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. యోహాను నుండి ఆయన తన శరీరంతో బాప్తిస్మము పొందడం ద్వారా ఆయన మన పాపములను ఒక్కసారిగా తీసుకున్నాడు. అలా, ఆయన మనల్ని పాపరహితులుగా చేసాడు. ప్రభువు శరీరమును భుజించడం ద్వారా మనం పాపరహితులమయ్యాము. ఇది చాలా అద్భుతంగా ఉంది. ప్రభువు శరీరమును భుజించడం ద్వారా మనం పాపరహితులుగా మారడం చాలా అద్భుతం. మనము నిజమైన రక్షణను పొందడం చాలా అద్భుతంగా ఉంది. ప్రభువు యొక్క శరీరం ఎంత శక్తివంతమైనది! యేసు శరీరమును తినే వారు పాపరహితులు.

    మీరు యేసు శరీరమును మరియు రక్తాన్ని ఎలా తిని త్రాగగలరు? యేసు బాప్తిస్మమును మరియు ఆయన చిందించిన రక్తమును విశ్వసించడం ద్వారా మనం అలా చేస్తాము. యోర్దాను నదిలో బాప్తిస్మము ద్వారా యేసు మన పాపములన్నింటినీ తీసుకున్నాడని నమ్మడం ద్వారా మనం యేసు శరీరమును తింటాము. కావున విశ్వాసముతో మనము ప్రతిదినము యేసు శరీరమును తినవలెను. మనం ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్నప్పుడల్లా తినాలి. మనకు పాపములు ఉన్నాయని లేదా ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నట్లు అనిపించినప్పుడు మనం యేసు శరీరమును తినాలి. ప్రభువు తన బాప్తిస్మము ద్వారా మన పాపములను తీసుకున్నాడని విశ్వసించడం ద్వారా మనం తరచుగా ఆయన శరీరమును తినాలి. ఆధ్యాత్మిక విశ్వాసం ఉన్న స్త్రీ లేదా పురుషుడిగా మారడం ఇలా సాధ్యమవుతుంది.

    యేసు శిష్యులలో కూడా, యేసు దేవుని కుమారుడని, లేదా యేసు లోక పాపములన్నింటినీ తీసుకున్నాడని నమ్మని వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా, యేసు తన శరీరముతో పాపములను తీసుకున్నాడని నమ్మని చాలా మంది ఉన్నారు. యేసు బాప్తిస్మము పొందడం ద్వారా లోక పాపములను తీసుకున్నాడని స్పష్టంగా తెలుస్తుంది, అయితే, క్రైస్తవులలో కూడా, ఈ సత్యాన్ని నమ్మని వారు చాలా మంది ఉన్నారు. అందుకే యేసు దాని గురించి మాట్లాడుతూనే ఉన్నాడు.

    యేసు పన్నెండు మంది శిష్యులలో యూదా అనే శిష్యుడు ఉన్నాడు. యూదా అపవాదియైన సాతానుకు చెందినవాడని యేసుకు తెలుసు. యేసు శిష్యులలో కొందరు ఆయనను పూర్తిగా విశ్వసించలేదని, ఆయనను అనుసరించిన జనసమూహంలో కొందరు ఆయనను విశ్వసించలేదని ప్రభువుకు కూడా తెలుసు. అప్పుడు, వారు ఎవరు? తండ్రి అయిన దేవునిచేత నడిపింపబడని వారు ఆయనయందు విశ్వాసముంచనివారు అని ప్రభువు చెప్పాడు. ఆయన ఇలా చెప్పాడు, తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను (యోహాను 6:65).

    తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని చెప్పినప్పుడు కూడా చాలా మంది ప్రజలు యేసును విడిచిపెట్టారు. యేసు శరీరమును, రక్తాన్ని తిని త్రాగడానికి విశ్వాసం ఉన్న ఆయనను చాలా మంది విడిచిపెట్టారు. నా తోటి విశ్వాసులారా, మీ మనస్సులు మోసగించబడినట్లయితే, తండ్రియైన దేవునిచే మీరు నడిపించబడలేరు. మన పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. కాబట్టి, మనం మోసపోయిన మనస్సులను కలిగి ఉండకూడదు. మన హృదయాల యొక్క వాస్తవ పరిస్థితిని ఆయన ఎదుట ఉన్నది ఉన్నట్లుగా మనం ఒప్పుకోవాలి: ఓ, నా ప్రభూ, నా హృదయంలో పాపములు ఉన్నాయి మరియు ఈ పాపముల కారణంగా నేను శిక్షించబడటానికి అర్హుడిని. దయచేసి నన్ను కరుణించు! అప్పుడు, ప్రభువు అటువంటి నిజాయితీగల ఆత్మను నీరు మరియు ఆత్మ యొక్క సువార్తతో తప్పకుండా కలుస్తాడు.

    యేసు తన పన్నెండు మంది శిష్యులతో, మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా? సీమోను పేతురు ఆయనతో, ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను (యోహాను 6:68-69).

    మనకు అదే విశ్వాసం యొక్క ఒప్పుకోలు ఉండాలి. ప్రభువును విడిచి జీవించగలమా? ప్రభువును విడిచి మరెక్కడికైనా వెళ్లగలమా? ప్రభువు తన శరీరంతో బాప్తిస్మము పొందాడు మరియు ఆయన రక్తాన్ని మనకు ఇచ్చాడు. మరియు ఆయన మనకు నిత్యజీవాన్ని పొందగలిగేలా చేసే దేవుని సత్య వాక్యము నీరు మరియు ఆత్మ యొక్క సువార్త మాత్రమేనని చెప్పాడు.

    ఇప్పుడు, మనం ఆయన పాపరహిత ప్రజలమైపోయాము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించేవాడు నిత్యమైన పాప విముక్తిని పొందగలడు మరియు నిత్య జీవమును పొందగలడు. హల్లెలూయా!

    CHAPTER0101

    యేసు క్రీస్తు, మన జీవము

    < యోహాను 1:1-4 >

    ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

    మనలను ఎంతగానో ప్రేమించి మన పాపాలన్నిటి నుండి మనల్ని విడిపించిన యేసు ఎంత గొప్పవాడో!

    యోహాను 1వ అధ్యాయం యేసును సమస్త విశ్వానికి సృష్టికర్తగా వివరిస్తుంది. దేవుడు సృష్టించిన అనంతమైన విశ్వంతో మనల్ని మనం పోల్చుకుంటే, మనం ఎంత చిన్న మరియు దుర్భరమైన జీవులమో తెలుసుకోవచ్చు. అందుకే ఇంత గొప్ప దేవుడిని కలుసుకోగలిగినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేము. ఇది అన్ని అద్భుతాలలో గొప్పది. ఇప్పుడు కూడా, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా వచ్చిన దేవునితో నేను కలుసుకున్న అనే అద్బుతం అన్ని అద్భుతాలన్నింటిలో ఇది గొప్పదని నేను భావిస్తున్నాను.

    లక్షల కోట్ల కాంతి సంవత్సరాల వెడల్పుతో విస్తరించి ఉన్న ఈ విశాల విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త యేసు. దేవుడు మన కంటికి కనిపించని శాశ్వతమైన సత్యాన్ని మరియు నిజమైన రక్షణను కూడా సిద్ధం చేశాడు. దేవుడు నిజంగా అద్భుతమైన దేవుడు. దేవుని యొక్క అత్యున్నతమైన పని ఏమిటంటే, ఇతర దేవుని సృష్టి కంటే మానవులను తన స్వంత పిల్లలుగా సృష్టించడం.

    అయినప్పటికీ, ఇంత గొప్ప మరియు అద్భుతమైన దేవుడిని మనం ఎదుర్కోగలిగినప్పుడు మనం దేవునికి ఎలా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండగలము? మన తెలివితేటలతో మనం గ్రహించలేనంత గొప్ప కార్యాలను దేవుడు సాధించాడు. దేవుడు సృష్టించిన లోకం మానవ మనస్సుకు అర్థం కాని రహస్యాలతో నిండి ఉంది. మన స్వంత అభీష్టానుసారం ఇంత గొప్ప దేవుడిని మనం కలుసుకోగలిగాము కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము. మన ఊహలకు అందని అనేక నక్షత్ర మండలములతో నిండిన విశ్వాన్ని చూస్తే మనం దేవుడిని స్తుతించకుండా ఉండలేము. దేవుడు సృష్టించిన విశ్వం అద్భుతమైనది. మనం దేవుడు సృష్టించిన విశ్వానికి సాటిలేని చిన్న జీవులం. ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో దుమ్ము రేణు కంటే పెద్దవాడు కాదు. అయినప్పటికీ, ఈ అద్భుతమైన విశ్వం యొక్క సృష్టికర్త అయిన దేవునితో మనలాంటి చిన్న జీవులు కలుసుకోగలిగినప్పుడు మనం ఎలా దేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండగలము? కృతజ్ఞతతో నిండిన హృదయంతో, నేను మరోసారి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

    అయినప్పటికీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం లేకుండా గొప్ప మరియు పరిశుద్ధమైన దేవునితో కలవడానికి ప్రయత్నిస్తున్న చాలా మంది వ్యక్తులు ఉండటం సిగ్గుచేటు. ఈ నిజమైన సువార్తపై విశ్వాసం లేకుండా మనం యేసును కలవడం పూర్తిగా అసాధ్యం. అలాగే, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త లేకుండా మనం పాప విముక్తిని పొందడం కూడా అసాధ్యం.

    అప్పుడు, యేసుక్రీస్తు మానవులమైన మనతో ఎలా కలవగలుగుతున్నాడు? మీలాగ మరియు నాలాగే మానవుడిగా మారిన యేసు ద్వారా తప్ప దేవుడు మనతో కలవడానికి వేరే మార్గం లేదు. యేసు మన పాపాలన్నిటినీ ఒకేసారి తనపైకి తీసుకునేలా బాప్తిస్మమిచ్చే యోహాను నుండి బాప్తిస్మం పొందాడు మరియు ఆయన సిలువ వేయబడటం ద్వారా మన పాపాలన్నిటిని పూర్తిగా తుడిచిపెట్టాడు. యేసు తన బాప్తిస్మం మరియు సిలువ వేయబడడం ద్వారా, దేవుడు మనలను తన స్వంత పిల్లలుగా స్వీకరించడాన్ని సాధ్యం చేశాడు. మరో మాటలో చెప్పాలంటే, మన పాపాలన్నిటి నుండి ఒక్కసారిగా మనల్ని విడిపించిన దేవుడు మన రక్షకుడిగా రావడం తప్ప రక్షణకు వేరే మార్గం లేదు. ఏది ఏమైనప్పటికీ, దేవుడు తన ప్రాథమిక పాత్రలో మనతో కలిసినట్లయితే, ఏ పాపాత్ముడు కూడా వారి పాపాలకు విధించిన తీర్పుల నుండి తప్పించుకోలేడు, ఎందుకంటే ఆయన అత్యంత పరిశుద్దుడు మరియు గంభీరమైన న్యాయమూర్తి. మనం ప్రాథమికంగా పాపులమైనందున, మనం దేవుని పరిశుద్ధమైన వెలుగు ముందు నిలబడితే మనం చనిపోతాము. ఆ విధంగా, దేవుడు మనతో కలవాలంటే, మనలాగే మానవుని శరీరాన్ని ధరించి మన దగ్గరకు రావాలి.

    మన ప్రభువు తానే మనుష్య దేహంలో వచ్చాడు, తద్వారా ఆయన మనతో కలుసుకున్నాడు మరియు బలహీనమైన మరియు అయోగ్యులమైన మనలను మన పాపాలన్నిటి నుండి విడిపించాడు. మనం కలిగి ఉన్న శరీరాల మాదిరిగానే, ఒక మనిషి యొక్క మాంసాన్ని మరియు రక్తాన్ని తీసుకోవడానికి, కన్య మరియ ద్వారా యేసు ఈ లోకంలో జన్మించాడు. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును (యెషయా 7:14) అని వ్రాయబడినట్లుగా, దేవుడు మనతో ఉండుటకు మనవలె మాంసము మరియు రక్తముతో మనయొద్దకు వచ్చెను. ఈ వాగ్దానాన్ని ప్రవక్తయైన యెషయా యేసు జననానికి 700 సంవత్సరాల ముందు ప్రవచించాడు. మన ప్రభువు తనను తాను మన దీన స్థితికి తగ్గించికొని మనల్ని సమీపించకపోతే, మీరు మరియు నేను దేవుడిని ఎన్నటికీ కలుసుకోలేము. మన ప్రభువు మనలాగే మనుష్య దేహంలో మనతో కలవడానికి ఈ లోకానికి వచ్చాడు.

    మనకు ఇమ్మాన్యుయేలుగా మారిన దేవుడు

    ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు మరియు యేసు అనే పేరుకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని అర్థం (మత్తయి 1:21, 23). యోహాను 3:16 ఇమ్మానుయేలైన యేసు గురించి ఇలా చెబుతోంది: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు కాబట్టి, ఆయన మనుష్య రూపాన్ని తీసుకొని మనతో కలవడానికి ఈ లోకానికి వచ్చాడు.

    యేసుక్రీస్తు మానవ శరీరములో ఈ లోకమునకు వచ్చి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మనలను పాపరహితులుగా చేసాడు. ఆ విధంగా, ఆయన మనలను తన స్వంత ప్రజలుగా చేసుకున్నాడు. మన ప్రభువు మనకు గొప్ప ఆశీర్వాదాల సువార్తను ఇచ్చాడు. ఆయన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని మనము విని మరియు మన హృదయాలలో విశ్వసించినప్పుడు, మనం అత్యంత పరిశుద్ధమైన దేవునితో కలుసుకోవచ్చు మరియు ఆయన స్వంత ప్రజలలో పాలిభాగస్తులమవుతాము. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా మన పాపాలన్నిటి నుండి విముక్తిని పొందాము కాబట్టి మనం దేవునితో కలవగలుగుతున్నాము. మనం కూడా దేవునితో నిజమైన సహవాసాన్ని కలిగి ఉండగలుగుతున్నాము, ఎందుకంటే మనం ఆయన స్వంత ప్రజలమయ్యాము. దీని కారణంగా, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను మొదట విశ్వసించకుండా మనం మన స్వంతంగా దేవునితో కలవలేమని మనం గ్రహించాలి. కాబట్టి, విశ్వాసం ద్వారానే మనం ఆయనతో కలవగలం. మన ప్రభువు ప్రాథమికంగా దేవుడు అయినప్పటికీ, ప్రాథమికంగా పాపులమైన మనతో కలవడానికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం ద్వారా ఆయన ఈ లోకాన్ని సందర్శించాడు.

    మనము నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తాము మరియు మన ప్రభువు రాజుల రాజు, సృష్టికర్తయైన దేవుడు మరియు నిజమైన రక్షకుడని మనము విశ్వసిస్తాము. యేసుక్రీస్తు మానవ దేహంతో ఈ లోకానికి వచ్చినందుకు మనం కృతజ్ఞులం. ఆయన మాట్లాడే నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యాన్ని విశ్వసించినప్పుడు మనం ఆయనతో కలవగలుగుతాము. యేసుక్రీస్తును కలవాలనుకునే వారు మన పాపాలన్నిటి నుండి మనలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చిన ఆయనను విశ్వసించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని గ్రహించాలి. మనము ఆయనను కలుసుకోవాలనే కోరిక వలన మాత్రమే ఆయనను కలవలేము. మనం నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసిస్తున్నాము కాబట్టి, మనం ఇప్పుడు దేవునితో స్వేచ్ఛగా కలుసుకోగలుగుతున్నాము. ప్రభువు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని విశ్వసించడం ద్వారా, మనం దేవుని స్వంత ప్రజలమయ్యాము. ప్రియమైన తోటి విశ్వాసులారా, ఈ మాటలు మీకు అర్థవంతంగా ఉన్నాయా?

    ప్రతి వ్యక్తి ఒక ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగాడు మరియు ఒకరి విశ్వాస వ్యవస్థ ప్రధానంగా ఈ వాతావరణం ద్వారా రూపొందించబడింది. మీరు పెరిగిన వాతావరణం కారణంగా మీరు క్రైస్తవులు కావచ్చు. యేసును విశ్వసించేవారిలో, తమ జీవితంలో మొదటిసారిగా సువార్తను తెలుసుకున్న వారు కూడా ఉన్నారు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యం మొదటి సారి విన్నప్పుడు కొంచెం భిన్నముగా అనిపించినప్పటికీ, అది ఇప్పటికీ సరైనదని మనకు తెలుసు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త యొక్క శక్తిలోకి ప్రవేశించినప్పుడు మనకు మొదట్లో గందరగోళం ఏర్పడటం సహజం. ప్రతి ఒక్కరూ మొదట అదే అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే, మీరు నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై మీ విశ్వాసాన్ని ఉంచినప్పుడు మీ గందరగోళం ఖచ్చితంగా అధిగమించబడుతుంది.

    నీరు మరియు ఆత్మ యొక్క సువార్త తెలియకపోయినప్పటికీ, దేవుని పట్ల ఉన్న ప్రేమతో దేవుణ్ణి స్తుతించే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. పాపుల యొక్క ఈ పొరపాటు స్తుతులతో ఆయన నిజంగా సంతోషిస్తున్నాడా? తమ విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మారిన వారు సంతోషకరమైన హృదయంతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మీరు దేవుని సంఘమునకు వెళితే, దేవుని నీతిని మాత్రమే స్తుతించే ఇతర వ్యక్తులను మీరు కనుగొనవచ్చు.

    ఎవరైతే దేవుని సంఘమునకు వస్తారో వారు చివరికి నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యాన్ని వింటారు. నీరు మరియు ఆత్మ యొక్క ఈ సువార్త లోకంలో మరెక్కడా వినలేని సువార్త సత్యం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని విని విశ్వసించే వారు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి దేవుని సంఘంలో సమావేశమవుతారు. అలాగే, వారి హృదయాలలో ఒక్క పాపపు మచ్చ కూడా ఉండదు కాబట్టి, వారు పూర్తిగా పాపరహిత హృదయాలతో దేవుణ్ణి స్తుతిస్తారు. వారు తమ హృదయపూర్వకముగా దేవుని స్తుతించగలరు, ఎందుకంటే వారు సత్యంలో ప్రభువును కలుసుకున్నారు మరియు వారి రక్షణకు సంబంధించిన నిశ్చయతను వారు కలిగి ఉంటారు. దేవుని సంఘంలో, మన ప్రభువు మనకు ఇచ్చిన పాప విముక్తి యొక్క కృప అన్ని సమయాల్లో పొంగిపొర్లుతూ ఉంటుంది.

    మన ప్రభువును కలవడం ఎలా సాధ్యమైంది? వాస్తవానికి, ఇది కేవలం మానవ మార్గాల ద్వారా అసాధ్యం. కేవలం మన స్వంత ప్రయత్నంతో దేవుడిని కలవడానికి ప్రయత్నించడం అర్ధంలేని పని. మానవ ఆలోచనలపై ఆధారపడిన విశ్వాసంతో మనం దేవునితో కలవలేకపోతున్నాం. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే మనం మన పాపాలన్నిటి నుండి విముక్తిని పొందాము మరియు అన్ని ఆకాశముల సృష్టికర్త అయిన దేవునితో కూడా కలుసుకోగలుగుతాము. మనం దేవునితో కలవాలంటే, మనకు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త పూర్తిగా అవసరం. ఆ సువార్తపై విశ్వాసం ద్వారా మనం పొందిన పాప విమోచనలో ఎలాంటి లోపం లేదు. ఇప్పుడు, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే వారు దేవునితో కలుసుకోవచ్చు మరియు వారి విశ్వాసం ద్వారా దేవుని స్వంత ప్రజలు కావచ్చు.

    మన నిజమైన మధ్యవర్తి యేసుక్రీస్తు (1 తిమోతికి 2:5). మరియు ప్రభువు ఇచ్చిన నీరు మరియు ఆత్మ యొక్క సువార్తలోనే నిజమైన రక్షణ ఉంది. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యం ద్వారా తప్ప ఎవరూ యేసును కలవలేరు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్త సత్యాన్ని మనం తెలుసుకోనంత వరకు మనలో ఎవరికీ శాశ్వతమైన శిక్ష నుండి మినహాయింపు లభించదు. నీరు మరియు ఆత్మ ద్వారా వచ్చిన నిజమైన రక్షణ సత్యాన్ని విశ్వసించడం ద్వారా మాత్రమే మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తును మనం కలుసుకోగలుగుతాము. కావున, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించిన వారు అత్యంత ఆశీర్వదించబడినవారని నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను.

    అయినప్పటికీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను రుచి చూడని క్రైస్తవ పరిచారకులు నిజమైన ఉపన్యాసాలను బోధించలేరు ఎందుకంటే వారు ఇంకా దేవునితో కలవలేదు కాబట్టి. అందువలన, వారు అసత్య ప్రబోధాలను మాత్రమే బోధించగలరు. వారు తమ స్వంత మార్గంలో దేవుని వాక్యాన్ని బోధించవచ్చు, కానీ వారు తమ ఆత్మలో పాప సమస్యను పరిష్కరించడానికి ప్రజలను అనుమతించే సత్యాన్ని పంచుకోలేరు. నీరు మరియు ఆత్మ సువార్త సత్యం యొక్క రాజ్యం గురించి మాట్లాడటం వారికి పూర్తిగా అసాధ్యం, ఎందుకంటే వారికి ఈ సువార్త సత్యం గురించి తెలియదు. చాలా మంది బోధకులు తమ సమ్మేళనాలకు ఉపన్యాసాలు ఇస్తారు, కానీ వారి మాటలు వారి స్వంత శరీరానికి సంబంధించిన సైద్ధాంతిక ఆలోచనలు తప్ప మరేమీ కాదు.

    దేవుని ప్రేమ నిజంగా ఎలా ఉంటుంది?

    దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమలు ఉన్నాయి. ప్రజల ప్రేమలు అనగా, స్నేహితుల ప్రేమ, ప్రేమికుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ మరియు దేవుని ప్రేమ ఉన్నాయి. అప్పుడు, ఏ రకమైన ప్రేమ అత్యంత విలువైనది? ఎప్పటికీ మారనది మరియు షరతులు లేని ప్రేమ అత్యంత విలువైనది కాబట్టి, దేవుని ప్రేమ రెండవ ఆలోచన లేకుండా ఇతర ప్రేమలన్నిటినీ ఓడించింది. మనమందరం మన హృదయాలలో దేవుని ప్రేమను కలిగి ఉండాలని కోరుకుంటాము. అలాంటప్పుడు మన హృదయాలలో దేవుని ప్రేమను ఎలా పొందగలుగుతాము? నీరు మరియు ఆత్మ యొక్క సువార్త వాక్యము ద్వారా వచ్చిన యేసుక్రీస్తును మన రక్షకునిగా విశ్వసించినప్పుడు, మనం దేవుని ప్రేమను పొందగలుగుతాము.

    గత తరం వరకు, సంఘమునకు వెళ్లడం ద్వారా లోక జ్ఞానం పొందవచ్చని ప్రజలు భావించేవారు. అయితే, ఈ రోజుల్లో, ప్రజలు అలాంటి ప్రయోజనం గురించి కూడా ఆలోచించడం లేదు. ఈ రోజుల్లో, లోకంలో నేర్చుకోవడానికి చాలా ప్రదేశాలు ఉన్నందున మరియు ప్రజలు ఇప్పటికే చాలా నేర్చుకున్నందున, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త బోధించబడకపోతే ప్రజలు అసంతృప్తి చెందుతారు.

    నీరు మరియు ఆత్మ యొక్క సువార్త దేవుని సంఘంలో మాత్రమే బోధించబడుతుంది. ఈ రోజుల్లో ప్రజలు సంఘమునకు వచ్చేది లోక జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కాదు, దేవుని గురించి తెలుసుకోవడానికి మరియు నీరు మరియు ఆత్మ యొక్క సువార్త ద్వారా దేవుని స్వరాన్ని వినడానికి. అయినప్పటికీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి తెలియని పరిచారకుడు ఇతరుల ఆత్మలను దేవుని వాక్యం వైపు ఎలా నడిపించగలడు? నీరు మరియు ఆత్మ యొక్క సువార్త గురించి ఇంకా తెలియని వారు ఈ సువార్త సత్యాన్ని తెలుసుకోనందున వారి పాపాల విముక్తిని పొందలేరు లేదా దేవునితో కలవలేరు. అలాంటప్పుడు వారు దేవుని సువార్త అయిన నీరు మరియు ఆత్మ సువార్త గురించి ఎలా చర్చించగలరు? ఇంకా, వారు మీ ఆధ్యాత్మిక స్థితి గురించి ఎలా మాట్లాడగలరు? వారు పాప విముక్తి మరియు నిజమైన రక్షణను గురించి చర్చించలేరు. వారు తమ సిద్ధాంతాలతో ఆధ్యాత్మికంగా అంధులైన క్రైస్తవుల హృదయాలను మాత్రమే గందరగోళపరుస్తారు. నీరు మరియు ఆత్మ యొక్క సువార్తపై విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ పాపాలన్నిటి నుండి పూర్తిగా కడుగుకోవాలి. లేకపోతే, బైబిల్లో స్పష్టంగా వ్యక్తీకరించబడిన ఈ నిజమైన సువార్తను పంచుకోవడం అసాధ్యం.

    అయినప్పటికీ, నీరు మరియు ఆత్మ యొక్క సువార్తను విశ్వసించే మనం ఈ సువార్త సత్యం ద్వారా యేసును కలుసుకోగలిగాము. యేసు ఈ లోకానికి నీరు మరియు రక్తం ద్వారా వచ్చాడు కాబట్టి (1 యోహాను 5:6), ఆ సువార్తపై మనకున్న విశ్వాసం ద్వారా మనం క్రొత్తగా జన్మించాము మరియు దేవుని స్వంత ప్రజలుగా తయారయ్యాము.

    నేటి యోహాను 1వ అధ్యాయములో, యేసుక్రీస్తు దేవుడు అని వ్రాయబడింది: ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను (యోహాను 1:1-5).

    ప్రారంభంలో, వాక్యం ఉంది. ఈ వాక్యం నిజానికి దేవుని వాక్యం. ఈ లోకం దేవుని వాక్యం ద్వారా సృష్టించబడింది మరియు ఈ లోకంలో దేవుని వాక్యం ద్వారా సృష్టించబడనిది ఏదీ లేదు. దేవుని వాక్యంలో, అన్నిటికీ జీవం వచ్చింది. ఆ జీవం మనుషులకు కూడా ప్రాణం పోసింది.

    మొత్తం విశ్వం యొక్క సృష్టికర్త అయిన దేవుడు త్రియేక దేవుడు; తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. కలుగునుగాక అనే తన వాక్యం ద్వారా దేవుడు విశ్వాన్ని వాస్తవంగా చేసాడు. దేవుడు మాట్లాడినప్పుడు, అది ఇలా మారింది. నేను చెప్పేదేమిటంటే, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు మన రక్షకుడిగా వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన మన ప్రభువుతో, మన పాపాలన్నిటి నుండి మనలను శుభ్రపరిచే అధికారం వచ్చింది. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు ప్రభువును ఎరుగరు మరియు పాపులుగా చనిపోతున్నారు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను (యోహాను 1:5).

    అయితే, నీరు మరియు ఆత్మ సువార్తను విశ్వసించే మీరు మరియు నేను దేవుని నుండి చాలా ప్రేమను పొందాము.

    Enjoying the preview?
    Page 1 of 1